కష్టే ఫలి అన్నది అనుభవమైంది | Chit Chat with Samantha | Sakshi
Sakshi News home page

కష్టే ఫలి అన్నది అనుభవమైంది

Published Thu, Sep 10 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

కష్టే ఫలి అన్నది అనుభవమైంది

కష్టే ఫలి అన్నది అనుభవమైంది

కషే ఫలి అన్నది నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది అన్నారు నటి సమంత. సూపర్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే. విక్రమ్, విజయ్, సూర్య,ధనుష్ వంటి స్టార్ హీరోలతో రీల్‌లో రొమాన్స్ చేస్తున్న సమంత తాజా చిత్రాల కబుర్లు, వ్యక్తిగత విషయాల గురించి చిన్న చిట్‌చాట్..
 
 ప్ర: తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నట్లున్నారు?
 జ: అవును. ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే అధిక శ్రద్ధ పెడుతున్నాను. ధనుష్‌తో వేలై ఇల్లా పట్టాదారి-2, చిత్రం పూర్తయింది. విక్రమ్‌కు జతగా 10 ఎండ్రదుకుళ్, విజయ్ సరసన అట్లీ దర్శకత్వంలో ఒక చిత్రం, సూర్యకు జంటగా 24 చిత్రం చిత్రాలతో పాటు తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. ఇక కన్నడం, మలయాళం, హిందీ చిత్రాలపై దృష్టి సారించలేదు. కారణం సమయం చాలకే.
 
 ప్ర: 10 ఎండ్రదుకుళ్ చిత్రంలో డబుల్ రోల్ చేశారట నిజమేనా?
 జ: 10 ఎండ్రదుకుళ్ చిత్ర కథ 60 లొకేషన్స్‌లో జరుగుతుంది. అందుకోసం పలు రాష్ట్రాల్లో పయనించాం.అలాగే కథలో కొంత షూటింగ్ నేపాల్‌లో జరుగుతుంది. అందువల్ల నేపాల్ అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాను. దాన్ని చూసి సమంత డ్యూయల్ రోల్ చేస్తోందనే ప్రచారం చేస్తున్నారు. దీన్ని నేను చాలా సార్లు ఖండించాను.
 
 ప్ర: సరే ఈ చిత్రంలో ఫైటింగులు కూడా చేశారట?
 జ; ఫైటింగులే కాదు ఏవేవో చేశాను. లారీలు, జీప్‌లు కూడా నడిపాను. ఒక జీప్‌ను వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలి. ఆ పని స్వయంగా నేనే చేశాను. యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. నన్నీ చిత్రంలో పాత్రకు ఎంపిక చేయడం కరెక్ట్ అని దర్శకుడు విజయ్‌విల్టన్, హీరో విక్రమ్ అనుకోవడం విన్న తరువాత నా మనసు కుదుట పడింది. చిత్రంలో ఫైట్స్ సన్నివేశాల్లో నేనే నటించాను. డూప్‌తో చేయిద్దామని స్టంట్‌మాస్టర్ అన్నారు. నేను అంగీకరించలేదు. ప్రేమ,సెంటిమెంట్ సన్నివేశాల్లో జాలీగా నటిస్తున్నాను.ై ఫెట్ సన్నివేశాల్లో ఎందుకు వెనక్కుతగ్గాలి అని నేనే నటించాను. అయితే గాయాలు బాగానే అయ్యాయి. కష్టపడితే గానీ ఫలితం దక్కదని అప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది.
 
 ప్ర: గుర్రపు స్వారీ కూడా చేశారట?
 జ; 10 ఎండ్రదుకుళ్ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న తరువాతే నేర్చుకున్నాను. ఒక ట్రైనర్ వచ్చి నేర్పించారు.అయితే నేపాల్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు గుర్రపు స్వారీ రాదు. అప్పుడు చాలా గుర్రాలను నిలబెట్టారు. అవన్నీ రేస్ గుర్రాలు. అందులో ఒక తెల్లని గుర్రం అందంగా కనిపించింది. దాని వద్దకు వెళ్లాను. ఎగిరి తన్నుతుందని భయపెట్టారు. అయినా ధైర్యం చేసి ముందుగా గుర్రం ముఖాన్ని తడిమాను. ఆ తరువాత దాని మీద ఎక్కి కూర్చుని స్వారీ చేయడం ఆరంభించాను. చిత్ర యూనిట్ అంతా బిత్తరపోయి చూస్తుండిపోయారు. అలా కొన్ని నిమిషాలకే గుర్రం నా ఆధీనంలోకి వచ్చేసింది.అందరూ ఆశ్చర్యపోయారు. మొండి ధైర్యం అంటే ఇదేనేమో అనిపించింది నాకు. మొత్తం మీద ఆ విధంగా వర్కౌట్ అయ్యిందా సన్నివేశం.
 
 ప్ర: వేలై ఇల్లా పట్టాదారి-2 చిత్రంలోని పాత్ర నచ్చిందని చెప్పినట్లున్నారు?
 జ: నచ్చడం కాదు పిచ్చ పిచ్చగా నచ్చింది. ఆ చిత్రంలో తొలిసారిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్ర చేశాను. చీరకట్టులో నన్ను చూసుకున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. నా సినీ కేరీర్‌లో వీఐపీ-2 కు ప్రత్యేక స్థానం ఉంటుంది.
 
 ప్ర: సాధారణంగా హీరోయిన్ల మధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయంటారు. మీరేంటి సహ నటీమణులందర్నీ పొగిడేస్తున్నారు?
 జ: నిజమే ఒక హీరోయిన్ గురించి మరో హీరోయిన్ మాట్లాడరంటారు. కానీ నేనలా కాదు. మంచి విషయం ఎక్కడున్నా వెతికి అభినందిస్తాను. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క ఎంత లావు అయ్యారో చూశారా? ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. హీరోయిన్లు స్లిమ్‌గా అందంగా కనిపించాలని కోరుకుంటారు. అనుష్క అలా కాదు పాత్రగా మారడానికి శ్రమించారు. అలాగే నటి ఎమిజాక్సన్ అంటే నాకు చాలా ఇష్టం.
 
 ప్ర: సోషల్ వర్క్స్ చేస్తున్నారట?

 జ: అందుకోసం ఒక సంస్థను ప్రారంభించాను. చాలా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాను.వాటిని పబ్లిసిటీ చెయ్యాలనుకోవడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement