బ్యూటీ టిప్స్
►ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.
► ఒక బౌల్‌లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్‌ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోండి.
మీకు తెలుసా?
►మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే క్యారట్లు సాధారణంగా 50 గ్రాముల వరకు బరువు ఉంటాయి. పెద్దగా కనిపించే క్యారట్లయినా 125 గ్రాముల లోపే బరువు ఉంటాయి. అయితే, అమెరికా మినిసోటా రాష్ట్రంలోని ఆత్సగోలో ఏకంగా 10.17 కిలోల బరువు ఉండే క్యారట్ పండి గిన్నిస్ రికార్డుకెక్కింది.
► చాలావరకు పూలు సుగంధాలను వెదజల్లుతాయి. టాంజానియా, దక్షిణాఫ్రికా పరిసరాల్లోని ఎడారి ప్రాంతాల్లో కనిపించే కారియన్ మొక్కకు పూసే పూలు మాత్రం దుర్భరమైన దుర్గంధాన్ని వెదజల్లుతాయి. వీటి నుంచి వెలువడే కుళ్లినమాంసం వాసనకు కీటకాలను ఆకర్షితమవుతాయి. ఆ కీటకాలు ఈ మొక్కల పరపరాగ సంపర్కానికి సాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment