‘కీర్తి’ లక్కే లక్కు | I'm a no nonsense actress: Keerthy Suresh | Sakshi
Sakshi News home page

‘కీర్తి’ లక్కే లక్కు

Published Tue, Feb 20 2018 1:38 AM | Last Updated on Tue, Feb 20 2018 1:38 AM

I'm a no nonsense actress: Keerthy Suresh - Sakshi

కీర్తిసురేశ్‌

తమిళసినిమా: నటుడు విజయ్, స్యూర ఒక రకం అని, విక్రమ్‌ మరో రకం  అంటోంది ముద్దుగుమ్మ కీర్తిసురేశ్‌. లక్‌ అంటే కీర్తిదే అనాలి. అతి తక్కువ కాలంలోనే విజయ్, సూర్య, విక్రమ్‌ లాంటి టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించే అవకాశాలను దక్కించుకుంది. వరుస విజయాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. కీర్తి విజయ్‌కు జంటగా ఇంతకు ముందు భైరవా చిత్రంలో నటించింది. తాజాగా ఆయనతో 62వ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక సూర్యతో తానాసేర్నదకూట్టం చిత్రంలో రొమాన్స్‌ చేసింది. విక్రమ్‌కు జంటగా సామి– 2 చిత్రంలో నటిస్తోంది. ఇలా టాప్‌ హీరోలతో నటించిన విషయాలపై కీర్తి తెలుపుతూ విజయ్‌కు జంటగా భైరవా చిత్రంలో నటించానని, ఇప్పుడు ఆయన 62వ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తను రెండో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడాన్ని కొట్టిపారేశారు.

తాను మాత్రమే ఈ చిత్రంలో హీరోయిన్‌ అని తెలిపారు. విజయ్, విక్రమ్, సూర్యలకు జంటగా నటించడం వినూత్న అనుభవమన్నారు. విజయ్‌ చాలా ప్రశాంతంగా ఉంటారన్నారు. ఏ విషయాన్నైనా ఆయన్ని అడిగి తెలుసుకుంటానన్నారు. సూర్య కూడా శాంతస్వభావేనని, కాకపోతే ఎవరితో ఎక్కువగా మాట్లాడరన్నారు. ఏదైనా అడిగితే సమాధానం ఇస్తారన్నారు. అయితే విక్రమ్‌ వారిద్దరి కంటే డిఫరెంట్‌ అని పేర్కొన్నారు. అందరితో మాట్లాడుతూ, సరదాగా ఉంటారన్నారు. సెట్‌లో ఒక చోట నిల్చొరన్నారు. సామి– 2 చిత్రంలో నటి త్రిష కూడా ఉండాలని తాను కోరుకుంటానని అన్నారు. సామి– 2 చిత్రంలో కూడా త్రిషనే ప్రేక్షకులు చూడాలని కోరుకుంటారని దర్శకుడితో చెప్పానన్నారు. షూటింగ్‌ లేని సమయాల్లో కుటుంబ సభ్యులతో ఇంట్లో గడపాలని కో రుకుంటానని, కాళీ సమయాల్లో టీవీ చూడడం, నిద్రపోవడానికి సమయాన్ని కేటా యించడానికి ఇష్టపడతానని కీర్తీసురేశ్‌ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement