వంటిల్లు
పేరులోనే ‘కూర’ను జత చేసుకున్నపాలకూర అన్నంలోకే కాదు, స్నాక్స్‌గానూ మారిపోతుంది. పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకుకూరను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేకరకాల సమస్యలనుంచి బయటపడవచ్చు.
కావలసినవి: పాలకూర తరుగు – ఒకటిన్నర కప్పు, బ్రెడ్ స్లైసులు – 3, అల్లం తరుగు – టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరగాలి), పుదీనా తరుగు – టేబుల్ స్పూన్, జీలకర్ర – టీ స్పూన్, చాట్ మసాలా – టీ స్పూన్, బియ్యప్పిండి – అర కప్పు, ఉల్లిపాయ తరుగు –పావు కప్పు, జీడిపప్పుల తరుగు – టేబుల్ స్పూన్, నిమ్మరసం – టీ స్పూన్. ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేయించడానికి తగినంత.
తయారీ: ∙బ్రెడ్ స్లైసులను మిక్సీలో గ్రైండ్ చేయాలి.పాలకూర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. ∙ఒక పెద్ద గిన్నెలో బ్రెడ్ మిశ్రమంతో సహా అన్ని పదార్థాలు వేసి, మెత్తని పిండిలా కలపాలి. ∙చిన్ని చిన్న ఉండలు చేసి, కొద్దిగా అరచేతితో అదిమి, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించి, తీయాలి. ∙వీటిని కెచప్‌తో సర్వ్ చేయాలి. (Paris Fashion Week 2025 : అపుడు మంటల్లో.. ఇపుడు దేవతలా ర్యాంప్ వాక్! )
పాలకూరతో ప్రయోజనాలు
పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉందని చెబుతారు. అధిక బరువు ఉన్నవారు పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
చదవండి: పోషకాల పాలకూర పచ్చడి : ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment