చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్‌ | Keerthy Suresh Picks Vijay Over Chiranjeevi In Best Dancer | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: కీర్తి సురేశ్ కామెంట్స్.. తప్పని ట్రోలింగ్

Published Fri, Aug 2 2024 7:24 AM | Last Updated on Fri, Aug 2 2024 9:04 AM

Keerthy Suresh Picks Vijay Over Chiranjeevi In Best Dancer

హీరోయిన్ కీర్తి సురేశ్ ఊహించని ట్రోలింగ్‌ని ఎదుర్కొంటోంది. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్స్ దీనికి కారణం. గత కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. 'రఘుతాత' అనే చిత్రాన్ని రిలీజ్‌కి రెడీ చేసింది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్.. చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పుకొచ్చింది. దీంతో రచ్చ షురూ అయింది.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

కీర్తి సురేశ్ విజయ్‌పై తనకున్న అభిమానం కొద్దీ విజయ్ పేరు చెప్పుండొచ్చు. కానీ మెగా అభిమానులు మాత్రం ఈమె కామెంట్స్‌ని తేలిగ్గా తీసుకోవట్లేదు. ఏ కోణంలో విజయ్ మంచి డ్యాన్సరో చెప్పాలని ట్రోల్స్, మీమ్స్ వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే విజయ్‌తో 'భైరవ', 'సర్కార్' అనే సినిమాల్లో కలిసి నటించింది. చిరంజీవితోనూ 'భోళాశంకర్' కోసం కీర్తి సురేశ్ కలిసి పనిచేసింది. 

(ఇదీ చదవండి: సినిమా కోసం నిర్మాతలతో గొడవ పెట్టుకున్న మృణాల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement