bike-rides
-
వీరికి సరదా.. వారికి ప్రాణసంకటం
దేవనహళ్లి: కొందరి సరదా మరికొందరికి ప్రాణసంకటమవుతోంది. అయినా సరదారాయుళ్లలో మార్పు రావడంలేదు. ఈ కోవలోనే ఓ యువకుడి వీలింగ్(బైక్ విన్యాసాల) పిచ్చికి బాలిక బలైంది. హైదరాబాద్-బెంగళూరు రహదారిలోని దేవనహళ్లి తాలూకా బుళ్ళహళ్లి గేట్ వద్ద ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అంజలి అనే బాలిక తన తండ్రితో కలిసి మంచినీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ఖరీదైన బైక్‌తో వీలింగ్ చేస్తూ ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అంజలి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. వీలింగ్ చేస్తూ అతడి వెనుకే వచ్చిన మరికొందరు యువకులను సైతం పట్టుకుని కొట్టి వారి ఖరీదైన బైక్‌లను ధ్వంసం చేశారు. వీకెండ్స్‌లో బెంగళూరు నుంచి వచ్చే యువకులు నందికొండ వరకూ వీలింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వీలింగ్ను అరికట్టాలని ఎంతోకాలంగా పోలీసులకు విన్నవించుకున్నా వారు చర్యలు తీసుకోలేదని, ఈ ఘటనకు పోలీసులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు గంటపైగా రాస్తారోకో చేపట్టారు. విజయపుర పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గోవా వీధుల్లో హల్చల్
నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలకు కాస్త విరామం దొరికితే ఏ విదేశాలకో, విహార యాత్రలకో చెక్కేస్తుంటారు. అయితే హీరోయిన్లలో కొందరు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతగా ఎడాపెడా చిత్రాలు చేసేస్తుంటారు. నటి సమంత బాణి చూస్తుంటే కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఈ చెన్నైది తమిళం, తెలుగు భాషలలో లైమ్‌టైమ్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. తాజాగా తెలుగులో మనం చిత్రంతోను, తమిళంలో కత్తి చిత్రంలోనూ విజయూలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన పత్తు ఎండ్రదుక్కుళ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తదుపరి ధనుష్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. క్రిస్మస్ పండుగను కూడా జరుపుకోలేనంతగా బిజీగా ఉన్న సమంత తాజాగా కాస్త విరామం దొరకడంతో కొత్త సంవత్సరాన్ని జాలీగా ఎంజాయ్ చేయడానికి స్నేహితురాలు, ప్యాషన్ డిజైనర్ నీరజ్కోనాతో కలిసి గోవా చెక్కేసింది. అక్కడ బీచ్ పరిసరాలు, వీధి రోడ్లలో స్వేచ్ఛగా విహరించేస్తోంది. అక్కడ తనగురించి ఎవరికీ తెలియదు కాబట్టి స్నేహితురాలితో విహంగజీవిలా టూ వీలర్ వాహనంపై తిరుగుతూ వినోదంగా గడిపేస్తోంది. ఆమె అక్కడ తీసుకున్న ఫొటోలను ఇంటర్నెట్లో పోస్టుచేసింది.