మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. టైగర్ నాగేశ్వరరావు అనేది కల్పిత పాత్ర కాదు. రియల్ లైఫ్ స్టోరీ.
స్టువర్టుపురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు. అతడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దొంగతనంలో అతడు ఎక్స్‌పర్ట్.. కానీ అసలు అతడు దొంగగా ఎందుకు మారాడు? వచ్చిన డబ్బు ఏం చేశాడనేది సినిమాలో చూపించారు. ఈ గజదొంగ స్టోరీ అభిమానులకు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందని అభిమానులు ఆరా తీస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా దూకుడును బట్టి ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. దీపావళి పండగ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేట్లు కనిపిస్తోంది.
చదవండి: హిట్ టాక్.. అయినా భోళా శంకర్‌ను బీట్ చేయలేకపోయిన భగవంత్ కేసరి.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment