కే– బ్యూటీ మానియా
►కొరియన్ గ్లాస్ స్కిన్ సొంత మవ్వాలంటే.. బియ్యం గంజిని ఫేస్‌కి అప్లయ్ చేసుకుని అది కంప్లీట్‌గా డ్రై అయిపోయాక వాష్ చేసుకోవాలి. ఈ రెమిడీని రెగ్యులర్‌గా ఫాలో అయితే యూవీ రేస్‌తో డామేజ్ అయిన స్కిన్‌కి మళ్లీ లైఫ్ వస్తుంది. స్మూత్‌గా.. రికింల్ ఫ్రీగా మారుతుంది!
► స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అందుకోసం ముందుగా కొరియన్ స్త్రీలు డబుల్ క్లెన్సింగ్‌ని ఫాలో అవుతుంటారు. పాలను సహజ క్లెన్సింగ్‌లా వాడుకోవచ్చు.
► కొరియన్ స్త్రీలు క్రీమ్స్ కంటే షీట్ మాస్క్‌లు ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం కాంతివంతంగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.
► టోనర్లు చర్మం పీహెచ్ స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు బెస్ట్ టోనర్‌గా పనిచేస్తుంది.
► ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతిరోజూ సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF-20, అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ధరించడం చాలా ముఖ్యం.
► అయితే ఎంత స్కిన్ కేర్ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
వానకాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
- మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక వనరుగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, గాయాలు తగ్గుతాయి.
- గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం.. ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి.
Comments
Please login to add a commentAdd a comment