ఉల్లాసంగా... ఉత్సాహంగా బీజేపీ టిఫిన్ బైఠక్‌లు
ఎక్కడికక్కడ పాల్గొన్న ముఖ్యనేతలు
సీనియర్ నేతలు, కార్యకర్తలకు శాలువాలతో సన్మానం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తల టిఫిన్ బైఠక్‌లు శనివారం ఉత్సాహంగా సాగాయి. పార్టీ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. శనివారం ఉదయం పోలింగ్‌బూత్ స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు కలుసుకుని అల్పాహారం తింటూ పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ముఖ్యనేతలు, పోలింగ్‌బూత్ కమిటీల అధ్య క్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జెండా ఆవిష్క రణ కార్యక్రమం, శక్తికేంద్రాల్లో (నాలుగైదు పోలింగ్ బూత్ లు కలిపి ఒకటి) సమావేశాల నిర్వహణతో పాటు 44 ఏళ్లలో పార్టీ చరిత్ర, వికాసం, పరిణామక్రమంపై చర్చ చేపట్టారు. ఇక పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న సీనియర్లను సన్మానించారు. ఆయా పోలింగ్ బూత్‌లో పార్టీ బలాబలాలు, వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, తదితర అంశాలపై చ ర్చించారు.
ఈ సందర్భంగా... ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ అంటూ నినదించారు. దేశ వ్యాప్తంగా 370 సీట్ల సా ధన, అందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ బూత్‌లో 50 శాతం ఓట్లు పడేలా కృషి చేస్తామంటూ పార్టీనా యకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకున్నారు. సికింద్రాబా ద్ నియోజకవర్గం కాచిగూడలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం
పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ సునీల్‌బన్సల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధా నకార్యదర్శలు చంద్రశేఖర్ తివారి (సంస్థాపక) తదితర నా యకులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం గుజ్జుల ప్రే మేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో శనివారం ఐదువేల చోట్ల బీజేపీ టిఫిన్ బైఠక్‌లు జరిగాయి. ఈ నెల 15 నుంచి 18 వరకు అసెంబ్లీ స్థాయిలో జరిగే సమావేశాలు.. 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు సంబంధించిన అంశాలపై ఆయా బైఠక్‌లలో చర్చించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment