దేవుడే అవకాశం కల్పించాడు | Theri Movie in Mother Character God Gift | Sakshi
Sakshi News home page

దేవుడే అవకాశం కల్పించాడు

Published Sat, Apr 16 2016 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

దేవుడే అవకాశం కల్పించాడు - Sakshi

దేవుడే అవకాశం కల్పించాడు

నటుడు విజయ్‌కు తనకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందని నటి సమంత అన్నారు. నిజం చెప్పాలంటే తమిళంలో ఈ బ్యూటీకి తొలి విజయం అందించిన చిత్రం కత్తి. అంతకు ముందు, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించలేదు. కత్తి చిత్రంలో విజయ్‌తో నటించిన సమంత మరోసారి ఆయనతో జత కట్టిన చిత్రం తెరి. అందులో ప్రేమికురాలిగా నటించిన ఈ చెన్నై చిన్నది ఇందులో భార్యగా బిడ్డకు తల్లిగా నటించారు. తెరి చిత్రం గురువారం తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. సమంత మాట్లాడుతూ తెరి చిత్రం విజయంపై తనకు అపార నమ్మకం ఉందన్నారు. విజయ్‌కు తనకు మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందన్నారు.

ఇంతకు ముందు కత్తి చిత్రంలో కలసి నటించడం వల్ల తెరి చిత్రంలో ఆయనతో నటించడం సులభమైందన్నారు.కథ వైవిధ్యంగా ఉండడం వల్లే తెరి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. ఇందులో బిడ్డకు తల్లిగా నటించడం గురించి అడుగుతున్నారని ఇంతకు ముందు తెలుగులో మనం చిత్రంలో అమ్మగా నటించానని,తమిళంలో తొలి సారిగా తెరి చిత్రంలో తల్లిగా నటించానని పేర్కొన్నారు. కథ,పాత్ర బాగుంటే ఇకపై కూడా ఎలాంటి చిత్రం అయినా నటించడానికి సిద్ధం అని అన్నారు.ఇప్పటి వరకూ డ్యూయెట్లు పాడిన తనకు తెరి చిత్రంలో అమ్మ పాత్ర చేయమని ఆ దేవుడే అవకాశం కల్పించి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ చిత్రంలో గ్లామర్‌గా కూడా నటించలేదని, మంచి పాత్రలో నటించాననే సంతృప్తి ఉందని సమంత ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement