chetan maddineni
-
రివెంజ్ డ్రామా
‘‘మొదట్నుంచి నాకు దర్శకత్వంపైనే ఆసక్తి. అనుకోకుండా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించి హీరోగా పరిచయం అయ్యాను’’అని చేతన్ మద్దినేని అన్నారు. చేతన్ నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ‘బీచ్ రోడ్ చేతన్’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ–‘‘రియలిస్టిక్ అండ్ రా ఎంటర్టైనర్. స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. ఒక్క సన్నివేశం మిస్ అయిన ప్రేక్షకులు లింక్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఫోన్ ద్వారా హీరో ఎవరి మెమొరీస్లోకైనా వెళ్లగలడు అనేది పాయింట్. చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోరు. అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి ఫ్రీగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశాం. నాకు దర్శకత్వంలో పెద్దగా అనుభవం లేదు. అందుకే డైరెక్షన్ ఎలా చేయాలి? షాట్ మేకింగ్, ఇలా 24 క్రాప్ట్స్కు సంబంధించిన విషయాలను ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. నెక్ట్స్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని అన్నారు. -
ఉదయం ఆట ఉచితం
‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ర్యాంక్ రాజు’ చిత్రాల్లో హీరోగా నటించిన చేతన్ మద్దినేని తొలిసారి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బీచ్ రోడ్ చేతన్’. తేజారెడ్డి కథానాయికగా నటించారు. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరో–దర్శక–నిర్మాత– చేతన్ మద్దినేని మాట్లాడుతూ– ‘‘ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. టీజర్ అందరికీ నచ్చింది. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. మా సినిమా మొదటి రోజు మొదటి ఆట టికెట్స్‌ని ఏపీ, తెలంగాణలో ప్రేక్షకులకు ఉచితంగా ఇస్తున్నాం. దాదాపు 200 థియేటర్స్‌లో మా సినిమా విడుదల కాబోతోంది. మొదటి ఆట నుంచి మా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘అందరికీ కల ఉంటుంది. వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తి కావాలి. ఈ సినిమాలో విలన్‌గా నాకు మంచి పాత్ర ఇచ్చారు చేతన్. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నటుడు నిర్మల్ భాను. ‘‘150 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు. అందరూ బాగా చేశారు’’ అన్నారు కో డైరెక్టర్ ఈశ్వర్. ఈ చిత్రానికి కెమెరా: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె. బెనయ్య. -
ఓ బేవర్స్ కుర్రాడి కథ
‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంకు రాజు’ చిత్రాల ఫేమ్ చేతన్ మద్దినేని హీరోగా నటిస్తూ, స్వీయదర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘బీచ్ రోడ్ చేతన్’. తేజారెడ్డి హీరోయిన్గా నటించారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. చేతన్ మాట్లాడుతూ– ‘‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంకు రాజు’ చిత్రాలు విజయం సాధించి హీరోగా నాకు పేరు తెచ్చాయి. కానీ చేతన్ మద్దినేని అనేంతగా గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్నాను. ఆ మూడు సినిమాల తర్వాత చాలా కథలు విన్నాను. ఏదీ నచ్చలేదు. అందుకే సొంతగా కథ రాసుకున్నాను. బీచ్‌లో బేవర్స్‌గా తిరిగే చేతన్ అనే యువకుని కథ ఇది. సినిమా అంతా వైజాగ్‌లో జరుగుతుంది. ఇందులో చేతన్ అనే పాత్ర చేశాను. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు. ‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇది. అవకాశం ఇచ్చిన చేతన్‌కు థ్యాంక్స్’’ అన్నారు తేజారెడ్డి. ‘‘చిన్న సినిమాగా స్టార్ట్ చేసినా మేం పెద్ద సినిమా చేశాం. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు కెమెరామన్ నిశాంత్ రెడ్డి. -
ర్యాంకు రాకపోతే..!
చేతన్ మద్దినేని హీరోగా నరేష్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. ‘విద్య నూరు శాతం. బుద్ది సున్నా శాతం’ అనేది ఉపశీర్షిక. మంజునాథ్ వి. కందుకూర్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. చేతన్ మాట్లాడుతూ – ‘‘కష్టపడి చదివిన తర్వాత ర్యాంకు రాకపోతే ఇక జీవితమే లేదనే నేటి యువతరం ఆలోచనా ధోరణి సరైనది కాదన్న విషయాన్ని మా చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకు సాధించే రాజు అనే వ్యక్తి లైఫ్ జర్నీ ఈ చిత్రం. ఈ సినిమా స్టూడెంట్స్‌కి ఎంత ఇంపార్టెంటో, వారి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ చిత్రంలో నేను రాజు పాత్రలో నటించాను. నేను మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. కన్నడ ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ఆధారంగా ఈ సినిమా చేశాం. దర్శకుడు మారుతిగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. సినిమా విడుదలలోనూ హెల్ప్ చేశారు. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
వారికి ఆ అర్హత లేదు
‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడనప్పుడు రొటీన్ సినిమాలు ఎందుకు వస్తున్నాయని కామెంట్ చేసే అర్హత లేదని నా నమ్మకం. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మంజునాథ్గారికి థ్యాంక్స్. నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయడానికి రెడీ’’ అని చేతన్ అన్నారు. నరేష్కుమార్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని, కశిష్ ఓరా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. ‘విద్య 100%.. బుద్ధి 0%’ అనేది ఉపశీర్షిక. మంజునాధ్ వి. కందుకూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘టైటిల్ లాగే సినిమా కూడా మంచి మార్కులు పొందాలి. టీమ్‌కి నా బెస్ట్ విషెష్’’ అన్నారు. ‘‘ఈ పాత్రకి చేతన్ తప్ప వేరెవరూ న్యాయం చేసేవారు కారు. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాడు. మంజునాథ్‌గారు, నరేష్‌గారు తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు డైరెక్టర్ మారుతి. ‘‘సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌తోనే ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ చిత్రం చేశాను. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఈ సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత మంజునాథ్. ‘‘లైఫ్‌లో విద్య మాత్రమే కాదు.. బుద్ధి కూడా ఉండాలి’ అనే మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు నరేశ్. ‘‘నా కెరీర్లో చూసిన బెస్ట్ స్క్రిప్ట్ ఇది’’ అన్నారు కాశీష్ ఓహ్రా. -
విద్య 100... బుద్ధి 0
‘‘ఒక అద్భుతమైన పాయింట్‌ని ఎంటర్టైనింగ్గా చెప్పడం చాలా గొప్ప విషయం’’ అన్నారు మా అధ్యక్షుడు సీనియర్ నరేశ్. చేతన్ మద్దినేని హీరోగా నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి. కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. ‘విద్య 100శాతం, బుద్ధి 0 శాతం’ అనేది ఉపశీర్షిక. ఇందులో హీరో తండ్రి పాత్రలో నటించారు నరేశ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘కన్నడంలో చాలా పెద్ద హిట్ సాధించిన ఈ చిత్రాన్ని అదే టీమ్ తెలుగులో చేయడం మొదటి సక్సెస్‌గా నేను భావిస్తున్నాను. చార్లీ చాప్లిన్ కామెడీ సీన్ వెనక చిన్న పెయిన్ ఉంటుంది. ఈ ఫార్ములాతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. పాత్రను ఫీలై చేతన్ అద్భుతంగా నటించారు. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. దర్శకుడు నరేశ్ మంచి వినోదాత్మకంగా తెరకెక్కించారు. తెలుగు సినిమాలపై అభిమానంతో ఓ మంచి చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనుకోవడం మంజునాథ్‌కి ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ సాధించాలి’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. తల్లిదండ్రులు చదువుకోసం వారి పిల్లలను ఎలా ఒత్తిడి చేస్తున్నారు? పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? అనే అంశాలను ఎంటర్టైనింగ్ చూపించారు’’ అన్నారు దర్శకులు మారుతి. ‘‘కన్నడంలో మేము చేసిన ఫస్ట్ ర్యాంకు చిత్రం మా జీవితాలను మార్చేసింది. విద్యార్థులకు విద్యే కాదు. బుద్ధి ఉండాలని చెప్పే సినిమా. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అన్నారు నరేశ్‌కుమార్. ‘‘తెలుగులో సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మిస్తాను’’ అన్నారు మంజునాథ్. ‘‘ప్రతి ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్ బయోపిక్ ఇది. ఈ పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు చేతన్. సంగీత దర్శకుడు కిరణ్ రవీంద్రనాథ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
ఫస్ట్ ర్యాంక్
చేతన్ మద్దినేని, కాశిష్ వోరా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. నరేష్ కుమార్ హెచ్.ఎన్. దర్శకత్వంలో డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్, మారుతి టాకీస్‌పై మంజునాథ్ కంద్కూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మారుతి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నరేష్ చెప్పిన కథ చాలా బాగుంది. ఈ సినిమా అందరికి నచ్చి, యూనిట్‌కి మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. హిలేరియస్ కామెడీతో పాటు మెసేజ్ ఉంటుంది. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం’’ అన్నారు మంజునాథ్. ‘‘మారుతిగారు మాకు బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. నా కథ నచ్చి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్న నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు నరేష్ కుమార్. తనికెళ్ల భరణి, నరేష్, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ మద్దినేని, సంగీతం: కిరణ్ రవీంద్రనాథ్, కెమెరా: శేఖర్ చంద్ర. -
కొత్తవారైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు!
‘‘భావోద్వేగంతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. 150 సెంటర్లలో ‘గల్ఫ్’ను విడుదల చేస్తే ఇప్పటికీ 16 కేంద్రాల్లో ఆడుతోంది. రూరల్ లెవల్లోనూ మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అని దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ విడుదలై మంగళవారానికి 25 రోజులైంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్ కావడం గ్రేట్. తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. రూరల్ పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఇందులో నటించింది కొత్తవారైనా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. వాళ్లు కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు గల్ఫ్‌లో ఉన్న తమ పిల్నల్ని వీళ్లలో చూసుకోవడం చూశా’’ అన్నారు. ‘‘రెండు మూడు రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ‘గల్ఫ్’కి ఇంతమంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చేతన్ మద్దినేని. ‘‘మా గత సినిమాల కన్నా ‘గల్ఫ్’కి ఎక్కువ స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు యక్కలి రవీంద్రబాబు. -
కష్టాలే కాదు.. లవ్‌స్టోరీ కూడా!
‘‘రోజులు మారాయి’ సినిమా తర్వాత నేను నటించిన చిత్రం ‘గల్ఫ్’. ఇందులో చేనేత కార్మికుడి కొడుకు పాత్ర చేశా. గల్ఫ్ దేశాల్లోని స్నేహితులు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారని భావించి భవన నిర్మాణ రంగం కూలీగా వెళతా. నా పాత్ర రియలిస్టిక్‌గా ఉంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశా’’ అన్నారు చేతన్ మద్దినేని. ఆయన హీరోగా, డింపుల్ కథానాయికగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్.రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ ఈరోజు విడుదలవుతోంది. చేతన్ మద్దినేని మాట్లాడుతూ– ‘‘కేవలం గల్ఫ్ కష్టాలే కాకుండా లవ్‌స్టోరీతో అన్ని వాణిజ్య అంశాలతో సునీల్‌కుమార్ రెడ్డిగారు ఈ సినిమా తెరకెక్కించారు. తెలంగాణలో డైలాగ్స్ చెప్పాల్సి రావడంతో నాలుగైదు సార్లు డైలాగ్స్‌ను చదివి, నేర్చుకుని మరీ చెప్పాను. లెక్చరర్‌ను పెట్టుకుని తెలంగాణ భాష నేర్చుకున్నా. మారుతిగారి ప్రొడక్షన్లో ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే సినిమా చేస్తున్నా. ఇది ఓ కన్నడ సినిమాకి రీమేక్’’ అన్నారు. -
మా రోజులు మారాయి
జిల్లావాసుల ఆదరణ మరువలేనిదని, తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ చిత్రయూనిట్ ఎంతగానో రుణపడి ఉందని, ఈ చిత్రంతో ‘మా రోజులు మారాయి’ అని అన్నారు ‘రోజులు మారాయి’ చిత్ర హీరోలు, హీరోయిన్. ఆ చిత్ర యూనిట్ బుధవారం కాకినాడ, రాజమహేంద్రవరంలలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చిన హీరోలు పార్వతీశం, చేతన్‌మద్దినేని, హీరోయిన్ కృతిక, దర్శకుడు మురళీకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. సినిమా విశేషాలు వెల్లడించారు. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను సందర్శించిన చిత్రయూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో అభినందించింది. చిత్ర కథానాయిక కృతిక మాట్లాడుతూ హాస్యం, సస్పెన్స్ తో నిర్మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. తనకు ‘దృశ్యం’ చిత్రం బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. ‘కేరింత’ నూకరాజని పిలుస్తున్నారు రోజులు మారాయి హీరో పార్వతీశం ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తనను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘కేరింత’ నూకరాజుగానే గుర్తిస్తున్నారని, అదే తనపేరైందని ‘రోజులు మారాయి’ హీరో పార్వతీశం పేర్కొన్నారు. స్థానిక ఆనందరీజెన్సీ హోటల్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : స్వగ్రామం, పెరిగింది ఎక్కడ? పార్వతీశం : స్వగ్రామం పలాస, బెంగళూరులో పెరిగా. అక్కడే బీటెక్ చదివా, యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్ వచ్చేశా. సాక్షి : ఇప్పటి వరకు చేసిన సినిమాలు? పార్వతీశం : కేరింత, రోజులు మారాయి చిత్రాలు చేశాను. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ‘నాన్నా.. నేను నా బాయ్‌ప్రెండ్స్’ చిత్రం చేస్తున్నా. హెబ్సాపటేల్ హీరోయిన్గా చేస్తుంది. సాక్షి : రోజులు మారాయి చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది? పార్వతీశం : రోజులు మారాయి చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. మేము వెళుతున్న ప్రతి థియేటర్లో ఈ సినిమాలో పీటర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరింత నూకరాజు అనేవారు పీటర్ అంటూ పిలుస్తున్నారు. సినిమాలోని డైలాగులు నాకంటే ముందే ప్రేక్షకులు చెప్పేస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఏ పాత్రలు చేయాలని అనుకుంటున్నారు? పార్వతీశం : ప్రకాష్‌రాజ్, నాని, అమీర్‌ఖాన్‌లు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలలో నటించాలన్నదే తన ఆకాంక్ష. ‘తొలి సినిమాకే ఆదరణ చూపిస్తున్నారు’ రోజులు మారాయి హీరో చేతన్ మద్దినేని తాను నటించిన మొదటి సినిమా ‘రోజులు మారాయి’కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా హీరో చేతన్ మద్దినేని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ‘‘మా స్వగ్రామం విశాఖపట్నం. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు యూఎస్‌లో సెటిల్అయ్యారు. యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్‌లో ఉంటున్నా. రోజులుమారాయి నా మొదటి సినిమా. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’సినిమాలో నటించాను. మూడు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రోజులు మారాయి చిత్రం నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ప్రతి థియేటర్లో నన్ను ఈజీగానే గుర్తుపట్టారు. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. మేము చెప్పే డైలాగులను ముందుగానే ప్రేక్షకులు చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అన్ని రకాల పాత్రలను చేస్తాను. అంతేకాకుండా దర్శకుడు మారుతి చిత్రాల్లోనే నటిస్తా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. ఆయన వల్లే చిత్రసీమకు వచ్చా. ‘మా అమ్మమ్మ వాళ్లది రాజమహేంద్రవరమే’ రోజులు మారాయి దర్శకుడు మురళీకృష్ణ ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ‘మా స్వగ్రామం కృష్ణాజిల్లా గుడివాడైనా.. అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరమే’ అని రోజులు మారాయి చిత్ర దర్శకుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : ఇప్పటివరకు సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. రోజులు మారాయి నా మొదటి చిత్రం. సాక్షి : ఏయే సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : నాన్న, చిన్నారి, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. మూడింటికీ ఉత్తమ సీరియల్స్‌గా నంది అవార్డులు అందుకున్నా. అలాగే నాన్న, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది. సాక్షి : రోజులు మారాయి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? మురళీకృష్ణ : వెళ్లిన ప్రతి చోట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైైనర్ సినిమా. ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. సాక్షి : కొత్తగా దర్శకత్వం వహించే సినిమాలు మురళీకృష్ణ : నిర్మాతలు దిల్‌రాజు, జి.శ్రీనివాసరావుల తో కలిసి కొత్తగా ఒక సినిమా చేద్దామని అన్నారు. త్వరలోనే మొదలు పెడతాం. సాక్షి : సెలవులకు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఏం చేసేవారు? మురళీకృష్ణ : అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట. చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు సైకిల్ తొక్కుకుంటూ గోదావరి గట్లపై తిరుగుతూ ఉండేవాడిని. ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పటి కీ మరిచిపోలేని అనుభూతి. మరలా రాజమహేంద్రవరం ‘రోజులు మారాయి’ విజయోత్సవ ర్యాలీకి రావడం ఆనందంగా ఉంది.