కథపైనే హీరోల దృష్టి
మారుతున్న కాలంతో మనమే కాదు సినిమాలు మారాలి, తప్పదు. లేకుంటే ఎంతటి పెద్ద హీరో చిత్రం అయినా, ఎంత బారీ బడ్జెట్ చిత్రం అయినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టే పరిస్థితి. టెక్నాలజీతో పాలు ప్రేక్షకుల నాలెడ్జ్ పెరగడంతో ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని చిత్రాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. ఎప్పటికీ సినిమాకు కథే కింగ్. అందులో వైవిధ్యం ఉం టేనే ఏ పాత్రదారులైనా అందుకు తగ్గట్టు నటించి మెప్పించగలరు. అయితే కొందరు ఇది గ్రహించకుండా హీరోల పైనో, భారీ హంగామాలపైనో ఆధారపడి చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారన్నది విజ్ఞుల మాట.
చిత్రాల విజయాల సంఖ్య వేళ్లల్లోనూ, అపజయాల సంఖ్య వందల్లోనూ ఉండడానికి ముఖ్య కారణం ఇదే. అదే సమయంలో చిన్న బడ్జెట్‌లో రూపొందిన మంచి కథా చిత్రాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కథానాయకుల్లో చాలా అవగాహన పెరిగిందని చెప్పవచ్చు. వారు కథలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా తమిళంలో హీరోలను తీసుకుంటే కథలలో వైవిధ్యం కోరుకుంటున్నారు. విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ కథానాయకులు పది మంది దర్శకుల కథలు విని అందులో ఒక్కటి ఎంపిక చేసుకుని నటిస్తున్నారు.అలా ఏడాదికి ఒక్క చిత్రం చేసినా పర్వాలేదనుకుంటున్నారు.
అంతే కాదు అం దులోని కథా పాత్రగా మారడానికి కావలసిన కసరత్తులన్నీ చేయడానికి శ్రమిస్తున్నారు. నటుడు విజయ్‌నే తీసుకుంటే 1992లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఆరంభ దశలో ఏడాదికి నాలుగైదు చిత్రా లు చేసేవారు. ఇప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలనే చేస్తున్నారు.ఇక నటుడు అజిత్‌కుమార్ 1993లో హీరోగా పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో ఈయ న ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేశారు. ఇప్పుడు ఏడాదికి ఒక్క చిత్రం కూడా చేయడానికి ఆలోచిస్తున్నారు అనే కంటే కథాబలం ఉన్న పాత్రల కోసం వేచి చూస్తున్నారని అనవచ్చు.అదే విధంగా నటుడు విక్రమ్ చాలా పోరాటం తరువాత ఇప్పటి స్థాయికి చేరుకున్న నటుడు.
ఈయన పాత్రకు జీవం పోయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేంతగా శ్రమిస్తారనడానికి ఒక ఐ చిత్ర మే ఉదాహరణ.విక్రమ్ కూడా చిత్ర కథల విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్నారు. ఇక నటుడు సూర్య కష్టాన్ని తక్కువ అంచనా వేయలేమ్. వైవిధ్యం కోసం తపించే నటుల్లో ఆయన ఒకరు. వారణం ఆయిరం,7ఆమ్ అరివు, ఇటీవల నటించిన 24లో లాంటి పలు చిత్రాలు ఆయన ఉన్నత నటనకు మచ్చుతునకులు. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇ లా హీరోలు కథే కింగ్‌గా భావిం చడం ఆహ్వానించదగ్గ పరిణామమే కదా.