
Khiladi Movie Actress dimple Hayathi Faced Rejection Of Her Skin Colour: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్రా జర్రా'.. ఐటెం సాంగ్‌తో మెప్పించింది డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకోంటోంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. అయితే కెరీర్ మొదట్లో పలు తిరస్కారాలు ఎదుర్కొన్నాని పేర్కొంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు.
అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది.