రివెంజ్‌ డ్రామా | Beach Road Chetan movie updates | Sakshi

రివెంజ్‌ డ్రామా

Nov 21 2019 3:26 AM | Updated on Nov 21 2019 3:26 AM

Beach Road Chetan movie updates - Sakshi

‘‘మొదట్నుంచి నాకు దర్శకత్వంపైనే ఆసక్తి. అనుకోకుండా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించి హీరోగా పరిచయం అయ్యాను’’అని చేతన్‌ మద్దినేని అన్నారు. చేతన్‌ నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చేతన్‌ మాట్లాడుతూ–‘‘రియలిస్టిక్‌ అండ్‌ రా ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. ఒక్క సన్నివేశం మిస్‌ అయిన ప్రేక్షకులు లింక్‌ మిస్‌ అయ్యే అవకాశం ఉంది. ఒక ఫోన్‌ ద్వారా హీరో ఎవరి మెమొరీస్‌లోకైనా వెళ్లగలడు అనేది పాయింట్‌. చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోరు. అందుకే డిఫరెంట్‌గా ఆలోచించి ఫ్రీగా ప్రీమియర్‌ షోలు ప్లాన్‌ చేశాం. నాకు దర్శకత్వంలో పెద్దగా అనుభవం లేదు. అందుకే డైరెక్షన్‌ ఎలా చేయాలి? షాట్‌ మేకింగ్, ఇలా 24 క్రాప్ట్స్‌కు సంబంధించిన విషయాలను ఆన్‌లైన్లో చూసి నేర్చుకున్నాను. నెక్ట్స్‌ రెండు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement