గోవా వీధుల్లో హల్‌చల్ | Feisty Samantha bike-rides in Goa | Sakshi
Sakshi News home page

గోవా వీధుల్లో హల్‌చల్

Published Thu, Jan 1 2015 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

గోవా వీధుల్లో  హల్‌చల్

గోవా వీధుల్లో హల్‌చల్

నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలకు కాస్త విరామం దొరికితే ఏ విదేశాలకో, విహార యాత్రలకో చెక్కేస్తుంటారు. అయితే హీరోయిన్లలో కొందరు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతగా ఎడాపెడా చిత్రాలు చేసేస్తుంటారు. నటి సమంత బాణి చూస్తుంటే కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ చెన్నైది తమిళం, తెలుగు భాషలలో లైమ్‌టైమ్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా తెలుగులో మనం చిత్రంతోను, తమిళంలో కత్తి చిత్రంలోనూ విజయూలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
 
 తదుపరి ధనుష్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. క్రిస్మస్ పండుగను కూడా జరుపుకోలేనంతగా బిజీగా ఉన్న సమంత తాజాగా కాస్త విరామం దొరకడంతో కొత్త సంవత్సరాన్ని జాలీగా ఎంజాయ్ చేయడానికి స్నేహితురాలు, ప్యాషన్ డిజైనర్ నీరజ్‌కోనాతో కలిసి గోవా చెక్కేసింది. అక్కడ బీచ్ పరిసరాలు, వీధి రోడ్లలో స్వేచ్ఛగా విహరించేస్తోంది. అక్కడ తనగురించి ఎవరికీ తెలియదు కాబట్టి స్నేహితురాలితో విహంగజీవిలా టూ వీలర్ వాహనంపై తిరుగుతూ వినోదంగా గడిపేస్తోంది. ఆమె అక్కడ తీసుకున్న ఫొటోలను ఇంటర్‌నెట్‌లో పోస్టుచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement