Khiladi Movie Review and Rating in Telugu - Sakshi
Sakshi News home page

Khiladi Movie Review: ఖిలాడి మూవీ ఎలా ఉందంటే..

Published Fri, Feb 11 2022 5:29 PM | Last Updated on Sat, Feb 12 2022 3:25 PM

Khiladi Movie Review and Rating in Telugu - Sakshi

సినిమా: ఖిలాడి
నటీనటులు: రవితేజ, డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, అనసూయ భరద్వాజ్‌, మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌,  ముకుందన్‌, ముఖేశ్‌ రుషి తదితరులు
సింగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫి: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు
దర్శకత్వం: రమేశ్‌ వర్మ
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
విడుదల తేదీ: 11.02.2022

Khiladi Movie Review: కరోనా థర్డ్‌వేవ్‌ కారణంగా బాక్సీఫీసు వద్ద కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు.  సంక్రాంతికి రావాల్సిన పాన్‌ ఇండియా, పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలతోనే ప్రేక్షకుల సరిపెట్టుకున్నారు. అవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కరోనా ఉధృతి తగ్గడంతో పెద్ద సినిమా హవా షూరు అయ్యింది. ఈ క్రమంలో వరసగా సినిమా రిలీజ్‌ డేట్స్‌ వస్తున్న క్రమంలో మంచి ‘కిక్‌’ ఇచ్చేందుకు ముందుగా వచ్చాడు మాస్‌ మహారాజా రవితేజ. రమేశ్‌ వర్మ దర్శకత్వలో ఆయన నటించిన తాజా చిత్రం ఖిలాడి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్‌, మాస్‌, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్‌ చేశాడు. రవితేజ సినిమా కావడం, ఇద్దరు యంగ్‌ కథానాయికలు నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? రవితేజ ఖాతాలో మరో విజయం ఖాయమైనట్లేనా? అసలు కథేంటి చూద్దాం రండి!

కథేంటంటే: 
‘ఖిలాడి’లో రవితేజ పాత్ర పేరు మోహన్‌ గాంధీ. ఓ అంతర్జాతీయ క్రిమినల్‌గా కనిపిస్తాడు. అయితే తన కుటుంబాన్ని హత్య చేసిన కేసులో మెహన్‌ గాంధీ(రవితేజ) జైలు శిక్ష అనభవిస్తుంటాడు. ఈ క్రమంలో పూజాను(మీనాక్షి చౌదరి) కలుస్తాడు. పూజా ఇంటెలిజెన్స్‌ ఐజీ జయరామ్‌(సచిన్‌ ఖేడ్కర్‌) కుమార్తె. క్రిమినల్‌ సైకాలజీ చదువుతుంది. క్రిమినల్స్‌ సైకాలజీని తెలుసుకునే థీసెస్‌ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా పూజా, మెహన్‌ గాంధీని కలుస్తుంది. అతను జైలుకు ఎలా వచ్చాడు, చేసిన నేరమంటనేది ఆరా తీస్తుంది. దీంతో పూజకు ఓ కట్టుకథ చెప్పి ఆమె ద్వారా జైలు నుంచి బయట పడాలనుకుంటాడు మోహన్‌ గాంధీ.

అతడి కథ విన్న పూజా చలించి అతడికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరి అతడు బయటకు రావడానికి రిస్క్‌ తీసుకుంటుంది. గాంధీ బయటకు వచ్చే సయమంలోనే పూజా ఓ షాకింగ్‌ నిజం తెలుసుకుంటుంది. మోహన్‌ గాంధీ అంతర్జాతీయ క్రిమినల్‌ అని, హోంమంత్రి చెందిన 10 వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేయానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుసుకుని షాక్‌ అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? దానిని రవితేజ ఎందుకు కొట్టేయాలనుకున్నాడు? ఆ డబ్బు కొట్టేయానికి రవితేజ ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనే దాని చుట్టే కథ నడుస్తుంది. 



సినిమా ఎలా సాగిందంటే..
ఈ సినిమాలో మాస్‌ మహారాజా మార్క్‌ను మరోసారి చూపించాడు రవితేజ. ఆయన ఎనర్జీ, మితిమిరిన తెలివితెటలు మంచి కిక్‌ ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మోహన్‌ గాంధీగా రవితేజ షెడ్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఓ తెలివైన దొంగ 10 వేల కోట్ల రాబరికి టార్గెట్‌ పెడితే ఎలా ఉంటుంది, అది ఓ బడా రాజకీయ నాయకుడి వద్ద.. ఆ దొంగను పట్టుకునేందుకు సీబీఐ చేజింగ్‌లు, రన్నింగ్‌తో దర్శకుడు ఫుల్‌ యాక్షన్‌, థ్రీల్లర్‌ సినిమా చూపించాడు. ముఖ్యంగా సెకండ్‌ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ  నెక్ట్‌ లెవల్‌ అని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉంటే భార్య(డింపుల్‌ హయాతి), అత్త(అనసూయ), మామలను హత్య చేసిన నేరగాడిగా రవితేజను పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది.

మీనాక్షి చౌదరి, రవితేజ కథను వివరించిన తీరు థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అక్కడ చూపించిన స్టోరీ రోటిన్‌ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది. ఇక రవితేజ బయటకు వచ్చాకా అసలు కథ స్టార్ట్‌ అవుతుంది. విరామం వరకు మోహన్‌ గాంధీ పాత్ర అసలు బయటకు రాకపోవడం, సెకండ్‌ పార్ట్‌లో రివిల్‌ చేయడంలో థ్రిల్‌ అవుతారు ప్రేక్షకులు. ఇక సెకండ్‌ పార్ట్‌ ఫుల్‌ యాక్షన్‌, థ్రిల్లింగ్‌తో నడిచినప్పటికీ కథ ముందుగానే ఊహించేలా ఉంటుంది. ఈ క్రమంలో కథ మొత్తం రోటిన్‌ అయిపోతుంది. రూ. 10 వేల కోట్లు కొట్టేసే క్రమంలో మోహర్‌ గాంధీ టీం చేసే ప్రయత్నాలు సిల్లిగా, కామెడీగా ఉంటాయి. ఇక మధ్యలో మధ్యలో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ ఊపునిస్తాయి. ఇలా సినిమాను దర్శకుడు సాగథీయడంతో సినిమా క్లైమాక్స్‌ కాస్తా విసుగు పుట్టిస్తుంది. అయినప్పటికీ మాస్‌ మహారాజా ఎనర్జీ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గ్లామర్‌ డోస్‌ పెంచి ప్రేక్షకులకు కనులవిందు అందించారు. ఇక డింపుల్‌  హయాతి పాత్ర అమాయకంగా, రెండోది ఇంటెన్స్‌గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ ఆమె. ఈ సినిమాలోన ఆమెను హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్‌తో సాగుతాయి.

తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. ఇదంతా జైలులో ఉన్న మోహన్ గాంధీ పూజకు వివరిస్తాడు. నిజంగానే మోహన్ గాంధీ తన భార్యను చంపాడా. ఆ హత్య చేసిందెవరు, ఈ గతంలో రామకృష్ణ (ఉన్ని ముకుందన్) ఎవరు, పదివేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నుంచి రాజశేఖర్, మోహన్ గాంధీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ.

బలాలు 
 రవితేజ నటన
 మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతిల గ్లామర్‌
 యాక్షన్‌ సీక్వెన్స్‌

బలహీనతలు
⇒ కథ(ఊహకు తగ్గట్టుగా సాగుతుంది)
⇒ క్లైమాక్స్‌

-స్నేహలత, వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement