కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇటీవల మరోసారి మహమ్మారి విజృంభించడంతో సంక్రాంతికి చిన్న సినిమాలు మాత్రమే సందడి చేశాయి. అయినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో వరసగా సినిమాల విడుదలను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ వారం పలు సినిమాలు ఇటూ థియేటర్లో అటూ ఓటీటీలో అలరించబోతున్నాయి. మరి అవేంటో చూడాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి.
రవితేజ ‘ఖిలాడి’
ఈ వీకెండ్‌కు మంచి కిక్ ఇచ్చేందుకు మాస్‌మాహారాజా రవితేజ సిద్దమవుతున్నాడు. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలో కథానాయికలు. కోనేరు సత్యనారాయన నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ, అర్జున్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’
విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల కానుంది.
సెహరి మూవీ
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాలా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
డీజే టిల్లు
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఆహాలో ‘భామ కలాపం’
టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భామ కలాపం’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
విక్రమ్ ‘మహాన్’ మూవీ
విభిన్నమైన కథలతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించే హీరో చియాన్ విక్రమ్. మోస్ట్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా విక్రమ్ అతని కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'మహాన్'. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో అలరించబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న మహాన్ విడుదలకు చేస్తున్నారు.
మళ్లీ ముదలైంది చిత్రం
సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అశోక్ గల్లా హీరో మూవీ
యంగ్ హీరో గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావులు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనె ‘గెహ్రాయా’
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాయా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment