
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే గ్రేటర్‌లో కమలం పార్టీ దూకుడు పెంచింది. అగ్రనేతలకు పలు నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను అప్పజెప్పింది. తాజాగా పలు నియోజకవర్గాలకు సీనియర్ నేతలకు పాలక్‌లుగా నియమించింది. ఈ బాధ్యతలు చేపట్టిన నేతలు పార్టీని నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంతోపాటు కార్యకర్తల సాధకబాధకాలు తీర్చడం,అన్ని వర్గాలను పారీ్టకి చేరువ చేయడం,పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల నిర్వహణ,నిధుల సమీకరణ ఇలా అన్ని బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టంచేశారు.
ప్రతీ నియోజకవర్గానికి ప్రభారీ,పాలక్,విస్తారక్,కన్వీనర్ ఇలా నలుగురు సీనియర్‌నేతలకు పార్టీ గెలుపు బాధ్యతలను అప్పజెప్పినట్లు వివరించారు. ఈ నాలుగు పదవుల్లో నియమితులైన వారిలో పార్టీ లో సుదీర్ఘకాలం సేవలందించిన నేతలతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజకీయాల్లో కాకలు తీరిన యోధులు, ఆర్‌ఎస్‌ఎస్‌లో దీర్ఘకాలం పనిచేసిన వారు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో సింహభాగం నియోజకవర్గాల్లో గెలుపుగుర్రాలను అన్వేషించేందుకు సీనియర్ నేతలను క్షేత్రస్థాయిలో రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
చదవండి: గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..!