లక్డీకాపూల్ (హైదరాబాద్): గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గల్ఫ్‌లో పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కలి్పస్తున్నామని చెప్పారు. శుక్రవారం బేగంపేట్‌లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం సలహాదారుడు బొజ్జ అమరేందర్‌రెడ్డి, ప్రతినిధులు భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, నరేశ్‌రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మహ్మద్ జబ్బార్, ఉపాధ్యక్షుడు మహ్మద్ మిస్రీ తదితరులు పాల్గొన్నారు.
పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాపై పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం పొన్నం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడం కడితే కూల్చేస్తామని నాడు కేసీఆర్ అన్నారా లేదా అని పొన్నం ప్రశ్నించారు. మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్వయంగా నాటి మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, మూసీ మీద ఉన్న ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, వాళ్లకు సొంత ఇళ్లు వచ్చేలా, మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచడానికి కార్యాచరణ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment