palak
-
మటన్ కీమాతో పాలక్ సమోసా.. భలే రుచిగా ఉంటాయి
కీమా పాలక్ సమోసా తయారీకి కావల్సినవి: కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు వేసి, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారెట్ తురుము – పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, పాలకూర గుజ్జు– ఒకటిన్నర కప్పులు (చపాతి ముద్ద కోసం), ఫుడ్ కలర్ – ఆకుపచ్చ రంగు (అభిరుచిని బట్టి పాలకూరలో కలిపి పెట్టుకోవాలి), ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారెట్ తురుము, మిరియాల పొడి, కీమా, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసుకుని.. అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో కీమా మిశ్రమాన్ని పెట్టి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... భలే రుచిగా ఉంటాయి. -
Telangana BJP: గ్రేటర్లో దూకుడు పెంచిన ‘కమలం’
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే గ్రేటర్లో కమలం పార్టీ దూకుడు పెంచింది. అగ్రనేతలకు పలు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను అప్పజెప్పింది. తాజాగా పలు నియోజకవర్గాలకు సీనియర్ నేతలకు పాలక్‌లుగా నియమించింది. ఈ బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీని నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తల సాధకబాధకాలు తీర్చడం,అన్ని వర్గాలను పారీ్టకి చేరువ చేయడం,పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ,నిధుల సమీకరణ ఇలా అన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రతీ నియోజకవర్గానికి ప్రభారీ,పాలక్,విస్తారక్,కన్వీనర్ ఇలా నలుగురు సీనియర్‌నేతలకు పార్టీ గెలుపు బాధ్యతలను అప్పజెప్పినట్లు వివరించారు. ఈ నాలుగు పదవుల్లో నియమితులైన వారిలో పార్టీ లో సుదీర్ఘకాలం సేవలందించిన నేతలతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజకీయాల్లో కాకలు తీరిన యోధులు, ఆర్ఎస్ఎస్లో దీర్ఘకాలం పనిచేసిన వారు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో సింహభాగం నియోజకవర్గాల్లో గెలుపుగుర్రాలను అన్వేషించేందుకు సీనియర్ నేతలను క్షేత్రస్థాయిలో రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చదవండి: గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..! -
119 మంది ‘పాలక్’లను నియమించిన బీజేపీ.. వారి పనేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలక్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. - కుత్బుల్లాపూర్ - డీకే అరుణ - ఎల్లారెడ్డి - రఘునందన్ రావు - రామగుండం - కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి - కల్వకుర్తి - రామచంద్రా రావు - వరంగల్ తూర్పు - ఈటల రాజేందర్ - ములుగు - సోయం బాపూరావు - మేడ్చల్ - లక్ష్మణ్ - శేరిలింగంపల్లి - కిషన్ రెడ్డి - పరిగి - విజయశాంతి. ఇదిలా ఉండగా.. పాలక్‌లు ప్రతీ నెలలో మూడు రోజులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలి. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తల బాగోగులు, ఆర్థిక వనరులు, కార్యక్రమాలల నిర్వహణ బాధ్యత అంతా వీరిపైనే ఉంటుంది. -
చాంప్స్ పలక్, వివేక్ సాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో పలక్, వివేక్ సాయి చాంపియన్లుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శనివా రం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో జి. వివేక్‌సాయి (హెచ్‌వీఎస్) 12–10, 8–11, 11–6, 11–6తో తరుణ్ యాదవ్ (స్టాగ్)పై గెలుపొందాడు. బాలికల ఫైన ల్లో పలక్ (జీఎస్ఎం) 11–5, 11–7, 11–5తో మెర్సీ (హిందూ పబ్లిక్ స్కూల్)ను ఓడించింది. మరోవైపు సబ్ జూనియర్ బాలికల విభాగంలో భవిత (జీఎస్ఎం) విజేతగా నిలిచింది. ఫైనల్లో భవిత 14–12, 11–3, 12–10, 13–11, 11–5తో విధి జైన్ (జీఎస్ఎం)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు సబ్ జూనియర్ బాలుర సెమీస్: బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–6, 11–8, 12–10, 11–4తో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)పై, అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–9, 11–7, 11–9, 13–11తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు. జూనియర్ బాలికల క్వార్టర్స్: జి. ప్రణీత (హెచ్‌వీఎస్) 14–12, 11–9, 11–3, 11–6తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై, వినిచిత్ర (స్టాగ్ అకాడమీ) 5–11, 10–12, 3–11, 11–3, 11–5, 13–11, 17–15తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)పై, లాస్య (ఎంఎల్ఆర్)11–7, 11–7, 9–11, 11–6, 11–8తో అంజలి (ఎంఎల్ఆర్)పై, సస్య (ఎంఎల్ఆర్) 7–11, 11–4, 11–8, 11–7, 11–5తో భవిత (జీఎస్ఎం)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. -
ఫైనల్లో పూజ, పలక్
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పూజ, పలక్ ఫైనల్‌కు చేరుకున్నారు. తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో స్టాగ్ అకాడమీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన క్యాడెట్ బాలికల సెమీస్‌లో పూజ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-9, 11-3తో ఫాతిమా (డాన్ బాస్కో)పై, పలక్ (జీఎస్ఎం) 11-5, 11-5, 11-9తో ప్రీతి (ఎన్సీసీ)పై గెలుపొందారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో పూజ (ఏడబ్ల్యూఏ) 11-7, 5-11, 11-9, 10-12, 11-7తో దేవిశ్రీ (నల్గొండ)పై, పలక్ (జీఎస్ఎం) 11-8, 11-4, 11-4తో అనన్య (జీఎస్ఎం)పై, ప్రీతి (ఎన్సీసీ) 5-11, 11-7, 11-6, 3-11, 11-6తో ప్రియాంక (హెచ్‌వీఎస్)పై, ఫాతిమా (డాన్‌బాస్కో) 11-2, 11-4, 11-1తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. మరోవైపు అంతర్ జిల్లా టోర్నమెంట్లో మహిళల విభాగంలో రంగారెడ్డి జిల్లా 3-0తో నల్గొండ జిల్లాపై గెలుపొందింది ఇతర మ్యాచ్‌ల ఫలితాలు క్యాడెట్ బాలుర క్వార్టర్స్: అథర్వ (ఏడబ్ల్యూఏ) 11-8, 9-11, 11-9, 4-11, 11-8తో వేణు మాధవ్‌పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-9, 11-7, 11-5తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, రాజు (ఏడబ్ల్యూఏ) 11-6, 13-15, 11-4, 11-4తో కుషాల్ (జీటీటీఏ)పై, త్రిశూల్ (ఎల్బీఎస్) 10-12, 11-7, 11-6, 6-11, 11-6తో క్షితిజ్ మల్పానీ (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. మహిళల ప్రిక్వార్టర్స్ ఫలితాలు: నిఖత్ బాను (జీఎస్ఎం) 11-9, 11-6, 11-3, 11-3తో నవ్య నిఖిత (వైఎంసీఏ)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 11-6, 11-5, 10-12, 11-5, 11-7తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-4, 11-6, 11-1, 11-6తో హనీఫా ఖాతూన్ (స్టాగ్ అకాడమీ)పై, వినిచిత్ర (స్టాగ్ అకాడమీ) 3-11, 7-11, 13-11, 11-7, 11-7, 5-11, 11-6తో నిఖిత (జీఎస్ఎం)పై, వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 11-6, 9-11, 11-13, 11-8, 11-3, 11-9తో అనూప రూత్ (జీఎస్ఎం)పై నెగ్గారు. -
పలక్, రిత్విక్‌లకు టైటిల్స్
స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పలక్, రిత్విక్ విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం క్యాడెట్ బాలికల విభాగంలో జరిగిన ఫైనల్లో జి. పలక్ (జీఎస్ఎం) 9-11, 11-5, 5-11, 11-5, 11-9తో ఆశ్లేష సింగ్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్టాగ్ అకాడమీకి చెందిన రిత్విక్ 13-15, 11-5, 5-11, 11-4, 11-5తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)ను ఓడించి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన బాలికల సెమీస్‌లో పలక్ 6-11, 11-7, 14-12, 11-7తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, ఆశ్లేష సింగ్ 11-8, 11-7, 11-5తో ప్రియాంక రాజ్ (హెచ్‌వీఎస్)పై విజయం సాధించారు. బాలుర సెమీస్‌లో త్రిశూల్ 7-11, 12-10, 11-6, 11-1తో వేణు మాధవ్ (జీఎస్ఎం)పై, రిత్విక్ 11-7, 11-6, 11-6తో కుషాల్ (జీటీటీఏ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి (జీఎస్ఎం) 11-7, 11-3, 11-9, 11-2తో కీర్తన (హెచ్‌వీఎస్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జూనియర్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ 11-2, 11-5, 11-9, 11-5తో గోవింద్ (స్టాగ్ అకాడమీ)పై, సారుు (జీఎస్ఎం) 11-5, 11-9, 9-11, 11-9, 11-6తో వెంకట ధనుష్ (ఏడబ్ల్యూఏ)పై, అరవింద్ (ఏడబ్ల్యూఏ) 11-5, 11-7, 11-2, 11-8తో రఘురాం (నల్గొండ)పై, హరికృష్ణ (జీటీటీఏ) 11-9, 11-8, 11-6, 11-4తో అనూప్ అమర (స్టాగ్ అకాడమీ)పై, అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ) 12-10, 11-2, 11-7, 11-9తో రుత్విక్ (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. జూనియర్ బాలికల క్వార్టర్స్: నైనా (ఎల్బీఎస్) 11-8, 13-11, 11-7, 8-11, 10-12, 11-9తో ఆయుషి (జీఎస్ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 5-11, 11-5, 11-3, 8-11, 11-5, 11-8తో అంజలి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-3, 8-11, 8-11, 6-11, 11-7, 11-8, 11-4తో భవిత (జీఎస్ఎం)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-8, 11-7, 11-7, 11-5తో దేవయాని (జీఎస్ఎం)పై విజయం సాధించారు. మహిళల రెండో రౌండ్: మౌనిక (జీఎస్ఎం) 11-6, 11-3, 7-11, 11-4, 11-8తో గాయత్రి (హెచ్‌వీఎస్)పై, నిఖత్ బాను (జీఎస్ఎం) 11-5, 11-6, 11-4, 11-7తో రచన (జీఎస్ఎం)పై, ఆకుల శ్రీజ (జీటీటీఏ) 11-1, 11-4, 11-2, 11-2తో నవ్య (ఖమ్మం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-1, 11-3, 11-5, 11-8తో హనీఫ (స్టాగ్ అకాడమీ)పై, లాస్య (11-5, 11-4, 11-7, 11-7తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలుర క్వార్టర్స్: వరుణ్ (జీటీటీఏ) 7-11, 12-10, 11-7, 11-8, 11-8తో విశాల్ (జీఎస్ఎం)పై, కేశవన్ కన్నన్ (జీటీటీఏ) 7-11, 11-9, 7-11, 11-5, 8-11, 11-4, 11-4తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై, ధనుష్ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-9, 11-6, 11-13,11-9తో రితేశ్ థామస్ (జీటీటీఏ)పై కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11-4, 9-11, 11-7, 7-11, 11-4, 11-8తో సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. యూత్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ) 11-7, 11-4, 11-6, 11-3తో అభయ్ (ఏడబ్ల్యూఏ)పై, హర్ష్ లహోటి (హెచ్‌వీఎస్) 13-11, 11-7, 11-9, 11-9తో సౌరభ్ (జీఎస్ఎం)పై, పీయూష్ (స్టాగ్ అకాడమీ) 11-9, 12-10, 11-5, 8-11, 7-11, 7-11, 12-10తో అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ)పై విజయం సాధించారు. -
45 లక్షలు గెలిచారని చెప్పి.. 11 లక్షలు దోచేసి..
బెంగళూరు: మీకు లాటరీ తగిలింది కొన్ని లక్షల రూపాయలను మీరు డిపాజిట్ చేస్తే మేం మీకు మొత్తం అందజేస్తాం అనే ఘరానా మోసాలు మనకు తరచూ కనిపించేవే. అలాంటి ఘటనే ఓ గృహిణికి ఎదురైంది. ఓ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య అయిన ఆమె వంచనకు గురై కుటుంబసభ్యుల ముందు అవమాన భారాన్ని తట్టుకోలేక తనంతట తానే ప్రాణాలను తీసుకునేలా చేసింది. మీరు రూ.45 లక్షల నగదును బహుమతిగా గెలుచుకున్నారంటూ బెంగళూరు వివేకానంద రోడ్డులో నివసించే ఓ సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ భార్య వీ పాలక్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె ఆ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించగా ఆ డబ్బు ఇవ్వాలంటే రూ.11 లక్షలను ముందుగా డిపాజిట్ చేయాలని వారు చెప్పారు. దాంతో భర్తకు తెలియకుండా డబ్బును సేకరించిన ఆమె వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 11 లక్షల నగదును రాహుల్, హస్ నాథ్, షబ్బీర్ తదితరుల అకౌంట్లకు బదిలీ చేశారు. ఆ తర్వాత డబ్బును తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని చెప్పడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మోసపోయామని తెలుసుకున్న ఆమె.. తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. దీంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఆండ్రూని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా ఆమె తరచు డబ్బు పంపుతుండటంతో ఏదో ఒక కారణం చూపుతూ డబ్బును రాబట్టాలని ప్రయత్నించినట్లు చెప్పాడు. ఢిల్లీకి వచ్చిన ఆమెను మరికొంత డబ్బు అడగగా ఇంక తన వద్ద డబ్బు లేదని చెప్పినట్లు చెప్పాడు. ఢిల్లీ నుంచి తిరిగి బెంగుళూరుకు వెళ్లిన మర్నాడు పురుగుల మందు తాగబోతుంటే పిల్లలు రక్షించినట్లు చెప్పిందనీ, ఎలాగైనా ప్రైజ్ మనీని ఇవ్వాలని కోరినట్లు వివరించాడు. కుటుంబసభ్యులు ఏమైందని ప్రశ్నించగా.. పాలక్ జరిగిన విషయం వారికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదుచేద్దామని వారు చెప్పడంతో అప్పటికి ఊరుకున్న పాలక్.. మర్నాడు పోలీస్ స్టేషన్ కు బయల్దేరబోతూ బెడ్ రూంలో ఉరేసుకుని చనిపోయినట్లు వివరించారు.