skin tone
-
చలికాలంలో డైఫ్రూట్స్ తింటున్నారా? దీనిలోని విటమిన్-ఈ వల్ల..
చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. మామూలు సమయాల్లో కంటే చలికాలంలో చర్మానినికి ఎక్కువ కేర్ అవసరం. ఈ సీజన్లో చర్మంలో తేమ లేకపోవడంతో కాస్తంత గీరగానే తెల్లటి చారికలు పడటం కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలంటే.. ►కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. ► రెండు టేబుల్ స్పూన్ల తేనెలో, రెండు టీ స్పూన్ల పచ్చి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, గొంతుకు, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ► చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా... మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం...స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తాజాగా మారుతుంది. ► స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు/గ్లిజరిన్ బేస్డ్ సబ్బు మంచిది. ► రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తాగాలి. అసలే చల్లటి వాతావరణం కారణంగా ఈ కాలంలో నీటిని తాగడం తగ్గుతుంది. కాబట్టి చర్మం పటుత్వాన్ని , తేమను కోల్పోయి మరింత గరుగ్గా కనిపిస్తుంది. అందుకే తగినంత నీరూ తాగాలి. పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) ఎక్కువగా తినాలి. ► ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తాజాగా కనిపించేలా చేస్తాయి. ►డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ►చలికాలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
అవకాడో గుజ్జుతో మెరిసే సౌందర్యం..ఇలా ప్యాక్ వేసుకోండి
బ్యూటీ టిప్స్ ►ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోండి. మీకు తెలుసా? ►మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే క్యారట్లు సాధారణంగా 50 గ్రాముల వరకు బరువు ఉంటాయి. పెద్దగా కనిపించే క్యారట్లయినా 125 గ్రాముల లోపే బరువు ఉంటాయి. అయితే, అమెరికా మినిసోటా రాష్ట్రంలోని ఆత్సగోలో ఏకంగా 10.17 కిలోల బరువు ఉండే క్యారట్ పండి గిన్నిస్ రికార్డుకెక్కింది. ► చాలావరకు పూలు సుగంధాలను వెదజల్లుతాయి. టాంజానియా, దక్షిణాఫ్రికా పరిసరాల్లోని ఎడారి ప్రాంతాల్లో కనిపించే కారియన్ మొక్కకు పూసే పూలు మాత్రం దుర్భరమైన దుర్గంధాన్ని వెదజల్లుతాయి. వీటి నుంచి వెలువడే కుళ్లినమాంసం వాసనకు కీటకాలను ఆకర్షితమవుతాయి. ఆ కీటకాలు ఈ మొక్కల పరపరాగ సంపర్కానికి సాయపడతాయి. -
కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ కావాలా? సింపుల్‌గా ఈ ప్యాక్ వేసుకోండి
ఫర్ గ్లాస్ స్కిన్.. ఈ చిట్కాలు పాటించండి. ►ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. ► శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. ► అవిసె గింజలు స్కిన్ టోన్‌ని గ్లాసీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఓ పాత్రలో వేడి చేసి అందులో నీళ్లు కలపాలి. జెల్ ఫార్మట్‌లో వచ్చాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. మిగిలిన జెల్‌ను ముఖంపై అప్లై చేస్తే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. -
ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం
ఎప్పుడూ జిడ్డు కారుతూ, మచ్చలతో, వడిలిపోయినట్లు ఉండే చర్మానికి.. ఇట్టే చెక్ పెట్టాలా? కోమలమైన, కాంతిమంతమైన సౌందర్యం మీ సొంతం కావాలా? అయితే ఈ ‘ఫేస్‌జిమ్ 2 ఇన్ 1 మైక్రోనీడ్లింగ్ ఎలక్ట్రిక్ డివైస్’ని వెంట పెట్టుకోవాల్సిందే. దీన్ని ఉపయోగిస్తే ముఖం మిలమిలా మెరిసిపోతుంది. పొడి చర్మం, సాధారణ చర్మం, జిడ్డు చర్మం.. ఇలా అన్ని రకాల చర్మాలకు ఇది చక్కటి వైద్యాన్ని అందిస్తుంది. ఈ మెషిన్.. ముఖం మీదున్న డార్క్ స్పాట్స్, ఫేస్ డల్‌నెస్‌ని దూరం చేస్తుంది. అలాగే చర్మంపైన ముడతలు, గుంతలను కూడా పూర్తిగా నయం చేస్తుంది. ఈ డివైస్‌తో పాటు లిక్విడ్ విటమిన్ రీఫిల్స్ లభిస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లిక్విడ్స్‌లో గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్ వంటివి మంచి ఫలితాలను అందిస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్‌తో ముఖం కాంతిమంతమవుతుంది. విటమిన్ ఎఫ్‌తో మచ్చలు, ముడతలు మాయమవుతాయి. ఈ ఫేస్షాట్ ఎలక్ట్రిక్ మైక్రోనీడ్లింగ్ మెషిన్.. చర్మాన్ని రిజువనేట్ చేస్తుంది. దీని సీరం డిస్పెన్సర్ ట్రీట్మెంట్.. ముఖంలోని కండరాలను ఉత్తేజపరచడంలో.. స్కిన్‌ను మృదువుగా, బిగుతుగా మార్చడంలో సహకరిస్తుంది. మెడికల్–గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ డివైస్‌లో లిక్విడ్స్‌ని ఎలా నింపుకోవాలంటే.. చిత్రంలోని రీఫిల్స్‌ని.. ఇంజెక్షన్ బాటిల్ మాదిరి పైభాగాన్ని ఓపెన్ చేసి.. అందులోని లిక్విడ్‌ని డివైస్‌కి సంబంధించిన టూల్లో నింపుకోవాలి. దాన్ని మెషిన్ హెడ్లోకి జొప్పించి.. మూత బిగించి.. ఫేస్‌కి దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాడైన చర్మాన్ని ఇది 97 శాతం వరకూ తిరిగి యథాస్థితికి తేగలదు. సరిగ్గా నెల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని ధర 275 డాలర్లు. అంటే 22 వేల 780 రూపాయలన్న మాట. -
కొరియన్ స్కిన్ టోన్ మీ సొంతం అవ్వాలంటే బియ్యం నీళ్లు..
కే– బ్యూటీ మానియా ►కొరియన్ గ్లాస్ స్కిన్ సొంత మవ్వాలంటే.. బియ్యం గంజిని ఫేస్‌కి అప్లయ్ చేసుకుని అది కంప్లీట్‌గా డ్రై అయిపోయాక వాష్ చేసుకోవాలి. ఈ రెమిడీని రెగ్యులర్‌గా ఫాలో అయితే యూవీ రేస్‌తో డామేజ్ అయిన స్కిన్‌కి మళ్లీ లైఫ్ వస్తుంది. స్మూత్‌గా.. రికింల్ ఫ్రీగా మారుతుంది! ► స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అందుకోసం ముందుగా కొరియన్ స్త్రీలు డబుల్ క్లెన్సింగ్ని ఫాలో అవుతుంటారు. పాలను సహజ క్లెన్సింగ్‌లా వాడుకోవచ్చు. ► కొరియన్ స్త్రీలు క్రీమ్స్ కంటే షీట్ మాస్క్‌లు ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం కాంతివంతంగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది. ► టోనర్లు చర్మం పీహెచ్ స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు బెస్ట్ టోనర్‌గా పనిచేస్తుంది. ► ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతిరోజూ సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF-20, అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ధరించడం చాలా ముఖ్యం. ► అయితే ఎంత స్కిన్ కేర్ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. వానకాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక వనరుగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, గాయాలు తగ్గుతాయి. గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం.. ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. -
మందార పువ్వులో ఇది కలిపి రాస్తే మొటిమలు, మచ్చలు మాయం
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కాలుష్యం, పని ఒత్తిడి, పెరుగుతున్న వయస్సుతో సాధారణంగా కాస్త పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ముఖాన్ని వైట్‌గా, కాంతివంతంగా మార్చుకునేందుకు వేలకు వేలు పోగేసి క్రీములు, ఫేస్‌మాస్కులు కొనగోలు చేసినా పెద్దగా ఉపయోగం లేదా? అయితే ఇది మీకోసమే. పైసా ఖర్చులేకుండా మన పెరట్లో దొరికే మందార పూలతోనే ముఖ వర్చస్సును మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా మందారం పువ్వులను జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా పెరిగేందుకు విరివిగా ఉపయోగిస్తుంటారన్నది అందరికి తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కానీ ఈ పువ్వులు కేవలం జుట్టుకే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? అదేలాగా? మందార పువ్వులతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మందారంలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. ఈమధ్య కాలంలో అందాన్ని కాపాడుకోవడం, మరింత బ్రైట్‌గా కనిపించేందుకు తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ వీటికన్నా మందార పూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా రెండు-మూడు మందార పువ్వులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.అంతేకాకుండా తరచూ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. చాన్నాళ్లుగా వేధిస్తున్న మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు కూడా తొలిగిపోతాయి. -
బ్రౌన్ స్కిన్ బార్బీ.. భారతీయ మహిళ ఆహార్యంలో..!
‘బ్రౌన్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పదాన్ని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తుంది. బ్రౌన్ స్కిన్ మేకప్‌ను ప్రాచుర్యంలోకి తేవడానికి దక్షిణాసియా బార్బీ డాల్ అమెరికన్ సీఇవో దీపికా ముత్యాల ఫస్ట్ ఇండియన్ స్కిన్‌టోన్ బార్బీని ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. మహిళల హిస్టరీ మంత్ వేడుకలో భాగంగా ఈ యేడాది మార్చిలో తన బ్యూటీ బ్రాండ్‌ను ఆవిష్కరిస్తూ చూపిన ఈ రూపం ఇప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. బార్బీ అనగానే తెల్లగా, నీలికళ్లతో ఉండే నాజూకైన రూపంతో ఉండే బొమ్మ మన మనసులో కదలాడుతుంది. ‘ఈ బార్బీని చూడండి. ఆమె చర్మం ముదురు గోధుమ రంగు, ఆమె కళ్లు పెద్దవి, వెడల్పాటి కనుబొమ్మలు, జూకాలు, గాజులు ధరించి పవర్సూట్తో సగర్వంగా ఉంటుంది. ఆమె ఈ ప్రపంచ సవాళ్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆమె గుర్తింపు. ఆమె సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. ఉన్నత లక్ష్యాలు, సానుభూతి, దయతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది’ అంటూ నేటి ఆధునిక భారతీయ మహిళ ఆహార్యాన్ని ఈ కొత్త బార్బీ రూపంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా పరిచయం చేసింది. దీనికి వ్యూవర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పుడు దీపికను అంతా ‘బ్రౌన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్’ అని పిలుస్తున్నారు. దక్షిణాసియా సమాజంలోని చర్మ రంగులను, విదేశాల్లో ఉన్న బ్యూటీ ప్రమాణాలను రెండింటినీ అంచనా వేసిన దీపికా ఈ రంగంలో ఏదైనా కొత్తదనం తీసుకురావాలనుకుంది. తన చిన్నతనంలో నీలిరంగు కళ్లతో తెల్లగా ఉండే బార్బీని గుర్తుచేసుకుంది. ఈ బొమ్మకు భారతీయ శైలికి తగినవిధంగా రూపొందించాలనుకుంది. అందుకు బొమ్మ రంగును ముదురు గోధుమ వర్ణంలో తీర్చింది. దీపికా ముత్యాల బ్రౌన్ స్కిన్ మేకప్‌ని ప్రాచుర్యంలోకి తెచ్చిన లైవ్ టిండెడ్ బ్యూటీ బ్రాండ్ ఫౌండర్ కూడా. ‘ప్రజలు ఈ బొమ్మను తమదిగా చేసుకోవడానికి, అలాగే ముదురు గోధుమ రంగుకు ఉన్న ప్రాధాన్యతను ప్రపంచం ముందుంచడానికి చేసిన ప్రయత్నం ఇది’ అని చెబుతుంది ఈమె. నిజానికి చాలా బ్యూటీ ప్రొడక్ట్‌లు రంగులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 2015లో ముదురు గోధుమ రంగు చర్మంపై పై బ్యూటీ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆమె చేసిన వీడియో వైరల్ అయ్యింది. 2018లో ఈ విభాగంలోనే ఆన్లైన్ కమ్యూనిటీని ప్రారంభించింది. 2019 నాటికి ఆల్–ఇన్–వన్ కలర్ కారెక్టర్, లిప్‌స్టిక్, ఐ షాడో, బ్లష్‌ను అభివృద్ధి చేయడానికి అనేకమంది నుంచి అభిప్రాయాలను సేకరించి, బార్బీని ఇలా ఆవిష్కరించింది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా ఓ కొత్త ఆలోచనతో ఇండియన్ బార్బిని ఆవిష్కరించిన దీపికకు అభిమానులు ఇంకా విస్తృతస్థాయిలో తమ అభినందనలు తెలియజేస్తున్నారు. -
నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్
Khiladi Movie Actress dimple Hayathi Faced Rejection Of Her Skin Colour: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్రా జర్రా'.. ఐటెం సాంగ్‌తో మెప్పించింది డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకోంటోంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. అయితే కెరీర్ మొదట్లో పలు తిరస్కారాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. -
సోషల్ మీడియాలో డిలీట్ చేశాం అనుకోకండి, స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే
‘సరేలే బోండాం’ ‘నువ్వూ నీ తారుడబ్బా ముఖమూ’ ‘ఉఫ్పున ఊదితే ఎగిరిపోతావ్’ ఎవరినైనా ఉద్దేశించి ఇలా బాడీ షేమింగ్ చేయడం నేరం. సోషల్ మీడియాలో చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కాని కోలకతా నటి శ్రుతి దాస్ పోలీస్ కంప్లయింట్ పెట్టింది. రంగు నలుపు అంటూ ఆమె పై చేసే వ్యంగ్య వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరాయి. మీ మిత్రులు ఇలాంటి కూతలు కూస్తుంటే మీరు హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. హేళన చేయడం ద్వారా మనిషి కొంత ఆనందం పొందుతాడు. అయితే ఆ ఆనందం వికృత స్థాయికి చేరుకుంటే ఏం చేయాలి? హేళన ద్వారా మనిషిని బాధించడం, హాస్యం పుట్టించడం ఇవాళ చాలా వ్యాపారం అయిపోయింది. టీవీలలో వస్తున్న చాలామటుకు కామెడీ షోలు స్త్రీలను, వారి రూపాలను, వారి నడవడికను, లైంగిక ప్రవర్తనలను హేళన చేసేవే. బాడీ షేమింగ్ (శరీర అవయవాలను అవమానించడం), కలరిజం (శరీర వర్ణాన్ని బట్టి కామెంట్ చేయడం) నిజానికి ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆ సంగతి తెలియక చాలామంది సోషల్ మీడియాలో విమర్శ పేరుతో హేళన చేస్తున్నారు. అలాంటి వారు ఇబ్బందుల్లో పడక తప్పదని కోలకటాలో తాజా ఘటన నిరూపించింది. అక్కడి టీవీ నటి శ్రుతి దాస్ తన రంగు తక్కువ అంటూ హేళన చేస్తున్న వారిపై కేసు పెట్టింది. ఏం జరిగింది? కోల్కటాలో టీవీ నటిగా ఉన్న శ్రుతి దాస్ గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘త్రినయని’ అనే టీవీ సీరియల్ హిట్ అయ్యింది. ‘నేను ఆ సీరియల్ దర్శకుడితో అనుబంధంలో ఉన్నాను. కాని సోషల్ మీడియాలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా రంగు గురించి ప్రస్తావన చేస్తూ నన్ను హేళన చేస్తున్నారు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో నల్లగా ఉన్నవారిని ‘కాలో’(నల్లది), ‘మోయిలా’ (మాసినది) అని హేళన చేసేవాళ్లుంటారు. విమర్శ చేయాలంటే ఏ పాయింట్ లేనప్పుడు ఇలా రంగునో రూపాన్నో ప్రవర్తననో ముందుకు తెచ్చి కామెంట్ చేసి బాగా అన్నాం అని చంకలు గుద్దుకుంటారు కొందరు. కాని అలాంటివారిని వదిలేది లేదని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే సోషల్ మీడియాలో మనం ఏదైనా కామెంట్ చేస్తే దానికి శిక్షలు పడవనుకుంటే పొరపాటు. బాధింపబడినవారు పోలీస్ కంప్లయింట్ చేస్తే అలాంటి వారిని వెంటనే చట్టపరంగా శిక్షించడానికి కేసు నమోదు అవుతుంది. కొందరు కామెంట్ చేసి ఆ తర్వాత దానిని డిలీట్ చేయవచ్చు. కాని ఈలోపు ఆ బాధితులు ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. హేళన కూడా ఒక అణచివేత సాధనమే. ఎదుటివారిని అణచివేయడానికి హేళనను ఆయుధంగా వాడుతారు. కాని అలాంటి రోజులు పోయాయి. స్త్రీలను, వృద్ధులు, వికలాంగులను, ఇంకా ఎవరినైనా గాని రూపాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, నేపథ్యాన్ని బట్టి హేళన చేస్తే, మనసు గాయపరిస్తే, అగౌరవపరిస్తే వారంతా చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ‘కాళీ మాత కూడా నల్లగానే ఉంటుంది. ఆమెను కొలుస్తాం మనం. కాని హేళన సమయంలో మాత్రం ఎదుటివారిని నల్లగా ఉన్నారని అంటాం. ఇది ఎంత తప్పో అందరూ ఆలోచించాలి’ అని శ్రుతి దాస్ అంది. ‘నలుపు నారాయణమూర్తే గాదా’ అని ఒక దేశీయగీతం ఉంది. ఏ రంగైనా ప్రకృతి దృష్టిలో ఒకటే. సంస్కారలోపం ఉన్నవారే వర్ణఅంతరాన్ని చూస్తారు. -
హీరోయిన్‌కు ఘోర అవమానం!
ఆధునిక సమాజంలోనూ వర్ణవివక్షకు గురవ్వడం ఎంతో బాధిస్తోందని హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సాధారణ వ్యక్తుల మాట దేవుడెరుగును.. కానీ సెలబ్రిటీలు కూడా వర్ణవివక్షకు గురవుతున్నారంటూ హాలీవుడ్ నటి, సింగర్ జెండయ కోలెమన్ అంటోంది. ఇందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తన స్నాప్ చాట్ ఖాతాలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసి నిరసన తెలిపింది. నటి కోలెమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగి కోలెమన్ వాలెట్ తీసి విసిరికోట్టాడు. దీంతో తనకు ఏం చేయాలో కొద్దిసేపు అర్థంకాలేదని వాపోయింది. గిఫ్ట్ కార్డులు కొనేందుకు వెళ్లగా తన రంగు(నలుపు) అయినుందున తనకు అవమానం జరిగిందని వివరించింది. వాలెట్ పడేసి నువ్వు ఇవి కొనేందుకు అర్హురాలివి కాదంటూ వ్యాఖ్యానించిందని, వాలెట్ లో ఎంతో విలువైన వస్తువులు ఉంటాయన్న కనీస అవగాహన కూడా ఆ ఉద్యోగికి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లజాతీయులకు అవమానాలు చాలా దేశాల్లో జరుగుతున్నాయని స్నాప్ చాట్ వీడియోల రూపంలో తన బాధను అభిమానులు, ఫాలోయర్స్ తో కోలెమన్ పంచుకుంది.