బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. మొదట్లో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది.
చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..
ఈ క్రమంలో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడి’ సినిమాలో అని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అట.
చదవండి: మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్..
హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌గాను అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేయనుందట. హీరోయిన్‌కు తల్లి అంటే.. హీరో రవితేజకు అత్త కూడా. అంటే ఒకే సినిమాలో తల్లి, అత్త పాత్రల్లో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు. ఆమె పోషించిన 'చంద్రకళ' పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment