Tiffin
-
టిఫిన్‌పే చర్చ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తల టిఫిన్ బైఠక్‌లు శనివారం ఉత్సాహంగా సాగాయి. పార్టీ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. శనివారం ఉదయం పోలింగ్‌బూత్ స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు కలుసుకుని అల్పాహారం తింటూ పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ముఖ్యనేతలు, పోలింగ్‌బూత్ కమిటీల అధ్య క్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్క రణ కార్యక్రమం, శక్తికేంద్రాల్లో (నాలుగైదు పోలింగ్ బూత్ లు కలిపి ఒకటి) సమావేశాల నిర్వహణతో పాటు 44 ఏళ్లలో పార్టీ చరిత్ర, వికాసం, పరిణామక్రమంపై చర్చ చేపట్టారు. ఇక పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న సీనియర్లను సన్మానించారు. ఆయా పోలింగ్ బూత్‌లో పార్టీ బలాబలాలు, వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, తదితర అంశాలపై చ ర్చించారు. ఈ సందర్భంగా... ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ అంటూ నినదించారు. దేశ వ్యాప్తంగా 370 సీట్ల సా ధన, అందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ బూత్‌లో 50 శాతం ఓట్లు పడేలా కృషి చేస్తామంటూ పార్టీనా యకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు. సికింద్రాబా ద్ నియోజకవర్గం కాచిగూడలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ సునీల్‌బన్సల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధా నకార్యదర్శలు చంద్రశేఖర్ తివారి (సంస్థాపక) తదితర నా యకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గుజ్జుల ప్రే మేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో శనివారం ఐదువేల చోట్ల బీజేపీ టిఫిన్ బైఠక్‌లు జరిగాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు అసెంబ్లీ స్థాయిలో జరిగే సమావేశాలు.. 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు సంబంధించిన అంశాలపై ఆయా బైఠక్‌లలో చర్చించామని తెలిపారు. -
ఏడాదంతా..ఇడ్లీలు, బిర్యానీలే!
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే.. బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్‌లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు. చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు.. నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్‌కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క రోజులో 207 పిజ్జాలు.. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్‌లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ. కేక్‌లే కేక్‌లు.. గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. -
బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ అరటిపండు తింటున్నారా? అస్సలు అలా చేయకండి
రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఛాయిస్. ► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినకూడదా? అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు. -
బీజేపీ ‘పరివార’ చర్చలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా బీజేపీ చేపట్టిన ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ ‘లంచ్’భేటీలకు కార్యకర్తలు ఎవరికి వారే టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఫొటోలు, వేదిక, బ్యానర్లు, మీడియా, భారీగా భోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు, ఆర్భాటాలేవీ లేకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘‘ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఏర్పడిన కాంగ్రెస్ కల్చర్‌కు, ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసే పద్ధతికి చెక్‌పెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తల సాదర సమావేశాలకు రూపకల్పన చేశాం. ఈ భేటీల సందర్భంగా కార్యకర్తలు పిచ్చాపాటిగా అన్ని విషయాలపై మాట్లాడుకోవడంతో పాటు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుంది..’’అని బీజేపీ నేతలు చెప్తున్నారు. నిరంతరం కొనసాగించే యోచన ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా ‘లంచ్’భేటీల్లో దృష్టి పెట్టనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఆదివారం ఈ బైఠక్‌లు జరిగాక.. వాటిని నిరంతరం కొనసాగించాలనే ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వివరించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. శక్తి కేంద్రాల ఇన్చార్జులు (మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి ఓ శక్తి కేంద్రం), ఆ పైస్థాయిల వారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో ఈ తరహా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. నేతలు అతిథులుగా.. ఆదివారం నిర్వహిస్తున్న లంచ్ బైఠక్ కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్, గద్వాలలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆర్మూర్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ , బోథ్‌లో ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్‌రావు, మలక్‌పేటలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఇతర నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠక్‌లకు హాజరవుతారని తెలిపారు. -
అరే నాయన ఏంట్రా బాబు ఇది? తినాలా? వద్దా!
ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్ చేస్తే...ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి సాంబార్ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ ప్లేట్లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే...చండీగఢ్‌లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్లోని సాగర్ రతన్ ఫుడ్ కోర్ట్‌లో గురిందర్ చీమా అనే కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్ చేశాడు. సదరు కస్టమర్ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్ కోర్ట్‌లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5 — Ravi Rai Rana #RWorld (@raviranabjp) June 15, 2022 (చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...) -
సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు. చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఎఫెక్ట్..పెరిగిన టిఫిన్ ధరలు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన రాష్ట్రంలో సామాన్యులపై భారం మోపుతోంది. వంట నూనెల ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. వంట నూనెలను ప్రధానంగా మన దేశం ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం అల్పాహార ధరలపై పడింది. వంట నూనెలతో తయారయ్యే అన్ని రకాల టిఫిన్ ధరలను హోటళ్ల యాజమాన్యాలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. నూనెతో తయారయ్యే దోశె, పూరి, వడ, బజ్జి, పుణుకులు వంటివాటి ధరలు ఇప్పటికే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా పెరిగాయి. యుద్ధం రాకముందు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.135గా ఉండేదని, ఇప్పుడు అది రూ.180కు చేరుకుందని.. దీంతో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని విజయవాడలోని సాయి ప్రియాంక హోటల్ యజమాని తెలిపారు. మొన్నటి దాక రూ.40గా ఉన్న ప్లేట్ మైసూర్ బజ్జి, గారెల ధరలను ఇప్పుడు రూ.50కు పెంచామని వివరించారు. అలాగే దోశెల ధరలను రూ.5 చొప్పున పెంచినట్లు వెల్లడించారు. చదవండి: సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు భగ్గుమంటున్న ఇతర వస్తువుల ధరలు ఇదే సమయంలో వంట నూనెలతోపాటు వంట గ్యాస్, ఎండు మిర్చి వంటి వాటి ధరలు కూడా భారీగా పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా ఇప్పుడిది రూ.1,980కు చేరిందన్నారు. అలాగే ఎండు మిర్చి ధర 15 రోజుల క్రితం కిలో రూ.200లోపు ఉండగా అది ఇప్పుడు రూ.260కి చేరిందని వివరించారు. అలాగే లైవ్ చికెన్ కిలో ఫిబ్రవరిలో రూ.92–112 మధ్య ఉంటే ఇప్పుడది రూ.149కి చేరిందని దీంతో చికెన్‌తో తయారయ్యే ఆహార ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. నష్టాలు భరించలేని చిన్న హోటల్స్ ధరలు పెంచాయని.. పెద్ద హోటల్స్ మాత్రం వేచిచూస్తున్నట్లు తెలిపారు. యుద్ధం సద్దుమణిగితే నూనె ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందేమోనని వేచిచూస్తున్నట్టు తిరుపతిలోని స్టార్ హోటల్ యజమాని ఒకరు ‘సాక్షి’కి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా రిటైల్ ధరలను సవరించలేదన్నారు. ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగితే అందరూ ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. నష్టాలు భరించలేం.. గత రెండేళ్లుగా కరోనాతో హోటల్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. అయినా వ్యాపారం పునరుద్ధరించుకోవడం కోసం రెండేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా టిఫిన్ ధరలను పెంచకుండా నష్టాలను భరించాం. కానీ ఇప్పుడు వంట నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు ఇదేవిధంగా కొనసాగితే అన్ని రకాల టిఫిన్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. – బాలకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ -
అల్పాహారం.. అల్లంతదూరం!
సాక్షి, వికారాబాద్ అర్బన్: ఎమర్జెన్సీగా బయటకు వెళ్లే వారు ఎక్కడో ఒకచోట ఆగి ఇష్టమైన టిఫిన్ చేద్దామని అనుకుంటారు. నోటి రుచి కోసం మరికొందరు టిఫిన్ సెంటర్ల నుంచి పార్సిల్ తెచ్చుకొని ఆరగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువగా కనిపించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఇంట్లోనే టిఫిన్ చేసి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు. కొంత ఆలస్యమైనా ఇంట్లోనే అల్పాహారం చేసుకుని తింటున్నారే గాని బయట కొనుక్కోవడానికి పెద్దగా ఇష్ట పడటం లేదు. ఎందుకంటే కరోనాకు ముందు ఉన్న టిఫిన్ ధరలు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. హోటళ్లలో టిఫిన్ల ధరలు అమాంతం పెంచేశారు. కరోనాకు ముందు వికారాబాద్ లాంటి పట్టణాల్లోని పెద్ద పెద్ద హోటళ్లలో ప్లేటు ఇడ్లీ రూ. 20 మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్లేటు ఇడ్లీ రూ.35కు పెరిగింది. గతంలో ప్లేట్ వడ(2) రూ. 30 ఉండగా ఇప్పుడు రూ. 45 అమ్ముతున్నారు. నాలుగు బోండాలు.. రూ. 25 ఉండగా ఇప్పుడు రూ. 40కి పెంచారు. ప్రస్తుతం ఒక పరోటా రూ.30కి అమ్ముతున్నారు. గతంలో ప్లేన్ దోశ రూ. 20 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 30కి పెంచారు. మసాల దోశ రూ. 40కి చేర్చారు. ఇక కాస్త రుచికోసం ఆనియన్ దోశ, ఉత్తప్ప వంటివి కోరితే మాత్రం రూ. 50 చెల్లించాల్సిందే. టిఫిన్ చేశాక కాస్త తియ్యగా టీ, కాఫీ తాగాలనుకునే వారికి తాగక ముందే ధరలను చూసి చేదు అనిపిస్తుంది. కరోనా కంటే ముందు టీ కొన్ని చోట్ల రూ. 5, కొన్ని చోట్ల రూ. 8 అమ్మేవారు. ఇప్పుడు అన్నీ చోట్ల టీ రూ. 10కి అమ్ముతున్నారు. కాఫీ కాస్త రూ. 15కు చేశారు. ధరలు ఇలా ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు టిఫిన్లు చేయలేని పరిస్థితి నెలకొంది. మీల్స్ సైతం.. ఇదిలా ఉండగా హోటళ్లలో ప్లేట్ అన్నం రూ. 50 లభించేది. ఇప్పుడు ఏకంగా రూ. 70కి పెంచారు. ఫుల్ మీల్స్ రూ. 70 ఉండేది, ఇప్పుడు అత్యధిక హోటళ్లలో రూ. 100కు చేర్చారు. ఇలా చికెన్, మటన్ బిర్యానీల రేట్లు కూడా అమాంతం పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ధరలు పెంచక తప్పలేదని హోటళ్ల యజమానులు అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, హోటల్ అద్దెలు పెంచడంతో తాము ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అధిక ధరలు సామాన్యులను రుచికరమైన అల్పాహారానికి కొంత దూరం చేసిందనే చెప్పవచ్చు. -
టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు
చింతలపూడి/ఏలూరు (ఆర్ఆర్ పేట): పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని ఒక చిన్న హోటల్ యజమానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. పట్టణానికి చెందిన సాయి నాగమణి కొత్త బస్టాండ్ సమీపంలో టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో నివ్వెరపోయారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంపై చర్యలు.. విద్యుత్ మీటర్లకు రీడింగ్ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్ రీడింగ్ మెషీన్లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్లో గత నెలలో మార్చిన మీటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా బుధవారం తిరిగి రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్ ప్రభాకర్‌ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్ చేశామని వివరించారు. ఇవీ చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
టిఫిన్‌దాత సుఖీభవ.. థాంక్యూ రాజన్న
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): చదువుపై ధ్యాసపెట్టిన విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి మర్యాల రాజన్న అందిస్తున్న అల్పాహారం ఎంతో దోహదపడుతోంది. పరీక్షల్లో మంచిర్యాంకులు సాధించాలనే తపనతో..విద్యార్థులు అదనపు తరగతుల్లో మునిగి ఆకలితో ఉంటున్నారు. కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న విద్యార్థులకు నాలుగేళ్లక్రితం ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించారు. ప్రస్తుతం మొత్తం 759 మంది విద్యార్థులకు ఈ ఏడాది అల్పాహారం అందించనున్నారు. నాలుగేళ్లక్రితం మొదలైన కార్యక్రమం పదోతరగతి విద్యార్థులతోపాటు, ఇంటర్ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2016–17 సంవత్సరంలో 129 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలురాయగా వీరికి నాలుగునెలలపాటు అల్పాహారం అందించారు. ఆ తరువాత 2017–18లో 119 మంది, 2018–19లో 99 మంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూరుస్తున్నారు. సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సారంగాపూర్, బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం మూడేళ్లక్రితం ప్రారంభించి, ఇంటర్ మొదటి, రెండోసంత్సరం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ ఏడాది సారంగాపూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 115 మంది, ఇంటర్ రెండో సంవత్సరంలో 77 మంది విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. బీర్పూర్ జూనియర్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో 163 మంది, ఇంటర్ రెండోసంవత్సరంలో 181 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూర్చుతున్నారు. . సారంగాపూర్ మండలంలోని ఇతర ఉన్నత పాఠశాలల్లో.. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు గడిచిన మూడేళ్లుగా అల్పాహారం అందిస్తుండగా, ఈ ఏడాది 52 మందికి అందిస్తున్నారు. రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మందికి, అర్పపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 19 మందికి, రేచపల్లి ఉన్నత పాఠశాలలో 51 మంది పదోతరగతి విద్యార్థులకు నాలుగునెలలపాటు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. మా మంచి రాజన్న కోనాపూర్ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న జగిత్యాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. విద్యాభివృద్ధికి కొంత ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో నాలుగునెలలపాటు అల్పాహారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సహకారంతో నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అల్పాహారంలో అటుకులు, ఉప్మా, మరమరాలు, మక్క అటుకుల వంటివి అందిస్తున్నారు. వీటిని రుచికరంగా తయారు చేయడానికి అందులోకి కావాల్సిన వస్తువులు పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తున్నారు. కలెక్టర్ ఉత్తేజం స్ఫూర్తి నింపింది కలెక్టర్ పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం స్ఫూర్తినిచ్చింది. మనకున్న దానిలో కొంతైన ఇతరులకు ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత మంచి చేస్తాడనేది నా నమ్మకం. అందుకే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా కొనసాగిస్తా. – మర్యాల రాజన్న చదువుపై శ్రద్ధ పెంచుతుంది రాజన్న సార్ మా కళాశాలలో అల్పాహారం అందిస్తున్నారు. టైంకు తినడంతో మాకు చదువుపై శ్రద్ధపెరుగుతుంది. రాజన్న కుటుంబానికి అంతా మంచి జరగాలి. – తిరుపతి, బైపీసీ, రెండోసంవత్సరం, సారంగాపూర్ థాంక్యూ రాజన్న భవిష్యత్‌లో మేము ఉన్నతంగా ఎదిగితే..మేము రాజన్న సార్ చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉంది. మాకు అందించే అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. – నవ్య, ఎంపీసీ రెండో సంవత్సరం సారంగాపూర్ జూనియర్ కళాశాల -
పరగడుపున ప్రత్యేకమా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదోతరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వివిధ సబ్జెక్టుల బోధనపై దృష్టి సారించారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరగడుపున అలాగే వస్తున్నారు. దీంతో వారికి అర్ధాకలితో నీరసం తప్పడం లేదు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు ఎక్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో ఉదయం వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుంటే సరి లేదంటే సాయంత్రం వరకు ఇబ్బందులు తప్పడం లేదు. వీరితో పాటు గతంలో దాతలు, అధికారులు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆకలితో చదివిన చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదని కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు. అల్పాహారం అందిస్తేనే ఫలితాలు గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ చొరవతో పదోతరగతి విద్యార్థులకు మల్టీగ్రెయిన్ బిస్కెట్లను ఉదయం, సాయంత్రం అందజేశారు. ఈ సంవత్సరం అలాంటి చర్యలేవీ తీసుకోలేకపోయారు. ఇక జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్ బాలుర కళాశాలలో రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో అధ్యాపకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే జడ్చర్ల, మిడ్జిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల విద్యార్థులకు దాతలు, నాయకులు, సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. పూర్తయిన సిలబస్ ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు సిలబస్ పూర్తి చేశారు. వీరికి వచ్చే ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చదువులో వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ చూపుతూ, స్లిప్‌టెస్టులు యూనిట్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు దాదాపుగా సబ్జెక్టులన్నీ పూర్తయ్యాయి. అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో గణితం, సైన్స్, ఇంగ్లిష్‌పై ప్రిపరేషన్ సాగడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చదువు ఒత్తిడితో పాటు దూరం నుంచి రావడం, పోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు సహకరించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దాతలు ఆదుకుంటేనే.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల సిలబస్ పూర్తయింది. ఈసారి వందశాతం ఫలితాల దిశగా కృషి చేస్తున్నాం. అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.– వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ -
ఇడ్లీ తిన మనసాయె!
‘రోజూ ఇడ్లీయేనా..’ మన ఇళ్లలో డైనింగ్ టేబుళ్ల దగ్గర, టిఫిన్ చేసేటప్పుడు ఈ డైలాగ్ తరచూ వింటుంటాం. ఇక హోటల్‌కు వెళితే మెనూలో ఇడ్లీ తప్పించి మిగతా వెరైటీలపైనే మన దృష్టంతా ఉంటుంది. రకరకాల కాంబినేషన్లలోని దోసెలు, పెసరట్లు, పూరీలు ఆర్డర్ చేసి లొట్టలేస్తాం. అయితే జిల్లాలోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు మాత్రం మాకు ఇడ్లీయే కావాలంటున్నారు. మెనూ కార్డు చూడకుండా.. ఏం టిఫిన్లు ఉన్నాయని సర్వర్‌ను అడక్కుండానే.. ఇడ్లీ, సాంబారు ఆర్డర్ చెసేస్తున్నారు. ఓ పేరొందిన హోటల్లో గతంలో రోజుకు 2వేల ఇడ్లీలు అమ్ముడవుతుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 4 వేలు దాటింది. ఇంతకీ ఇడ్లీకి హఠాత్తుగా అంత డిమాండ్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. అనంతపురం న్యూసిటీ : జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర పీడితులతో నిండిపోయాయి. అదే సమయంలో హోటళ్లలో ఇడ్లీలకు డిమాండ్ రెండు రెట్లు పెరిగింది. ఈ రెండిటికీ లింకేంటి అంటారా? చాలా ఉంది. సులువుగా జీర్ణమయ్యే ఇడ్లీయే తినాలన్న వైద్యుల సూచనలతో జనం రెండు పూటలా వాటిని ఇడ్లీతోనే సరిపెడుతున్నారు. మామూలుగా ఉదయం లేదా సాయంత్రం జనం వీటిని తినేందుకు ఇష్టపడేవారు. విజృంభించిన జ్వరాలతో డాక్టర్ల సలహా మేరకు మూడు పూటలా ఇడ్లీ సాంబర్తో సరిపెట్టుకుంటున్నారు. దీంతో హోటళ్లలో ఇడ్లీలు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రోజూ 3వేల మంది చికిత్స పొందుతుంటే.. ఇందులో వెయ్యి మందికి పైగా జ్వరపీడితులే ఉన్నారు. జ్వరంతో నీరసించడంతో సులువుగా జీర్ణమయ్యే ఆహారమైన ఇడ్లీ వైపే రోగులు మొగ్గుచూపుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. ఇడ్లీనే ఎందుకు? ఇడ్లీలో చాలా పోషకాలున్నాయి. జ్వరం వచ్చినప్పుడు మూడు ఇడ్లీలు తింటే మనకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. పిండి పులియబెట్టడం వల్ల విటమిన్లు పెరుగుతాయి. ఆవిరితో ఉడికించడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. నూనె వాడకపోవడం వల్ల ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు దరిచేరవు. ధాన్యం, పప్పు కాంబినేషన్ వల్ల సంపూర్ణ పోషకాలు అందుతాయి. వేడివేడిగా కావాలంటే క్యూ తప్పదు ఇటీవల అనంతపురం హోటళ్లలో ఇడ్లీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. జ్వరపీడితులతో పాటు వృద్ధులు, యువతలో ఎక్కువ మంది ఇడ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. జంక్‌ఫుడ్ వల్ల అనేక గ్యాస్ట్రిక్, ఇతర సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇడ్లీ ఫేవరేట్ ఫుడ్‌గా మారింది. నగరంలోని ప్రధాన హోటళ్లతో పాటు సప్తగిరి సర్కిల్, క్లాక్‌టవర్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, కమలానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా సంఖ్యలో ఇడ్లీ సెంటర్లున్నాయి. గతంలో విక్రయాలతో పోలిస్తే ఇటీవల వ్యాపారం 30 నుంచి 50 శాతం పెరిగినట్లు చెపుతున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లలో ఒక్క పూట వెయ్యి నుంచి 1,500 ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి. మంచి పోషక విలువలున్నాయి ఇడ్లీలో మంచి పోషక విలువలు ఉంటాయి. జ్వరంతో బాధపడుతున్న వారికి అవసరమైన అన్ని రకాల క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఇడ్లీని ఆహారంగా తీసుకోవచ్చు. – నందిని, న్యూట్రిషియన్ కౌన్సిలర్, సర్వజనాస్పత్రి, అనంతపురం సులువుగా జీర్ణమవుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇడ్లీనే ఆహారంగా తీసుకోవాలని చెబుతుంటాం. ఎందుకంటే చాలా సులువుగా జీర్ణమవుతుంది. దీని ద్వారా ఇతర ఇబ్బందులు ఏమీ ఉండవు. – డాక్టర్ ప్రవీణ్ దీన్‌కుమార్,చిన్నపిల్లల వైద్య నిపుణులు,సర్వజనాస్పత్రి, అనంతపురం -
పేదరాలి ఇంటికి పెద్దసార్
రాయచూరు రూరల్: ఓ ఐపీఎస్ అధికారి అనుకుంటే ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి టిఫిన్ వస్తుంది. పెద్ద పెద్ద చెఫ్‌లు వండిపెడతారు. కానీ ఆ ఎస్పీ ఓ చిన్న పూరిగుడిసెలో ముసలమ్మ చేసిన టిఫిన్‌ను పూరెగుడిసెలో ఆరగించి అందరినీ అబ్బురపరిచారు. జనంతో మమేకం కావడం ఎలాగో చూపించారు. ఆదివారం కర్ణాటకలో రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో ఎస్పీ వేదమూర్తి ఆధ్వర్యంలో యువత, ఉద్యోగులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. పాడుబడ్డ బావిని శుభ్రం చేసి, దాని చుట్టూ మొక్కలు నాటారు. ఎస్పీ వేదమూర్తి గ్రామంలో సంచరిస్తున్న సమయంలో పాలమ్మ (70) అనే వృద్ధురాలు ఆయనకు నమస్కారం చేసింది. బాగున్నావా అమ్మా అని ఎస్పీ ఆమెను పలకరించారు. ఉదయం ఏమైనా తిన్నారా?, తింటావా అని ఆమె ఎస్పీని ప్రశ్నించింది. ఎస్పీ సరేనంటూ ఆమె పూరిపాకలోకి వెళ్లారు. పాలమ్మ ఇచ్చిన జొన్నరొట్టే, శనగపిండి కూరని తిన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
నన్ను చూడండి
ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్ అంతా మూసేసి టిఫిన్ తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా? దయచేసి నన్కొకసారి చూడండి. ఇంతకు కొంచెం ముందు నేను తోసుకుంటూ బస్సు ఫుట్‌బోర్డ్ ఎక్కాను. తర్వాత ఆ జనసమూహం మధ్య అటూ ఇటూ దూరి, సరిగ్గా ఒక ఎలుక గొయ్యిత్రవ్వినట్లు త్రోవ చేసుకొని ఇంతదూరం వచ్చి పడ్డాను. బస్సుపై ఊచలు చాలా ఎత్తు. వాటిని అందుకుని వ్రేళ్లాడలేను. నేను పొట్టివాణ్ని. అంచేత సీట్ల వెనకాల పట్టుకుని నిలబడ్డాను. బస్సు కుదుపికి ఊగవలసి వచ్చినప్పుడు, ప్రక్క వాళ్ల మీద పడి సర్దుకోవలసి వచ్చినప్పుడు, చుట్టు పక్కల ఉన్న జనం నన్ను కోపగించుకోలేదు. కారణమేమిటంటే నా బరువు చాలా తక్కువ. నేనెవరి మీదైనా పడ్డా వాళ్లకు దెబ్బ తగలదు. నా ఇరువైపులా ఉన్న మనుష్యులు పర్వతాలంత ఎత్తుగా ఉన్నారు. వాళ్లు నన్నెంతగా మూసేవారంటే, అసలు వాళ్లు నన్ను చూడలేదనిపిస్తోంది. లేకపోతే చూసికూడా నన్ను ఎవరూ లెక్కచేయడం లేదు. ఇదే చిక్కు.నేను ఉన్నా లేకపోయినా వాళ్లకు లాభం కాని నష్టం కాని లేదు. నా ముఖంలో కూడా ఏమి ప్రత్యేకత లేదు...ఎవరైనా నన్ను వేరేగా గుర్తుపట్టేందుకు. 40 సంవత్సరాల తరువాత నా తల క్రమంగా పండిపోయింది. నా జుట్టు పలచబడిపోయింది. నా పెళ్లి అయ్యాక నన్ను కలవరపరిచే తమాషా సంఘటన ఒకటి జరిగింది. నేను నా భార్యను తీసుకొని బజారు పని మీద బైటకు వెళ్లాను. కాపురానికి తీసుకురావడం కోసం కొన్ని లాంఛనాలు బట్టలూ మొదలైనవి కొనవలసి వచ్చింది. ‘‘న్యూ మార్కెట్‌కు వెళదామా?’’ అని నా భార్యను అడిగాను. న్యూమార్కెట్‌లో సరుకులు కొనేందుకు తగిన డబ్బు లేదు. బస్సు పక్కన ఉన్న అంగడిలో ఏవో చవక బట్టలు కొనేందుకు చాలిన డబ్బు మాత్రం ఉంది. అయినా ఆ మాట ఎందుకన్నానంటే ఒకటి నా భార్య పల్లెటూరిది. ఎప్పుడూ న్యూమార్కెట్ చూడలేదు. రెండోది నాతో పోలిస్తే మా అత్తింటివాళ్లు కాస్త ధనవంతులు. అంచేత నేను న్యూమార్కెట్ అని చెప్పేసరికి నా నూతన వధువు చాలా సంతోషిస్తుందని, అక్కడ బట్టలు గిట్టలూ కొంటే ఆ సంగతి తెలుసుకొని మా అత్తవారి తాలూకు వాళ్ల కనుబొమలు కాస్త పైకిలేస్తాయని. కానీ ఈ న్యూమార్కెట్ సంఘటన ప్రాణసంకటం చేసే తప్పయింది. ఏమయిందంటే, న్యూమార్కెట్లోకి ప్రవేశించి ఆ తళతళలాడే కొట్లలోని సరుకులు చూసేçసరికి మా ఆవిడకు ఒళ్లు తెలియలేదు. నా వైపు చూడడమే మరిచిపోయింది. ఆమె ఏ ఒక వస్తువుపైనా ప్రత్యేకించి శ్రద్ధ చూపించక, అన్ని వస్తువులనూ పరిశీలిస్తూనే ఉంది. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేటప్పుడు సోల్జర్లు ఎలా నడుస్తారో ఆ పద్ధతిలో ఆమె దుకాణాలలో సరుకులు చూస్తూ నడుస్తోంది,మధ్యమధ్య ఆమె ఏదైనా నేను ప్రక్కన ఉన్నాననుకొని మాట్లాడినా, నిజానికి నేను ఉన్నానా లేదా అన్న సంగతి పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను కనిపించలేదో నన్ను వెతుక్కుంటూ నిలబడింది. నాలుగువైపులా వ్యాకులా భావంతో చూస్తోంది నా కోసం. తమాషా చేద్దామని ఆమెకు కనిపించేలా ముందుకు వెళ్లలేదు. గుండ్రంగా ఉన్న సందుల్లో ఒకచోట హఠాత్తుగా వెళ్లిదాక్కున్నాను. పల్లెటూరిపిల్ల నా కోసం వెదుకుతూనే ఉంది. నాలో నేను నవ్వుకున్నాను.ఒక ప్రక్క నుంచి ఆమె ఏడుపు ముఖంతో ఇటూ అటూ నా కోసం నాలుగు ప్రక్కలా వెతికి బయలుదేరిన చోటికి తిరిగి రావడం కనిపెడుతున్నాను. ఎన్నిసార్లు తిరిగినా ఆమె నన్ను కనిపెట్టలేదు. గాభరలో నన్ను వెతుకుతున్న మనిషి నన్ను ప్రక్క నుంచి దాటిపోయింది. కానీ గుర్తుపట్టలేకపోయింది. ఈ పల్లెటూరిపిల్ల గడుసుదే కాబట్టి ఆమె కావాలనే నన్ను చూసీచూడనట్లు నటిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆమె ముఖం చూస్తే ఆమె అలా తమాషా చేస్తుందని అనుకోలేకపోయాను. ఆఖరికి ఒక గడియారం దుకాణం ముందు ఆమె త్రోవకు అడ్డువెళ్లి అన్నాను....‘‘హేయ్!’’ ఆమె ఉలిక్కిపడి నోటమాట లేకుండా నా వైపు చూసింది. అలా చాలాసేపు చూసి జోరుగా ఊపిరి విడిచి, వణుకుతూ నవ్వి అంది: ‘‘ఎక్కడున్నావు ఇంతసేపు నువ్వు? నేనెంత సేపటి నుంచి నిన్ను వెదుకుతున్నానో!’’ఆమె నిజం చెబుతుందని అనుకున్నాను. బస్సులో తిరిగివెళ్లేటప్పుడు ఆమెతో చెప్పాను–ఇలా నేను దాగుడు మూతలు ఆటలాడేటప్పుడు ఆమెకు చాలాసార్లు దగ్గరగానే ఉన్నానని, ఆమెముందే నిలబడ్డానని. మొదట ఆమె నా మాటలు నమ్మలేదు. కానీ నేను తిరిగితిరిగి నొక్కి చెప్పాక ఆశ్చర్యపడి అంది. ‘‘నిజంగానా! ఇంకెప్పుడు అలా దాక్కోక. అలా చేస్తే చాలా ప్రమాదకరం’’ ఆపు, కండక్టర్ భాయి, నేనిక్కడ దిగుతా....చూడు, దాదా చూడండి, భాయి, నా కళ్లజోడుని కాస్త కనిపెట్టండి...అయ్యో చూడండి, ఎవ్వరూ నా మాట వినరా, నేను దిగే ముందరే కండక్టరు బస్సు వెళ్లే గంటకొట్టాడు. తలుపుకి అడ్డంగా మొద్దుబండలాగా ఒక అతను కదలకుండా నిలబడ్డాడు. హవాయ్ షర్టు కట్టుకున్న కుర్రవాడు, మోచేతితో త్రోసుకుంటూ వచ్చిన కళ్లజోడు వంకర చేశాడు. అందుకే అన్నాను:‘‘ఎవ్వరూ నన్ను లెక్క చెయ్యరు–బస్సులో కానీ, ట్రాములో కానీ, రోడ్డు మీద కానీ...’’ వర్షాకాలం కాబట్టి ఎండవేడి తక్కువగా ఉంది.కొంచెం దూరంలో ఒక క్రాసింగు. దాని తర్వాత మా ఆఫీసు. నేను క్రాసింగు దగ్గరకు వచ్చి రోడ్డు దాటటానికి కాలుపెట్టేసరికి ట్రాఫిక్ పోలీసువాడు చెయ్యి అడ్డుపెట్టి చాపాడు. నేను దాటవలసిన రోడ్డే అడ్డుపడింది.‘‘ఏం ట్రాఫిక్ పోలీసుభాయి, నేను రోడ్డు దాటాలని చూడడం లేదా? కాస్త నీ చేయి దింపితే నీ చేతికేమైనా హాని కలుగుతుందా’’ నేను ఫస్ట్‌ఫ్లోరు పైకి వెళ్లేందుకు ఎక్కే లిఫ్టు ఒక వందసంవత్సరాల పూర్వానిది. గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ లిఫ్ట్ వాడుతున్నాను. ఈ 13 సంవత్సరాలు లిఫ్ట్బాయి రామస్వరూప్ నన్ను పైకితీసుకువెళుతున్నాడు.‘‘ఏం భాయి రామస్వరూప్ నా 26వ ఏట లేక 27వ ఏట నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పుడు చెప్పు నా పేరేమిటి?’’ అని అడిగేసరికి రామస్వరూప్ నవ్వుతూ అంటాడుగదా–‘‘తమరు అరవింద బాబుగారు కదా?’’అది నా పేరేం కాదు. నేనెప్పుడూ అరవిందబాబుని కాను. చిన్నప్పటి నుంచి అరిందమ్ బమాని మాత్రమే.పదేళ్ల నుంచి క్యాషియర్‌గా ఉంటున్నాను. నేను అవలీలగా డబ్బు లెక్కపెట్టగలను. అందుచేత నాకు క్యాష్ పని తప్ప మరొకటి ఎక్కడా ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా క్యాషియర్‌గా మళ్లీ తిరిగిరావలసిందే.ఒకప్పుడు పేమెంట్, రిసీవింగ్ పేమెంటే ఎక్కువ. ఎందుకంటే మానవులకు ధనం ఇవ్వడం కంటే పుచ్చుకోవడానికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి.ఒక తీగపంజరం మధ్య నేను కూర్చుంటాను. నా గుండెకాయకు దగ్గరగా అనేక సొరుగులు గల ఒక డ్రాయరు. దాని మూలల్లో ఎన్ని రూపాయల నోట్లున్నాయో, ఎంత చిల్లర ఉందో నేను కళ్లు మూసుకుని తప్పు లేకుండా చెప్పగలను.పేమెంట్ చేసేటప్పుడు నేను డ్రాయరు తెరిచి లెక్కగా డబ్బు బైటకు తీసి, తర్వాత డ్రాయరు మూసి, మళ్లీ డబ్బు లెక్కపెట్టి, మళ్లీ డబ్బు ఇచ్చాక మరో పేమెంట్ కోసం చెయ్యి జాపి టోకెన్ తీసుకుని, మళ్లీ డ్రాయర్ తెరిచి డబ్బు బైటకు తీసి లెక్కపెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాగేవ్యవహారం నడుస్తుంది. నా ఎదురుగుండా కదులుతున్న వాళ్లు నా పని చూసి బహుశా....‘‘ఏమిటి ఈ మానవుడు ఒకే విసుగు పుట్టే పద్ధతిలో పనిచేస్తున్నాడు!’’ అని అనుకుంటూ ఉంటారు. రామ్‌బాబు మాకు బాగా పాత ఖాతాదారు. అతనికి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఏజెంటు కూడా అతడిని బాగా గౌరవిస్తాడు. చాలా ఛాదస్తపు నిక్కచ్చి అతనిది. చాలామటుకు ఎవళ్లనీ పంపించకుండా తనే చెక్కులుక్యాష్ చేసుకుంటాడు. నేనెప్పుడు అతనికి పేమెంట్ చేసినా, అతను ఊచల మధ్య నుంచి ప్రసన్నముఖంతో నాకు ధన్యవాదాలు చెబుతాడుఒకమారు నా పెద్దబావమరిది కలకత్తా వచ్చి పట్టణం అంతా తిరుగుతూ చాలా డబ్బు తగలపెట్టాడు. ఆ సందర్భంలో అతను నన్ను పార్కుస్ట్రీటులోని ఒక రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మాకు రామ్‌బాబు కనిపించాడు. ఒక్కడే కూర్చున్నాడు. చేతిలో తెల్లజిన్. కళ్లుఏవో కలలు కంటున్నట్లున్నాయి. నిజం చెప్పాలంటే డబ్బున్నవాళ్ల మాట నేను ఏమంత గొప్పగా భావించను. అందుమూలాన రామ్బాబుతో మాట్లాడాలని నాకనిపించలేదు. అందుచేత నాకు తెలిసున్న పాత స్నేహితులున్న చోటుకు ముందుకు నడిచాను.రామ్‌బాబు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ఎత్తి అన్నాడు:‘‘ఎక్కడో చూసినట్లుందే! జ్ఞాపకం రావడం లేదు’’అప్పుడు నా బావమరిది ముందు నాకు చాలా సిగ్గేసింది. అతను నిజంగా గుర్తు పట్టలేకపోతే, నిజంగా ఇటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తే నాకు గౌరవహీనం అనిపిస్తుంది. అప్పుడు నేను చేసేది లేక మాబ్యాంకు పేరు చెప్పి, నేనెక్కడ క్యాషియర్ని అని చెప్పాను...అప్పుడు అతని చేతిలోనిజిన్లాగే అతని ముఖం స్వచ్ఛంగా పరిష్కరించబడినట్లయింది.గుర్తు పట్టాను అని, ప్రసన్నతతో ఇంకా ఇలా అన్నాడు.‘‘ఏం చెప్పను. ఈ ఊచల మధ్య ఆ పంజరం మధ్య మిమ్మల్ని చూడడం అలవాటైన వాళ్లు, అకస్మాత్తుగా ఇలాంటి చోట చూస్తే ‘తెలియదు’ అని చెప్పవచ్చు. అసలు సంగతి ఏమిటంటే, ఈ పర్స్పెక్టివ్ తప్పిస్తే,ఒక మనిషిని ఇంకో మనిషి గుర్తుపట్టాలంటే వేరే మార్గం ఏముంది.ఆ పంజరం మధ్య ఊచల లోపల నుంచి మీరు ఈ కోటూ, పాంటూ, బట్టతలా వీటితో ఉన్న నన్ను చూడండి. వీటి నుంచి వేరే చేస్తే, అప్పుడు మీకు తెలుస్తుంది. మీకూ, నాకూ నిజమైన పరిచయం లేదని. ఈమాటగ్రహించారా, ఇప్పుడే నేను పర్స్పెక్టివ్ మాట ఎత్తాను. నా చిన్నప్పుడు నేను రైల్వేకాలనీలో ఉండేవాణ్ణి. మా నాన్నగారు టాలీక్లబ్లో ఉద్యోగం చేసేవారు. ‘కాటిహార్’లోని రైల్వేక్వార్టర్సులో మా ప్రక్క ఇంటి నుంచి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి తన తల్లి ఇంట్లో ఆదరం లేక, మా ఇంటికి వచ్చి, అప్పుడప్పుడూ మా అమ్మకి వంటింట్లో సాయం చేస్తుండేది. ముడతలు పడి, చిరిగిపోయిన గౌనులోమోకాలుదూర్చి పరోటా వత్తేది. అప్పుడప్పుడూ మా అమ్మ అంటూ ఉండేది ‘దీనితో నీకు పెళ్లి చేస్తాను’ అని. ఆ మాట విని ఆ పిల్లను నేను ప్రేమతో చూసేవాడిని. కానీ ఈ జగత్తులో ఎక్కువ రోజులు అలా ఉండలేదు ఆ పిల్ల’’అంతవరకు చెప్పిన రామ్‌బాబు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. అప్పుడు నేను బాధతో అడిగాను–‘‘తర్వాత ఏమైంది, ఆమె చనిపోయిందా?’’. ఆయన తలాడించి ‘‘లేదు లేదు.పెద్దయ్యాక దాన్ని నేను పెళ్లాడాను. అది ఇప్పుడు నా భార్య. ఎప్పుడూ విసుక్కుని సాధించే స్వభావం దానిది. ఆమె దూషణం వింటుంటే కష్టపురోజుల్లో మా అమ్మ రెండు నారింజపళ్లు ఇస్తే, నోటినిండానవ్వే ఆమనిషేనా ఈ మనిషి అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు చూడండి. దానితో దెబ్బలాడి బయటికివచ్చాను. ఆ పూర్వపురోజులూ, అది వంటింట్లో కూర్చొని నిప్పంటించడం, ముడతలుపడిన, చిరుగుగౌనులో దాని మోకాళ్లు దాచుకోవడం, దాని అప్పటి కూర్చునే తీరూ అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు నా మనసు ప్రేమతో నిండుతుంది. ఇంటికి తిరిగివెళ్లి దాని కోపాన్ని పోగొట్టాలి. అర్థం అయిందా!’’ అని రామ్‌బాబు ఆ తెల్లటిజిన్తో కొంత డోస్ వేసుకుని నవ్వాడు. ‘‘ఈ ఊచల కిటికీ ఉందే–దేనిలోంచైతే మిమ్మల్ని చూస్తానో అదే అసలు. ఈ ఊచలకిటికీ ఇప్పుడు 23–26 సంవత్సరాల మధ్య యువకుడొకడు పేమెంట్ కోసం వచ్చి నిలబడ్డాడు. అతనికి నేను తెలుసు. వాళ్ల నాన్నకి పాతకార్లు కొని అమ్మడం వ్యాపారం. ఇంతకు పూర్వం వాళ్ల నాన్న వస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇతడొస్తున్నాడు బ్యాంకుకి. ‘మీ నాన్నగారు బాగున్నారా?’ అని అడిగాను. ‘‘అ’’ అన్నాడు. కానీ నాకేమని అనుమానం ఉందంటే ఒకరోజు ఎప్పుడైనా ఇక్కడ నుంచి నన్ను బదిలీ చేస్తే ఈ స్థానంలో ఇంచుమించు అందరిలాగా ఉండే ముఖం గలవాడెవ్వడైనా కూర్చుంటే, అప్పుడు అతను ఆ తేడా కనిపెట్టలేడని. అప్పుడు కూడా ఇతను కౌంటర్ మీద డప్పు వేస్తూ, కొత్తగా వచ్చిన క్యాషియర్ కంటపడితే, అతని వైపు కూడా పూర్వపరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వుతాడు. తన తప్పు కనిపెట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది అతనికి. ఎందుకంటే అతను నన్నింత క్రితం ఎప్పుడూ సరిగ్గా చూడలేదు.బహుశా అతని కొత్తగర్ల్ఫ్రెండ్ మాట ఆలోచించుకుంటూ ఉండవచ్చు. అతను మెడతిప్పి రిసెప్షన్ పిల్లకేసి చాలాసార్లు చూశాడు.ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్ అంతా మూసేసి టిఫిన్ తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా? ∙∙ అప్పుడప్పుడూ నాకీ సందేహం వస్తుంది. నేను నిజంగా ఉన్నానా అని. బ్యాంకులోని ఈ ఊచల మధ్య నుంచి ప్రజలు నా చేతిలోంచి డబ్బు తీసుకుని లెక్కపెడతారు. కొందరు నాకు ధన్యవాదాలు చెబుతారు. కానీ నా స్థానంలో మరెవరైనా వస్తే, ఈ డబ్బు లెక్క పెట్టుకునేవాళ్లూ, ఈ కృతజ్ఞత తెలియజేసే కొందరూ, ఈ ఊచలకిటికీకి అవతల ఉన్న వ్యక్తిలో మార్పు గమనించరు. ఆ న్యూమార్కెట్ సంఘటన తీసుకోండి. నా భార్యే నడుస్తూ నడుస్తూ నన్ను వెతికింది కానీ, ఎదురుగుండా కళ్లముందు ఉన్న నన్ను గమనించకుండా దాటి వెళ్లిపోయిందంటే, ఇంక మిగతావాళ్లు నన్ను గమనించకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ‘‘నాన్నా, రథోత్సవానికి వెళ్లాలి. తొరగా ఇంటికొచ్చెయ్యి’’ అన్నాడు మా చిన్న అబ్బాయి హావనేను మెట్టు మీద అడుగు పెట్టానో లేదో వాడు పై నుంచి పరిగెట్టుకుంటూ దిగి వచ్చేశాడు. ‘‘ఇంత ఆలస్యం చేశావేం, నాన్నా? వెళదామా?’’ అన్నాడు.‘‘వెళదాం బాబూ, చాలా ఆకలేస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకొని ఏదైనా కొంచెం తిన్నాక వెళదాంలే’’ అన్నాను.హావూ చాలా అల్లరి పిల్లాడు. తీర్థంలో అడుగుపెట్టాడో లేదో నా చెయ్యి విడిపించుకుని నడవడం మొదలెట్టబోయాడు. ‘‘నా చెయ్యి పట్టుకుని ఉంటేనే నీకు తీర్థం చూపిస్తాను’’ అన్నాను. వాడు గట్టిగా అరిచాడు:‘అదేంటి నానా? ఇక్కడ కూడానా? నన్ను స్వతంత్రంగా అన్నీ చూడనీ’’చేతిలో ఒక పాపిడి పట్టుకుని రంగులరాట్నం ఎక్కాడు హావూ. ఆ రాట్నం ఆకాశం పైకి ఎగురుతున్నప్పుడు, మళ్లీ నేలపై దిగుతున్నప్పుడు ఒళ్లు తెలియని ఆనందంతో నవ్వుతున్నాడు. ఆ తర్వాత మేమిద్దరం ఒక అరగంటసేపు సర్కస్ చూశాం. వాడి కళ్లు మటుకు తళతళ మెరుస్తున్నాయి. బయటకు వచ్చాక వాడిచేయివదిలేశాను. నా ప్రక్కగా నడుస్తున్నాడు. దుకాణంలో చక్కగా ప్రదర్శించబడిన ఈలలు చూశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఏరోప్లేన్‌ల వరుస చూశాడు. తర్వాత మెల్లిమెల్లిగానడుస్తూఆటతుపాకీలు, రంగురంగుల బొమ్మలూ చూస్తున్నాడు.నెమ్మదిగా అడుగు వేస్తున్నాడు. క్రమంగా జనసమూహంలోకి చొచ్చుకుపోయాడు హావూ.హావూ ఎక్కడా కనిపించడం లేదు. ‘హావూ’ అని పిలుస్తూ ముందుకు వెళ్లాను.అవును సార్, మీరెక్కడైనా చూశారా నీలం చొక్కా తొడుక్కున్న నాలుగేళ్ల అబ్బాయిని? వాడి పేరు హావూ. చాలా అల్లరికుర్రాడు.ఈ బొమ్మలకొట్టు ముందు నిలబడ్డవాడు కాదు–వాళ్లిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారనుకోండి. వాడి ముఖంలోని ప్రత్యేక గుర్తులు నాకిప్పుడు తట్టడం లేదు. ముఖం నా ముఖంలాంటిదే. నీలం చొక్కాతొడుక్కున్న కుర్రాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే నాలుగేళ్ల వాళ్లూనూ. లేదండి, నేను నిక్కచ్చిగా చెప్పలేను...ఈ వేలకొలది ఉన్న బాలబాలికల మధ్య మా హావూ ఎవరో నా మట్టుకి. వాడి మట్టుకి వాడు చెప్పలేడు కూడా. ఈ జనసమ్మర్దంలో నేను ఎవరో మరిచిపోకండి. వాళ్లమ్మ కూడా ఒకప్పుడు నన్ను గుర్తుపట్టలేకపోయింది.ఒకవేళ మీరు హావూని చూస్తే దయచేసి వాడితో చెప్పండి. నేనే, నేనే వాళ్ల నాన్ననని.ఈ నన్ను కాస్త చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు మరవకండి. - బెంగాలీ మూలం : శీర్షేందు ముఖోపాధ్యాయ్ - తెలుగు : రాధాకృష్ణమూర్తి చల్లా -
అప్పు చేసే వాళ్లకు పంచాక్షరి మంత్రం!
‘‘ఏమిటయ్యా ఎప్పుడు చూసినా వీల్లేదు వీల్లేదు అంటారు’’ అని అప్పుల గుంపు ఆ ఇంట్లోకి బలవంతంగా తోసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.‘‘చెప్పాను గదయ్యా వీలులేదు’’ అంటున్నాడు సెక్యూరిటీ గార్డ్లాంటి వాడు.అప్పుడే అక్కడికి భజగోవిందం వచ్చాడు. ఈయన ది గ్రేట్ రామదాసుగారి గుమస్తా.రామదాసుగారికి అప్పులు చేయడం మంచినీళ్లు తాగినంత సులభం. ఈయన నుంచి డబ్బు రాబట్టడం ఇసుక నుంచి ఆయిల్ తీసేంత కష్టం.అప్పులవాళ్లను చూసి...‘‘రండి బాబు రండీ. చెంచయ్యా... వీళ్లందరికి టిఫిన్ పట్రా’’ అని ఆర్డర్ వేశాడు భజగోవిందం.‘‘టిఫిన్ వద్దూ పాడూ వద్దూ. మా బాకీ మాకు పారెయ్యండి చాలు’’ అని ఒంటికాలి మీద లేచి అరిచాడు ఒక అప్పాయన.‘‘అరే.. బాకీకి టిఫిన్‌కు ఎందుకు ముడిపెడతారు? తినండి బాగా తినండి. ఇదంతా మీదే. దక్కినంత దక్కుతుంది’’ అన్నాడు భజగోవిందం. ఆయన మాటలో ఎన్నో అర్థాలు కనిపించాయి. అవి వెక్కిరిస్తున్నాయి కూడా. కానీ వీళ్లకు వెక్కిరింపులతో ఏంపని?‘‘చాల్లే ఊరుకో. నీకు అంతా వేళాకోళంగా ఉంది. అప్పిచ్చి రాత్రింబవళ్లు నిద్ర పట్టక మేము ఛస్తున్నాం’’ అన్నాడు ఆ గుంపులో బక్కపలచటి వ్యక్తి.‘‘అయితే బాదంలో తినండి. బాగా నిద్రపడుతుంది. చెంచయ్యా... ముందు ఆ బాదం ప్లేట్లు అవి పట్రా’’ అని అరిచాడు భజగోవిందం. ఈ అరుపులోనూ వేళాకోళం ధ్వనించింది. ‘‘చాల్లేవయ్యా, రామదాసుగారిని పిలువు’’ అంటూ భజగోవిందం మీద భగ్గుమన్నాడు ఒకడు.ఈలోపు రామదాసుగారు రానే వచ్చారు. అప్పటి వరకు బెంగాల్ టైగర్‌గా కనిపించిన అప్పుల వాళ్లు ఏదో మంత్రం వేసినట్లు మ్యావ్గా మారిపోయారు. (ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడకపోయినా అప్పు ఇచ్చిన వారికి భయపడాలని, గజగజవణుకుతూ వారిని గౌరవంగా పలకరించాలని పెద్దలు ఎన్నడో చెప్పారు) ‘‘ఎందుకొచ్చారు?’’ దబాయిస్తున్నట్లుగా అడిగాడు రామదాసు. ‘‘మీకు అప్పు ఇచ్చాం కదండి. మా డబ్బు మాకు ఇవ్వండి. తిరగలేక ఛస్తున్నాం’’ అనాలి లెక్క ప్రకారం. అలా ఏం అనలేదు. ఇలా మాత్రం అన్నారు... ‘‘ఏ... ఏమీ లేదండి. తమకు రావుబహుదూర్ బిరుదు వచ్చిందని తెలిసి చూసిపోదామని వచ్చాం’’ ‘‘ఓహో...చూశారుగా. ఇక దయచేయండి’’ అని వెక్కిరించినంత పని చేశాడు రామదాసు. ‘‘అంతేనంటారా!’’ అని నీళ్లు నములుతూనే ‘‘మళ్లీ ఎప్పుడు రమ్మంటారు?’’ అడిగారు అప్పులవాళ్లు. ‘‘ఎందుకు రావడం?’’ అన్నాడు రామదాసు.\ ‘‘పాత బాకీ కోసం అండీ’’ సూటిగా పాయింట్లోకి వచ్చారు అప్పులవాళ్లు. ‘‘ఇస్తాను లేవయ్యా బోడి పదివేలు. లక్షలు లక్షలిచ్చిన వాళ్లే నోరెత్తడం లేదు’’ అరిచినంత పనిచేశాడు రామదాసు.\ ‘‘నువ్వు మాత్రం తగులుకున్నావు చెవి కింద జోరీగలాగా’’ అని బాసుకు వంత పాడాడు భజగోవిందం. ‘‘ఆయన్ని అడుగుతుంటే మధ్యన మీకెందుకండి’’ భజగోవిందాన్ని కొరకొరా చూశాడు అప్పాయన. ‘‘అడగడానికి వేళాపాళా ఉండనక్కర్లేదూ’’ అంటూనే ‘రణ...దీప్’ అని కేకేశాడు. రణ... దీప్ అనే సౌండ్ వినగానే వాళ్లు భయపడిపోయారు. ఎందుకంటే ఈయన రామదాసు బాడీగార్డ్. అంత్తెత్తున ఉంటాడు. అందుకే.... ‘‘మేం వెళతాం లెండి... వెళతాం లెండి’’ అని ఎక్కడి వాళ్లు అక్కడ జారుకున్నారు. అద్దం ముందు మేకప్ చేసుకుంటున్న భజగోవిందానికి ఏదో అలికిడై చూసీచూడనట్లు వెనక్కి తిరిగాడు. అమ్మో...అప్పుల వాళ్లు! వాళ్లు వస్తున్నారని గ్రహించి రాని ఫోన్‌ను చెవిలో పెట్టుకొని ‘హలో హలో’ అంటున్నాడు. అప్పుడే అప్పులవాళ్ల గుంపు వచ్చింది. ‘ఎందుకయ్యా అందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు?’’ అసహనంగా అన్నాడు భజగోవిందం. ఆయన మధ్య వాళ్ల మధ్య మాటలు ఊపందుకోబోతున్న సమయంలో సీన్లోకి రామదాసు వచ్చాడు. ‘‘ఎవరోయి వీళ్లంతా భజగోవిందం?’’ అని ఆరాతీశాడు. ‘‘వీళ్లంతా నా బాకీ వాళ్లండి. పప్పులు ఉప్పులు... అంతా చిల్లరగ్రహాలండి’’ వినయంగా చెప్పాడు భజగోవిందం. ‘‘సరే, రేపు ఇస్తాడు పోండి’’ అని అప్పులవాళ్లను గద్దించాడు రామదాసు. ‘‘వెళ్లమంటున్నారుగా. వెళ్లండి’’ భజగోవిందం కూడా బాసుకు మద్దతుగా గద్దించాడు. ‘‘అయితే భజగోవిందం నువ్వూ అప్పులు చేస్తావన్నమాట’’ ఆశ్చర్యంగా అన్నాడు రామదాసు. ‘‘అబ్బే! నేను చేయలేదండి. అప్పు చేస్తే దొరుకుతుందా? మన పరపతినిబట్టి వాళ్లే ఇస్తారు. నేను మీ గుమస్తాననేసరికి మన పరపతి పెరిగింది.వాళ్లు నా వెంట పడ్డారు. వద్దనడం ఎందుకు? ఖాతాలు పెట్టాను. ఇక చూస్కోండి. మా మామ అందులోనే, మరదలు అందులోనే, చెంచయ్య అందులోనే, నాటకం వాళ్లు, వాళ్ల బంధుమిత్ర సమేతంగా అందరూ అందులోనే వాడేవారంతా’’ ‘‘సరి సరి. ఇంకా నువ్వు అప్పు చేయడంలో కొత్త బిచ్చగానిలా కనబడుతున్నావు. నే చెప్తాను ఆ కిటుకు. నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా ఫర్వాలేదు. కానీ అప్పుల వాళ్లు ఎక్కువమంది ఉండకూడదు. ఒక్కడ్నే అడిగావనుకో అందరూ వెంటబడతారు. ఇక ముందు నీకు వెయ్యి రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకోవద్దు. పదిమంది దగ్గర పది వందలుగా మాత్రమే తీసుకో’’ అని లెక్చర్ దంచాడు రామదాసు. ‘‘ఆహా... అప్పు చెసేవాళ్లకు ఇది పంచాక్షరి మంత్రమండి. మీరు నాకో వెయ్యిరూపాయలిస్తే తొందరపెట్టేవాళ్లందరికీ ఇచ్చేస్తా’’ అని అట్టి పంచాక్షరి మంత్రాన్ని ఆయనపైనే ఎక్కుపెట్టాడు భజగోవిందం. ‘‘తొందరపడేవాళ్లేమిటోయ్ ఇంకో అయిదొందలైనా సరే అందరికీ సర్దెయ్. ఇప్పుడు మనకు కూడా చిల్లరబాకీలు తీర్చడానికి రెండు లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు’’ అంటూ భజగోవిందం ప్రయోగించిన బాణాన్ని నేలకూల్చాడు రామదాసు. ‘‘రెండు లక్షలా? ఎక్కడ చూడనండి! ఇప్పుడు బజారులో మనకేం పరపతిలేదు’’ కుండబద్ధలు కొట్టాడు భజగోవిందం. ‘‘పరపతి ఉంటే నువ్వేందుకోయ్ ఏడ్వడానికి? వాళ్లే ఇంటికి తెచ్చిస్తారు. పో...పో... పొయ్యి కొత్తవాళ్లనెవరినైనా పట్టుకురా. ఈ వ్యవహారంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లా ఎప్పటికప్పుడు మనం కొత్తవాళ్లను పట్టాల్సిందే’’ అన్నాడు రామదాసు. ‘‘మరి వడ్డీ సంగతి!’’ అని భజగోవిందం అమాయకంగా అడిగితే... ‘‘వడ్డీ ఎంతయితే ఏమిటి? ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాల్సింది అసలు’’ అన్నాడు గడుసుగా రామదాసు. -
స్నాక్స్‌తో ఆ రిస్క్ అధికం..
లండన్ : లంచ్, డిన్నర్ మధ్యలో తరచూ స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యం, జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తరచూ ఆహారం తీసుకున్న ఎలుకలతో పోలిస్తే ఆహారాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న ఎలుకలు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్టు తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. మీల్స్ మధ్య ఏ ఆహారం తీసుకోని ఎలుకలు వయసు సంబంధిత వ్యాధులను దీటుగా ఎదుర్కొంటున్నాయని, రోజుకు ఒక పూట ఆహారం తీసుకునే ఎలుకల్లో అత్యధిక జీవనకాలం నమోదవుతోందని తెలిపారు. ఆహారాన్ని ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలనే వైద్య నిపుణుల సూచనకు భిన్నంగా ఈ అథ్యయనం సరికొత్త అంశాన్ని ముందుకుతెచ్చింది. రోజుకు ఒక పూట ఆహారం తీసుకున్న ఎలుకలు దీర్ఘకాలం జీవించడంతో పాటు వయోభారంతో వచ్చే వ్యాధుల బారిన పడటం అరుదని, వీటిలో జీవక్రియల వేగం కూడా మెరుగ్గా ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ డైరెక్టర్ రిచర్డ్ జే హోడ్స్ తెలిపారు. ఈ అథ్యయన వివరాలు సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
‘టిప్’ ఇవ్వడం మంచిదా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: టిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో, సాయం సంధ్య వేళల్లో అలా అహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలసి కాఫీలు, టీలు తాగడానికి హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు లేదా సరదాగా స్నేహితులతో కలసి బీరు తాగేందుకు బార్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్వర్లకు ఎంతో కొంత టిప్ చెల్లించడం మనకు అలవాటే. టిప్పులెంత అనేది వినియోగదారుల మనస్తత్వం, వారి జేబు బరువునుబట్టి ఉంటుంది. అంటే, కొంత మంది డబ్బున్న వాళ్లు డాంబికం కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. కొంత మంది ఎంత డబ్బున్నాసరే తక్కువ టిప్‌తో సరిపెట్టవచ్చు. కొంత మంది అంతంత మాత్రమే డబ్బున్నా ఉదారంగా ఎక్కువ టిప్ ఇవ్వొచ్చు. మరికొందరు పక్కనే ఉన్న గర్ల్ ఫ్రెండ్ లేదా స్నేహితుల మెప్పు కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. అసలు ఈ టిప్‌లు అంటే ఏమిటీ? ఈ సంస్కతి ఎక్కడ పుట్టింది? ఎందుకోసం పుట్టింది? దీని వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? అన్న అంశాలపై మరోసారి ఇప్పుడు చర్చ మొదలైంది. టిప్ అంటే ‘టు ఇన్సూర్ ప్రామ్టిట్యూడ్’ అని చెబుతారు. అంటే సకాలంలో లేదా తక్షణమే ఆర్డర్ చేసినది అందించడానికని అర్థం. ఇప్పుడు పబ్స్‌గా వ్యవహరిస్తున్న ఒకప్పటి ఇంగ్లీషు హౌసెస్‌లో ఈ టిప్ సంస్కతి పుట్టిందట. సకాలంలో మంచి సర్వీసు అందించడం కోసం సర్వర్లకు టిప్ లివ్వడం మొదలైంది వాటిలోనే. అనతి కాలంలోనే ఈ సంస్కతి యూరప్ అంతటా వ్యాపించింది. 20వ శతాబ్దంలో ఉత్తర అమెరికాకు పాకింది. అక్కడి నుంచి వివిధ దేశాలకు విస్తరించింది. మనం ఇచ్చే టిప్‌లకు సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందా? ఉంటే ఎక్కువ టిప్ ఇచ్చిన వారికి ఎక్కువ సర్వీసు, తక్కువ టిప్ ఇచ్చిన వారికి తక్కువ సర్వీసు ఉంటుందా? ఇచ్చిన టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే సర్వర్ ఆశించే టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. ఓ కస్టమర్ ఎక్కువ టిప్ ఇస్తాడని ఆశించిన సర్వర్ ఆయనకు మంచి సర్వీసు అందించవచ్చు. ఆ..బేవార్స్ బ్యాచీ! టిప్ పెద్దగా ఇవ్వరని సర్వర్ భావిస్తే వారికి మంచి సర్వీసు అందించక పోవచ్చు. ధరించిన దుస్తులు, ముఖ కవలికలనుబట్టి ఎవరు ఎక్కువ ఇస్తారో, తక్కువ ఇస్తారో సర్వర్లు ఊహించవచ్చు. అప్పుడప్పుడు వారి ఊహలు తారుమారు కావచ్చు. ఇక్కడ మంచి సర్వీసంటే వేగంగా సర్వ్ చేయడమే కాకుండా, కస్టమర్లకు నచ్చిన చట్నీలనో, కూరలనో అడక్కముందే అందించడం, ఉన్నంతలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను వేడి వేడిగా సర్వ్ చేయడం. తరచుగా వచ్చే కస్టమర్లు ఎక్కువ టిప్ ఇస్తారంటే మంచి సర్వీసు, ఇవ్వరనుకుంటే సర్వర్లు నింపాది సర్వీసు ఇవ్వొచ్చు. వాస్తవానికి ఈ టిప్‌ల వల్ల సర్వీసు దెబ్బతింటుందని, ఓ సర్వర్‌కు టిప్ వందొస్తే చాలనుకుంటే ఆ సర్వర్ వంద చేతిలో పడగానే పనిచేసే చోటు నుంచి వెళ్లిపోతాడని, దాని వల్ల సర్వీసుకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పిన వాళ్లు ఉన్నారు. సర్వర్లకు టిప్‌లు ఇవ్వడం వల్ల వారి యజమానులు వారి జీతాలను పెంచడం లేదని, అందుకని వినియోగదారులు టిప్‌లు ఇవ్వడం మానేస్తే యజమానులు చచ్చినట్లు సర్వర్ల జీతాలు పెంచుతారనే బలమైన వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ వాదనను కూడా తప్పని తేల్చిన వారు ఉన్నారు. వినయోగదారుల నుంచి టిప్‌లు తగ్గిపోయాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని యజమానులు సర్వర్లకు జీతాలు పెంచాలని ఆలోచించరట. మార్కెట్లో సర్వర్లు ఎంతకు దొరుకుతున్నారనే అంశంపైనే ఆధారపడి ఉంటుందట వారి జీతభత్యాలు. ఇంకా టిప్‌లు రాకపోతే సర్వర్ ఉద్యోగం బాగాలేదని, మరో ఉద్యోగానికి సర్వర్లు వెళతారట. అలా సర్వర్ల కొరత ఏర్పడితే తప్పించి యజమానులు వారికి ఎక్కువ జీతాలు ఇవ్వడానికి ఇష్టపడరట! పైగా టిప్‌ల సంస్కతి వల్ల తినుబండారాల ధరలు స్థిరంగా ఉంటున్నాయనే వాదన కూడా ఉంది. సర్వర్ల జీతాలను వినియోగదారులు టిప్‌ల రూపంలో షేర్ చేసుకోవడం వల్లన యజమానులు తినుబండారాల ధరలను పెంచడం లేదట. సర్వర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తే యజమానలు కచ్చితంగా తినుబండారాల ధరలను పెంచుతారనే విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో టిప్‌ల సంస్కతికి తిలోదకాలివ్వాలా, లేదా ? అన్న అంశంపై ‘టొరాంటో స్టార్ రీడర్స్’ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా 85 శాతం మంది వీటికి గుడ్‌బై చెప్పాలని తేల్చారు. ఎలా గుడ్‌బై చెప్పాలి? వినియోగదారుల్లో చైతన్యం తీసుకరావాలా? యజమానుల వైఖరిలో మార్పు రావాలా? ఇరువురి వైఖరిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమని, అదికూడా అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, భారత్‌లో కూడా కొన్ని హోటళ్లు సర్వర్లకు టిప్‌లు ఇవ్వొద్దని, తామే బిల్లులో టిప్ వేసి సర్వర్లకు ఇస్తామని ముందుకు వచ్చాయి. కొన్ని హోటళ్లు టిప్‌ల స్థానంలో సర్వీసు చార్జీలను తీసుకొచ్చాయి. అయితే ఆ పద్ధతులు సక్కెస్ అయిన దాఖలాలు లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫైల్ రెస్టారెంట్ గ్రూపైన ‘డాని మేయర్స్ యూనియన్ స్క్వేర్ హాస్పిటాలిటీ గ్రూప్’ టిప్‌లను నిర్ద్వంద్వంగా రద్దు చేసింది. సత్ఫలితాలు కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఆ గ్రూప్ తెలియజేసింది. -
కృష్ణా పుష్కరాల భక్తులకు అల్పాహారం
రాయికల్(షాద్‌నగర్ రూరల్): ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఆర్యవైశ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు. అల్పాహార కార్యక్రమం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. వనితా, వాసవీక్లబ్ ఆర్థిక సహకారంతో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంఘం సభ్యులు తెలిపా రు. పుష్కరాలకు వెళ్లే భక్తులకు దారిలో అల్పాహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆకారపునాగరాజు, వసుందర, సురేష్, శశిధర్, సూర్యప్రకాష్, విజయ్‌కుమార్, శారద, సుగుణ, బాల్‌రాజ్, కృష్ణయ్య, సంతోష్, ప్రభాకర్, లక్ష్మయ్య, నరేందర్. సింహ్మయ్య, సుభాష్, నరేష్, భారతి, వెంకటేష్, నర్సింలు, నందీశ్వర్, చంద్రయ్య, భారతి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. -
నీతూ బుద్ధి
పిల్లల కథ ఈ పోటీ మార్కుల చదువుల్లో పిల్లలకు మంచి నడత గురించి చెప్పే టీచర్లు తక్కువ. ముఖ్యంగా తిండి గురించిన పద్ధతులు ఇంట్లో అమ్మానాన్నలు, పెద్దలు చెప్పాలి. నవనీత్‌ని అందరూ ‘నీతూ’ అని పిలుస్తారు. వాడికున్నంత తిండి ‘యావ’, తిండిపోతులా కనిపించే వాడి చేష్టలూ ఆ తరగతిలో ఎవరికీ లేవు. వాడు తెచ్చుకున్న టిఫిన్ ఒకరికి పెట్టడు. ఎప్పుడూ ఎవరిదో తిన చూస్తాడు. ఎవ్వరేం తెచ్చుకున్నారో వాడికి చూపాలి. లేదంటే యుద్ధం ప్రకటిస్తాడు. తనకు నచ్చినది ఏదైనా ఉంటే.... అది పదింతలు తినేస్తానంటాడు. ఇంకొకరి గురించి చూడకుండా ఏది కనబడ్డా ముందు తనే తినడం వాడి అలవాటు. పదిమంది కోసం తెచ్చిన స్వీటు చాటుగా ఒక్కడే మెక్కేయ చూస్తాడు. ‘‘లడ్డూలు యాభై తింటాను, మాజా ఇరవై తాగుతాను, చాక్లెట్లు ముప్పై తింటాను’’ అంటూ ఉంటాడు. వీడి వింత ప్రవర్తన క్లాసు టీచర్‌కి సమస్యగా ఉంది. ఒకసారి ఆదివారం క్లాసు పిల్లలందరినీ జూపార్క్‌కి పిక్నిక్ తీసికెళ్లింది టీచర్. అంతా తిరిగి చూశాక.... పెద్ద చెట్టు నీడన అందరూ కూర్చున్నారు. టీచర్ వాళ్ళతో ‘‘ఈ ఫిక్నిక్ ఇవ్వాళ నీతూ ఆనందం కోసం... నీతూ ఈ దినం తన తిండి గొప్పతనం మనకు చూపిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి’’ అంది. అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ దిమ్మెలాంటి సిమెంట్ బెంచీ ఉంది. దాని మీద నీతూని కూర్చోబెట్టారు. నీతూ గొప్పలుపోతున్నాడు. వాడి ముందు క్లాసు పిల్లలంతా ఉన్నారు. టీచర్ అందరికీ రెండేసి ‘‘కేక్ పేస్ట్రీ’’లు పంచింది. తను చెప్పేవరకు ఎవ్వరూ తినకూడదని చెప్పింది. తర్వాత నీతూ దగ్గర నిలబడి ‘‘మీ అందరికన్నా నీతూకి తినడం అంటే ఇష్టం కదా, అందుకే మీరందరూ నీతూ కోసం మీ దగ్గరున్న రెండు ‘పేస్ట్రీ’ల నుండి ఒకటి ఇచ్చేయాలి! వరుసగా రండి, అందరూ ఒక్కొక్కటి ఇచ్చేయండి’’ అని చెప్పింది. నీతూకు భలే అనిపించింది. వాడి ముందు ఒక పేపర్ పరిచారు. అందరూ ఒక్కోపేస్ట్రీ వాడి ముందుపెట్టారు. తిరిగి వెళ్లి కూర్చున్నారు. ‘‘ఇప్పుడు మన అందరికన్నా ఎక్కువగా తింటాడు నీతూ... ఇవాళ ముప్పై ఆరుమంది మీరు, మీకిచ్చిన కేక్‌లలో ఒకటి వీడికి ప్రేమతో ఇచ్చారు. మీ ముందు ఇక అన్నీ తినేస్తాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తినకపోతే సారీ చెప్పి లెంపలేసుకుంటాడు. ఇవి అన్నీ తినేస్తే నేను వీడు అడిగిన బహుమతి ఇస్తాను’’ అని చెప్పింది టీచర్. పిల్లలందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు. కేక్ తినడం మొదలుపెట్టాడు నీతూ. ఒకటి... రెండు... మూడు... నాలుగు... అంతే, ఐదో కేక్ నోటిదగ్గరే ఆగిపోయింది. భయంగా టీచర్ దిక్కు చూస్తున్నాడు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ... ‘‘తినూ.... తినూ.... నీతూ.... తినూ.....’’ అంటున్నారు ‘రిథమిక్’గా. టీచర్ చేయి ఊపగానే అందరూ మౌనంగా కూర్చున్నారు. నీతూ ముందు ‘కేక్’ల కుప్ప.... ‘రాశి’ పోసినట్టుగావుంది. ఒకరు లేచి నిలబడి ‘‘నా టిఫిన్ రోజూ లాక్కొని తింటావ్గా తినూ!’’ అన్నాడు. మరొకరు ‘‘నేను ఏదన్నా ఇవ్వకుంటే తంతావుగా మరి తిను’’ అన్నాడు. ‘‘అన్నీ నీకే కావాలిగా తినవేంరా’’ అని ఇంకొకరు. ఐదో కేక్ బలవంతంగా తిన్నాడు. టీచర్ ‘‘ఊ! కానీ’’ అంది గట్టిగానే. ఇక తట్టుకోలేక ఏడుపు ముంచుకొచ్చింది నీతూకి. ఏడ్చాడు. ఆ తరువాత నీతూ ఎప్పుడూ ‘‘అతిగా వెళ్లక’’ అందరిలాగే ఉండడం నేర్చుకున్నాడు. -
రెప్పవాల్చని సిటీ...
సూర్యుడికి సాయంకాలం పడమటి కొండల్లో విశ్రాంతి... చంద్రుడు రవికిరణం సోకితే చల్లగా జారుకుంటాడు.. మరి భాగ్యనగరి... నిరంతర జన ప్రవాహ ఝరి.... అర్ధరాత్రీ హడావుడి.. సందడి మామూలే... నైట్ లైఫ్... అర్ధరాత్రికి ఆకలెక్కువనుకుంటాను పెనమ్మీద మాడిపోయిన బ్రెడ్డుముక్కల్నీ గుడ్డుముక్కల్నీ చౌరస్తాలు ఎగబడి పంచుకుంటున్నాయి... భాగ్యనగరి.. నిరంతర జనఝరి.. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకూ జీవనయానం సాగుతునే ఉంటుంది. 24 గంటలు మాకు సరిపోవు అన్నట్టు నగరం పరుగులు తీస్తోంది. స్త్రీ, పురుషులు, బడా, పేద అనే తేడాను చెరిపేస్తోంది. అర్ధరాత్రి సైతం అందరినీ ‘కలిపే’ నడిపిస్తోంది. ఐటీ హబ్‌లు..అంతర్జాతీయ కార్యాలయాలకు కేంద్రంగా నిలిచిన విశ్వ నగరం నిరంతరం మేల్కొనే ఉంటోంది. రేయి, పగలుకు తేడా లేదంటూ అర్ధరాత్రి విద్యుత్ దీప కాంతుల్లో యువత కేరింతలు.. దూసుకుపోతున్న కార్లు.. వేడివేడి టిఫిన్ల కోసం మొబైల్ క్యాంటిన్లు.. వీధులను శుభ్రం చేస్తున్న కార్మికులు.. కలల బండి మెట్రో పనులు చేస్తున్న శ్రామికులు.. మీ భద్రతకు మేం భరోసా అంటూ పెట్రోలింగ్ పోలీసులు.. ఇలా గ్రేటర్ సిటీ బిజీబిజీ. నిశిరాత్రి వేళ నగరంలో వింతలు.. విశేషాలను మీ ముందుంచేందుకు ‘సాక్షి’ ఓ ప్రయత్నం చేసింది. హైటెక్ హంగులు పులుముకున్న మాదాపూర్.. కొత్త పాతల మేలు కలయిక మెహదీపట్నం.. ఎప్పుడూ బిజీగా ఉండే అమీర్‌పేట్, సికింద్రాబాద్‌లలో పర్యటించింది. నగరం నిద్దరోతున్న వేళ..మేల్కొని ఉన్న మరో ప్రపంచాన్ని మీరూ చూడండి. - సాక్షి, సిటీబ్యూరో -
టెండ‘రింగ్’
సాక్షి, విజయవాడ : గతం గుణపాఠం నేర్పుతుందంటారు. దుర్గగుడి అధికారులు మాత్రం గత అనుభవాలను పక్కకు నెట్టేసి.. చేసిన తప్పునే పదేపదే చేస్తూ అవినీతి పాఠాలు వల్లెవేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి టిఫిన్లు, భోజనాలు అందించే అంశంపై గత ఏడాది కోర్టు మెుట్టికాయలు తిన్న అధికారులు ఈసారి కూడా అదే తప్పు చేస్తున్నారు. సిబ్బందికి టిఫిన్లు, భోజనాల టెండర్లు ఖరారు చేయడంలో తీవ్ర తాత్సారం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే జరగడంతో కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు. దీంతో ఉత్సవాలకు ఒక రోజు ముందు హడావుడిగా టెండర్లు ఖరారు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇంకా 10 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించట్లేదు. ఎందుకీ తాత్సారం? గత ఏడాది ఒక్కొక్కరికీ రెండు పూటలా భోజనం, ఉదయం టిఫిన్ కోసం రూ.110 చొప్పున చెల్లించారు. ఈ సంవత్సరం కాంట్రాక్టర్లు రింగై రూ.150 చొప్పున డిమాండ్ చేస్తూ టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. అధికారులు కోరితే.. కొద్దోగోప్పో తగ్గించి దేవస్థానానికి ఎంతో మిగిల్చామని హడావుడి చేయాలని యోచిస్తున్నారు. గత ఏడాది రూ.110కు ఆహారం, అల్పాహారాలు అందజేసిన ఒంగోలుకు చెందిన కాంట్రాక్టర్ ప్రస్తుతం రూ.125కే రుచికరమైన భోజనం అందజేస్తానంటూ ముందుకొస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు టెండర్లు ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. చివర నిమిషంలో కాంట్రాక్టర్లు కోరిన రేటు చెల్లించి.. వారి నుంచి డబ్బు దండుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు డబ్బు ఇస్తారట..! ఉత్సవాల సందర్భంగా సుమారు 4వేల మంది పోలీసులు పనిచేయనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.150 చెల్లిస్తామని, టిఫిన్లు, భోజన ఏర్పాట్లు వారే చూసుకోవాలని అధికారులు ప్రతిపాదన పెడుతున్నారు. అరుుతే, దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రూ.150 ఇవ్వడం వల్ల సిబ్బంది విధుల్ని పక్కనపెట్టి ఆహారం కోసం వెళ్లడం.. లేదా అర్ధాకలితో విధులు నిర్వహించడం వంటివి చేస్తారన్న సందేహం పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధి వద్ద సెటిల్మెంట్ గతంలో దుర్గగుడి భోజన సరఫరా టెండర్ల విషయంలో కొద్దో గొప్పో పోటీ ఉండేది. ఈ ఏడాది టెండర్లు వేసే కాంట్రాక్టర్లందరినీ ఓ మాజీ ప్రజాప్రతినిధి ఒక తాటిపైకి తెచ్చినట్లు తెలిసింది. టెండర్లు విభజించి అందరూ పంచుకోవాలని సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అత్యధికంగా రూ.150 టెండర్లు దాఖలు చేశారని చెబుతున్నారు. కాంట్రాక్టర్ల మధ్య సఖ్యత కుదిర్చినందుకు గానూ, ఆ నేతకు ముడుపులు కూడా అందనున్నారుు. కాంట్రాక్టర్లు కోరిన రేటుకు టెండర్ ఇప్పించేందుకు దేవాదాయ శాఖ మంత్రి వద్ద తాను చక్రం తిప్పుతానని వన్‌టౌన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెబుతున్నారని సమాచారం. -
అలా నేర్చుకున్నాను...
మనోగతం బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో హోటల్లో తినీ తినీ ‘ఇక నా వల్ల కాదు. పెళ్లి చేసుకోవాల్సిందే’ అనుకున్నాను. నేను అనుకున్నానో లేదో మా వాళ్లు ఒక అందమైన అమ్మాయిని చూశారు. ‘‘అమ్మాయికి వంట రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది’’ అనే మాట విని నెత్తి మీద ఆర్డీఎక్స్ పేలినట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాను. ‘‘అదేమీ పెద్ద విషయం కాదనుకోండి...’’ అన్నాడు నాన్న. ‘‘అదే అసలు విషయం’’ అని నాలో నేను గొణుక్కున్నాను. ‘‘అమ్మాయికి వంటరాదు కాబట్టి ఆమె నచ్చలేదు’’ అని చెప్పడం న్యాయం కాదు కాబట్టి ‘ఓకే’ అనేశాను. ‘‘ఇవ్వాళ టిఫిన్ చేశాను. తిని ఓకేనా కాదా చెప్పండి’’ ‘‘ఇవ్వాళ బెండకాయ వేపుడు చేశాను. తిని బాగుందో లేదో చెప్పండి’’ ఇలా అడిగేది మా ఆవిడ. ‘‘ఆమె చేసిన టిఫిన్ టిఫిన్ కాదని, కూర కూర కాదని ఎలా చెప్పాలి? ఓరి భగవంతుడా... ఏమిటీ శిక్ష ’’ అనుకునేవాడిని. ఆమెను చిన్న మాట అనడానికైనా మనసొప్పేది కాదు. అలా అని ఆమె వంటల మంటలను మింగలేను కదా! ఇక ఇలా కాదనుకొని ఆ ఇళ్లు, ఈ ఇళ్లు తిరిగి పనిగొట్టుకొని రకరకాల వంటలు నేర్చుకున్నాను. దినపత్రికల వంటలు పేజీలు చాలా శ్రద్ధగా సేకరించేవాడిని. నేను వంటలు నేర్చుకోవడంతో పాటు, మా ఆవిడకు అర్థమయ్యేలా సులభంగా చెప్పాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి... ఇప్పుడు నా కంటే ఆవిడ వంట చక్కగా చేస్తుంది! -బి. శేఖర్, హైదరాబాద్ -
టిఫినీలు.. తిన్నారా..!
ప్రధాన రాజకీయపార్టీల క్యాంప్ కార్యాలయాల వద్ద ఎన్నికల కళ రోజు విందు వినోదాలు కల్పించాల్సిందే సాధారణ ఎన్నికల ప్రచారం వేడి రాజుకొంటున్న వేళ.. ఆయా పక్షాల క్యాంప్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. పార్టీలో చేరేకొత్త ముఖాలతో కళకళలాడుతున్నాయి. ఉదయం అల్ఫాహారం మొదలుకుని.. రాత్రి భోజనం వరకు నేతలు అన్ని తామై చూసుకుంటున్నారు. టిఫిన్లు ముగియగానే అభ్యర్థులు వెంటరాగా ప్రచారరథాలు కాలనీల్లో వాలిపోతున్నాయి. ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ చిటపటమనగానే క్యాంప్‌ల వద్దకు తరలుతున్నాయి. విందు భోజనం కాగానే కాసేపు సేదతీరి.. మళ్లీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. సాయంత్రం వేళ ఎవరి‘దారి’ వారు చూసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధానపార్టీల ప్రచార పర్వం సాగుతోన్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేకకథనం.. కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో అన్నిపార్టీల కార్యాలయాలు, స్వతంత్రుల క్యాంపు కార్యాలయాలు పార్టీ శ్రేణులు, అభిమానులతో కళకళలాడుతున్నాయి. రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10గంటల వరకు వీరికి సకల మర్యాదలు చేస్తున్నారు. ఇక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీతోపాటు రాత్రి అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారు. దీంతో ప్రతి కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఇక ఓటర్లు అయితే ఎవరికి వారే గ్రూపులుగా ఏర్పడి బరిలో ఉన్న నేతలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు. మనకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ ఊదరగొడుతున్నారు.అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొనే వారంతా ఉదయం ఒకరి వెంట, మధ్యాహ్నం ఇంకొకరి వెంట, రాత్రికి మరొకరివెంట.. ఇలా రోజుకు ముగ్గురిని వెంట ప్రచారం చేసేపనిలో బిజీగా గడుపుతున్నారు. వీరికి ఎవరి వెంట తిరిగితే అంత కూలీ చెల్లిస్తుండటంతో ఓటర్లు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు.