Ravanasura Movie OTT: ఓటీటీకి త్వరగానే వచ్చేస్తున్న రావణాసుర.. స్ట్రీమింగ్‌ అప్పుడే! | Raviteja Ravanasura OTT Streaming Expecting In May First Week - Sakshi
Sakshi News home page

Ravanasura Movie: ఓటీటీకి త్వరగానే వచ్చేస్తున్న రావణాసుర.. స్ట్రీమింగ్‌ అప్పుడే!

Apr 17 2023 8:37 AM | Updated on Apr 17 2023 9:34 AM

Raviteja Ravanasura OTT Streaming Expecting In May First Week - Sakshi

మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్‌ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మాస్ ఫ్యాన్స్‌ ఊహించినంతగా రావణాసుర మెప్పించలేదు. 

అయితే రావణాసుర చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద అభిమానులను మెప్పించకపోవడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మే నెల మొదటివారంలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రవితేజ ధమాకా సక్సెస్ తర్వాత ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో చూడనివారు ఎంచక్కా  ఓటీటీలో చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement