Dimple
-
ఎవరెస్ట్ పర్వతాన చిన్నారి పాదాలు
ఆరేళ్ల పాప కారిడార్‌లో ఆడుతుంటేనే చిన్న భయం ఉంటుంది. 17,500 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకోవాలనుకుంటే? పూణెకు చెందిన ఆరేళ్ల ఆరిష్క లడ్డా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న అత్యంత చిన్నారిగా రికార్డు స్థాపించింది. తల్లితో కలిసి పదిహేను రోజులపాటు ఆరోహణ చేసి ఈ సాహసకార్యం పూర్తి చేసింది. కొంతమంది చిన్నారులు పుట్టుకతో చిరుతలు అని పాడుకోవాలి ఇలాంటి పిల్లలను చూస్తే. ఆరేళ్ల ఐదు నెలల వయసు ఉన్న ఆరిష్కా లడ్డాకు నిజంగా తానేం ఘనకార్యం చేసిందో తెలియదు. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకోవడం అంత చిన్న వయసులో అసాధ్యమైనా సాధ్యం చేసిందనీ తెలియదు. తల్లి చేయి పట్టుకుని ఎంత దూరమైనా సాగగలను అనే నమ్మకమే ఆరిష్కాను సముద్ర మట్టానికి 17,500 ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేర్చింది. ఫూణెలో ఇప్పుడు ఆ పాప నివాసం ఉంటున్న కొత్రుడ్ ఏరియా, చదువుతున్న స్కూలు, బంధువులు అందరూ గర్వపడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తీసుకెళ్లరు. ఎందుకంటే పర్వతారోహణ సమయంలో తమ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు వస్తున్నదో చిన్న వయసు పిల్లలు స్పష్టంగా చెప్పలేరు. అలా చెప్పకపోతే ప్రమాదం వస్తుంది. మేము రిజిస్టర్ చేసుకున్న సంస్థను నడిపే భగవాన్ చావ్లే మా పూణెకు చెందిన పర్వతారోహకుడు. మూడుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడాయన. పర్వతారోహణలో విశేష అనుభవం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో నేను ఆరిష్కాతో పాటుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలనుకున్నప్పుడు– మీ సొంత రిస్క్ మీద తీసుకువెళతాను. కాని పాప ఆరోగ్యంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వెంటనే వెనక్కు పంపిస్తాను అని చెప్పాడు. నేను అంగీకరించాను. ఎందుకంటే నా కూతురు సాధించగలదన్న నమ్మకం ఉంది’ అంది ఆరిష్కా తల్లి డింపుల్ లడ్డా. ప్రాథమిక శిక్షణ ఆరిష్కా పూణెలో వారాంతంలో చుట్టుపక్కల కోటలను, కొండలను ట్రెక్ చేసేది. గత సంవత్సరం వైష్ణోదేవికి వెళ్లినప్పుడు కూడా హుషారుగా నడిచింది. ‘అది గమనించాకే బేస్‌క్యాంప్‌కు నడవగలదు అన్న నమ్మకం కుదిరింది’ అంది డింపుల్. ఏప్రిల్ మొదటివారంలో మొదలైన వీరి ఆరోహణ పోను 65 కిలోమీటర్లు రాను 65 కిలోమీటర్లు మొత్తం 130 కిలోమీటర్ల పొడవునా కాలినడకన సాగింది. అంత దూరమూ ఆరిష్కా తల్లికి సహకరిస్తూ హుషారుగా నడవగలిగింది. ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు పర్వతారోహణ చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకు మంచి ఆహారం ఉండాలి. ‘మేము శాకాహారులం. పర్వతారోహణలో మాకు పప్పన్నం మాత్రమే శాకాహారంగా దొరికింది. అయితే పాపకు నేను ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు ఎక్కువగా పెట్టాను. వేణ్ణీళ్లు ఎక్కువగా తాగేలా చూశాను. చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. ఒక్కోసారి పాప తలనొప్పి, చెవుల నొప్పి అని కంప్లయింట్ చేసేది. అయితే అదృష్టవశాత్తూ కొద్దిపాటి మందులతో కుదుట పడింది’ అని తెలిపింది డింపుల్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చెయ్యూపుతూ నిలబడటంతో మన దేశం నుంచి అత్యంత చిన్న వయసులో అక్కడివరకూ చేరిన చిన్నారిగా ఆరిష్కా రికార్డు సాధించింది. ‘ఇక ఆమెను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుతాను. ఎవరెస్ట్ ఎక్కేలా చేస్తాను. తోడుగా కావాలంటే నేనూ ఎక్కుతాను’ అని తెలిపింది డింపుల్. తండ్రి కౌస్తుభ్ ‘నా కూతురిని చూసి గర్వపడుతున్నాను. ఈ ఘనత అంతా తల్లీకూతుళ్లదే. నేను కేవలం సపోర్టింగ్ యాక్టర్‌ని’ అని నవ్వాడు. ఆరిష్కాకు అభినందనలు. పాపను చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. – డింపుల్, అరిష్కా తల్లి -
Dimple Hayathi Photos: రామ బాణం మూవీ హీరోయిన్ డింపుల్ హయాతి ఫోటోలు
రామ బాణం మూవీ హీరోయిన్ డింపుల్ హయాతి ఫోటోలు -
డైరెక్టర్ నమ్మలేదు.. దీంతో రెండు ఆడిషన్స్ ఇచ్చాను: హీరోయిన్
‘‘ఓ నటిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. కెరీర్లో ఐదేళ్లు గడిచిపోయినా కూడా నేను ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నాను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది’’ అన్నారు హీరోయిన్ డింపుల్ హయతి. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామ బాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో యూ ట్యూబ్ బ్లాగర్ భైరవి పాత్రలో నటించాను. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని నాకు ఈ పాత్ర కొత్తగా, కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ‘ఖిలాడి’ సినిమాలో నా గ్లామరస్ యాక్టింగ్‌ను చూసి శ్రీవాస్‌గారు ‘రామబాణం’ సినిమాలో భైరవి ΄పాత్ర నేను చేయగలనా? అని కాస్త సంకోచించారు. దీంతో రెండు ఆడిషన్స్ ఇచ్చాను. ‘భైరవి’ పాత్రకు నేను సరిపోతానని ఆయన నమ్మారు. ప్రస్తుతం కొన్ని కొత్త కథలు వింటున్నాను. తెలుగు, తమిళ భాషల్లో నేను చేసిన కొత్త సినిమాల ప్రకటనలు త్వరలోనే వస్తాయి’’ అన్నారు. -
‘రామబాణం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఫోటో గ్యాలరీ
-
జగపతిబాబు అంతకు ముందే తెలుసు.. ఆయనను చౌ మామా అని పిలుస్తా
‘‘నా కెరీర్ ప్రారంభంలో రాఘవేంద్రరావు, పి. వాసు, భారతీరాజా, బాలచందర్, జంధ్యాల, గోపాల్ రెడ్డి వంటి ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పాత్ర బాగుందన్నా, బాగా లేదన్నా ఆ క్రెడిట్ దర్శకులదే. ఎందుకంటే వారు చెప్పినట్టే నేను చేస్తాను. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం నా పనిని ప్రేమిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని నటి ఖుష్బూ అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ఖుష్బూ చెప్పిన విశేషాలు. ► ‘రామబాణం’ ప్రధానంగా కుటుంబ బంధాల నేపథ్యంలో ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని ఈ సినిమా చెబుతుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మూవీలో నేను చేసిన భువనేశ్వరి పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ► మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండేది.. ఆ తర్వాత హైదరాబాద్‌కి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. అయితే నా కుటుంబం కోసం నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడు తమిళ్లో ఎక్కువ చాన్సులు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు కాక తెలుగులో ‘చంటి’ వంటి సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ బాధ ఉంది. ► గోపీచంద్‌తో మొదటిసారి ‘రామబాణం’లో నటించాను. జగపతిబాబుగారు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌గారు నిర్మించిన రెండు సినిమాల్లో నేను బాలనటిగా చేశాను. జగపతిగారు మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామా అని పిలుస్తాను. ► ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారు సెట్స్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. వారు వరుస హిట్స్ అందుకోవడం సంతోషంగా ఉంది. శ్రీవాస్‌తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. తనతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది. ► అప్పటికి, ఇప్పటికి మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. హీరోయిన్ డింపుల్ హయతి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో లొకేషన్లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి? ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి? అనే ట్రిక్స్ మాకు తెలిసేవి. ఈ తరానికి అలాంటివి తెలీదు. ► కెరీర్లో గ్లామర్ రోల్స్ చేశాను, డ్యాన్స్‌లు చేశా. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. వారి మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు చేయాలి. అలాంటి పాత్రనే ‘రామబాణం’లో చేశాను. తెలుగులో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకిప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా చేస్తాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నాను.. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా. విజయ్ హీరోగా చేసిన ‘వారసుడు’లో నాది 18 నిమిషాల పాత్ర.. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా పాత్ర సన్నివేశాలు తొలగించారు. ► సినిమాల్లో డైరెక్టర్స్ సృష్టించిన పాత్రకి తగ్గట్లు చేయాలి. కానీ, టీవీ షోల్లో నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాను. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయాను. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. -
గోపీచంద్ కి దిష్టి తీయాలి..
-
ఈ హీరోయిన్ ధరించిన ఐవరీ ఫ్లోరల్ సారీ ధర ఎంతంటే!
Dimple Hayathi In Bhargavi Kunam Ivory Floral Saree: సినిమా చాన్స్ ఇమ్మని తొక్కిన ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ గడపలో ‘ఒంటి రంగు చూసుకున్నావా?’ అన్నట్టు వ్యక్తీకరించిన తిరస్కారపు చూపులను ఎదుర్కొంది డింపుల్ హయాతి. బాధపడింది. కానీ కుంగిపోలేదు. నిరుత్సాహపడింది కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమే ఇప్పుడు ఆమె తెర మీద కనిపిస్తే చప్పట్లు కొట్టేలా చేస్తోంది. అవకాశాల వెల్లువను ఆమె ఇంటి ముందుకు మళ్లించింది. ఆ ఆత్మవిశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ఒక కారణం డింపుల్లోని ప్రతిభ అయితే ఇంకో కారణం.. ఆమెను మెరిపించే ఫ్యాషన్ బ్రాండ్స్. అవేంటో చూద్దాం.. భార్గవి కూనమ్ భార్గవి కూనమ్ అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కళబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేసింది. అదే ప్రత్యేకతగా నిలిపింది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర : ఐవరీ ఫ్లోరల్ (భార్గవి కూనమ్) ధర: రూ. 34,800 థియా జ్యూయెలరీ థియా అంటే వెలుగు, మెరుపులకు ప్రతిరూపమైన గ్రీకు దేవత. ఈ బ్రాండ్‌ను స్థాపించింది అమెరికాలో స్థిరపడిన దక్షిణ కొరియా వనిత ఇరేన్. దాదాపు 20 ఏళ్లు కార్పోరెట్ ఉద్యోగం చేసి.. విసిగి వేసారి ఆ ఉద్యోగాన్ని వదిలి తనకు నచ్చిన స్పా, సెలూన్, బొటిక్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడే జ్యూయెలరీ మీద ఆమె దృష్టి పడింది. ముందు తన కోసం తాను నగలను డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అవి తన బోటిక్స్‌కు వచ్చే ఆడవాళ్లను ఆకర్షించడం గమనించి జ్యూయెలరీ డిజైన్లోనూ మెలకువలను నేర్చుకుంది. తక్కువ కాలంలో ఆమె సృజన బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో 2012లో ‘థియా జ్యూయెలరీ’ని స్థాపించింది. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతీసంప్రదాయాలు, అభిరుచుల కలయికే ఈ బ్రాండ్ ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. జ్యూయెలరీ: పర్ల్స్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: థియా జ్యూయెలరీ మైండ్‌లో భయాన్ని పెట్టుకొని కాదు మది నిండా కలలు నింపుకొని సాగాలి. నీమీద నీకున్న నమ్మకమే నీ లక్ష్యాన్ని చేరుస్తుంది.– డింపుల్ హయాతి ∙దీపిక కొండి -
తళుక్కున మెరిసిన డింపుల్ హయాతి
-
డింపుల్ అందాలకు గుండెలు ధడేల్ (ఫోటోలు)
-
‘ఖిలాడి’ మూవీ రివ్యూ
సినిమా: ఖిలాడి నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ముకుందన్, ముఖేశ్ రుషి తదితరులు సింగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు దర్శకత్వం: రమేశ్ వర్మ నిర్మాత: కోనేరు సత్యనారాయణ విడుదల తేదీ: 11.02.2022 Khiladi Movie Review: కరోనా థర్డ్‌వేవ్ కారణంగా బాక్సీఫీసు వద్ద కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు. సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా, పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలతోనే ప్రేక్షకుల సరిపెట్టుకున్నారు. అవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కరోనా ఉధృతి తగ్గడంతో పెద్ద సినిమా హవా షూరు అయ్యింది. ఈ క్రమంలో వరసగా సినిమా రిలీజ్ డేట్స్ వస్తున్న క్రమంలో మంచి ‘కిక్’ ఇచ్చేందుకు ముందుగా వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. రమేశ్ వర్మ దర్శకత్వలో ఆయన నటించిన తాజా చిత్రం ఖిలాడి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, మాస్, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. రవితేజ సినిమా కావడం, ఇద్దరు యంగ్ కథానాయికలు నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? రవితేజ ఖాతాలో మరో విజయం ఖాయమైనట్లేనా? అసలు కథేంటి చూద్దాం రండి! కథేంటంటే: ‘ఖిలాడి’లో రవితేజ పాత్ర పేరు మోహన్ గాంధీ. ఓ అంతర్జాతీయ క్రిమినల్‌గా కనిపిస్తాడు. అయితే తన కుటుంబాన్ని హత్య చేసిన కేసులో మెహన్ గాంధీ(రవితేజ) జైలు శిక్ష అనభవిస్తుంటాడు. ఈ క్రమంలో పూజాను(మీనాక్షి చౌదరి) కలుస్తాడు. పూజా ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. క్రిమినల్ సైకాలజీ చదువుతుంది. క్రిమినల్స్ సైకాలజీని తెలుసుకునే థీసెస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా పూజా, మెహన్ గాంధీని కలుస్తుంది. అతను జైలుకు ఎలా వచ్చాడు, చేసిన నేరమంటనేది ఆరా తీస్తుంది. దీంతో పూజకు ఓ కట్టుకథ చెప్పి ఆమె ద్వారా జైలు నుంచి బయట పడాలనుకుంటాడు మోహన్ గాంధీ. అతడి కథ విన్న పూజా చలించి అతడికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరి అతడు బయటకు రావడానికి రిస్క్ తీసుకుంటుంది. గాంధీ బయటకు వచ్చే సయమంలోనే పూజా ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. మోహన్ గాంధీ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి చెందిన 10 వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేయానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుసుకుని షాక్ అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? దానిని రవితేజ ఎందుకు కొట్టేయాలనుకున్నాడు? ఆ డబ్బు కొట్టేయానికి రవితేజ ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనే దాని చుట్టే కథ నడుస్తుంది. సినిమా ఎలా సాగిందంటే.. ఈ సినిమాలో మాస్ మహారాజా మార్క్‌ను మరోసారి చూపించాడు రవితేజ. ఆయన ఎనర్జీ, మితిమిరిన తెలివితెటలు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మోహన్ గాంధీగా రవితేజ షెడ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఓ తెలివైన దొంగ 10 వేల కోట్ల రాబరికి టార్గెట్ పెడితే ఎలా ఉంటుంది, అది ఓ బడా రాజకీయ నాయకుడి వద్ద.. ఆ దొంగను పట్టుకునేందుకు సీబీఐ చేజింగ్‌లు, రన్నింగ్‌తో దర్శకుడు ఫుల్ యాక్షన్, థ్రీల్లర్ సినిమా చూపించాడు. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉంటే భార్య(డింపుల్ హయాతి), అత్త(అనసూయ), మామలను హత్య చేసిన నేరగాడిగా రవితేజను పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది. మీనాక్షి చౌదరి, రవితేజ కథను వివరించిన తీరు థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అక్కడ చూపించిన స్టోరీ రోటిన్ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది. ఇక రవితేజ బయటకు వచ్చాకా అసలు కథ స్టార్ట్ అవుతుంది. విరామం వరకు మోహన్ గాంధీ పాత్ర అసలు బయటకు రాకపోవడం, సెకండ్ పార్ట్‌లో రివిల్ చేయడంలో థ్రిల్ అవుతారు ప్రేక్షకులు. ఇక సెకండ్ పార్ట్ ఫుల్ యాక్షన్, థ్రిల్లింగ్‌తో నడిచినప్పటికీ కథ ముందుగానే ఊహించేలా ఉంటుంది. ఈ క్రమంలో కథ మొత్తం రోటిన్ అయిపోతుంది. రూ. 10 వేల కోట్లు కొట్టేసే క్రమంలో మోహర్ గాంధీ టీం చేసే ప్రయత్నాలు సిల్లిగా, కామెడీగా ఉంటాయి. ఇక మధ్యలో మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ ఊపునిస్తాయి. ఇలా సినిమాను దర్శకుడు సాగథీయడంతో సినిమా క్లైమాక్స్ కాస్తా విసుగు పుట్టిస్తుంది. అయినప్పటికీ మాస్ మహారాజా ఎనర్జీ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులకు కనులవిందు అందించారు. ఇక డింపుల్ హయాతి పాత్ర అమాయకంగా, రెండోది ఇంటెన్స్‌గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ ఆమె. ఈ సినిమాలోన ఆమెను హీరోయిన్గా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్‌తో సాగుతాయి. తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. ఇదంతా జైలులో ఉన్న మోహన్ గాంధీ పూజకు వివరిస్తాడు. నిజంగానే మోహన్ గాంధీ తన భార్యను చంపాడా. ఆ హత్య చేసిందెవరు, ఈ గతంలో రామకృష్ణ (ఉన్ని ముకుందన్) ఎవరు, పదివేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నుంచి రాజశేఖర్, మోహన్ గాంధీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ. బలాలు ⇒ రవితేజ నటన ⇒ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిల గ్లామర్ ⇒ యాక్షన్ సీక్వెన్స్ బలహీనతలు ⇒ కథ(ఊహకు తగ్గట్టుగా సాగుతుంది) ⇒ క్లైమాక్స్ -స్నేహలత, వెబ్‌డెస్క్ -
హీరోయిన్‌కు సారీ చెప్పిన 'ఖిలాడి' డైరెక్టర్
Khiladi Director Ramesh Varma Says Sorry To Heroine: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రమేశ్ వర్మ.. స్టేజ్‌పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు. ఖిలాడీ ట్రైలర్ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. -
నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్
Khiladi Movie Actress dimple Hayathi Faced Rejection Of Her Skin Colour: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్రా జర్రా'.. ఐటెం సాంగ్‌తో మెప్పించింది డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకోంటోంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. అయితే కెరీర్ మొదట్లో పలు తిరస్కారాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. -
‘ఖిలాడి’ హీరోయిన్ల అందాలు చూడతరమా
-
టీజర్ ఆసక్తికరంగా ఉంది
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా, డింఫుల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘ప్లాన్ బి’. కేవీ రాజమహి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏవీఆర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను త్రివిక్రమ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా క్యూరియాసిటీ నింపింది. సినిమా పెద్ద సక్సెస్ అయి అందరికీ పేరు రావాలనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సస్పెన్స్, క్రైమ్ థిల్లర్‌గా రూపొందించాం. కునాల్ శర్మ విలన్‌గా చేశారు’’ అన్నారు రాజమహి. ‘‘షూటింగ్ పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. మా టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివర్లో ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ఏవీఆర్. -
గద్దలకొండ గణేష్ స్పెషల్ సాంగ్ భామ హయాతీ ఫొటోలు
-
ఎంటర్టైనింగ్.. ఎంగేజింగ్
కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రానికి కథే బలం. యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో జరిగే కథ ఇది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్.మా సినిమాలో అదేంటన్నది సస్పెన్స్’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘మా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. జులై ఫస్ట్ వీక్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోయిన్గా ఇది నా రెండో చిత్రం. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు డింపుల్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: విశ్వ. -
బరిలో దిగితే పతకమే
హైదరాబాద్: పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు. లెక్కకు మిక్కిలిగా ప్రతిభా, ప్రశంసా అవార్డులు. బరిలోకి దిగితే అవలీలగా ప్రత్యర్థులను మట్టికరిపించడం. ఇదీ కరాటేలో అద్భు త ప్రతిభ కనబరుస్తోన్న 18 ఏళ్ల తెలుగు అమ్మాయి సూరపనేని డింపుల్ సామర్థ్యం. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పోటీలకు వెళ్లాలంటే ఇతరుల వద్ద చేతులు చాపాల్సిన పరిస్థితి. దాదాపుగా అన్ని స్థాయిల్లో విజయాలను సాధించిన ఆమె... ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కార్వీ సంస్థ అందించిన సహాయం ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. ఆ సంస్థ ఇచ్చిన ప్రో త్సాహంతోనే ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని సాధించింది. భవిష్యత్‌లో కరాటే చాంపియన్‌గా మారాలని దృఢంగా నిర్ణయించుకుంది. కుటుంబ నేపథ్యం... డింపుల్ స్వస్థలం విజయవాడ. ఆమె తల్లిదండ్రులు సూరపనేని రామోజి, సుజనశ్రీ. ప్రస్తుతం ఆమె ఆంధ్ర లయోలా కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఏడేళ్ల వయస్సు నుంచే కరాటేలో ప్రతిభ కనబరుస్తోన్న డింపుల్‌కు స్కూల్ స్థాయిలో ఇచ్చిన శిక్షణే పునాది. అంతర్ పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తూ ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మారింది. 2013లో జాతీయ స్థాయిలో తొలి కాంస్యాన్ని సాధించింది. అదే ఏడాది మలేసియాలో జరిగిన టోర్నీలో స్వర్ణంతో పాటు కాంస్యాన్ని గెలుచుకుంది. 2015లో క్రొయేషియాలో జరిగిన ‘వరల్డ్ ఫెడరేషన్ టోర్నమెంట్’, 2016లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లోనూ డింపుల్ పాల్గొంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో యూఎస్ ఓపెన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నానని డింపుల్ చెప్పింది. కార్వీ సంస్థ చివరి క్షణంలో ఆదుకోవడంతోనే భారత్‌కు పతకాలు అందించగలిగానని తెలిపింది. డింపుల్ చిన్ననాటి కోచ్ వెంకటేశ్వరరావు కాగా ప్రస్తుతం జాతీయ కోచ్ కీర్తన్ కొండూరు ఆమెకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన డింపుల్ మూడు పతకాలను సాధించింది. అండర్–65 కేజీల వెయిట్ కేటగిరీ మహిళల వ్యక్తిగత ‘కటా’ విభాగంలో స్వర్ణంతో పాటు ‘టీమ్ కుమిటీ అండ్ కటా’ కేటగిరీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత కుమిటీ విభాగంలో రన్నరప్‌గా నిలి చి రజతాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డింపుల్‌కు అభినందన సభ జరిగింది. -
కరాటే ప్లేయర్ డింపుల్‌కు కార్వీ ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: కరాటే క్రీడలో ప్రతిభ కనబరుస్తోన్న క్రీడాకారిణి సూరపనేని డింపుల్‌ను ప్రోత్సహించేందుకు కార్వీ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో త్వరలో జరుగనున్న ఓపెన్, జూనియర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్లో డింపుల్ 65 కేజీల మహిళల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నేపథ్యంలో ఆమె శిక్షణ కోసం కార్వీ సంస్థ ఆర్థిక సహాయం అందించింది. బుధవారం కార్వీ ఎండీ ఎం. యుగంధర్ ఆమెకు లక్ష రూపాయల చెక్‌ను అందించారు. గతంలో మలేసియాలో జరిగిన నైట్ ఇంటర్నేషనల్ కరాటే కప్‌లో డింపుల్ స్వర్ణాన్ని సాధించింది. జాతీయ స్థాయిలోనూ పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన డింపుల్... 13 ఏళ్ల వయసులోనే కరాటే షోడాన్ టైటిల్‌ను సాధించింది. ప్రస్తుతం విజయవాడలో బీఈ కంప్యూటర్స్ చదువుతోంది. -
కొత్తవారైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు!
‘‘భావోద్వేగంతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. 150 సెంటర్లలో ‘గల్ఫ్’ను విడుదల చేస్తే ఇప్పటికీ 16 కేంద్రాల్లో ఆడుతోంది. రూరల్ లెవల్లోనూ మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అని దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ విడుదలై మంగళవారానికి 25 రోజులైంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్ కావడం గ్రేట్. తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. రూరల్ పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఇందులో నటించింది కొత్తవారైనా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. వాళ్లు కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు గల్ఫ్‌లో ఉన్న తమ పిల్నల్ని వీళ్లలో చూసుకోవడం చూశా’’ అన్నారు. ‘‘రెండు మూడు రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ‘గల్ఫ్’కి ఇంతమంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చేతన్ మద్దినేని. ‘‘మా గత సినిమాల కన్నా ‘గల్ఫ్’కి ఎక్కువ స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు యక్కలి రవీంద్రబాబు. -
కష్టాలే కాదు.. లవ్‌స్టోరీ కూడా!
‘‘రోజులు మారాయి’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రం ‘గల్ఫ్’. ఇందులో చేనేత కార్మికుడి కొడుకు పాత్ర చేశా. గల్ఫ్ దేశాల్లోని స్నేహితులు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావించి భవన నిర్మాణ రంగం కూలీగా వెళతా. నా పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశా’’ అన్నారు చేతన్ మద్దినేని. ఆయన హీరోగా, డింపుల్ కథానాయికగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్.రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ ఈరోజు విడుదలవుతోంది. చేతన్ మద్దినేని మాట్లాడుతూ– ‘‘కేవలం గల్ఫ్ కష్టాలే కాకుండా లవ్‌స్టోరీతో అన్ని వాణిజ్య అంశాలతో సునీల్‌కుమార్ రెడ్డిగారు ఈ సినిమా తెరకెక్కించారు. తెలంగాణలో డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో నాలుగైదు సార్లు డైలాగ్స్‌ను చదివి, నేర్చుకుని మరీ చెప్పాను. లెక్చరర్‌ను పెట్టుకుని తెలంగాణ భాష నేర్చుకున్నా. మారుతిగారి ప్రొడక్షన్లో ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే సినిమా చేస్తున్నా. ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్’’ అన్నారు. -
వాళ్లు చూసినా చాలు... మా సినిమా సక్సెస్!
‘‘మన తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువమంది ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళుతుంటారు. అక్కడ కష్టాలు పడేవాళ్లలో 95 శాతం మంది తెలుగువాళ్లే. వాళ్లలో హింసకు గురయ్యే మహిళలూ ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వాలు ఎక్కువగా స్పందించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల్లో, నాయకుల్లో ఆ స్పందన తీసుకురావడం కోసమే ‘గల్ఫ్’ సినిమా చేశా’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ‘గల్ఫ్’ మరో ఎత్తు. ఇది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. కథ కోసం రీసెర్చ్ చేయడంతో సినిమాకు రెండున్నరేళ్లు పట్టింది. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేవాళ్లపై సినిమాలొచ్చాయి. కానీ, గల్ఫ్ వలసల మీద తెలుగు లో ఒక్క సినిమా రాలేదు. అందుకే ఆ సున్నితమైన అంశం మీద సినిమా తీయాలనుకున్నా. గల్ఫ్ దేశాల్లో అక్కడి స్థానికులు మనవాళ్లని మోసం చేసేకన్నా మనవాళ్లని మనవాళ్లే మోసం చేయడం ఎక్కువ. మన తెలుగువారిలో 50 లక్షల మందికి గల్ఫ్ అంటే ఏంటో? అక్కడి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇది వాళ్ల సినిమానే. వాళ్లు చూసినా చాలు మా సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవుతుంది. వాళ్లు చూస్తారనే నమ్మకంతోనే చేశా. గల్ఫ్ కష్టాల నేపథ్యం లోనే తెలుగబ్బాయి, తెలుగమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథ కూడా ఉంటుంది. కమర్షియల్ అంశాలు కోరుకునేవారికీ, ప్రేక్షకుడి డబ్బుకీ న్యాయం జరుగుతుంది’’ అన్నారు. -
సరిహద్దులు దాటిన ప్రేమకథ
పుట్టిన ఊర్లో సరైన ఉపాధి లేక ఎందరో గల్ఫ్ బాట పడుతున్నారు. తీరా అక్కడ వారు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? అనే కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వలస భారతీయులు జైలుశిక్షను అనుభవిస్తూ ఎలా హింసకు గురవుతున్నారు? అనే అంశాలను 400మందికి పైగా గల్ఫ్ బాధితులతో మాట్లాడి తెలుసుకుని ఈ చిత్రం తీశాం. గల్ఫ్ వెతలు కళ్లకు కట్టినట్టు చూపించాం. 90 శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ అరబిక్ సాంగ్ కూడా ఉంది.’’ అన్నారు. చేతన్, డింపుల్ పాల్గొన్నారు. -
'ఏ' సర్టిఫికెట్తో వస్తున్న జయిక్కిర కుదిర
సాక్షి, చెన్నై: లవ్, కామెడీ, గ్లామర్ ఈ మూడు అంశాలు ఉంటేనే నేటి యువతకు చిత్రాలు నచ్చుతున్నాయి. అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం జయిక్కిర కుదిరై అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శక్తి ఎన్.చిదంబరం. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సినిమాప్యారడైజ్, చరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొంత గ్యాప్ తరువాత జీవన్ హీరోగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా డింపుల్ శోబాడే, సాక్షీఅగర్వాల్, అశ్వని ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, తలైవాసల్ విజయ్, కోవైసరళ, రవిమరియ, సింగంపులి, చిత్రాలక్ష్మణ్, లీవింగ్‌స్టన్, రమేశ్‌ఖన్నా, మదన్ బాబు, యోగిబాబు, భడవాగోపి, టీపీ.గజేంద్రన్, పాండు, ఏఎల్.అళగప్పన్, రోబోశంకర్, ఇమాన్ అన్నాచ్చి, దీప, రామానుజం, వైయాపురి, ఆదవన్ నటిస్తున్నారు. అంజి సంగీతం, కేఆర్.కవిన్ శివ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు శక్తి.ఎన్.చిదంబరం తెలుపుతూ జయిక్కిర కుదిరై చిత్రం జనరంజకమైన అంశాలతో ఆరంభం నుంచి, చివరి వరకూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
గల్ఫ్ కష్టాలు తెలుసుకున్నా!
‘‘సునీల్‌కుమార్‌రెడ్డిగారి సినిమాలన్నీ చూశా. విశాఖలో ఇంజినీరింగ్ చదివే టైమ్‌లో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’కు వెళ్లా. 60వ రోజున కూడా థియేటర్ హౌస్‌ఫుల్ అయింది. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఆయన దర్శకత్వంలో ఎప్పటికైనా నటించాలనుకున్నా. లక్కీగా నా రెండో సినిమాతోనే కుదిరింది’’ అన్నారు చేతన్ మద్దినేని. ఆయన హీరోగా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్.యస్. రామ్‌కుమార్ నిర్మించిన సినిమా ‘గల్ఫ్’. చేతన్ మద్దినేని మాట్లాడుతూ – ‘‘సిరిసిల్ల చేనేత కార్మికుడి కుమారుడు శివ పాత్రలో నటించా. బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారనేది నా పాత్ర ద్వారా దర్శకుడు చూపించారు. కష్టాలే కాదు, ఫ్లైట్‌లో పరిచయమైన ఓ అమ్మాయి (డింపుల్)తో క్యూట్ లవ్‌స్టోరీ కూడా ఉంది. మా పేరెంట్స్ అమెరికాలో ఉంటారు. వాళ్లను కలవడానికి ఇండియా టు అమెరికా వయా దుబాయ్ ఫ్లైట్‌లో వెళ్తుంటాను. జర్నీలో గల్ఫ్ కార్మికుల కష్టాలు కొన్ని తెలుసుకున్నా. ఈ సినిమా అంగీకరించాక, సునీల్‌కుమార్‌రెడ్డిగారితో నేనూ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు పర్యటించి రీసెర్చ్ చేశా. అందువల్ల, సినిమా అంతా తెలంగాణ యాసలో ఈజీగా నటించగలిగా. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’, ‘హై ఎండ్ ఫోన్’ సినిమాలు చేస్తున్నా. ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’కు మారుతిగారు నిర్మాత’’ అన్నారు. -
గల్ఫ్ వెతలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ రాని గల్ఫ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య, నల్ల వేణు ప్రధాన పాత్రధారులు. పి. సునీల్ కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించారు. జూలై మొదటివారంలో పాటల్ని, రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గల్ఫ్ దేశాలన్నీ పర్యటించి, దాదాపు 400కి పైగా కేస్ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. చిన్నారాయణ రాసిన చక్కటి భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే ఉప శీర్షికతో వస్తోన్న చిత్రమిది. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘క్రిమినల్ ప్రేమ కథ’ల కన్నా పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత. ‘‘గల్ఫ్ నేపథ్యంలో తెలుగులో ఇప్పటికీ ఒక్క సినిమా రాకపోవడం ఆశ్చర్యం. సునీల్ కుమార్‌రెడ్డి ఆ లోటు తీర్చేసారు. ఆయనలోని జర్నలిస్ట్ ఈ సినిమా తీయడానికి ఉసిగొల్పినట్టు అనిపిస్తోంది’’ అని మాటల రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బాపిరాజు పాల్గొన్నారు.