mother character
-
స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు గ్లామరస్ తల్లిగా అనసూయ!
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది. మొదట్లో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఈ క్రమంలో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఖిలాడి’ సినిమాలో అని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరికి అనసూయ తల్లిగా నటిస్తుందట. ఇందులో ఆమె పాత్ర పేరు చంద్రకళ అట. చదవండి: మళ్లీ ఒక్కటవ్వబోతున్న షణ్ముఖ్-దీప్తి సునయన!, ఇదిగో ప్రూఫ్.. హీరోయిన్‌కు తల్లిగా మాత్రమే కాకుండా గ్లామర్‌గాను అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేయనుందట. హీరోయిన్‌కు తల్లి అంటే.. హీరో రవితేజకు అత్త కూడా. అంటే ఒకే సినిమాలో తల్లి, అత్త పాత్రల్లో అనసూయ తన జోరు చూపించనుందని అంటున్నారు. ఆమె పోషించిన 'చంద్రకళ' పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయనున్నారు. -
పెళ్లైతే అమ్మగానే నటించాలా?
సినిమా : పెళ్లైన నటీమణులు అమ్మగానే నటించాలా? అని ప్రశ్నిస్తున్నారు నటి అమలాపాల్. మైనా చిత్రంతో మౌనంగా ఎదిగిన ఈ మలయాళీ బ్యూటీ విక్రమ్ సరసన దైవతిరుమగళ్, విజయ్‌కు జంటగా తలైవా వంటి భారీ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయకిల సరసన చేరారు. ఆ తరువాత అమలాపాల్‌కు తెలుగులోనూ అవకాశాలు వరించాయి. ఇలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ యమబిజీగా ఉన్న సమయంలోనే యువ దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే చిన్న గ్యాప్ తరువాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అయ్యారు. తాజాగా అమలాపాల్ నటించిన అమ్మాకణక్కు ఇటీవల తెరపైకి వచ్చింది. ఇందులో ఆమె పదో తరగతి చదువుతున్న అమ్మాయికి అమ్మగా నటించడం విశేషం. ఈ సందర్భంగా ఈ అమ్మడితో చిన్న భేటీ. ప్ర: అమ్మాకణక్కు చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: ఈ చిత్రంలో శాంతి అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేశాను. బరువు పెరిగాను. యోగా, మెడిటేషన్ చేసి మానసికంగా సిద్ధం అయ్యాను. చేపలమ్మే స్త్రీగా బట్టలు ఉతికే పని, పిండి ఆడించే పని, ఇంటి పనిమనిషి అంటూ రకరకాల పరిమాణాల్లో నన్నీ చిత్రంలో చూస్తారు. ఇది సహజత్వంతో కూడిన కథా చిత్రం కావడంతో మేకప్ లేకుండానే నటించాను. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో 15 ఏళ్ల అమ్మాయికి అమ్మగా నటించాను. మొత్తం మీద అమ్మాకణక్కు చిత్రంలో నటించడం మంచి అనుభవం ప్ర: ఇందులో అమ్మగా నటించడానికి సంకోచించారటగా? జ: నిజం చెప్పాలంటే నటికి వివాహం అయితే అక్క, వదిన, అమ్మ పాత్రలకు పరిమితం అనే ముద్ర వేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నటిని నటిగా చూడాలి. నేను హీరోయిన్గా నటిస్తున్న సమయంలోనే మలయాళంలో నటించిన మిలీ, తమిళంలో చేసిన పసంగ -2 చిత్రాలు నన్ను వేరే కోణంలో ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. మైనా చిత్రం తరువాత ఛాలెంజింగ్ పాత్ర అంటే అమ్మాకణక్కులో చేసిన పాత్రే. ఇందులో నా నటనకు పెద్ద ఇన్సిపిరేషన్ మా అమ్మనే. ప్ర: సంసారజీవితం ఎలా సాగుతోంది? జ: నా భర్త విజయ్‌తో చాలా సంతోషంగా ఉన్నాను. తమిళనాడుకు కోడలిగా వచ్చాను. ఇప్పుడు కూతురిగా చూసుకుంటున్నారు. నటిగా పలు భాషల్లో బిజీగా నటిస్తున్నాను. ఇందుకు నా భర్త, ఆయన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. ప్ర: కన్నడంలో సుదీప్ సరసన నటిస్తున్నారటగా? జ: ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్నాను. అయితే సాదాసీదా హీరోయిన్ పాత్రలు ధరించడం ఇష్టం లేదు. మలయాళంలో కుంజాకోబొపన్, జయసూర్యకు జంటగా నటిస్తున్న షాజహానుమ్ పరికుట్టియుమ్ చిత్రాలు నా కేరీర్లో మైలురాయిగా నిలిచిపోతాయి. ఇక కన్నడంలో సుదీప్ సరసన హెంబులి చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తాను. ప్ర: దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? జ: విజయ్ దర్శకత్వం వహించే చిత్రాల షూటింగ్ స్పాట్‌కు వెళుతుంటాను. అక్కడ అన్ని విషయాలు గమనిస్తుంటాను. దర్శకత్వం అన్నది సాధారణ విషయం కాదు. కాబట్టి ఆ రంగంలో ఆసక్తి లేదు. విజయ్‌తో కలిసి చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించాను. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో సిల సమయంగళ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాం. -
దేవుడే అవకాశం కల్పించాడు
నటుడు విజయ్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని నటి సమంత అన్నారు. నిజం చెప్పాలంటే తమిళంలో ఈ బ్యూటీకి తొలి విజయం అందించిన చిత్రం కత్తి. అంతకు ముందు, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించలేదు. కత్తి చిత్రంలో విజయ్‌తో నటించిన సమంత మరోసారి ఆయనతో జత కట్టిన చిత్రం తెరి. అందులో ప్రేమికురాలిగా నటించిన ఈ చెన్నై చిన్నది ఇందులో భార్యగా బిడ్డకు తల్లిగా నటించారు. తెరి చిత్రం గురువారం తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. సమంత మాట్లాడుతూ తెరి చిత్రం విజయంపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. విజయ్‌కు తనకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందన్నారు. ఇంతకు ముందు కత్తి చిత్రంలో కలసి నటించడం వల్ల తెరి చిత్రంలో ఆయనతో నటించడం సులభమైందన్నారు.కథ వైవిధ్యంగా ఉండడం వల్లే తెరి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో బిడ్డకు తల్లిగా నటించడం గురించి అడుగుతున్నారని ఇంతకు ముందు తెలుగులో మనం చిత్రంలో అమ్మగా నటించానని,తమిళంలో తొలి సారిగా తెరి చిత్రంలో తల్లిగా నటించానని పేర్కొన్నారు. కథ,పాత్ర బాగుంటే ఇకపై కూడా ఎలాంటి చిత్రం అయినా నటించడానికి సిద్ధం అని అన్నారు.ఇప్పటి వరకూ డ్యూయెట్లు పాడిన తనకు తెరి చిత్రంలో అమ్మ పాత్ర చేయమని ఆ దేవుడే అవకాశం కల్పించి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ చిత్రంలో గ్లామర్‌గా కూడా నటించలేదని, మంచి పాత్రలో నటించాననే సంతృప్తి ఉందని సమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి
టీనగర్: తల్లి పాత్రలో నటిస్తే హీరోయిన్ అవకాశాలకు ఇబ్బందేమీ ఉండదని నటి ఐశ్వర్యా రాజేష్ తెలిపారు. అట్టకత్తి చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు ఐశ్వర్యా రాజేష్. ఆ తర్వాత పన్నయారుం పద్మినియుం, ర మ్మి సహా పలు చిత్రాల్లో నటించారు. కాక్కాముట్టై చిత్రంలో మురికివాడ మహిళగా ఇద్దరి పిల్లల తల్లిగా నటించారు. ఈ పాత్రకు అనూహ్య ఆదరణ లభించింది. ప్రస్తుతం మళ్లీ అరుళ్‌నిధి ఆరాదుసినం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం సంతోషం కలిగించిందని, తల్లి పాత్రంలో నటించడం తప్పుకాదన్నారు. తాను ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తున్నానని, హీరోయిన్స్ చాన్స్‌కు ఏమీ ఆటంకం ఏర్పడలేదన్నారు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ముఖ్యమన్నారు. ఉత్తమ చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శకుల చిత్రాల్లో నటించేందుకు ఆశిస్తున్నట్లు తెలిపారు. చక్కని నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమన్నారు. -
‘అమ్మా’ అని పిలుస్తున్నారు!
‘‘తమిళ, మలయాళ భాషల్లో మంచి సినిమాలు వస్తున్నాయి.. తెలుగులో రావడం లేదంటుంటారు. కానీ, ఇప్పుడు మంచి సినిమా వచ్చింది. ఆ చిత్రాన్ని అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని నటి లక్ష్మీ మంచు అన్నారు. చల్లా మన్మోహన్ దర్శకత్వంలో లక్ష్మీ మంచు, శ్రీధర్ రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు ముఖ్య తారలుగా భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘బుడుగు’. శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మీ మంచు పత్రికల వారితో మాట్లాడుతూ - ‘‘ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తావనీ, ఇందులో అమ్మ పాత్రకు ప్రాణం పోశావనీ సినిమా చూసినవాళ్లు అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను అనుసరించేవాళ్లు ‘లక్ష్మీ’ అని పిలవడానికి మొహమాటపడి ‘అక్కా’ అని పిలుస్తుంటారు. ఏం పిలవాలో తెలియక ‘అక్కా’ అని కూడా పిలిచేవాళ్లున్నారు. ఈ చిత్రం చూశాక ‘అమ్మా’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపు నన్నెంత ఆనందానికి గురి చేసిందో మాటల్లో చెప్పలేను. కథను నమ్మి దర్శకుడు ఈ సినిమా తీశారు. ఆ నమ్మకం నిజమైంది’’ అని చెప్పారు. ఈ చిత్రవిజయం ఇచ్చిన ప్రోత్సాహంతో ‘బుడుగు 2’ తీయబోతున్నానని నిర్మాతల్లో ఒకరైన సారికా శ్రీనివాస్ తెలిపారు. -
'తల్లి పాత్రల్లో నటిస్తే తప్పేంటి?'
నాజూకు భామ శ్రియ శరణ్ గ్లామర్ పాత్రలకు స్వస్తి చెప్పినట్టే కనబడుతోంది. వరుసగా గృహిణి పాత్రల్లో నటిస్తూ పంథా మార్చింది. మనం, గోపాల గోపాల సినిమాల్లో ఆమె గృహిణి పాత్రల్లో ఒదిగిపోయింది. గ్లామర్ పాత్రలు చేయడానికి అవకాశం రాకపోవడం వల్లే ఆమె ఇలాంటి పాత్రలు చేస్తోందన్న వాదనను శ్రియ తోసిపుచ్చింది. 14 ఏళ్ల తన సినీ ప్రయాణంలో చాలా రకాలు పాత్రలు చేశానని, ఇప్పుడు విభిన్నరకాల పాత్రలు ప్రయత్నిస్తున్నానని శ్రియ పేర్కొంది. ఇటీవల విడుదలైన గోపాల గోపాల సినిమాలో పదేళ్ల పిల్లవాడికి తల్లిగా నటించింది శ్రియ. నటిగా అన్నిరకాల పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపింది. తల్లి పాత్రల్లో నటిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించింది. తనకు నచ్చితే ఎటువంటి పాత్రలోనైనా నటిస్తానని స్పష్టం చేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని శ్రియ తెలిపింది.