సరిహద్దులు దాటిన ప్రేమకథ | The Gulf Movie will be released on 13th of this month | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటిన ప్రేమకథ

Published Mon, Oct 9 2017 2:08 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

The Gulf Movie will be released on 13th of this month - Sakshi

పుట్టిన ఊర్లో సరైన ఉపాధి లేక ఎందరో గల్ఫ్‌ బాట పడుతున్నారు. తీరా అక్కడ వారు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? అనే కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్‌’. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. చేతన్‌ మద్దినేని, డింపుల్‌ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌. రామ్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వలస భారతీయులు జైలుశిక్షను అనుభవిస్తూ ఎలా హింసకు గురవుతున్నారు? అనే అంశాలను 400మందికి పైగా గల్ఫ్‌ బాధితులతో మాట్లాడి తెలుసుకుని ఈ చిత్రం తీశాం. గల్ఫ్‌ వెతలు కళ్లకు కట్టినట్టు చూపించాం. 90 శాతం విదేశాల్లోనే షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్‌ అరబిక్‌ సాంగ్‌ కూడా ఉంది.’’ అన్నారు. చేతన్, డింపుల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement