రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్‌తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు.
ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం.
► బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది.
► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్‌ఫాస్ట్‌ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది.
► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్‌ఫాస్ట్‌కి బెస్ట్ ఛాయిస్.
► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది.
► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు.
► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్‌ను తీసుకోవాలి.
► మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి.
► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్‌తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండు తినకూడదా?
అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది.
అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్‌గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment