సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో పలక్, వివేక్ సాయి చాంపియన్లుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శనివా రం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో జి. వివేక్‌సాయి (హెచ్‌వీఎస్) 12–10, 8–11, 11–6, 11–6తో తరుణ్ యాదవ్ (స్టాగ్)పై గెలుపొందాడు. బాలికల ఫైన ల్లో పలక్ (జీఎస్‌ఎం) 11–5, 11–7, 11–5తో మెర్సీ (హిందూ పబ్లిక్ స్కూల్)ను ఓడించింది. మరోవైపు సబ్ జూనియర్ బాలికల విభాగంలో భవిత (జీఎస్‌ఎం) విజేతగా నిలిచింది. ఫైనల్లో భవిత 14–12, 11–3, 12–10, 13–11, 11–5తో విధి జైన్ (జీఎస్‌ఎం)పై విజయం సాధించింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
సబ్ జూనియర్ బాలుర సెమీస్: బి. వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11–6, 11–8, 12–10, 11–4తో కేశవన్ కన్నన్ (ఎంఎల్‌ఆర్)పై, అద్వైత్ (ఏడబ్ల్యూఏ) 11–9, 11–7, 11–9, 13–11తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు.
జూనియర్ బాలికల క్వార్టర్స్: జి. ప్రణీత (హెచ్‌వీఎస్) 14–12, 11–9, 11–3, 11–6తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై, వినిచిత్ర (స్టాగ్ అకాడమీ) 5–11, 10–12, 3–11, 11–3, 11–5, 13–11, 17–15తో వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం)పై, లాస్య (ఎంఎల్‌ఆర్)11–7, 11–7, 9–11, 11–6, 11–8తో అంజలి (ఎంఎల్‌ఆర్)పై, సస్య (ఎంఎల్‌ఆర్) 7–11, 11–4, 11–8, 11–7, 11–5తో భవిత (జీఎస్‌ఎం)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు.