Tamil Film industry
-
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
కోలీవుడ్‌లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్‌ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్‌ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్‌ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్‌పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
బాబు బంగారం!
సినిమా షూటింగ్ అంటే మినిమమ్ వంద రోజులు యూనిట్ అంతా ట్రావెల్ చేస్తారు. సినిమా భారీతనాన్ని బట్టి రోజులు పెరుగుతాయి. చిన్న సినిమాలంటే ముప్ఫై నలభై రోజుల్లో పూర్తవుతాయి. రోజులు ఎన్నయినా ఒక సినిమా పూర్తయ్యేంతవరకూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి షూటింగ్ చివరి రోజు ఒకింత ఎమోషన్ అవుతారు. కొంతమందైతే బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుంటుంది. షూటింగ్ చివరి రోజున అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు యూనిట్ సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా మరో స్టార్ శింబు కూడా ‘ఈశ్వరన్’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. శింబూకి వివాదస్పద వ్యక్తి అనే పేరుంది. అయితే ఇలాంటి మంచి పనులు చేసి ‘బాబు బంగారం’ అని కూడా అనిపించుకుంటుంటారు. ఇక సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వరన్’ సంక్రాంతికి విడుదల కానుంది. -
తమిళనాడులో థియేటర్స్ తెరవరా?
థియేటర్స్ తెరవాలని ఏడు నెలలుగా థియేటర్స్ ఓనర్స్, నిర్మాతలు.. ఇలా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15 నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే పాటించాల్సిన గైడ్‌లైన్స్ కూడా సూచించింది. కానీ తమిళనాడులో థియేటర్స్ ప్రారంభం అవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. తమిళనాడు రాష్ట్ర మంత్రి కడంబూర్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సినిమా థియేటర్స్ ప్రారంభించే అవకాశం లేదని పేర్కొన్నారు. ‘థియేటర్స్ అంటే ఎక్కువమంది జనం చేరే చోటు. ఇప్పుడు అది అంత శ్రేయస్కరం కాదు. అందుకని త్వరలో థియేటర్స్ ఓపెన్ చేయడానికి కుదరకపోవచ్చు. ఏదైనా ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటిస్తాం’ అని తెలిపారు. -
సాహిత్య రంగంలోనూ కరుణ కృషి అమోఘం
-
‘సినీ కార్మికులు కష్టాన్ని చూస్తూ ఊరుకోం’
తమిళ సినిమా : చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రచార శాఖామంత్రి కడంబూర్ రాజు వెల్లడించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, నిర్మాతలమండలి, థియేటర్ల యాజమాన్యానికి మధ్య నెలకొన్న సమస్యలపై పలు దపాలు జరిగిన చర్యలు విఫలం కావడంతో నిర్మాతల మండలి మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయడంతో పాటు, మార్చి 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, అన్ని సినిమా కార్యక్రమాలను నిలిపివేసి సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో లక్షలాది సినీ కార్మికులు పని లేక ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తున్న పరిస్థితి. నిర్మాతల మండలి, థియేటర్ల సంఘం. క్యూబ్ సంస్థల అధినేతలు ఎవరికి వారు పట్టు విడవకుండా పంతాలకు పోవడం ఈ క్లిష్ట పరిస్థితికి కారణం. ప్రస్తుతం నెల కొన్న సమస్యను ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం సాయంత్రం రాష్ట్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి కడంబూర్ రాజు కలిసి విజ్ఞప్తి చేశారు. మంత్రి కడంబూర్ రాజు సినీ సంఘాల నిర్వాహకులతో రెండు రోజుల్లో సమగ్ర చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లక్షలాది మంది సినీ కార్మికులు భృతిని కోల్పోవడాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల చార్జీలు తగ్గించడం, థియేటర్ల టికెట్ ధర, ఆన్లైన్ బుకింగ్, పార్కింగ్ చార్జీలు, తినుబండారాల ధరల నియంత్రణ వంటి విషయాలపై మంత్రి కడంబూర్ రాజుకు వివరించానన్నారు. అన్ని సమస్యలౖను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భారతీరాజా హెచ్చరిక : దర్శకుడు భారతీరాజ్ ఐపీఎల్ క్రికెట్ పోటీలపై ధ్వజమెత్తారు. రాష్ట్రం ఒక పక్క కావేరి బోర్డు వంటి సమస్యలతో పోరుబాట పడుతుంటే ఐపీఎల్ క్రికెట్ పోటీలను నిర్వహించడం సబబు కాదన్నారు. ఈ పోటీలను నిర్వహించొద్దని తాము చెప్పడం లేదని, రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం లభించిన తరువాత జరుపుకోవాలని అన్నారు. లేని పక్షంలో జల్లికట్టు పోరు తీరులో తమిళుల ఆగ్రహాన్ని చవిచూస్తారని హెచ్చరించారు. -
8న కోలీవుడ్ ఆందోళన
కావేరి బోర్డుకు మద్దతుగా, స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరుబాటకు కోలీవుడ్ కదిలింది. ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వేదికగా దక్షిణ భారత నటీనటుల సంఘంతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 9గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాగుతుంది. దీని గురించి దక్షిణ భారత నటీనటుల సంఘం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ తూత్తుక్కుడిలోని స్టెర్లైట్ కర్మాగారాన్ని మూసివేయాలని, అదే విధంగా కావేరి నది జలాల వ్యవహారంలో బోర్డును నియమించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన జరపనుందని పేర్కొన్నారు. ఈ ఆందో ళనలో చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు ఈ నెల 4న స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా, కావేరి బోర్డు ఏర్పాటుకు మద్దతుగా, అదే విధంగా చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నడిగర్‌సంఘం ప్రకటించింది. అయితే అందుకు ప్రభుత్వంనుంచి అనుమతి లభించలేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కావేరి బోర్డు నియామకం కోసం ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రభుత్వం కోలీవుడ్ దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని ఈనెల 8న చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
ప్రముఖ దర్శకుడి కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు సీవీ రాజేంద్రన్(81) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ దర్శకుడు సీవీ శ్రీధర్‌కు రాజేంద్రన్ సోదరుడు. తమిళనాడు చెంగల్పట్టు సమీపంలోని చిత్తామురి ఆయన స్వస్థలం. తమిళంతో పాటు కన్నడం, హిందీ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కించారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు రూపొందించారు. శివాజీ గణేశన్ కుమారుడు ప్రభును సంగిలి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఈయనే. సుమతి ఎన్ సుందరి, గర్జనై, కలాట్టా కళ్యాణం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను చిత్ర పరిశ్రమకు అందించారు. అమెరికాలో ఉన్న రాజేంద్రన్ కుమారుడు వచ్చిన తర్వాత చెన్నైలోని టీ నగర్లో రాజేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు చెల్లించేది లేదు
క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు ఇకపై చెల్లించేది లేదని నిర్మాతల మండలి, థియేటర్ల యాజమాన్యం బుధవారం జరిపిన చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్( క్యూబ్, వీపీఎఫ్) చార్జీలు తగ్గించాలని నిర్మాతల మండలి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ సంస్థతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్మాతల మండలి ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను, ఈనెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు, సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి నిర్వాహకులు, థియేటర్ల మాజమాన్యం, ఫెఫ్సీ నిర్వాహకుల సమావేశం స్థానిక ఫిలిం చాంబర్లో జరిగింది. ఈ సమావేశంలో ఇకపై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎలాంటి చార్జీలు చెల్లించేది లేదని, అవసరమైతే ఈ వ్యవహారంలో అందరూ కలిసి న్యాయపోరాటం చేయాలని తీర్మానం చేసినట్లు సమాచారం. అదే విధంగా సినిమా టిక్కెట్లను ఇకపై కంప్యూటర్ బుకింగ్ ద్వారా నిర్వహించాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కోరినట్లు, ఈ విధానాన్ని మరో 30 రోజుల్లో అమలు పరచాలని థియేటర్ల యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వంకు పెద్ద మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. సొంత ప్రొజెక్టర్లు ఉండగా వీపీఎఫ్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని విశాల్ థియేటర్ల యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో వాగ్వాదానికి దారి తీసింది, అదే విధంగా ఆన్లైన్ బుకింగ్‌పై అదనంగా వసూలు చేసే రుసుమును తగ్గించాలన్న డిమాండ్ గురించి చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్‌సెల్వం, చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామిరామనాథన్, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి పాల్గొన్నారు. -
నాపై గాసిప్స్ ఎందుకు వస్తాయ్?
నా గురించి గాసిప్స్ ఎందుకు వస్తాయి అంటోంది నటి నిక్కీగల్రాణి. ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో బిజీ కథానాయకి. త్వరలో తమిళనాడు కోడలు అయినా అవుతానంటున్న నిక్కీగల్రాణికి ఇక్కడ చేతినిండా చిత్రాలున్నాయి. దీంతో ఇతర భాషల్లో నటించాల్సిన అవసరం కూడా లేదంటోంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న తన మనోభావాలను, తాజా చిత్రాల వివరాలను పంచుకున్నారు. అవేమిటో చూసేద్దామా. ప్ర: ఈ ఏడాది మీ టైం బాగున్నట్టుందే? జ: అవునండి. ఏడాది ప్రారంభంలో మొట్టశివ కెట్టశివ విడుదలై మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత మరగత నాణియం, నెరుప్పుడా వరుసగా సక్సెస్ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. ఈ మూడు చిత్రాల్లోనూ నా పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మహిళాభిమానులు ఎంతో ప్రేమతో హగ్ చేసుకుని అభినందిస్తున్నారు. ప్ర: సరే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలను చెప్పండి? జ: మళ్లీ నెరుప్పుడా చిత్ర హీరో విక్రమ్‌ప్రభుకు జంటగా పక్కా చిత్రంలో నటిస్తున్నాను. అదే విధంగా జీవాకు జంటగా కీ చిత్రం లో నటిస్తున్నాను. గౌతమ్ కార్తీక్ సరసన నటించిన హరహర మహాదేవకీ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ప్ర: అడల్ట్ చిత్రంగా చెప్పుకుంటున్న హరహర మహాదేవకి చిత్రంలో నటించడానికి ఎందుకు అంగీకరించారనే ప్రశ్న ఎదురవుతోందే? జ: మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర బాగుందనిపించడంతో నటించడానికి సమ్మతించాను. హరహర మహాదేవకీ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే నాకు సంబంధించిన సన్నివేశాల్లో కూడా అడల్ట్ కామెడీ ఉంటుంది. అయితే అవి చాలా నాగరికంగా జాలీగా నవ్వుకునేలా ఉంటాయి. ప్ర: తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇతర భాషల్లో అవకాశాలు రావడం లేదా? జ: నేను ఇప్పటికే కన్నడం, తెలుగు అంటూ అన్ని భాషల్లోనూ ఒక రౌండ్ కొట్టేశాను. ప్రస్తుతం నా దృష్టి అంతా తమిళ చిత్రాలపైనే పెడుతున్నాను. ప్ర: సమీప కాలంలో మీ గురించి ఎలాంటి గాసిప్స్ రావడం లేదు. ఏం మాయ చేస్తున్నారు? జ: నా గురించి గాసిప్స్ రాకపోవడం మంచి విషయమేగా. అందుకు నేనేం మాయా మంత్రాలు చేస్తాను. షూటింగ్ ముగియగానే నేరుగా ఇంటికి వెళ్లి పోతాను. ఇంకొకరి గురించి అనవసరంగా కామెంట్స్ కూడా చేయను. ఎలాంటి గొడవలకూ వెళ్లను. అలాంటిది నా గురించి ఎందుకు గాసిప్స్ ప్రచారం అవుతాయి? ప్ర: చెన్నైలో సెటిల్ అయ్యి తమిళ ప్రేక్షకుల డార్లింగ్ అయ్యిపోయారు. భవిష్యత్‌లో తమి ళింటి కోడలయ్యే అవకాశం ఉందా? జ: నా పెళ్లి గురించి అడుగుతున్నారన్న విషయం అర్థమైంది. అయితే సినిమాల్లో నేనింకా సాధించాల్సింది చాలా ఉంది. భవిష్యత్తులో నేను తమిళింటి కోడలిని అవ్వనూవచ్చు. ఆ విషయాన్ని జరిగినప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం సినిమా గురించే చెప్పుకుందాం. ప్ర: ఇటీవల సినిమా రంగంలో నటీమణులకు రక్షణ కరువైందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏమిటి? జ: ఈ విషయంలో సినిమా రంగం అని విడదీసి చెప్పకూడదు. మన దేశంలోనే మహిళలకు సరైన రక్షణ లేదు. సడన్‌గా నలుగురు మగవారు నన్ను అడ్డగిస్తే వారి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నేను సినిమాల్లోనే ఫైట్స్ చేసేదాన్ని అమ్మాయిని కాను. నిజజీవితంలోనూ నా తడాఖా చూపిస్తాను. -
ఆందోళన వ్యక్తం చేసిన రజనీకాంత్
-
ఆందోళన వ్యక్తం చేసిన రజనీకాంత్
చిత్ర పరిశ్రమపై డబుల్ ట్యాక్స్ వద్దంటూ విజ్ఞప్తి చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమపై డబుల్ పన్నులు విధించాలన్న తమిళనాడు సర్కారు నిర్ణయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీతోపాటు 30శాతం వినోదపన్ను విధించాలన్న పళనిస్వామి సర్కారు నిర్ణయంతో ఇండస్ట్రీపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'తమిళ చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధిని దృష్టిలో పెట్టుకొని తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలి' అని రజనీ మంగళవారం ట్వీట్ చేశారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో వినోదపన్ను కూడా కొనసాగించాల్న తమిళనాడు సర్కారు నిర్ణయం చిత్రపరిశ్రమకు శరాఘాతంగా మారింది. దీంతో తమిళనాడు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం, మంగళవారం థియేటర్లన్నింటినీ మూసివేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. బుధవారం కూడా తమిళనాడులోని థియేటర్లు బంద్ పాటించనున్నాయి. ఇప్పటికే తమిళ సర్కారు నిర్ణయం కమల్‌హాసన్ సహా తమిళ హీరోలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఇరకాటంలో తమిళ చిత్రపరిశ్రమ!
-
ఇరకాటంలో చిత్రపరిశ్రమ!
తమిళనాడులో కొనసాగుతున్న థియేటర్ల బంద్ జీఎస్టీపై ముక్తకంఠంతో సాగాలంటున్న కమల్ హాసన్ చెన్నై: తాజాగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)తో తమిళ చిత్ర పరిశ్రమను ఇరకాటంలో పడింది. జీఎస్టీతోపాటు తమిళనాడు ప్రభుత్వ వినోద పన్ను కూడా వసూలు చేస్తుండటంతో థియేటర్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి. సోమవారం నుంచి 1050 థియేటర్లు బంద్ పాటిస్తున్నట్టు థియేటర్ యాజమాన సంఘాలు ప్రకటించాయి. దీంతో తమిళ నిర్మాతల మండలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. థియేటర్ యజమానుల నిర్ణయంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాతల మండలి పరిష్కారానికి రంగంలోకి దిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సినిమాటోగ్రఫి మంత్రి కడంబూర్ రాజుతో భేటీ అయి.. ప్రభుత్వ వినోద పన్నును మినహాయించాలని కోరారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే, థియేటర్ యాజమాన్య సంఘాలు తమ బంద్‌ను ఉపసంహరించుకోవాలని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. సినిమాలపై జీఎస్టీ 28 శాతం వరకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను పేరుతో 30 శాతం పన్నులను విధిస్తోంది. దీంతో వచ్చే వంద రూపాయిల్లో 58 శాతం పన్నులకుపోగా మిగిలిన 42 శాతం అటు థియేటర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే అమలైతే థియేటర్లలో టికెట్ల ధరలను పెంచాల్సివుంటుంది. సినిమా పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరూ జీఎస్టీ బాదుడుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దర్శకనిర్మాతలు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కరానికి సినీ పరిశ్రమ అంత ముక్తకంఠంతో స్పందించాలని, ఒకే వాదన వినిపించాలని సినీ నటుడు కమల్ హాసన్ కోరారు. -
సీనియర్లకు నటుడు 'బంగారు' కానుక
చెన్నై: వంద మంది సీనియర్ సినీ కళాకారులకు నటుడు విజయ్ సేతుపతి తలా ఒక కాసు బంగారం కానుకగా అందించనున్నారు. భారతీయ సినిమా శతాబ్ధి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా 100 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను బహుకరించాలని ఉలగాయుదా ఫౌండేషన్ నిర్ణయించింది. కాగా ఆ బంగారు పతకాలను తానే అందిస్తానని నటుడు విజయ్‌సేతుపతి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ సినిమా తనకు చాలా చేసిందని, అందుకు ప్రతిఫలంగా ఏదైనా చేయడం తన కనీస బాధ్యతగా పేర్కొన్నారు. అందుకే శతాబ్ధి సినిమా సందర్భంగా కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1న సినిమాకు సంబంధించిన 23 శాఖలలోని సీనియర్ కళాకారులు 100 మందికి పతకాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఫెఫ్సీకి ఒక లేఖను అందించనున్నానని, అందులో శాఖలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేసి వారి ద్వారా 100 మంది సీనియర్ కళాకారుల ను గుర్తించి వారికి బంగారు పతకాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ యుగంతో ఫిలిం మూలపడిందని, దీంతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. అయితే హాలీవుడ్ తరువాత అధికంగా ఫిలిం ఉపయోగించింది మన భారతీయ సినిమానేనన్నారు. ఆ విధంగా లక్షలాది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటారన్నారు. వారిలో కొంతమందినైనా అన్వేషించి బంగారు పతకాల పంపిణీ వేడుకకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి వారికి ఈ కానుకలు అందించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. కాగా ఉలగాయుదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన డైరెక్టర్ ఎస్పీ. జననాథన్ గతంలో భారతీయ సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007లో బైసెల్ సంస్థతో కలిసి జీవీ.ఫిలింస్ సహకారంతో 75 మంది సీనియర్ సినీ కళాకారులకు కాసు బంగారంతో కూడిన పతకాలను కానుకగా అందజేశారు. ఈసారి భారతీయ సినిమా శతాబ్ధి వేడుక సందర్భంగా విజయ్ సేతుపతి తనవంతు సాయం అందిస్తున్నాడు. -
వాళ్లు రక్తం మరిగిన రాబందులు : వర్మ
సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్లో స్పందించే రాంగోపాల్ వర్మ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జల్లికట్టు అంశంపై స్పందించాడు. అయితే సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటి పైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లికట్టు కోసం నిరసన తెలుపుతున్న ఆందోళన కారులపై నిప్పులు చెరిగాడు. ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలకు దిగాడు. 'ప్రభుత్వం సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం కూడా నేరమని, సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని సమర్థిస్తోంది. ఆ ఎద్దులు చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు తొలగి, ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణించటం అనాగరికం. అమాయకమైన జంతువులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అని పేరు పెట్టుకొని తప్పించుకోలేరు. జల్లికట్టును సమర్ధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు 100 ఎద్దులను వదలి ఆ తరువాత వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారు అనాగరికులు, అందుకే ఓ జంతువును హింసించే హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే అల్‌ఖైదా కూడా కరెక్టే. రక్షణ లేని జంతువులను సాంప్రదాయం పేరుతో ఆనందం కోసం హింసించటం టెర్రరిజం కన్నా ఘోరం. అలా ఒక మూగజీవాన్ని వేటాడం కన్నా ఓ మనిషి ఎందుకు వేటాడరు. జల్లికట్టుకోసం పోరాడుతున్న వారికి కనీసం సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు. ఆ జంతువులకు ఓటు హక్కు ఉండి ఉంటే ఒక్క రాజకీయ నేత కూడా జల్లికట్టుకు సపోర్ట్ చేసేవాడు కాదు'. అంటూ విమర్శించాడు వర్మ. Govt restricts filmmakers to show even crow or dog but allows bulls to be brutally harassed for cultural entertainment #jaijallikattu — Ram Gopal Varma (@RGVzoomin) 20 January 2017 Ears ,horns cut,mutilated,tail bones dislocated,poked with knives tortured with nose ropes causing death .#jaijallikattu is Barbarism — Ram Gopal Varma (@RGVzoomin) 20 January 2017 Torturing defenseless living beings for personal entertainment in the name of culture and tradition is worse than terrorism #jaijallikattu — Ram Gopal Varma (@RGVzoomin) 20 January 2017 None of the #jaijallikattu protestors know neither the meaning nor spelling of culture ..They are just human shaped vultures wanting blood — Ram Gopal Varma (@RGVzoomin) 20 January 2017 Bottom line of #jaijallikattu is each supporter should be made to be chased by a 1000 Bulls and then let's see how much they will protest? — Ram Gopal Varma (@RGVzoomin) 20 January 2017 -
విక్రమ్, నయనకు ఫిలింఫేర్ అవార్డులు
ఐకి 4, తనీఒరవన్కు 3 తమిళసినిమా: నటుడు విక్రమ్,నటి నయనతార ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డుల తరువాత అంత ప్రాధాన్యం గలవి ఫిలింఫేర్ అవార్డులు. ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చెందిన ఉత్తమ కళాకారులను, దక్షిణాది ఉత్తమ కళాకారులను ప్రతి ఏడాది ఈ అవార్డులతో సత్కరించడం ఆనవాయితీగా జరుగుతోంది. 63వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దక్షిణాది తారల అందాలతో ఈ కార్యక్రమం గుభాళించింది. ముఖ్యంగా అందాల భామల వివిధ రకాల నృత్యరీతికలు అలరించాయి. ఇక ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ గెలుచుకున్న అవార్డుల వివరాలను చూస్తే ఐ చిత్రం నాలుగు అవార్డులను, తనీరువన్ చిత్రం మూడు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నా యి. ఆ వివరాలిలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం అవార్డును కాక్కాముట్టై, ఉత్తమ నటుడి అవార్డును ఐ చిత్రానికి గానూ విక్రమ్, ఉత్తమ నటి అవార్డును నానుమ్ రౌడీదాన్ చిత్రానికి గానూ నయనతార,ఉత్తమ దర్శకుడు అవార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ మోహన్‌రాజా, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఐ చిత్రానికి గానూ ఏఆర్.రెహ్మాన్ అందుకున్నారు. అదే విధంగా ఉత్తమ పరిచయ హీరో అవార్డును డార్లింగ్ చిత్రానికి గానూ జీవీ.ప్రకాశ్‌కుమార్,క్రిటిక్స్ జ్యూరీ అవార్డును తనీఒరవన్ చిత్రానికి గానూ జయంరవి,ప్రత్యేక జ్యూరీ అవార్డును 36 వయదినిలే చిత్రానికి గానూ నటి జ్యోతిక,ఉత్తమ సహాయ నటి అవార్డును తంగమగన్ చిత్రానికి గానూ రాధికా శరత్‌కుమార్,ఉత్తమ సహాయనటుడు అ వార్డును తనీఒరువన్ చిత్రానికి గానూ అరవిందస్వామి అందుకున్నారు. అదే విధంగా ఉత్తమ గాయకుడు అవార్డు ఐ చిత్రంలో ఇన్నోడ నీ ఇరుందాల్ పాటకుగానూ సిద్ శ్రీరామ్, ఉత్తమ గాయనీ అవార్డు తంగమగన్ చిత్రంలో ఎన్న సొల్ల అనే పాటకు గానూ శ్వేతామోహన్, ఉత్తమ గీత రచయిత అవార్డు ఐ చిత్రంలోని పూక్కలయో సట్రు పాటకుగాను మదన్కార్గీలను వరించాయి. -
99 సాంగ్స్‌కు నిర్మాతగా ఏఆర్ రెహ్మాన్
సంగీతానికి మరో పేరు ఏఆర్.రెహ్మాన్ అన్నంతగా ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారాయన. చిన్న చిన్న ఆశ అంటూ రోజా చిత్రంతో కోలీవుడ్‌లో పరిమళించిన ఏఆర్ రెహ్మాన్ ఆ తరువాత తన కేరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రారంభించిన తన సంగీత పయనాన్ని దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమను దాటి హాలీవుడ్లో గ్రాండ్‌గా ల్యాండ్ అయ్యింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో పాటలకు ఉత్తమ బాణీలు, నేపథ్య సంగీతం అంటూ రెండు ఆస్కార్ అవార్డులను ఒకే వేదికపై అందుకున్న ఘన చరిత్ర ఏఆర్ రె హ్మాన్ది. ఆ విధంగా భారతీయ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సంగీత మాంత్రికుడు గ్రామీ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను అవలీలగా కొల్లగొట్టారు. సంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి కొత్త పుంతలు తొక్కించిన ఏఆర్.రెహ్మాన్ బహుముఖ ప్రజ్ఞావంతుడని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనలో సంగీత దర్శకుడే కాకుండా మంచి గాయకుడు, గీత రచయిత, కథకుడు ఉన్నారన్నది తెలిసిందే. కాగా తాజాగా మంచి నిర్మాత కానున్నారు. ఈ బాధ్యతలు చేపట్టాలన్న ఆసక్తిని ఆయన చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుందన్నది తాజా సమాచారం. ఏఆర్.రెహ్మాన్ 99 పాడల్గళ్(99 సాంగ్స్) అనే పేరుతో ఒక చిత్రం నిర్మించనున్నారు. హిమాన్ భట్, డెన్సింగ్ డలా అనే నూతన జంట హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి
టీనగర్: తల్లి పాత్రలో నటిస్తే హీరోయిన్ అవకాశాలకు ఇబ్బందేమీ ఉండదని నటి ఐశ్వర్యా రాజేష్ తెలిపారు. అట్టకత్తి చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు ఐశ్వర్యా రాజేష్. ఆ తర్వాత పన్నయారుం పద్మినియుం, ర మ్మి సహా పలు చిత్రాల్లో నటించారు. కాక్కాముట్టై చిత్రంలో మురికివాడ మహిళగా ఇద్దరి పిల్లల తల్లిగా నటించారు. ఈ పాత్రకు అనూహ్య ఆదరణ లభించింది. ప్రస్తుతం మళ్లీ అరుళ్‌నిధి ఆరాదుసినం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. ఆమె మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను నటించడం సంతోషం కలిగించిందని, తల్లి పాత్రంలో నటించడం తప్పుకాదన్నారు. తాను ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తున్నానని, హీరోయిన్స్ చాన్స్‌కు ఏమీ ఆటంకం ఏర్పడలేదన్నారు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం ముఖ్యమన్నారు. ఉత్తమ చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శకుల చిత్రాల్లో నటించేందుకు ఆశిస్తున్నట్లు తెలిపారు. చక్కని నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమన్నారు. -
ప్రభుదేవాతో తమన్న
ప్రభుదేవాకు జంటగా తమన్న అనగానే ఇదేదో హింది చిత్రం అనుకునేరు. నృత్య దర్శకత్వం నుంచి, నటన, దర్శకత్వం అంటూ ఎదగడమే కాకుండా తమిళోడి సత్తా ఏమిటన్నది దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చాటి చెప్పిన కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవా. అయితే ఈయన తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. బాలీవుడ్లో దర్శకుడిగా బిజీ అవ్వడంతో తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారనే చెప్పాలి. అయితే ఇటీవల సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. మదరాసు పట్టణం, తాండవం, దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రభుదేవా తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. కాగా ఇందులో ప్రభుదేవాతో రొమాన్స్ చేయిం చడానికి నటి తమన్నను ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారిక పూర్వకంగా వెలువడే అవకాశం ఉంద ని తెలిసింది. -
రాజీవ్ హంతకుల విడుదలకై సినిమావాళ్లు..
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయించేందుకు తమిళ సినిమా వర్గం నడుంకట్టనుంది. ఆ హంతకులను మానవతా దృక్పథంతో వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఓ భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆయన హత్యకు సంబంధించి ప్రస్తుతం ఏడుగురు జైలు శిక్షను 20 ఏళ్లుగా అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 20 ఏళ్లలో ఆ దోషుల్లో చాలా మంచి మార్పు వచ్చిందని, ఇప్పటికైనా ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకొని వారిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి జయలలితకు విజ్ఞప్తి చేయనున్నారు. -
మలేషియాలో నటుడు కేశవన్ మృతి
చెన్నై : యువ కథానాయకుడు 'కేశవన్' శనివారం మలేషియాలో మృతి చెందాడు. కేశవన్ 'క్కాక్కాకా' అనే తమిళ చిత్రంలో హీరోగా నటించారు. నూతన దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఇటీవల కుటుంబ సభ్యులతో మలేషియా వెళ్లిన కేశవన్ అక్కడ జలపాతాలను సందర్శిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తమ కళ్లముందే కన్న కొడుకు జలపాతంలో కొట్టుకుపొవడంతో అతని తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కేశవన్ మృతదేహాన్ని ఆదివారం వెలికి తీశారు. కేశవన్ దుర్మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక టీవీ చానల్లో చిత్ర ప్రమోషన్లో కేశవన్ పాల్గొన్నాడని, ఆ ప్రోగ్రామ్‌ను తన కుటుంబ సభ్యులతో కలిసి చూడటానికి మలేషియా వెళ్లాడని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. క్కాక్కాకా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో చిత్ర హీరో మరణం ఎంతగానో బాధించిందని చిత్ర దర్శకుడు విజయ్ అన్నారు. -
చెన్నైకి డార్లింగ్
తమిళసినిమా : చెన్నై మహానగరానికి వచ్చిన వారిని ఆదరిస్తుందనే పేరుంది.ఇక్కడి సినీపరిశ్రమకు ఏ మూల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకునే విశాల హృదయం ఉందని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పనవసరంలేదు.ఇంతకు ముందు భాషా భేదం (ఇప్పుడు లేదనుకోండి) లేకుండా సినిమాకు పుట్టినిల్లుగా భాసిల్లింది చెన్నై. అలాంటి తమిళ చిత్రపరిశ్రమలో పర భాషా తారల వెల్లువన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం తేదు. భాషా ఒక్కసారి చెబితే అన్నట్లుగా ఇక్కడ ఒక్క చిత్రం చేసిన నటి మళ్లీ మళ్లీ నటించాలని ఆశ పడుతుంటారు. యువ నటి నిక్కీగల్రాణి ఇలానే కోరుకుంటోంది. డార్లింగ్ అంటూ కోలీవుడ్‌కు ఎంటర్ అయిన ఈ బెంగళూరు బ్యూటీ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకేముంది అవకాశాలు వరుసగా తలుపు తట్టడం మొదలెట్టాయి. ఇటీవలే ఆది సరసన నటించిన యాగవరాయనుమ్ నాక్కాక చిత్రం తెరపై కొచ్చింది.ఈ చిత్రంలో అమ్మడి అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పకోవడం. కాగా ప్రస్తుతం నటుడు బాబిసింహా సరసన కో-2 చిత్రంలోనూ, జీవాకు జంట గా కవలై వేండామ్ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేసూ బిజీగా ఉంది.తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయట.దీంతో తన మకాంను చెన్నైకి మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
'నా ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవం'
చెన్నై: తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను సీనియర్ నటి మనోరమ ఖండించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆమె సోమవారమిక్కడ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తనయుడు భూపతి ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. కాగా మనోరమ కొంతకాలం క్రితం బాత్రూమ్లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం మనోరమ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మనోరమ మరణించారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. -
హాలీవుడ్ మూవీలో విజయ్?
-
కన్నీటి వీడ్కోలు
తమిళసినిమా:దర్శక శిఖరం, తమిళ చిత్ర పరిశ్రమ దర్శక దిగ్గజం గా, అభిమాన, గౌరవ, మర్యాదలను అందుకున్న దర్శక పితామహుడు కె.బాలచందర్ భౌతిక కాయానికి యావత్ సినీ కుటుంబం బాధాతప్త హృదయంతో ఘన నివాళి అర్పించింది. బాలచందర్ సాధనలను, అసాధారణ వెండితెర ఆవిష్కరణలను కన్నీటితో కీర్తించింది. ‘స్త్రీ’ అనే సున్నితమైన హృదయ పుస్తకం చదివి ఆ మనోభావాలను నిర్భయంగా సినిమా రూపంలో ప్రపంచానికి చూపించిన దర్శక సవ్యసాచి బాలచందర్. సరాసరి చిత్రాలకు దూరంగా తన చిత్రాలు ఎంతో కొంత మేలు చేయాలి. సందేశం ఉండాలని తపించిన కళాతృష్ణ బాలచందర్. తమిళ సినిమాకు జాతీయస్థాయిలో గౌరవాన్ని సాధించిన మేటి దర్శకుడు. బాలచందర్ ప్రతి చిత్రం ఒక కళాఖండమేనని చెప్పడం అతిశయోక్తి కాదు.కళాత్మక చిత్రాలైనా కాసుల వర్షం కురిపించడంలో గురి తప్పని చిత్రాలు. ఎందరో కళాకారులకు సృష్టికర్తగా, ఎందరో కళాకారులకు స్ఫూర్తిదాయకంగా మరెంరదికో అత్యున్నత స్థారుు జీవితాలను ప్రసాదించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు గొప్ప చిత్రాలను నిర్మించారు. అంతటి దర్శక శిఖరం నేలకొరగడం, చిత్ర పరిశ్రమకే కాదు యావత్ భారత సినీలోకానికి తీరనిలోటని తారలు ఉద్ఘాటిస్తున్నారు. సినీచరిత్రలో నూతన అధ్యాయానికి నాంది బాలచందర్. సినిమాను మరో కొత్త కోణంలో ఆవిష్కరించిన ఘనత ఆయనది. దర్శక శిఖామణి భౌతిక కాయూలనికి నివాళులర్పించడానికి సినీ రాజకీయ, అభిమాన లోకం తరలివచ్చింది. ఆయన శిష్యగణం శోక సంద్రంలో మునిగిపోయింది. నివాళులర్పించిన ప్రముఖుల్లో డీఎంకే నేత కరుణానిధి, స్టాలిన్, పుదియ తమిళ కట్చి నేత ఎ.సి.షణ్ముగం, పొన్ముడి, దురైమురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, డీఎండీకే నేత విజయకాంత్ తిరుమావళవన్, కుష్బూ వంటి రాజకీయ నాయకులన్నారు. ఇంకా సినీ పరిశ్రమలో అగ్రస్థారుులో వెలుగొందిన రజనీకాంత్, లత రజనీకాంత్, శరత్ కుమార్, రాధిక, శివకుమార్, విజయ్, ధనుష్, ముక్తాశ్రీనివాస్, ఎ.వి.ఎం శరవణన్, టి.రాజేంద్రన్, ఎస్.జె.సూర్య, కార్తి, ఎస్.పి.ముత్తురామన్, పి.వాసు, శంకర్, కె.ఎస్.రవికుమార్, ధారణి, లింగుసామి, పేరరసు, వసంత్, సత్యరాజ్, జయరాం, వివేక్, ఆర్.సి. శక్తి, వాగై చంద్రశేఖర్, రాధారవి, కె.రాజన్, నటి మనోరమ, శ్రీప్రియ, సరిత, విమలారామన్, నిరోషా, సరస్వతి, ఆర్.కె. సెల్వమణి, ప్రభు సాలమన్, నిర్మాత ధాను, ఆర్.బి.చౌదరి, తమిళచ్చి తంగపాండియన్, కె.ఆర్, వైజీ మహేంద్రన్, డ్రమ్స్ శివమణి, ప్రతాప్ పోతన్, దేవా, శ్రీకాంత్ దేవా, చో.రామస్వామి, నల్లి కుప్పుసామి, మణిరత్నం, సుహాసినీ, కుష్బూ, విజయకుమార్ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కె.బాలచందర్ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు అభిమానుల కోసం స్థానిక మైలాపూర్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు. భార్య రాజ్యం, కూతురు పుష్పా కందసామి, శోఖ సంద్రంలో మునిగిపోయారు. కొడుకు ప్రసన్న శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలచందర్ అంత్యక్రియలు బీసెంట్ రోడ్డులో గల శ్మశాన వాటికలో జరిగాయి. వేలాదిమంది సినీ ప్రముఖులు, అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తమిళ సినిమాకు మలుపు తమిళ సినిమాను కొత్త మలుపు తిప్పిన దర్శకుడు కె.బాలచందర్. జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన దర్శకుడు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన చిత్రాలు సజీవ సాక్ష్యాలు. సినిమా ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి గుర్తుండిపోతుంది. బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - కరుణానిధి, డీఎంకే అధినేత నన్ను నేను కోల్పోయాను నన్ను నేను కోల్పోయాను. బాలచందర్ మనిషిగా జీవించిన దేవుడు. నన్పెప్పుడూ నటుడిగా చూడలేదు. తన కొడుకుగానే భావించే వారు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఈ సినిమా పరిశ్రమ చూడలేదు. - నటుడు రజనీకాంత్ వెతికి వెళ్లి అభినందించేవారు నేను చదువుకుంటున్న రోజుల్లోనే బాలచందర్ చిత్రాలు చూసి అబ్బురం చెందేవాడిని. మూడు దశాబ్దాల పాటు ప్రఖ్యాత దర్శకుడిగా వెలుగొందడం అసాధ్యం. నేనైతే 15 ఏళ్లు దర్శకుడిగా రాణిస్తే చాలనుకుంటున్నా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శక శిఖరం బాలచందర్. దర్శకులకే దర్శకుడాయన. మంచి విషయం అనిపిస్తే వెతుక్కుంటూ వె ళ్లి అభినందించే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. బాలచందర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. - దర్శకుడు శంకర్ జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి దర్శక శిఖరం కె.బాలచందర్ జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి. ఆయన చేతివేళ్లు పట్టుకుని ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగారు. బాలచందర్ భౌతికంగా లేకపోయినా ఆయన మధురజ్ఞాపకాలు భవిష్యత్ తరాలను సజీవంగా వెంటాడతాయి. - నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ‘అరంగేట్రం’తోనే బలమైన నిర్ణయాలు తమిళ సినిమాలో నటులుగా ఎమ్జీఆర్, శివజీగణేశన్ ఎంతగొప్పవారో దర్శకులు బాలచందర్ అంత గొప్పవారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు బాలచందర్ పరిచయం చేసిన మాట వాస్తవమే. అయితే అంతకు ముందే నాగేష్ లాంటి నటుడిని కథానాయకుడిగా పరిచయం చేసిన గట్స్ ఉన్న దర్శకుడాయన. అరంగేట్రం చిత్రం తరువాత బాలచందర్ పొగతాగరాదని, స్త్రీ ఇతివృత్తంలో పలు చిత్రాలు తీసిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. - నటుడు శివకుమార్ అద్భుత దర్శకుడు బాలచందర్ చిత్రాలు అఖిల భారత స్థాయిలో కీర్తి కిరీటాలు పొందాయి. అంత గొప్ప చిత్రాలు తీసిన అద్భుత దర్శకుడాయన. బాలచందర్ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని విన్నపం - సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా బాలచందర్ కవితాలయ సంస్థ నిర్మించిన అన్నామలై చిత్రంతోనే సంగీత దర్శకుడిగా నా స్థారుు పెరిగింది. - సంగీత దర్శకుడు దేవా నాకు మార్గదర్శి భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శక దిగ్గజం కె.బాలచందర్. నేనుచదివిన అన్నామలై, కళాశాలలోనే నాకన్నా ముద్ర చదివి నాకు మార్గదర్శిగా నిలిచారు. ఎవరేమనుకున్నా తన మనసులోని భావాలను నిర్భయంగా వెండితెరపై ఆవిష్కరించి విజయం సాధించిన దర్శకుడు. అలాంటి దర్శకుడు మరణం సినీ లోకాన్ని శోక సముద్రంలో ముంచింది. - నటుడు టి.రాజేందర్ ఇక ముందు చూడలేం బాలచందర్ అంత గొప్ప దర్శకుడ్ని ఇక ముందు చూడలేం. ఆదిలోనే నా నవగ్రహ నాటకం ప్రదర్శన చూసి చాలా బాగుందని అభినందించారు. అంత ఉన్నత మనసు ఆయనది. - నటి మనోరమ చిత్ర పరిశ్రమకు తీరని లోటు బాలచందర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక ధృవతార రాలిపోయింది. మధ్య తరగతి కుటుంబాల జీవిన శైలిని కళ్లకు కట్టినట్లు చూపించడంలో బాలచందర్ సిద్ధహస్తులు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సంఘానికి, దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా సేవలు చేసిన ఏకైక వ్యక్తి బాలచందర్. ఆయన ఆత్మకు శాంతికలగాలని వారి కుటుంబానికి ఆయన లేని కష్టాన్ని భరించే ధైర్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. - కాట్రగడ్డ ప్రసాద్ (సౌత్ ఇండియన్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి) -
యువ నాయికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
చెన్నై : ఈ తరం యువ నాయికలకు మద్రాసు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 18 ఏళ్లు దాటని అమ్మాయిలు నాయికలుగా నటించడాన్ని నిషేధించాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చలన చిత్రాల్లో 18 ఏళ్లు నిండని అమ్మాయిలను కథానాయికలుగా నటింపజేస్తున్నారని తెలిపారు. ఈ వయసులో అమ్మాయిలు పరిపక్వత ఉండదని, అలాంటివారు మానసికంగా, శారీరకంగా బాధింపులకు గురి అవుతారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాంటివారు అత్యాచారాలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో నటి సంధ్య, కార్తిక, లక్ష్మీమీనన్, తులసి వంటి నాయకలు 18 ఏళ్ల వయసు నిండకముందే పాఠశాలలో చదువుకుంటూనే నటిగా రంగప్రవేశం చేశారని తెలిపారు. ఇలాంటి బాలికలు నాయికలుగా నటించడం చిన్నారుల న్యాయ చట్టానికి, భారతీయ పిల్లల సంరక్షణ చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాబట్టి 18 ఏళ్ల వయసులోపు అమ్మాయిల్ని నాయికలుగా నటించడంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో సాధించాలన్న లక్ష్యంతో పయనిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానం కల్పించుకోదంటూ పిటిషన్ కొట్టివేసింది. -
శ్రీలంక వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ ధర్నా
చెన్నై: శ్రీలంక రక్షణ శాఖ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళ చిత్ర పరిశ్రమ సోమవారం ధర్నాకు దిగింది. చెన్నైలోని శ్రీలంక కాన్సులేట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ చిత్ర పరిశ్రమ ఆందోళన చేపట్టింది. శ్రీలంక రక్షణ శాఖకు చెందిన అధికారిక వెబ్సైట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా ఓ ఫోటోలతో పాటు.. కామెంట్స్ పొందుపరిచారు. ఈ ఫోటోలు తమిళనాడులో సంచలనం సృష్టించగా, ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ జాలర్ల అంశంపై ప్రధానికి రాసే లేఖలను నరేంద్ర మోడీకి జయలలిత రాస్తున్న ప్రేమ లేఖలు అనే అర్థం వచ్చేలా అందులో కామెంట్స్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం శ్రీలంక రక్షణ శాఖ క్షమాపణలు చెప్పింది. -
నటి మనోరమకు మళ్లీ అస్వస్థత
చెన్నై : సీనియర్ నటి మనోరమ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలు భాషలలో నాలుగొందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆమెను తమిళ పరిశ్రమ ఆచ్చి అని గౌరవంగా పిలుపుకుంటుంది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో చాలాకాలం నటనకు దూరంగా ఉన్న మనోరమ ఈ మధ్య ఒకటి, రెండు చిత్రాల్లో నటించారు. కొద్దిరోజుల క్రితమం మూత్ర సంబంధ సమస్యతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనోరమ కోలుకుంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరి కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని సమాచారం. -
కిచ్చా సుదీప్ రికార్డు రెమ్యునరేషన్!
కిచ్చా సుదీప్ రికార్డు రెమ్యునరేషన్! తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టనున్న కన్నడ హీరో సాక్షి, బెంగళూరు : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా కిచ్చా సుదీప్‌లోని నటవిశ్వరూపాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్న సుదీప్ ఈ సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ ఫేమస్ అయిపోయాడు. దీంతో త్వరలోనే తెరకెక్కనున్న రజనీకాంత్ సినిమాలో సుదీప్ విలన్‌గా కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అంతకంటే ఓ ముఖ్యమైన వార్త శాండల్‌వుడ్‌లో వినిపిస్తోంది. అదేంటంటే ‘ఇళయ దళపతి’గా కోలీవుడ్‌లో ఖ్యాతినార్జించిన విజయ్ సినిమాలో సుదీప్ కూడా కనిపించనున్నారట. ఈ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి సుదీప్ అడుగుపెట్టనున్నారు. గత సోమవారమే ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సుదీప్ సంతకం చేశారని శాండల్‌వుడ్ వర్గాల సమాచారం. ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కోసం అక్షరాల రూ.6 కోట్ల పారితోషికాన్ని కిచ్చా సుదీప్ అందుకోనున్నారు. శాండల్‌వుడ్‌లో ఇదో రికార్డు అనే చెప్పవచ్చు. ఎందుకంటే శాండల్‌వుడ్‌లో అగ్ర కథానాయకుడిగా ఉన్న దర్శన్ ప్రస్తుతం అత్యధికంగా రూ.5.5 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు దర్శన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.6 కోట్ల పారితోషికాన్ని సుదీప్ అందుకుంటున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. -
ప్రేమ కోసం.. తమిళంలో?
తెలుగులో ఆచి తూచి సినిమాలు చేస్తున్న సమంత... కెరీర్ ప్రారంభంలో తనను కూరలో కరివేపాకులా పక్కన పెట్టిన తమిళ చిత్రసీమలో మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే విజయ్‌తో ‘కత్తి’, సూర్యతో ‘అంజాన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇటీవలే విక్రమ్ సినిమాకు కూడా పచ్చ జెండా ఊపేశారు. వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా సమంత నటించే అవకాశాలున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే- లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘అంజాన్’లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కార్తీతో ఓ సినిమా చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నారు. సినిమా పేరు ‘ఎన్ని ఏళు నాట్కళ్’. అంటే ‘లెక్కపెట్టి మరీ... ఏడు రోజులు’ అని అర్థం. యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ కథను ఇటీవలే కార్తీకి వినిపించారట లింగుస్వామి. కార్తీకి కూడా కథ నచ్చిందని సమాచారం. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం తమిళ సినిమాలను సమంత అంగీకరిస్తున్న తీరుని బట్టి, ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని కోలీవుడ్ టాక్. అసలు ఉన్నట్టుండి సమంతకు తమిళ సినిమాపై అంత ప్రేమ పెరగడానికి కారణమేంటి? అనే విషయంపై కూడా అక్కడ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హీరో సిద్ధార్థ్‌ను తెలుగు సినిమా పూర్తిగా పక్కన పెట్టేయడం, ఆయన కూడా పూర్తిగా తమిళ సినిమాలపైనే దృష్టి సారించడం సమంతలో ఈ మార్పుకు కారణమని పలువురి అభిప్రాయం. సమంతది మొదటి నుంచీ ప్రేమించే గుణం. ఆమెకు భావోద్వేగాలు ఎక్కువ. ప్రేమ కోసం అలాంటి నిర్ణయమే ఆమె తీసుకుంటే... అది తప్పేం కాదని మరో వర్గం అభిప్రాయం. సమంత మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... మరో వైపు తన శైలిలో సేవాకార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇటీవల ఓ పాప కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసి సదరు పాప కుటుంబానికి అందించారు సమంత. -
తమిళ్‌కు నో
నటి ప్రియమణి తమిళచిత్ర పరిశ్రమపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారాణాలేమయినా ఈ అమ్మడు తమిళచిత్ర అవకాశాలను నిరాకరిస్తోందట. కోలీవుడ్‌లో తొలి రోజుల్లోనే పరుత్తివీరన్ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రలో ఒదిగి పోయి ఆ పాత్రకు గానూ జాతీయ అవార్డును గెలుచుకున్న నటి ప్రియమణి. అలాంటిది తమిళ చిత్రాలకు నో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కన్నడంలో అతిథి పాత్రలకు కూడా ఓకే అంటున్న ఈ మలయాళ భామ తమిళంలో అవకాశాలను తిరస్కరించడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడంలేదు. పరుత్తివీరన్ చిత్రం తరువాత గ్లామర్ వైపు మొగ్గు చూపిన ఈ బ్యూటీకి ఇలాంటి మరిన్ని అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అందాలారబోతలో విజృంభించింది. దీంతో కొందరు ప్రముఖ హీరోలను ఆకర్షించింది కూడా. అయినా అది కొన్ని చిత్రాలకే పరిమితం అవ్వడంతో మళ్లీ మాతృభాషపై దృష్టి సారించింది. ప్రస్తుతం కన్నడ చిత్రంలో ఒక గెస్ట్ రోల్‌ను పోషించడానికి రెడీ అయ్యిందట. ఇందుకు కారణం కూడా సిద్ధం చేసుకుంది. కన్నడ దర్శకుడు పట్నాయక్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చింది. అందువల్లే ఆయన దర్శకత్వంలో గెస్ట్ రోల్ చేయడానికి అంగీకరించానంది. అంతేకాకుండా తానింత వరకు సీబీఐ అధికారిగా నటించలేదని ఈ చిత్రంలో అలాంటి పాత్ర కావడంతో నటిస్తున్నట్లు చెప్పింది. తెలుగులో నటించే విషయమై కథలు వింటున్నట్లు తెలిపింది. అదేవిధంగా కన్నడ, మలయాళ భాషల్లో బిజిగా ఉండటం వల్ల ఇతర భాషల చిత్రాలను అంగీకరించడంలేదని ప్రియమణి తెలిపింది. -
అమ్మా థియేటర్లపై హర్షం
చిన్న చిత్రాల నిర్మాతలకు శుభవార్త. అమ్మా థియేటర్ల పేరుతో రాష్ట్రంలో జయలలిత ప్రభుత్వం పలు సినీ థియేటర్లను నిర్మించనుంది. దీనిపై చిత్ర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తమిళ నిర్మాతల మండలి సంఘం అధ్యక్షుడు కెఆర్ గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కొరత పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అమ్మా థియేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించి తమిళ సినిమా పరిశ్రమను సంతోషంలో ముంచెత్తిందన్నారు. కోరకుండానే కోరికలు తీర్చుతున్న ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలడం లేదన్నారు. ప్రస్తుత తమిళ నిర్మాతల మండలి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదన్న నిర్మాత కలైపులి ఎస్.థాను పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. దీంతో నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తమిళ నిర్మాతల మండలి పలు కార్యక్రమాలు చేపట్టనుందని తెలిపారు. ముఖ్యంగా చిత్రాల విడుదల విషయంలో నిబద్ధతతను తీసుకురానున్నట్లు చెప్పా రు. భారీ బడ్జెట్ చిత్రాలు పండుగ దినాల సందర్భంగాను, ప్రతి నెలా మూడవ శుక్రవారంలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. చిన్న బడ్జెట్ చిత్రాలు ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చని చెప్పారు. -
నటులకు బెదిరింపు లేఖలా?
నటులు శివకుమార్, విశాల్, నాజర్, సంతానం తదితరులకు మదురై నాటక రంగ నటుల పేరుతో హత్యా బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఈ బెదిరింపు లేఖల ఉదంతంపై దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ స్పందించారు. సంఘం తరపున అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి, కోశాధికారి వాగైచంద్ర శేఖర్ ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ నటీనటుల సంఘం సీనియర్ సభ్యుల్లో ఒకరైన శివకుమార్, నటుడు నాజర్, విశాల్, సంతానంలకు హత్యా బెదిరింపు లేఖలు వచ్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. తమ సభ్యులకు ఇలాంటి పిరికిపందల నుంచి బెదిరింపు లేఖలు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. పోలీసుల సహాయంతో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు విడుదలవడం సంప్రదాయం. అయితే తమిళనాడులో దీపావళి సమయంలో పెద్ద చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ దీపావళికీ భారీ చిత్రాలు ముస్తాబయ్యాయి. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన అళగురాజా, ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించిన ఆరంభం, మరికొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. తమిళ ప్రజలను తన హాస్యంతో ఉర్రూతలూగించి పారితోషికంలో రికార్డు సృష్టించిన వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో తెరమరుగయ్యారు. ప్రస్తుతం సంతానం హవా నడుస్తోందని చెప్పవచ్చు. సంతానం రోజుకు రూ.10 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 15 చిత్రాలతో సంతానం డైరీ ఫుల్ అని చెబుతున్నారు. ఆర్.బి.చౌదరి ప్రస్తుతం ‘జిల్లా’ అనే సినిమాను నిర్మిస్తూ పొంగల్‌కు విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అళగురాజా నిర్మించిన జ్ఞానవేల్‌రాజా, ఇదే చిత్రంలో హాస్యపాత్ర పోషించిన సంతానం ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. చెన్నై తణికాచలం రోడ్డులోని జ్ఞానవేల్‌రాజా, సాలిగ్రామంలోని సంతానం ఇళ్లపై దాడులు జరిపారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలోని సినిమా నగర్‌లోని జ్ఞానవేల్‌రాజా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం లో సోదాలు నిర్వహించారు. అలాగే నిర్మాత అశోక్సామ్రాజ్ ఇంటిపై, కస్తూరి ఫిలిమ్స్ పేరుతో నిర్వహిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంపై దాడులు జరిగాయి. చెన్నై టి.నగర్‌లోని సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఇంటిపై, సాలిగ్రామంలోని సూర్య ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత ఎ.ఎం.రత్నం ఇల్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఎ.ఎం.రత్నానికి చెందిన మరో ఇల్లు హైదరాబాద్‌లో ఉండగా అక్కడా ఇదే సమయంలో ఐటీ దాడులు నిర్వహించారు. కోయంబత్తూరు సింగానల్లూరులోని కోవైతండి, ఎస్బీ కాలనీ రామ్‌నగర్‌లోని కేటీవీఆర్ రామస్వామి, వీరకేరళంలో స్టూడియో గ్రీన్, సేలం మాదంపట్టిలోని శివకుమార్, తిరిడా ముత్తూరులోని మరుదు సెల్వం, పీఎస్జీ కల్వారీ సమీపంలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులుకోవై మురుగన్ తదితర సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిపారు. ‘తలైవా’ చిత్ర నిర్మాత సుందరప్రకాష్ జైన్, దర్శకులు లింగుస్వామి ఇళ్లపైనా దాడులు జరిపారు. 30 చోట్ల దాడులు చెన్నైలో 23 చోట్ల, ఇతర జిల్లాల్లో 6 చోట్ల, హైదరాబాద్‌లో చోట దాడులు జరిగాయి. సుమారు వంద మంది అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగారు. ప్రముఖుల ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో కోలీవుడ్ ఉలిక్కి పడింది. -
తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖుల ఇళ్లపై గురువారం మెరుపు దాడులు చేశారు. చెన్నైలో ఒకే సమయంలో 29 మంది నిర్మాతలు, నటుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తెలుగులో పలు చిత్రాలు నిర్మించిన ఏఎమ్ రత్నం, ఆర్బీ చౌదరి ఇళ్లను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. జ్ఞానవేలు రాజా, హాస్య నటుడు సంతానం తదితర ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. ఒకేసారి ఇంతమంది ప్రముఖల ఇళ్లను సోదా చేయడం గమనార్హం. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది.