తెలుగులో ఆచి తూచి సినిమాలు చేస్తున్న సమంత... కెరీర్ ప్రారంభంలో తనను కూరలో కరివేపాకులా పక్కన పెట్టిన తమిళ చిత్రసీమలో మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే విజయ్‌తో ‘కత్తి’, సూర్యతో ‘అంజాన్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇటీవలే విక్రమ్ సినిమాకు కూడా పచ్చ జెండా ఊపేశారు. వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా సమంత నటించే అవకాశాలున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే- లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘అంజాన్’లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత కార్తీతో ఓ సినిమా చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నారు. సినిమా పేరు ‘ఎన్ని ఏళు నాట్కళ్’. అంటే ‘లెక్కపెట్టి మరీ... ఏడు రోజులు’ అని అర్థం. యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ కథను ఇటీవలే కార్తీకి వినిపించారట లింగుస్వామి. కార్తీకి కూడా కథ నచ్చిందని సమాచారం. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం తమిళ సినిమాలను సమంత అంగీకరిస్తున్న తీరుని బట్టి, ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని కోలీవుడ్ టాక్.
అసలు ఉన్నట్టుండి సమంతకు తమిళ సినిమాపై అంత ప్రేమ పెరగడానికి కారణమేంటి? అనే విషయంపై కూడా అక్కడ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హీరో సిద్ధార్థ్‌ను తెలుగు సినిమా పూర్తిగా పక్కన పెట్టేయడం, ఆయన కూడా పూర్తిగా తమిళ సినిమాలపైనే దృష్టి సారించడం సమంతలో ఈ మార్పుకు కారణమని పలువురి అభిప్రాయం. సమంతది మొదటి నుంచీ ప్రేమించే గుణం. ఆమెకు భావోద్వేగాలు ఎక్కువ.
ప్రేమ కోసం అలాంటి నిర్ణయమే ఆమె తీసుకుంటే... అది తప్పేం కాదని మరో వర్గం అభిప్రాయం. సమంత మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... మరో వైపు తన శైలిలో సేవాకార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇటీవల ఓ పాప కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసి సదరు పాప కుటుంబానికి అందించారు సమంత.
ప్రేమ కోసం.. తమిళంలో?
Published Fri, Apr 18 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM
Advertisement
Advertisement