‘‘రోజులు మారాయి’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రం ‘గల్ఫ్’. ఇందులో చేనేత కార్మికుడి కొడుకు పాత్ర చేశా. గల్ఫ్ దేశాల్లోని స్నేహితులు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావించి భవన నిర్మాణ రంగం కూలీగా వెళతా. నా పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశా’’ అన్నారు చేతన్ మద్దినేని. ఆయన హీరోగా, డింపుల్ కథానాయికగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్.రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ ఈరోజు విడుదలవుతోంది.
చేతన్ మద్దినేని మాట్లాడుతూ– ‘‘కేవలం గల్ఫ్ కష్టాలే కాకుండా లవ్‌స్టోరీతో అన్ని వాణిజ్య అంశాలతో సునీల్‌కుమార్ రెడ్డిగారు ఈ సినిమా తెరకెక్కించారు. తెలంగాణలో డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో నాలుగైదు సార్లు డైలాగ్స్‌ను చదివి, నేర్చుకుని మరీ చెప్పాను. లెక్చరర్‌ను పెట్టుకుని తెలంగాణ భాష నేర్చుకున్నా. మారుతిగారి ప్రొడక్షన్‌లో ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే సినిమా చేస్తున్నా. ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment