Khiladi Movie
-
ఓటీటీలో ఖిలాడి, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
రవితేజ హీరోగా, మీనాక్షి చైదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖిలాడి. ‘ప్లే స్మార్ట్’ అన్నది ట్యాగ్ లైన్. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌తో కలసి హవీష్ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. తాజాగా ఖిలాడి ఓటీటీ బాట పట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. 'ఈ ఆటలో ఒక్కడే కింగ్, ఇంకా కొద్ది రోజులే వెయిటింగ్, ఫుల్ కిక్‌తో మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ రాబోతోంది' అని ట్వీట్ ద్వారా ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఖిలాడి చూసేయొచ్చని సంబరపడుతున్నారు. Ee aata lo okkade king! Inka koddi rojule waiting!! Full kick toh March 11th na @DisneyPlusHS lo MassMaharaja @RaviTeja_offl's Khiladi is coming!! Catch him if you can #KhiladiOnHotstar #Raviteja #disneyplushotstar #MassMaharaja pic.twitter.com/FabOPHrHj3 — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 4, 2022 -
డింపుల్ అందాలకు గుండెలు ధడేల్ (ఫోటోలు)
-
'ఖిలాడీ' సినిమా ఆపాలంటూ బాలీవుడ్ నిర్మాత కేసు!
మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడి. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో ఖిలాడి దర్శకనిర్మాతలపై బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ కేసు పెట్టాడు. ఖిలాడీ టైటిల్ తనదని, 1992లో అక్షయ్ కుమార్ హీరోగా ఈ టైటిల్‌తో సినిమా కూడా రిలీజ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖిలాడీ పేరుతో దక్షిణాదిలో సినిమా తెరకెక్కుంతుదన్న విషయం తనకు ఇంతవరకు తెలియదని పేర్కొన్నాడు. ఈ మధ్యే ట్రైలర్ చూశాక తెలిసొచ్చిందన్నాడు. ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద ఇదివరకే ఖిలాడీ టైటిల్‌ను తను రిజిస్టర్ చేయించానని, కాబట్టి రవితేజ కథానాయకుడిగా నటించిన ఖిలాడి టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాడు. తాను డబ్బులు ఆశించడం లేదని, ఖిలాడి సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని స్పష్టం చేశాడు. దక్షిణాదిన లోకల్ అసోసియేషన్స్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించి వారి సినిమాలను అదే టైటిల్‌తో హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. హిందీ సినిమా టైటిల్స్‌కు దగ్గరగా ఉండే డబ్బింగ్ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు సీబీఎఫ్సీ పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇలా జరుగుతుందని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చాడు. ఖిలాడీ సినిమా హిందీలో రిలీజ్ అవుతున్న విషయం కూడా తనకు తెలియదన్నాడు. ఈ సినిమా టైటిల్‌ను మార్చేవరకు రిలీజ్‌ను ఆపాలని కోర్టును సంప్రదించాడు కానీ అప్పటికే సమయం మించిపోయిందని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించింది. దీంతో కనీసం ఓటీటీ రిలీజ్‌ను అయినా ఆపాలని కోర్టుకు విన్నవించాడు. ఈ వివాదంపై ఖిలాడీ చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. -
‘ఖిలాడి’ మూవీ రివ్యూ
సినిమా: ఖిలాడి నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ముకుందన్, ముఖేశ్ రుషి తదితరులు సింగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు దర్శకత్వం: రమేశ్ వర్మ నిర్మాత: కోనేరు సత్యనారాయణ విడుదల తేదీ: 11.02.2022 Khiladi Movie Review: కరోనా థర్డ్‌వేవ్ కారణంగా బాక్సీఫీసు వద్ద కొత్త సినిమాల సందడి పెద్దగా కనిపించడం లేదు. సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా, పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలతోనే ప్రేక్షకుల సరిపెట్టుకున్నారు. అవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కరోనా ఉధృతి తగ్గడంతో పెద్ద సినిమా హవా షూరు అయ్యింది. ఈ క్రమంలో వరసగా సినిమా రిలీజ్ డేట్స్ వస్తున్న క్రమంలో మంచి ‘కిక్’ ఇచ్చేందుకు ముందుగా వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. రమేశ్ వర్మ దర్శకత్వలో ఆయన నటించిన తాజా చిత్రం ఖిలాడి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ సినిమా అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, మాస్, కామెడీకి ఏమాత్రం లోటు ఉండదు. పైగా ఈ సారి కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. రవితేజ సినిమా కావడం, ఇద్దరు యంగ్ కథానాయికలు నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? రవితేజ ఖాతాలో మరో విజయం ఖాయమైనట్లేనా? అసలు కథేంటి చూద్దాం రండి! కథేంటంటే: ‘ఖిలాడి’లో రవితేజ పాత్ర పేరు మోహన్ గాంధీ. ఓ అంతర్జాతీయ క్రిమినల్‌గా కనిపిస్తాడు. అయితే తన కుటుంబాన్ని హత్య చేసిన కేసులో మెహన్ గాంధీ(రవితేజ) జైలు శిక్ష అనభవిస్తుంటాడు. ఈ క్రమంలో పూజాను(మీనాక్షి చౌదరి) కలుస్తాడు. పూజా ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్(సచిన్ ఖేడ్కర్) కుమార్తె. క్రిమినల్ సైకాలజీ చదువుతుంది. క్రిమినల్స్ సైకాలజీని తెలుసుకునే థీసెస్ అనే ప్రాజెక్ట్‌లో భాగంగా పూజా, మెహన్ గాంధీని కలుస్తుంది. అతను జైలుకు ఎలా వచ్చాడు, చేసిన నేరమంటనేది ఆరా తీస్తుంది. దీంతో పూజకు ఓ కట్టుకథ చెప్పి ఆమె ద్వారా జైలు నుంచి బయట పడాలనుకుంటాడు మోహన్ గాంధీ. అతడి కథ విన్న పూజా చలించి అతడికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరి అతడు బయటకు రావడానికి రిస్క్ తీసుకుంటుంది. గాంధీ బయటకు వచ్చే సయమంలోనే పూజా ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. మోహన్ గాంధీ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి చెందిన 10 వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేయానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుసుకుని షాక్ అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? దానిని రవితేజ ఎందుకు కొట్టేయాలనుకున్నాడు? ఆ డబ్బు కొట్టేయానికి రవితేజ ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనే దాని చుట్టే కథ నడుస్తుంది. సినిమా ఎలా సాగిందంటే.. ఈ సినిమాలో మాస్ మహారాజా మార్క్‌ను మరోసారి చూపించాడు రవితేజ. ఆయన ఎనర్జీ, మితిమిరిన తెలివితెటలు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మోహన్ గాంధీగా రవితేజ షెడ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఓ తెలివైన దొంగ 10 వేల కోట్ల రాబరికి టార్గెట్ పెడితే ఎలా ఉంటుంది, అది ఓ బడా రాజకీయ నాయకుడి వద్ద.. ఆ దొంగను పట్టుకునేందుకు సీబీఐ చేజింగ్‌లు, రన్నింగ్‌తో దర్శకుడు ఫుల్ యాక్షన్, థ్రీల్లర్ సినిమా చూపించాడు. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉంటే భార్య(డింపుల్ హయాతి), అత్త(అనసూయ), మామలను హత్య చేసిన నేరగాడిగా రవితేజను పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తిగా ఉంటుంది. మీనాక్షి చౌదరి, రవితేజ కథను వివరించిన తీరు థ్రిల్లింగ్‌గా ఉన్నా.. అక్కడ చూపించిన స్టోరీ రోటిన్ ఫ్యామిలీ డ్రామాగా అనిపిస్తుంది. ఇక రవితేజ బయటకు వచ్చాకా అసలు కథ స్టార్ట్ అవుతుంది. విరామం వరకు మోహన్ గాంధీ పాత్ర అసలు బయటకు రాకపోవడం, సెకండ్ పార్ట్‌లో రివిల్ చేయడంలో థ్రిల్ అవుతారు ప్రేక్షకులు. ఇక సెకండ్ పార్ట్ ఫుల్ యాక్షన్, థ్రిల్లింగ్‌తో నడిచినప్పటికీ కథ ముందుగానే ఊహించేలా ఉంటుంది. ఈ క్రమంలో కథ మొత్తం రోటిన్ అయిపోతుంది. రూ. 10 వేల కోట్లు కొట్టేసే క్రమంలో మోహర్ గాంధీ టీం చేసే ప్రయత్నాలు సిల్లిగా, కామెడీగా ఉంటాయి. ఇక మధ్యలో మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ ఊపునిస్తాయి. ఇలా సినిమాను దర్శకుడు సాగథీయడంతో సినిమా క్లైమాక్స్ కాస్తా విసుగు పుట్టిస్తుంది. అయినప్పటికీ మాస్ మహారాజా ఎనర్జీ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులకు కనులవిందు అందించారు. ఇక డింపుల్ హయాతి పాత్ర అమాయకంగా, రెండోది ఇంటెన్స్‌గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ ఆమె. ఈ సినిమాలోన ఆమెను హీరోయిన్గా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్‌తో సాగుతాయి. తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. ఇదంతా జైలులో ఉన్న మోహన్ గాంధీ పూజకు వివరిస్తాడు. నిజంగానే మోహన్ గాంధీ తన భార్యను చంపాడా. ఆ హత్య చేసిందెవరు, ఈ గతంలో రామకృష్ణ (ఉన్ని ముకుందన్) ఎవరు, పదివేల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నుంచి రాజశేఖర్, మోహన్ గాంధీ ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన కథ. బలాలు ⇒ రవితేజ నటన ⇒ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిల గ్లామర్ ⇒ యాక్షన్ సీక్వెన్స్ బలహీనతలు ⇒ కథ(ఊహకు తగ్గట్టుగా సాగుతుంది) ⇒ క్లైమాక్స్ -స్నేహలత, వెబ్‌డెస్క్ -
ఖిలాడీ ట్విటర్ రివ్యూ, ఎలా ఉందంటే?
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లు. రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక ప్రమోషన్ల స్పీడు పెంచి సినిమాకు హైప్ తెచ్చింది చిత్రయూనిట్. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముతానన్న రవితేజ ఈ సినిమా విజయాన్ని అందుకోవడం తథ్యమని ఎంతో ధీమాగా ఉన్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ కమర్షియల్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 11న) థియేటర్లలో రిలీజైంది. మరి ఈ సినిమా హిట్టయ్యిందా? ఫట్టయ్యిందా? ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కథ ఎలా ఉంది? ఎవరెలా చేశారు? హిట్టా? యావరేజా? పలు అంశాలను ట్వీట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అవేంటో ఓ సారి చూసేద్దాం.. ఖిలాడీ యావరేజ్ సినిమా అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సూపర్ హిట్ బొమ్మ అని పొగిడేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగిందని, పెద్దగా కొత్త కంటెంట్ ఏం లేదని పెదవి విరుస్తున్నారు. ఇటలీ చేజింగ్ సీన్లో కెమెరా వర్క్ తప్ప అంతా రోతనే కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. కొన్ని సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయని, దేవిశ్రీప్రసాద్ మిగతా సాంగ్స్ కూడా అదిరిపోయేలా ఇచ్చుంటే బాగుండేదంటున్నారు. మొత్తంగా ఖిలాడి సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్నట్లు కనిపిస్తోంది. #Khiladi Review Routine commercial potboiler with twists adding to it. Director failed to engage. Flop, 2/5 ! — Desi Box Office (@DesiBoxOffice) February 11, 2022 Telugu lo Manchi talk osthundi Hindi lo kuda Manchi talk vaste #Khiladi pic.twitter.com/C9Jaybo7iK — T🇦🇦ʀᴜɴ འaل KᴜᴍⒶR (@TarunRajKumarAA) February 11, 2022 Stuff account lu oka 2 days pandaga. Anasuya in Interval 😂 #Khiladi — Silent GuaRRRdian (@Kamal_Tweetz) February 11, 2022 Not even single point or scene is interesting in entire first half #Khiladi — Team RRR (@kiran_nine) February 11, 2022 Interval ,second half mass action s superhit 💥💥 Mahesh Babu fans #Khiladi — Mahesh Anna (@Vijay12425550) February 11, 2022 40 mins in to the movie…Comedy scenes going on decent so far #Khiladi — Rakita (@Perthist_) February 11, 2022 #Khiladi Hit talk nadustunde 🔥🔥 Weekend vellali 😍 CONGRATULATIONS @RaviTeja_offl annaaaaaaa — పోకిరి🔔 (@Pokiri_Freak) February 11, 2022 Done with the show First half : above average, comedy seems to be routine but internal bang Face screaming in fearCollision symbol Second half: Racy action sequences and twists Fire... blockbuster 2nd half Overall BOMMA HIT @DirRameshVarma @AstudiosLLP#Khiladi — su DHEER Varma ALLURI (@suDheerVarmaAA) February 11, 2022 Positive response from Overseas 💥💥#Khiladi Can't wait to watch 🤩🤩 Evening show planned 😁👍 Krack movie la ne blockbuster avvali 💥💥 — Raghava Reddy (@Raghava_Reddy_) February 11, 2022 #Khiladi@RaviTeja_offl First Half Report: So far, the movie is average and it takes time to get into the main story. Some comedy scenes are good. A decent interval block. Let's see what the film holds in the second half. — Charan (@ursCharanDevil) February 11, 2022 Sandhya 35mm#Khiladi 🔥🔥🤙🤙🤙 pic.twitter.com/6nCiP6DdFJ — Raviteja Era (@RavitejaEra) February 11, 2022 Movie hit @Khiladi 🔥❤ https://t.co/3woXro31KB — Rowdy Kanna (@KannaBangaram7) February 11, 2022 #Khiladi movie pakka hit .. Reasons mass ki connect avutundi 1 hr average ..next movie good to very good Songs baaga nacchutai .. Solo release ..no other movie watch — JMB (@EmiratesBabu) February 11, 2022 -
ఖిలాడి ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
హీరోయిన్‌కు సారీ చెప్పిన 'ఖిలాడి' డైరెక్టర్
Khiladi Director Ramesh Varma Says Sorry To Heroine: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రమేశ్ వర్మ.. స్టేజ్‌పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు. ఖిలాడీ ట్రైలర్ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది. -
రవితేజ ‘ఖిలాడీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
అరగంటలో అన్ని సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్
‘‘ఏ సినిమాని కూడా నేను నటునిగా చూడను.. ఒక ప్రేక్షకునిగా చూస్తాను. నేను కూడా మీలో(ఆడియన్స్) ఒక్కణ్ణే. ఓ ప్రేక్షకునిగా నాకు ‘ఖిలాడీ’ నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో రవితేజ అన్నారు. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను. అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్ హయతి భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ ఖిలాడీ’ ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. కానీ 11న రిలీజ్ చేద్దామని ఐదు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, బాలకృష్ణగార్లను ఆహ్వానించాం.. వారు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ‘ఖిలాడీ’తో రవితేజ వందశాతం పాన్ఇండియా హీరో అయిపోయారు. ఈ మూవీ చూస్తే రాజమౌళిగారి సినిమాలా అనిపించింది. రమేశ్ వర్మతో ఈ చిత్రం చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పిన 15 నిమిషాలకే సినిమా చేద్దామని చెప్పిన రవితేజకు థ్యాంక్స్. అరగంటలో అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. డింపుల్, మీనాక్షిలకు సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్నగ్యాప్ తర్వాత రవితేజగారితో వర్క్ చేశాను.‘ఖిలాడి’ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ బాబీ, నక్కిన త్రినాథరావు, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటి అనసూయ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవితేజ ‘ఖిలాడీ’ మూవీ స్టిల్స్
-
అప్పుడు స్పెషల్ సాంగ్, ఇప్పుడేకంగా రవితేజ సరసన ఛాన్స్!
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ– ‘ఖిలాడీ’ రవితేజగారి సినిమా అనగానే మరో మాట మాట్లాడకుండా అంగీకరించాను. ఆయన కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కామెడీ టైమింగ్ కోసం నేను కూడా హోమ్ వర్క్ చేశాను’’ అని మీనాక్షి చౌదరి అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను ఏ సినిమా ఒప్పుకున్నా నా పాత్ర నిడివి ఎంత అనేది చూడను. కథలో నా పాత్ర ప్రాధాన్యత చూస్తాను. ‘ఖిలాడీ’ కమర్షియల్ సినిమా కాబట్టి లిప్‌లాక్ వంటి కొన్ని అంశాలుంటాయి.. ఇది కూడా నటనలో ఓ భాగమే. నేను ‘సలార్’ చిత్రంలో నటించడం ఇంకా ఖరారు కాలేదు. తెలుగులో ‘హిట్ 2’, తమిళంలో ‘కొలై’లో నటించాను.. మరో రెండు కొత్త సినిమాలున్నాయి’’ అన్నారు. డింపుల్ హయతి మాట్లాడుతూ–‘‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేశాను.. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ కొంత విరామం తీసుకుని మంచి సినిమా కోసం వెయిట్ చేసి ‘ఖిలాడీ’ చేశాను. నటిగా ఈ సినిమా సంతృప్తినిచ్చింది. రవితేజగారితో సమానమైన పాత్ర అంటే మొదట్లో భయమేసింది. ఇలా చెబుతున్నారు తీస్తారా? లేదా? అనే అనుమానం కూడా కలిగింది. సినిమా చేశాక రమేశ్ వర్మ చెప్పింది చెప్పినట్లు తీశారని అర్థమైంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘ఖిలాడీ’ లో ‘క్యాచ్ మీ..’ పాట చేయడానికి ముందు లావుగా ఉన్నాను. దర్శకుడు చెప్పడంతో 6 కేజీలు తగ్గాను. పైగా లాక్డౌన్ రావడంతో రెండు నెలలపాటు నా బాడీని మెయిన్టైన్ చేయడానికి డైట్‌తోపాటు వ్యాయామం చేశాను. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..
కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. రవితేజ ‘ఖిలాడి’ ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. సెహరి మూవీ హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఆహాలో ‘భామ కలాపం’ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ ‘మహాన్’ మూవీ విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు. మళ్లీ ముదలైంది చిత్రం సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అశోక్ గల్లా హీరో మూవీ యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొనె ‘గెహ్రాయా’ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది. -
నాకు అది ముందే తెలుసు.. అందుకే డైరెక్టర్‌కి గిఫ్ట్ ఇచ్చా!
‘‘నేను కథను నమ్ముతాను.. కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు సెకండరీ. ‘రాక్షసుడు’ సినిమా కథను నమ్మాను.. హిట్ అయింది. ‘ఖిలాడీ’ కథ కూడా బాగుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం’’ అని కోనేరు సత్యనారాయణ అన్నారు. రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ విలేకరులతో చెప్పిన విశేషాలు. ∙రమేశ్ వర్మ సరికొత్త పాయింట్‌తో చెప్పిన ‘ఖిలాడీ’ కథ నాకు బాగా నచ్చింది. ఇది రవితేజకి బాగుంటుందన్నాను. రవితేజకు కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే సినిమా చే ద్దామన్నారు. ‘మీ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రావాలని ఈ సినిమా చేస్తున్నాను’ అని రవితేజతో చెప్పాను. ఇటలీలో తీసిన సన్నివేశాలు చూస్తే హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తుంది. ∙‘పెళ్లి చూపులు, రాక్షసుడు’ సినిమాను తమిళంలో రీమేక్ చేసి, హిట్ సాధించాను. ‘ఖిలాడీ’ సినిమా రషెస్ చూశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. అందుకే దర్శకుడు రమేశ్ వర్మకి కారును బహుమతిగా ఇచ్చాను. ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. ∙ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలున్నా కూడా మా అబ్బాయి హవీష్ కోసమే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. హవీష్ ప్రస్తుతం ‘సంజయ్ రామస్వామి’ అనే సినిమా చేస్తున్నాడు. ‘రాక్షసుడు 2’ ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్లతో ‘యోధ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నాం. త్వరలోనే వరల్డ్ హై క్లాస్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాను. -
రవితేజ ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది, మరోసారి మాస్మహారాజా మార్క్ చూపించేశాడు
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. భారీ బడ్జెట్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సింగిల్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ అలరించనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘ఎప్పుడూ ఒకే టీమ్ లో ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు .. ఐపీఎల్ ప్లేయర్. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను’ అనే రవితేజ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు .. ఈ ఆటలో ఒక్కడే కింగ్ ఉంటాడు’ అనే రవితేజ మరో డైలాగ్ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. ఇక ఇందులో హీరోయిన్ రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి-రవితేజ లిప్‌లాప్ కిస్ సీన్‌ను కూడా చూపించారు. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీతో మాస్ సాంగ్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రవితేజ ‘ఖిలాడి’ ప్లాన్.. క్లిక్ అయ్యేనా!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పుష్ప కలెక్షన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ హీరోలు మాస్ మూవీస్ కు దూరంగా ఉండటం, ఆ లోటును దక్షిణాది హీరోలు తీరుస్తామనడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎవరూ ఊహించని హీరో, టాలీవుడ్ మాస్ రాజా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్న మరో తెలుగు హీరో రవితేజ. ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతున్న ఖిలాడి మూవీతోనే మాస్ రాజా బాలీవుడ్ ఎంట్రీ కన్ ఫామ్ అయింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ లో సౌత్ సినిమాల కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ మాస్ రాజాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ చూసే ఖిలాడి సినిమాను హిందీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది పెన్ స్టూడియోస్. ఫిబ్రవరి 11న బాలీవుడ్ థియేటర్స్ లో హిందీ సినిమా బదాయి దో రిలీజ్ అవుతోంది. గతంలో వచ్చిన బదాయి హో కు సీక్వెల్ వస్తోంది ఈ సినిమా. రాజ్ కుమార్, భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఓ సామాజిక అంశం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమాతో పోటీ పడి ఖిలాడి వసూళ్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది. హిందీ మార్కెట్ లో ఖిలాడి క్లిక్ అయితే ఆ తర్వాతే బాలీవుడ్ లోనూ మాస్ రాజా ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ కావడం కన్ ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు హిందీ మార్కెట్ కు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు. -
స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు గ్లామరస్ తల్లిగా అనసూయ!
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. మొదట్లో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఈ క్రమంలో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడి’ సినిమాలో అని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అట. చదవండి: మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్.. హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌గాను అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేయనుందట. హీరోయిన్‌కు తల్లి అంటే.. హీరో రవితేజకు అత్త కూడా. అంటే ఒకే సినిమాలో తల్లి, అత్త పాత్రల్లో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు. ఆమె పోషించిన 'చంద్రకళ' పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. -
ఆ సినిమాలో అనసూయ డ్యుయెల్ రోల్ !.. ఒకటి రెబల్‌గా మరొకటి
Anchor Anasuya Dual Role In Ravi Teja Khiladi Movie: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. రంగస్థలలంలో రంగమ్మత్తగా ఎంత పాపులర్ అయిందో కూడా తెలిసిందే. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్'లో కూడా అనసూయ పాత్ర ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ మరో విభిన్న పాత్రలో తన సత్తా చాటనుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలో అనసూయ ద్విపాత్రిభినయం చేస్తోందని సమాచారం. ఒక పాత్రలో రెబల్‌గా, రెండో పాత్రలో ఒక బ్రహ్మణ యువతిగా సందడి చేయనుందని సమాచారం. అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే మరొ రోల్ సినిమా చివరి వరకూ ఉండి ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఒకరకంగా అనసూయకు ఇది ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఇంకా ఇవే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర చేస్తుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో, మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న భీష్మ పర్వం మూవీలోనూ విభిన్న పాత్రలు చేస్తోందట అనసూయ. -
నల్లగా ఉంది.. కలర్ తక్కువ అని చాలా మాటలు అన్నారు : హీరోయిన్
Khiladi Movie Actress dimple Hayathi Faced Rejection Of Her Skin Colour: గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్రా జర్రా'.. ఐటెం సాంగ్‌తో మెప్పించింది డింపుల్ హయతి. ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకోంటోంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది. అయితే కెరీర్ మొదట్లో పలు తిరస్కారాలు ఎదుర్కొన్నాని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గద్దలకొండ గణేష్ చిత్రానికి ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నల్లగా, రంగు తక్కువ ఉన్న కారణంగా ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నానో లెక్కేలేదు. ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో గద్దలకొండ గణేష్‌లో పాట చేశా. ఆ తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. దీంతో నటిగా నన్ను నేను నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నా. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశా. ఆ సమయంలోనే ఖిలాడి ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఫుల్ కిక్కు' సాంగ్
Ravi Teja Full Kick Song Gets Huge Response: మాస్ మహారాజ రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్గా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫుల్కిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకూ 5.8 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఈ పాటకు 1.78లక్షలకు పైగా లైకులు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మాస్ బీట్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి11న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. -
డైరెక్టర్‌కు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ అయితే డైరెక్టర్స్‌కి హీరోలు, నిర్మాతల నుంచి బహుమతులు వస్తుంటాయి. కానీ రిలీజ్‌కు ముందే ఖిలాడి డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. మాస్‌రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా ఖిలాడి. ఫిబ్రవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విజయంపై ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ రమేశ్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
అలా రూ.72 కోట్లు సొంతం చేసుకున్న రవితేజ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ‘క్రాక్’ తర్వాత ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది. ఈ మూవీతో మాస్ మహారాజా బాలీవుడ్‌కి కూడా పరిచయం కాబోతున్నాడు. ఇక శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’సినిమా షూటింగ్ ఎండింగ్ దశకు చేరుకుంది. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మరో హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’మూవీ చేయనున్నాడు. రవితేజ 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నాడు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వీటితో పాటు సెట్‌పైకి వెళ్లిన రవితేజ మరో చిత్రం ‘ధమాకా’.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. మాస్ కథలకి, పాత్రలకు పెట్టింది పేరైన రవితేజ ఈ చిత్రాల్లోనూ అదే తరహాలో సందడి చేయనున్నట్లు ఇటీవల విడుదలైన పోస్టర్లను బట్టి తెలుస్తోంది. ఈ నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉండగానే.. తన 71వ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’టైటిల్ ప్రకటించాడు రవితేజ. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’బయోపిక్ ఇది. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదల కానుంది. విటితో పాటు చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు రవితేజ. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాదంతా ఫుల్ బిజీగా ఉన్న రవితేజ.. దాదాపు రూ. 300 కోట్ల మేర బిజినెస్ చేయబోతున్నాడని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల చొప్పున.. ఆరు సినిమాలకు గాను ఏకంగా రూ. 72 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘క్రాక్’తర్వాత రవితేజ కెరీర్మూడు పూలు ఆరుకాయలు అనేంతలా మారిపోయింది.