ఒక్కొక్కరితో ఒక్కో ప్రత్యేక అనుభవం | special experience Each actor says Hansika | Sakshi

ఒక్కొక్కరితో ఒక్కో ప్రత్యేక అనుభవం

Published Fri, Mar 13 2015 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

ఒక్కొక్కరితో  ఒక్కో ప్రత్యేక అనుభవం

ఒక్కొక్కరితో ఒక్కో ప్రత్యేక అనుభవం

ఇళయదళపతి విజయ్ డాన్స్‌లో ఇరగదీస్తారు. ఇక సూర్యతో నటనలో పోటీ పడటానికి చాలా కష్టపడాల్సిందే నంటోంది నటి హన్సిక. కోలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతున్న బ్యూటీ హన్సిక. అలాగే ప్రముఖ యువ కథా నాయకులందరితోనూ నటించేస్తూ మంచి రైజింగ్‌లో ఉన్న ఈ ఉత్తరాది భామ ఒక్క ఖర్చు విషయంలో మినహా దర్శక నిర్మాతలకు తెగ నచ్చేస్తోంది. కారణం ఏంటంటే, చెప్పిన సమయానికి షూటింగ్‌కు రావడం, కాల్‌షీట్స్ సమస్యలు లాంటివి తెచ్చిపెట్టకపోవడం లాంటి కూడా క్వాలిఫికేషన్స్ హన్సికకు అవకాశాలు దగ్గర చేస్తున్నాయి.
 
  వరుస విజయాలు కూడా ఈ అమ్మడిని లక్కీస్టార్‌ను చేశాయి. అరణ్మణై, పూజై లాంటి తాజా విజయాలను తన ఖాతాలో వేసుకున్న హన్సిక ప్రస్తుతం వాలు, వేట్టైమన్నన్, ఉయిరే ఉయిరే చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తోంది. అదే విధంగా జయం రవితో నటిస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక ఇళయదళపతి విజయ్‌తో పులి చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్, సూర్య, ఆర్య, ధనుష్, శింబు వంటి స్టార్ హీరోలతో నటించిన అనుభవంతో హన్సిక వారేమిటో చెప్పనా అంటోంది.
 
 నటుడు విజయ్ డాన్స్‌లో దుమ్మురేపుతారు. రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తారు. సూర్య గురించి చెప్పాలంటే కఠిన శ్రమ జీవి. ఆయనతో సమంగా నటించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నటుడు ధనుష్ చాలా ప్రతిభావంతుడు. జయం రవి మంచి స్నేహశీలి. ఆర్య విషయానికొస్తే ఒట్టి అల్లరోడు. శివకార్తికేయన్ చాలా జాలీ టైప్. ఇలా ఒక్కో నటుడితో ఒక్కో ప్రత్యేక అనుభవం ఉందంటున్న హన్సిక తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement