కన్నీటి వీడ్కోలు | Celebrities pay tributes to K. Balachander | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Published Thu, Dec 25 2014 2:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

కన్నీటి వీడ్కోలు - Sakshi

కన్నీటి వీడ్కోలు

 తమిళసినిమా:దర్శక శిఖరం, తమిళ చిత్ర పరిశ్రమ దర్శక దిగ్గజం గా, అభిమాన, గౌరవ, మర్యాదలను అందుకున్న దర్శక పితామహుడు కె.బాలచందర్ భౌతిక కాయానికి యావత్ సినీ కుటుంబం బాధాతప్త హృదయంతో ఘన నివాళి అర్పించింది. బాలచందర్ సాధనలను, అసాధారణ వెండితెర ఆవిష్కరణలను కన్నీటితో కీర్తించింది. ‘స్త్రీ’ అనే సున్నితమైన హృదయ పుస్తకం చదివి ఆ మనోభావాలను నిర్భయంగా సినిమా రూపంలో ప్రపంచానికి చూపించిన దర్శక సవ్యసాచి బాలచందర్. సరాసరి చిత్రాలకు దూరంగా తన చిత్రాలు ఎంతో కొంత మేలు చేయాలి.
 
 సందేశం ఉండాలని తపించిన కళాతృష్ణ బాలచందర్. తమిళ సినిమాకు జాతీయస్థాయిలో గౌరవాన్ని సాధించిన మేటి దర్శకుడు. బాలచందర్ ప్రతి చిత్రం ఒక కళాఖండమేనని చెప్పడం అతిశయోక్తి కాదు.కళాత్మక చిత్రాలైనా కాసుల వర్షం కురిపించడంలో గురి తప్పని చిత్రాలు. ఎందరో కళాకారులకు సృష్టికర్తగా, ఎందరో కళాకారులకు స్ఫూర్తిదాయకంగా మరెంరదికో అత్యున్నత స్థారుు జీవితాలను ప్రసాదించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు గొప్ప చిత్రాలను నిర్మించారు. అంతటి దర్శక శిఖరం నేలకొరగడం,  చిత్ర పరిశ్రమకే కాదు యావత్ భారత సినీలోకానికి తీరనిలోటని తారలు ఉద్ఘాటిస్తున్నారు.
 
 సినీచరిత్రలో నూతన అధ్యాయానికి నాంది బాలచందర్. సినిమాను మరో కొత్త కోణంలో ఆవిష్కరించిన ఘనత ఆయనది. దర్శక శిఖామణి భౌతిక కాయూలనికి నివాళులర్పించడానికి సినీ రాజకీయ, అభిమాన లోకం తరలివచ్చింది. ఆయన శిష్యగణం శోక సంద్రంలో మునిగిపోయింది. నివాళులర్పించిన ప్రముఖుల్లో డీఎంకే నేత కరుణానిధి, స్టాలిన్, పుదియ తమిళ కట్చి నేత ఎ.సి.షణ్ముగం, పొన్ముడి, దురైమురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, డీఎండీకే నేత విజయకాంత్ తిరుమావళవన్, కుష్బూ వంటి రాజకీయ నాయకులన్నారు.
 
 ఇంకా సినీ పరిశ్రమలో అగ్రస్థారుులో వెలుగొందిన రజనీకాంత్, లత రజనీకాంత్, శరత్ కుమార్, రాధిక, శివకుమార్, విజయ్, ధనుష్, ముక్తాశ్రీనివాస్, ఎ.వి.ఎం శరవణన్, టి.రాజేంద్రన్, ఎస్.జె.సూర్య, కార్తి, ఎస్.పి.ముత్తురామన్, పి.వాసు, శంకర్, కె.ఎస్.రవికుమార్, ధారణి, లింగుసామి, పేరరసు, వసంత్, సత్యరాజ్, జయరాం, వివేక్, ఆర్.సి. శక్తి, వాగై చంద్రశేఖర్, రాధారవి, కె.రాజన్, నటి మనోరమ, శ్రీప్రియ, సరిత, విమలారామన్, నిరోషా, సరస్వతి, ఆర్.కె. సెల్వమణి, ప్రభు సాలమన్, నిర్మాత ధాను, ఆర్.బి.చౌదరి, తమిళచ్చి తంగపాండియన్, కె.ఆర్, వైజీ మహేంద్రన్, డ్రమ్స్ శివమణి, ప్రతాప్ పోతన్, దేవా, శ్రీకాంత్ దేవా, చో.రామస్వామి, నల్లి కుప్పుసామి, మణిరత్నం, సుహాసినీ, కుష్బూ, విజయకుమార్ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
 
 కె.బాలచందర్ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు అభిమానుల కోసం స్థానిక మైలాపూర్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు. భార్య రాజ్యం, కూతురు పుష్పా కందసామి, శోఖ సంద్రంలో మునిగిపోయారు. కొడుకు ప్రసన్న శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలచందర్ అంత్యక్రియలు బీసెంట్ రోడ్డులో గల శ్మశాన వాటికలో జరిగాయి. వేలాదిమంది సినీ ప్రముఖులు, అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
 
 తమిళ సినిమాకు మలుపు
 తమిళ సినిమాను కొత్త మలుపు తిప్పిన దర్శకుడు కె.బాలచందర్. జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన దర్శకుడు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన చిత్రాలు సజీవ సాక్ష్యాలు. సినిమా ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి గుర్తుండిపోతుంది. బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
 - కరుణానిధి, డీఎంకే అధినేత
 
 నన్ను నేను కోల్పోయాను
 నన్ను నేను కోల్పోయాను. బాలచందర్ మనిషిగా జీవించిన దేవుడు. నన్పెప్పుడూ నటుడిగా చూడలేదు. తన కొడుకుగానే భావించే వారు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఈ సినిమా పరిశ్రమ చూడలేదు.
 -  నటుడు రజనీకాంత్
 
 వెతికి వెళ్లి అభినందించేవారు
 నేను చదువుకుంటున్న రోజుల్లోనే బాలచందర్ చిత్రాలు చూసి అబ్బురం చెందేవాడిని. మూడు దశాబ్దాల పాటు ప్రఖ్యాత దర్శకుడిగా వెలుగొందడం అసాధ్యం. నేనైతే 15 ఏళ్లు దర్శకుడిగా రాణిస్తే చాలనుకుంటున్నా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శక శిఖరం బాలచందర్. దర్శకులకే దర్శకుడాయన. మంచి విషయం అనిపిస్తే వెతుక్కుంటూ వె ళ్లి అభినందించే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. బాలచందర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
 - దర్శకుడు శంకర్
 
 జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి
 దర్శక శిఖరం కె.బాలచందర్ జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి. ఆయన చేతివేళ్లు పట్టుకుని ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగారు. బాలచందర్ భౌతికంగా లేకపోయినా ఆయన మధురజ్ఞాపకాలు భవిష్యత్ తరాలను సజీవంగా వెంటాడతాయి.
 - నటీనటుల సంఘం అధ్యక్షుడు  శరత్‌కుమార్
 
 ‘అరంగేట్రం’తోనే బలమైన నిర్ణయాలు
 తమిళ సినిమాలో నటులుగా ఎమ్జీఆర్, శివజీగణేశన్ ఎంతగొప్పవారో దర్శకులు బాలచందర్ అంత గొప్పవారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు బాలచందర్ పరిచయం చేసిన మాట వాస్తవమే. అయితే అంతకు ముందే నాగేష్ లాంటి నటుడిని కథానాయకుడిగా పరిచయం చేసిన గట్స్ ఉన్న దర్శకుడాయన. అరంగేట్రం చిత్రం తరువాత బాలచందర్ పొగతాగరాదని, స్త్రీ ఇతివృత్తంలో పలు చిత్రాలు తీసిన ఘనత బాలచందర్‌కే దక్కుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
 - నటుడు శివకుమార్
 
 అద్భుత దర్శకుడు
 బాలచందర్ చిత్రాలు అఖిల భారత స్థాయిలో కీర్తి కిరీటాలు పొందాయి. అంత గొప్ప చిత్రాలు తీసిన అద్భుత దర్శకుడాయన. బాలచందర్ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని విన్నపం
 - సీనియర్ దర్శకుడు మహేంద్రన్
 
 అంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా బాలచందర్ కవితాలయ సంస్థ నిర్మించిన అన్నామలై చిత్రంతోనే సంగీత దర్శకుడిగా నా స్థారుు పెరిగింది.
 - సంగీత దర్శకుడు దేవా
 
 నాకు మార్గదర్శి
 భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శక దిగ్గజం కె.బాలచందర్. నేనుచదివిన అన్నామలై, కళాశాలలోనే నాకన్నా ముద్ర చదివి నాకు మార్గదర్శిగా నిలిచారు. ఎవరేమనుకున్నా తన మనసులోని భావాలను నిర్భయంగా వెండితెరపై ఆవిష్కరించి విజయం సాధించిన దర్శకుడు. అలాంటి దర్శకుడు మరణం సినీ లోకాన్ని శోక సముద్రంలో ముంచింది.
 - నటుడు టి.రాజేందర్
 
 ఇక ముందు చూడలేం
  బాలచందర్ అంత గొప్ప దర్శకుడ్ని ఇక  ముందు చూడలేం. ఆదిలోనే నా నవగ్రహ నాటకం ప్రదర్శన చూసి చాలా బాగుందని అభినందించారు. అంత ఉన్నత మనసు ఆయనది.
 - నటి మనోరమ
 
  చిత్ర పరిశ్రమకు తీరని లోటు
 బాలచందర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక ధృవతార రాలిపోయింది. మధ్య తరగతి కుటుంబాల జీవిన శైలిని కళ్లకు కట్టినట్లు చూపించడంలో బాలచందర్ సిద్ధహస్తులు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సంఘానికి, దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా సేవలు చేసిన ఏకైక వ్యక్తి బాలచందర్. ఆయన ఆత్మకు శాంతికలగాలని వారి కుటుంబానికి ఆయన లేని కష్టాన్ని భరించే ధైర్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 - కాట్రగడ్డ ప్రసాద్ (సౌత్ ఇండియన్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement