మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి | Aishwarya Rajesh To Romance Sibi In His Next? | Sakshi
Sakshi News home page

మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి

Published Sat, Feb 27 2016 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి - Sakshi

మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి

టీనగర్: తల్లి పాత్రలో నటిస్తే హీరోయిన్ అవకాశాలకు ఇబ్బందేమీ ఉండదని నటి ఐశ్వర్యా రాజేష్ తెలిపారు. అట్టకత్తి చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు ఐశ్వర్యా రాజేష్. ఆ తర్వాత పన్నయారుం పద్మినియుం, ర మ్మి సహా పలు చిత్రాల్లో నటించారు. కాక్కాముట్టై చిత్రంలో మురికివాడ మహిళగా ఇద్దరి పిల్లల తల్లిగా నటించారు. ఈ పాత్రకు అనూహ్య ఆదరణ లభించింది. ప్రస్తుతం మళ్లీ అరుళ్‌నిధి ఆరాదుసినం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం సంతోషం కలిగించిందని, తల్లి పాత్రంలో నటించడం తప్పుకాదన్నారు.

తాను ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తున్నానని, హీరోయిన్స్ చాన్స్‌కు ఏమీ ఆటంకం ఏర్పడలేదన్నారు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ముఖ్యమన్నారు. ఉత్తమ చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శకుల చిత్రాల్లో నటించేందుకు ఆశిస్తున్నట్లు తెలిపారు. చక్కని నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement