K. Balachander
-
సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు.. దటీజ్ కమల్
టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్ షాపులో పని చేశాడు కమల్‌హాసన్. గ్రూప్ డాన్సర్‌గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్‌హాసన్ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో. ‘మీ పక్కన కాస్తంత చోటివ్వండి’ అంటాడు కమల్‌హాసన్ ‘సాగర సంగమం’లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. ‘స్టార్’ లేదా ‘యాక్టర్’ రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్‌గా ఉంటూ స్టార్ అయినవాడు కమల్‌హాసన్. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది. నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించినవారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు. బాల్యంలో ఉన్న ఈజ్ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్‌హాసన్. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు. ‘సొమ్మొకడిది సోకొకడిది’ సినిమాలో ‘ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా’ అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్ మొదటి లైన్ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యుయాన్సెస్ అంటారు దీనిని. కళ అంటేనే అది. ‘సాగర సంగమం’ సూపర్ డూపర్ హిట్ అయ్యాక కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ తీశారు. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’ పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్ కూడా ‘ఈ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేద్దాం’ అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్ ‘సార్... ఈ పాటకు నేను డాన్స్ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు’ అన్నారట. అదీ కమల్. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్ వేసిన వచ్చీ రాని స్టెప్స్‌ను లోకం మురిసిపోయి చూసింది. కమల్ చార్లీ చాప్లిన్‌ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. ‘డాన్స్‌మాస్టర్’లో స్వయంగా చాప్లిన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్ విలియమ్స్ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు. మంచి నటుడు బ్లాటింగ్ పేపర్ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. ‘గాడ్‌ఫాదర్’ను మోడల్‌గా పెట్టుకుని మణిరత్నం ‘నాయకుడు’ తీశాడు. గాడ్‌ఫాదర్‌లో మార్లెన్ బ్రాండో చేసింది గొప్పదే. ‘నాయకుడు’లో కమల్ చేసింది కూడా గొప్పే. కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్ చేసింది ఒక సిలబస్. కమల్ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్‌లు రాని రోజుల్లోనే ‘సత్యమే శివం’ వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం. కమల్ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్‌స్టార్. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. ‘మరో చరిత్ర’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’ కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్ నటుడైన దిలీప్ కుమార్ కామిక్ టైమింగ్ అద్భుతం. అమితాబ్ కామెడీకి తిరుగు లేదు. కమల్ కామెడీ చేసి ‘పుష్పక విమానం’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్’, ‘తెనాలి’... లిస్టు పెద్దది. ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్‌ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్ అయిన కోవై సరళతో ‘సతీ లీలావతి’ చేసి హిట్ కొట్టాడు కమల్. సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్ ఫ్లాప్స్ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్‌గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో ‘విక్రమ్’ వంటి హిట్ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్‌డే.(నవంబర్ 7న కమల్‌హాసన్ బర్త్‌డే) -
ప్రముఖ దర్శకుడి విగ్రహావిష్కరణ
చెన్నై: ప్రఖ్యాత సినీ దర్శక దిగ్గజం కే.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఆయన సొంత ఊరు అయిన తిరువారూర్ జిల్లాలోని నలమాంగుడిలో నెలకొల్పారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రముఖ గీతరచయిత వైరముత్తు ఆయన మిత్రబృందం నిర్వహంచిన ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నం, వసంత్ తదితర సినీ ప్రముఖులతో పాటు కె.బాలచందర్ సతీమణి రాజ్యం, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతర చయిత వైరముత్తు మాట్లాడుతూ సినీదిగ్గజం కె.బాలచందర్ స్టార్స్ అంతస్తును మించిన ఖ్యాతిని గడించారని కీర్తీంచారు. ఆయన జీవితాన్ని యువత పాఠంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
జ్ఞాపకాలు హౌస్‌ఫుల్
దేవుడు కట్ చెప్పాడు. విధాత కదా... చెబుతాడు. ప్రేక్షకులం కదా... మనం నొచ్చుకుంటాం. ఇంకో వంద సీన్లుంటే బాగుండు... అనుకుంటాం. చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలిచ్చినా దాసరి లేకపోవడాన్ని భరించలేకపోతున్నాం. మానవ సంబంధాలను అల్లి... తెలుగు సినిమాకు కండువాగా వేసి వెళ్లిన దర్శకుడు... దార్శనికుడు దాసరి. దాసరి గారూ... మీరూ– మీ సినిమా మీరూ – మీ ప్రేమ మీరూ – మీ పరంపర ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ హార్ట్‌ఫుల్... హౌస్ ఫుల్. ఆకాశ దేశాన... ఆషాఢ మాసాన... డైలాగులతో పైకి వచ్చిన దాసరి పాటను పట్టుకున్నాడట. సంగీత ప్రధానమైన సినిమా తీస్తున్నాడట. ‘ఆ.. ఆయన వల్ల కాదు’ అనుకున్నారు ప్రత్యర్థులు. ‘మేఘసందేశం’ రిలీజైంది. అవును... డైలాగులనే నమ్ముకున్న దాసరి అసలు డైలాగులకే ప్రాధాన్యం ఇవ్వకుండా గొప్ప భావుకత్వంతో సంగీత ప్రధానంగా సినిమా తీయగలడని నిరూపించుకున్నాడు. ఆ సమయంలోనే ఒక తమిళ దర్శకుడు ఈ సినిమా గురించి విని దాసరితో కలిసి ప్రత్యేకంగా ఆ సినిమాను చూశాడు. సినిమా పూర్తయ్యాక ‘ఇన్స్పైర్ అయ్యాను నారాయణరావ్’ అని మెచ్చుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఆయన తమిళంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను తీశాడు. దాని పేరు ‘సింధుభైరవి’. ఆ దర్శకుడు కె. బాలచందర్. … తమిళంలో వచ్చిన గొప్ప దర్శకుడు శంకర్. భారీ సినిమాలు జనరంజక సినిమాలు తీయడంలో పేరు సాధించాడు. ఆయన కమలహాసన్‌తో ఒక సినిమా తీశాడు. స్వాతంత్య్ర సమరయోధుడొకడు వర్తమాన సమాజంలో పేరుకునిపోయిన అవినీతిని చూసి దాని మీద పోరాటం మొదలుపెడతాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. చాలా డబ్బు సంపాదించింది. కాని – దాసరి నారాయణరావు అదే సినిమాను చాలా కాలం క్రితమే తీసేశారు. పేరు సర్దార్ పాపారాయడు. అలాంటి కథాంశమే శంకర్ చేతిలో పడి ‘భారతీయుడు’గా బయటికొచ్చింది. … పి.వాసు అంటే తమిళంలో పెద్ద దర్శకుడు. రజనీకాంత్‌ను హీరోగా పెట్టి, విజయశాంతిని హీరోయిన్గా పెట్టి ‘మన్నన్’ అనే సినిమా తీశాడు. తమిళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. దానిని తెలుగులో చిరంజీవితో ‘ఘరానా మొగుడు’ అని రీమేక్ చేస్తే ఇక్కడా పెద్ద హిట్. కాని ఈ సినిమాను కన్నతండ్రి దాసరినారాయణరావే. కృష్ణంరాజు కార్మికవర్గ నాయకుడిగా, జయప్రద ఫ్యాక్టరీ యజమానిగా ఆయన తీసిన ‘సీతారాములే’ మళ్లీ తారలను మార్చుకుని తెర మీదకు వచ్చింది. … మణిరత్నం గ్రేట్ డైరెక్టరే. ‘దళపతి’ సినిమా తీశాడు. ఈ కథ భారతంలో కర్ణుడి ఉదంతం. కాని దాసరి నారాయణరావు ఇంకా గ్రేట్. దాని కంటే చాలా ఏళ్ల ముందే అదే కథాంశాన్ని ‘కటకటాల రుద్రయ్య’గా తీశారు. హుందాగా బతికారు... అలానే వెళ్లిపోయారు-మోహన్‌బాబు గురువుగారు హఠాత్తుగా ఇలా కనుమరుగవుతారని ఊహించలేదు. ఆయనకు కూడా ఎలాంటి సందేహం లేదు. ఆపరేషన్ చేయించుకుని, ఇంటికి వచ్చేస్తా అనుకునేవారు. మొదటిసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆయన ఇంటికి తిరిగొచ్చాక నేను ప్రతి రోజూ వెళ్లకపోయినా ఫోన్ చేసి, క్షేమసమాచారాలు తెలుసుకునేవాణ్ణి. అప్పుడప్పుడూ వెళుతుండేవాణ్ణి. అప్పుడు ‘ఇదిగో నిలబడ్డా చూడు.. నడుస్తున్నాను కూడా’ అని నాలుగు అడుగులు వేసి, చూపించేవారు. ఒకవేళ అలా చేయకపోతే, ‘ఏంటి గురువుగారూ.. నిలబడాలి, నడవాలి’ అని దబాయించేవాణ్ణి. అప్పుడు నడవడానికి ప్రయత్నించేవారు. ఆయన చాలా హుందాగా బతికారు. గురువుగారి అంతిమ క్రియలు కూడా అంతే హుందాగా జరిగాయి. అది నాకు తృప్తిగా ఉంది. ఆయన మరణవార్త విన్న వెంటనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి విషయం తెలియజేశారు. కేసీఆర్‌గారు గురువుగారి పట్ల చూపించిన మర్యాద అద్భుతం, అమోఘం. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హాస్పిటల్ నుంచి ఇంటి వరకు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఇంటి దగ్గర విపరీతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. ప్రభుత్వ లాంఛనాలతో దాసరిగారి అంత్యక్రియలను నిర్వహించారు. ఒక వ్యక్తిని ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయాలంటే కేబినేట్ మీటింగ్ పెట్టాలని ఇంకోటని... ఇంకోటని రకరకాలు చెప్పి, తప్పించుకుంటారు. కానీ, విషయం తెలిసిన కాసేపటికి అన్నీ ఏర్పాటు చేశారు. మా గురువుగారి పట్ల చూపించిన ఆదరాభిమానాలను నేను మరచిపోలేను. … దర్శకులు చాలా మంది ఉండొచ్చు. దాసరి నారాయణరావు మాత్రం ‘దర్శకులకే దర్శకుడు’ . … చిత్ర పరిశ్రమలో ఒక ఘనమైన పరంపర ఉంది. అది ప్రొడక్షన్ హౌస్‌ల పరంపర. ఇది వాహినివారి చిత్రం... ఇది విజయా వారి చిత్రం... ఇది ఏవీఎం వారి చిత్రం... సినిమా– ప్రొడక్షన్ హౌస్ వారిది. పోస్టర్ మీద ప్రొడక్షన్ హౌస్ ఎలివేట్ అవుతుండేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఎలివేట్ అయ్యేవారు. దర్శకుడు అనేవాడు ఆ ప్రొడక్షన్లో ఒక ఉద్యోగి హోదాలో ఉండేవాడు. ఈ పరంపరలో ఉంటూనే తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న దర్శకుడు కె.వి.రెడ్డి. మరో నలుగురైదుగురు ఈ స్థాయికి దగ్గరగా ఉన్నా పోస్టర్ మీద పేరును పైకి చేర్చిన తెలుగు దర్శకుడు మాత్రం దాసరి నారాయణరావు. తమిళంలో ఆయన కంటే కొద్దిగా ముందు కె.బాలచందర్ ఇదే పనిని చేశాడు. పోస్టర్లో ఒక ‘ఫిల్మ్ ముక్క’లో ఆయన పేరు కనిపిస్తే ఇక్కడ తెలుగులో ఒక ‘మబ్బు తుంట’లో దాసరి నారాయణరావు పేరు కనిపించేది. ఓడలో ఎవరు ఏ అంతస్తులో ఉన్నా కెప్టెన్ పై అంతస్తులో ఉండి ఓడను నడిపిస్తాడు. సినిమాలో దర్శకుడిది కూడా పై స్థానమే అని దాసరి చిత్ర పరిశ్రమకు చెప్పగలిగారు. నిర్మాత గౌరవం నిర్మాతకు ఇస్తూ దర్శకుడుగా తాను పొందాల్సిన గౌరవాన్ని పొందినవారు దాసరి నారాయణరావు. అంతేకాదు భిన్న శాఖలను ఒక్క మనిషే నిర్వహించవచ్చు అని ఆయన నిరూపించారు. సాధారణంగా ఒకప్పుడు దర్శకుడంటే కథ కోసం ఒక మనిషి దగ్గరకు, మాటల కోసం మరో మనిషి దగ్గరకు, పాటల కోసం వేరో మనిషి దగ్గరకు, స్క్రీన్ ప్లే కోసం ఇంకో మనిషి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దాసరి నారాయణరావు వచ్చి అవన్నీ తానే చేసుకోగలను అని చేసి చూపించారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి నారాయణరావు అని టైటిల్స్ చివర పడటం ప్రేక్షకులు అబ్బురంగా చూడటం మొదలుపెట్టారు. నా ఫ్యామిలీకి మంచి గైడ్-జయసుధ కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకున్నాను. అందుకే మే 29న నేను విదేశాలకు వెళ్లాను. 30న దాసరిగారు చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసేసరికే ఆలస్యం అయింది. చివరి చూపు కోసం వచ్చేద్దామంటే నేనిక్కడికి వచ్చే లోపే ఆయన అంతిమ క్రియలు జరుగుతాయని తెలిసింది. చాలా బాధపడ్డాను. దాసరిగారు నా కుటుంబానికి పెద్దదిక్కు లాంటివారు. ఆయన నాకు ‘ఫాదర్ ఫిగర్’. నా లైఫ్‌కి గైడ్. నితిన్‌గారికి, నాకూ పెళ్లి చేసింది ఆయనే. దాసరిగారి దగ్గరే మా ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా చేసేవారు. అప్పుడే మేము ప్రేమలో పడ్డాం. మాకు అండగా దాసరిగారు నిలబడ్డారు. అప్పటి నుంచి మాకే సమస్య వచ్చినా ఆయన దగ్గర చెప్పుకునేవాళ్లం. మా ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయినప్పుడు దాసరిగారు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. కానీ, నితిన్‌గారు డిప్రెషన్ నుంచి బయట పడలేకపోయేవారు. నితిన్‌గారి మరణం నాకు పెద్ద షాక్ అయితే... దాసరిగారి మరణం ఇంకో షాక్. బహుశా నేనిక్కడ ఉండి ఉంటే... ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయి ఉండేదాన్ని. అందుకే ఆ దైవమే నన్ను తీర్థయాత్రలకు పంపించాడేమో అనిపిస్తోంది. దాసరిగారు దూరం కావడం ద్వారా ఇండస్ట్రీలో ఓ ‘పెద్ద వాయిస్’ మిస్ అయింది. ఇతరుల కోసం ఫైట్ చేసేవాళ్లు ఎవరున్నారు చెప్పండి? ఈ భూమ్మీద నిర్వహించాల్సిన పనులన్నింటినీ ఆయన సక్రమంగా చేశారు. బతికి ఉండగానే దాసరిగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. ఇతరుల కోసం జీవించారు. అందరి మనసుల్లో జీవించే ఉంటారు. … ఒక గురువును గురువు అని చెప్పాలంటే ఆయన పరంపర ఎలా సాగుతుందనేది చూడాలి. చరిత్రలో కొందరు గొప్పవారు తమ పరంపరను కొనసాగించగలిగే శిష్యులను ఇవ్వలేదు. దర్శకులలో కూడా బాపు, కె.విశ్వనాథ్, వంశీ వంటివారు తాము నిత్య విద్యార్థులుగా ఉంటూ శిష్యపరంపరను కొనసాగించే ఆనవాయితీకి దూరంగా ఉన్నారు. కాని దాసరి నారాయణరావు అలా కాదు. ఒక ఫ్యాక్టరీని స్థాపించినట్టుగా శిష్యులను ఉత్పత్తి చేశారు. ఒక దర్శకుడు వంద సినిమాలు తీయడం అతి గొప్ప. దాసరి ఆ ఘనతను చిటికెలో సాధించారు. ఆ దర్శకుడి శిష్యుడు కూడా వంద సినిమాలు తీయడం విడ్డూరం. కాని కోడి రామకృష్ణ ఆ ఘనతను సాధించి గురువుకు దక్షిణ చెల్లించారు. వంద సినిమాలు తీసిన గురుశిష్యులు భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే లేరు. కోడి రామకృష్ణ అనే ఏముంది రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎం.ఎస్.కోటారెడ్డి. ధవళ సత్యం, రాజా చంద్ర ఇలా ఎందరో దర్శకులు దాసరి దగ్గర తయారయ్యారు. దర్శకత్వం జోలికి రాకుండా కో డైరెక్టర్లుగా వెలిగినవారు మరెందరో. ఆయన శ్రామికుల హీరో -జయప్రద దాసరిగారి గురించి మాట్లాడాలంటే ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. ఆయనకు ఆపరేషన్ జరిగే ముందు ఆస్పత్రికి వెళ్లి, కలిశాను. ‘‘మంచి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు సార్.. గెట్ వెల్ సూన్’’ అంటే, ‘‘అలాగే’’ అని నవ్వారు. కాసేపయ్యాక ‘‘నీకు ఫ్లైట్‌కి టైమ్ అవుతోంది కదా... వెళ్లు... ఏం ఫర్వాలేదులే జయా’’ అన్నారు. దాసరిగారితో నేను మాట్లాడిన చివరి మాటలవే. నేను ఆయన్ను కలవడం అదే చివరిసారి అవుతుందనుకోలేదు. దాసరిగారు చనిపోయినప్పుడు ఇక్కడ లేను. చివరి సారి చూద్దామనుకుంటే ఫ్లైట్ టికెట్స్ దొరక్క రాలేకపోయాను. అందుకే ఈ రోజు పెద్ద కర్మను మిస్ కాకూడదనుకున్నా. దాసరిగారు పైకి గంభీరంగా కనిపించే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు. ‘విశ్వనాథ నాయకుడు’ షూటింగ్ అప్పుడు నేను ఒకరోజు ఆలస్యంగా షూటింగ్‌కి వెళ్లాను. సాంగ్ షూట్ అన్నమాట. మేకప్ హెవీగా చేసుకోవాల్సి వచ్చింది. హెయిర్ సై్టల్‌కి చాలా టైమ్ పట్టేసింది. లొకేషన్‌కి వెళ్లాక, దాసరిగారు ఏం మాట్లాడలేదు. సాంగ్ షూట్ మొదలైంది. డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్స్ వేయడం మొదలుపెట్టాను. మాస్టర్ ‘ఓకే’ అంటున్నారు కానీ, దాసరిగారు మాత్రం ‘కట్’ అనేవారు. అలా పదీ పదిహేను టేక్స్ అయ్యాయి. దాంతో ‘సార్.. మాస్టర్ చెప్పినట్లే చేస్తున్నాను కదా.. ఏదైనా ప్రాబ్లమా?’ అనడిగితే, గట్టిగా నవ్వేశారు. ‘‘నువ్వు లేట్‌గా వచ్చావు కదా జయా.. అందుకే’’ అన్నారు. నా మీద అలిగారని అప్పుడు అర్థమైంది. ఇద్దరం నవ్వుకున్నాం. లొకేషన్‌కి వెళ్లగానే, ‘ఏంట్రా జయా... ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించేవారు. ఇక ఆ పిలుపు వినపడదంటే బాధగా ఉంది. దాసరిగారు శ్రామికుల హీరో. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. … కొందరు నటులు కొందరు దర్శకులకు సూట్ అవుతారు. లేదా కొందరు దర్శకులు కొందరు నటులకు సూట్ అవుతారు. దాసరి కూడా కొందరు నటీనటులతోనే ఎక్కువగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించారు. కమెడియన్‌గా ఉన్న రాజబాబు అంటే దాసరికి ఇష్టం. ఆయనను దాసరి ‘తాత–మనవడు’, ‘తిరుపతి’, ‘యవరికి వారే యమునా తీరే’ సినిమాలలో హీరోగా చేశారు. మురళీమోహన్ సినీ జీవితంలో స్థిరపడటానికి కారణం దాసరి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ప్రభంజనంలో మురళీమోహన్ తనకుంటూ సినిమాలు మిగుల్చుకోగలిగారంటే దాసరి వాత్సల్యమే కారణం. దాసరి– మురళీమోహన్ కాంబినేషన్లో ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘ముద్దబంతిపువ్వు’, ‘ఓ మనిíషీ తిరిగి చూడు’, ‘ఇదెక్కడి న్యాయం’, ‘అద్దాల మేడ’ వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక మోహన్‌బాబుకు సినిమా జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలుసు. దాసరి–మోహన్‌బాబు కాంబినేషన్లో ‘స్వర్గం–నరకం’, ‘శివరంజని’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘ప్రేమాభిషేకం’, ‘దీపారాధన’ వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఆర్.నారాయణమూర్తి, శ్రీహరి, ఈశ్వరరావు... వీరంతా దాసరి నీరు పోసి పెంచిన మొక్కలు. కాని దాసరి అనగానే వెంటనే తలుకోవడానికి వచ్చే పేరు అక్కినేనే. ఒక సందర్భంలో కె.రాఘవేంద్రరావు– ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమాలు ఎక్కువగా వచ్చేవి. పారలల్‌గా దాసరి–అక్కినేని కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు వచ్చేవి. రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ ఇస్తే దాసరి అక్కినేనితో ‘ప్రేమాభిషేకం’ ఇచ్చారు. రాఘవేంద్రరావు ‘జస్టిస్ చౌదరి’ ఇస్తే దాసరి ‘రాముడు కాదు కృష్ణుడు’ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాల్లో యాక్షన్, గ్లామర్ ఉంటే దాసరి సినిమాల్లో మెసేజ్, డ్రామా ఉండేది. తెలుగులో కమర్షియల్ సినిమా తరాజును దాసరి ఎప్పుడూ తన సినిమాలతో సరిచేస్తూ ఉండేవారు. తెలుగు సినిమాల్లో కథ అంటూ ఒకటి బతికి ఉండటానికి దాసరి చాలా ముఖ్యమైన ఒక కారణం. … దాసరి తన జీవిత కాలంలో ఒక రోత పుట్టించే హారర్ సినిమా తీయలేదు. తన జీవిత కాలంలో ఒక అశ్లీలమైన మాటను రాయలేదు. తన జీవితకాలంలో కుటుంబాలు చూడటానికి ఇబ్బంది పడే సినిమా తీయలేదు. తెలంగాణ భాషను కొందరు కొన్ని సినిమాల్లో వినోదానికీ విలనిజానికీ వాడుకుంటే దాసరి తెలంగాణ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేశారు. తెలం గాణ గొప్పతనం చూపే ‘ఒసే రాములమ్మ’, ‘సమ్మక్క–సారక్క’ సినిమాలు తీశారు. వర్కింగ్ క్లాస్ అంటే దాసరికి ముందు నుంచి అభిమానమే. అందుకే ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘ఏడంతస్తుల మేడ’, ‘సూరిగాడు’, ‘ఎంకన్నబాబు’, ‘ఒరేయ్.. రిక్షా’, ‘మేస్త్రీ’ వంటి సినిమాలు తీశారు. ఇక ఆయన స్త్రీ పక్షపాతి. ఆడవాళ్ల కోసం తీసిన సినిమాలకు లెక్క లేదు. ‘బంట్రోతు భార్య’, ‘రాధమ్మ పెళ్లి’, ‘యవ్వనం కాటేసింది’, ‘కన్యాకుమారి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘స్వప్న’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘కాంచనసీత’, ‘అమ్మ రాజీనామ’, ‘అక్క పెత్తనం–చెల్లెలి కాపురం’, ‘కంటే కూతుర్నే కను’... ఇన్ని సినిమాలు తీశారు. ఆయన చిన్న సినిమాల పెద్ద దర్శకుడు. పెద్ద సినిమాల పెను దర్శకుడు. మీడియం బడ్జెట్ ఆయనకు కొట్టిన పిండి. ఓవర్ బడ్జెట్ ఆయన డిక్షనరీలో లేదు. … దాసరి నారాయణరావు మే 30న మరణించారు. కాని ఆయన అసలైన ఘన జీవితం ఆ రోజు నుంచే తిరిగి ప్రారంభమైంది. కొత్త తరాలు, భావితరాలు ఈ దర్శక శిఖరాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం, ఆయన వేసిన దారిని తిరిగి కనగొనడం, ఆ సాధించిన ఘన విజయాలను పునర్ మూల్యాంకనం చేయడం ఇప్పుడే సరిగ్గా మొదలవుతుంది. మహారథం ఆగినప్పుడే అది ఎంత దూరం ప్రయాణించిందో అంచనాకొస్తుంది. … దాసరి సినీ ఘనతను ఇప్పుడు సరిగ్గా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. ఆయన పేరున ఒక యూనివర్సిటీని తెరవాల్సిన సందర్భం వచ్చింది. దాసరి అనే పేరు వెలుతురులో ఎన్నో కొత్త తారలు, కలాలు, దర్శక దివ్వెలు వెండితెరను వెలిగించాల్సిన సన్నివేశం వచ్చింది. అది జరిగినప్పుడే ఆ దర్శకుడికి అది సినీ పరిశ్రమ అర్పించే ప్రేమాభిషేకం అవుతుంది. నిజమైన కృతజ్ఞతాభివందనం అవుతుంది. వందనం అభివందనం దాసరికి స్మరణాభి వందనం. ఆయన ఓ ఇన్స్టిట్యూషన్ దాసరిగారి డైరెక్షన్లో నేను పది సినిమాల వరకు చేశాను. ఆయనతో నేను చేసిన ఫస్ట్ మూవీ ‘బహుదూరపు బాటసారి’. మల్టీస్టారర్ మూవీ అన్నమాట. దాసరిగారి సినిమాల గొప్పతనం ఏంటంటే.. చిన్న పాత్ర అయినా ఆ పాత్ర చేసిన ఆర్టిస్ట్‌కి మంచి గుర్తింపు వస్తుంది. అలా నాకు ‘బహుదూరపు బాటసారి’ మంచి పేరు తెచ్చింది. మిగతా డైరెక్టర్స్‌కి, ఈయనకీ ఉన్న తేడా ఏంటంటే.. దాసరిగారు ఒక డైలాగ్ ఇచ్చి, ‘‘ఈ డైలాగ్‌ని ఎలా చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే, వాటి గురించి చెప్పేవారు. ఆయన డైరెక్షన్లో చేసిన వాటిలో నాకు ‘తిరుగుబాటు’ సినిమా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, అందులో నాది పూలన్ దేవి టైప్ క్యారెక్టర్. ‘ఈ క్యారెక్టర్ చేయగలనా’ అని నాలో నేనే అనుకున్నాను. పైగా లెంగ్తీ డైలాగ్స్ ఉండేవి. అవి చెప్పగలనా అని సందేహం. అది గమనించి, దాసరిగారు ‘‘ఏంటీ... చేయలేననుకుంటున్నావా? నువ్వు అమ్మాయిని అనే సంగతి మరచిపో. నిన్ను నువ్వు చిరంజీవి అనుకో. హీరోని అనుకుని చేసేయ్’’ అన్నారు. ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. ఆ పాత్రను సునాయాసంగా చేసేశాను. నటీనటులకు ఆయన చెప్పే విధానం చాలా క్లియర్‌గా ఉంటుంది. దాసరిగారు ‘హార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ’. తెలుగు సినిమాకి ఇన్స్టిట్యూట్ లాంటివారు. ఆయన మరణం తీరని లోటు. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రేమ చరిత్ర
అగాథంలోకి తొంగి చూస్తే? లోతైన ప్రేమ కనబడుతుంది. పర్వతాలెక్కి పిలిస్తే? ప్రేమ ప్రతిధ్వనిస్తుంది. షరతులతో సంకెళ్లేస్తే? ప్రేమ పట్టరానిదైపోతుంది. కాంక్షలతో కాటేస్తే? కక్షలతో చంపేస్తే? ప్రేమ... మరో చరిత్ర అవుతుంది. ఇలాంటి సినిమా చూడకపోతే? ప్రేమ... భవసాగరంలో కొట్టుకుపోతుంది... బాలు, స్వప్నల స్వప్నంలా..! ప్రేమ ఫలించిందంటే ఏమిటి అర్థం? కథ అయిందనా? చరిత్ర అయిందనా? రెండూ కాదు. నిజం అయిందని! కానీ కమల్, సరితల ప్రేమ నిజం కాలేదు. అంటే వాళ్ల ప్రేమ ఫలించలేదా? ఫలించింది. వాళ్ల ఆత్మలు ఇంకా వైజాగ్ బీచ్ కోటలో కలిసే ఉన్నాయి. ఆత్మలా? మనుషుల్లేరా! ఉన్నారు. ఇప్పుడున్న ప్రేమికులందరి ఆత్మలే ఆ ఇద్దరు. అవునూ... ఇప్పుడూ మనం ఇలా శిథిలాల్లో తిరుగుతున్నాం ఎందుకు స్వప్నా? (కమల్ ఆత్మ) ఈ శిథిలాల వెనుక ఎన్నో కథలుంటాయ్. చిరిగిపోయిన చరిత్ర పుటలు ఎంత చిందరవందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయ్. బాలూ... (సరిత ఆత్మ)స్వప్నా... మనం పెళ్లి చేసుకోకూడదు. ఏ బాలూ...? ప్రేమంతా అయిపోయిందా? ప్చ్... కాదు. పెళ్లి చేసుకుంటే అందరిలా మనం కూడా ఆలుమగలుగా మిగిలిపోతాం? ప్రేమ ఫలించకపోతేనే కథానాయకులమవుతాం. మనది కథెందుకు కావాలి? చరిత్ర కాకూడదా? సరిత విశాఖ విమెన్స్ కాలేజీలో చదువుతోంది. కమల్ ఉద్యోగం మానేసి మద్రాస్ నుండి వైజాగ్ వచ్చేశాడు.ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. కమల్‌ది తమిళ ఫ్యామిలీ. సరితది తెలుగు ఫ్యామిలీ. కమల్‌ది వెజ్ ఫ్యామిలీ. సరితది నాన్‌వెజ్ ఫ్యామిలీ. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి తల్లిదండ్రులూ డైనమైట్లా పేలారు! ఇద్దర్నీ విడివిడిగా కూర్చోబెట్టి, నిలబెట్టి వంద ప్రశ్నలు వేశారు. ఇద్దరిదీ ఒకటే మాట... మేము ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకున్నాం. ఓ రోజు కమల్ డెరైక్టుగా సరిత ఇంటికే వచ్చేశాడు. సరితను కౌగిలించుకుని ‘ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు’ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య పచ్చటి ప్రేమ భగ్గుమంది.రెండు వైపుల పెద్దలూ సమావేశమయ్యారు. ఇక్కడ కమల్ తల్లి సాఫ్ట్. అక్కడ సరిత తండ్రి సాఫ్ట్. కానీ ఇక్కడి తండ్రి, అక్కడి తల్లి ధాటికి ఆ సాఫ్ట్‌నెస్ వర్కవుట్ కాలేదు. పెద్దలకు, పిల్లలకు మధ్య ప్రేమయుద్ధం మొదలైంది. మేం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం. (కమల్)అందరూ మాకన్నా వయసులో, అనుభవంలో పెద్దవాళ్లు. ఒక్కరూ మా మనసులేమిటో అర్థం చేసుకోరే! (సరిత) పెద్దవాళ్లని గౌరవిస్తున్నాం కదా. అందుకే (కమల్) ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవదీసుకుపోతే ఏం చేసేవారేం? ఆన్సర్ హర్ (కోపంగా పైకి లేవబోయిన తండ్రితో కమల్). మేమేం చేసినా హద్దులు... హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే! కమల్ తండ్రి జె.వి.రమణమూర్తి ఆవేశంగా అరిచాడు. ‘‘వాయి మూడ్రా భడవా... బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు.. మాంసం తినే పిల్లను పెళ్లి చేసుకుంటాట్ట. సిగ్గు లేదు. సిగ్గు’’. నేను మాంసం, చేపలు మానేస్తాను అంది సరిత. ఓహో అది గొప్ప త్యాగమా అంది సరిత తల్లి. అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను అన్నాడు కమల్.శివ శివా అన్నాడు కమల్ తండ్రి. ఇదంతా కావాలని ఈ అరవోళ్లు చేస్తున్న కుట్ర. అదేదో సామెత చెప్పినట్టు... ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినోడికి మా అమ్మాయిని కట్టబెడతామా? ఏం.. తెలుగుదేశం గొడ్డుబోయిందా? (సరిత తల్లి) మీకు భాష మాత్రమే అభ్యంతరమైతే... ఒక్కనెల గడువివ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను. కవిత్వాలు రాస్తాను. పొయెట్రీ. జస్ట్ వన్ మంత్ (కమల్)రాస్తావ్ అబ్బాయ్ రాస్తావ్. మా నెత్తిన పేడ రాస్తావ్. అందుకే కన్నారు మీ అమ్మా అబ్బా. (సరిత తల్లి) చూడండి... వాళ్లు సరే చిన్నవాళ్లు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతే ఎలా? వాళ్లిద్దరూ ఒకళ్లనొకళ్లు ప్రేమించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. (కమల్ తల్లి) ఏం చేయవలెనా? ముందా చెయ్యి తియ్యమనండి. (కమల్ సరిత చెయ్యి పట్టుకుని ఉంటాడు) అంద కయ్యిడరా. ఈ వయసులో ప్రేమయే! ప్రేమ! వ్యామోహం ద. బలుపు. (కమల్ తండ్రి) వాదన ఆగట్లేదు. ఇదంతా ఎందుకండీ... మాది నిజమైన ప్రేమే అని తెలియజేయడానికి ఏం చెయ్యమంటారో చెప్పండి. చేస్తాం అంది సరిత. ఊ... చూడండీ... మీరెవరూ ఏమీ అనుకోనంటే... నేనొక మాట చెప్తాను. ఒక సంవత్సరం పాటు వాళ్లిద్దర్నీ వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్లు పరస్పరం కోరుకుంటే... అది నిజంగా ప్రేమే. వ్యామోహం కాదు అన్నాడు మధ్యవర్తి. కమల్ ఇంటి ఓనర్. అయితే అప్పుడు పెళ్లి చేయవాలా? పోవయ్యా.. నూరు సంవత్సరమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అదెల్లా ముడియాదు. (కమల్ తండ్రి). ముడియాదు అనడానికి మీరెవరండీ. నేను చెప్తున్నాను. ఈ సంబంధం నాకు ముడియాదు. ఈ జగన్నాథానికేం (మధ్యవర్తి) పోయింది. పిల్లా పీచా.. నోటికొచ్చినట్టు వాగుతాడు. (సరిత తల్లి)అలా తోసి పారేయకండి. కాస్త ఆలోచించండి. (కమల్ తల్లి) సరిత తండ్రి ఆలోచనలో పడ్డాడు. అవునే. ఆయనజెప్పిందీ కాస్త సబబుగానే ఉన్నట్టుంది. అన్నాడు. ఏం బాలూ అంది కమల్ తల్లి. ఎదుక్కుమా ఇదెల్లా.. ఏదో పెద్ద అగ్ని పరీక్ష లాగా. యూ... యూసీ... మేము ఒప్పుకోం (కమల్) పోనీ ఒప్పుకుందాం బాలూ. వీళ్ల పరీక్షలకు మనం దడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారవ్. నాకా నమ్మకం ఉంది అంది సరిత. ఊ.. అయితే అన్నాళ్లు ఒకర్నొకరు చూసుకోకూడదు. మాట్లాడకూడదు. ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. (సరిత తల్లి) ఆ.. అసలు ఇద్దరూ ఒక ఊర్లోనే ఉండకూడదు. వాణ్ణి హైద్రాబాద్ పంపిస్తున్నాను. (కమల్ తండ్రి) అగ్రిమెంట్ అయింది. కమల్, సరిత విడిపోయారు. కమల్ హైదరాబాద్‌లో. సరిత వైజాగ్‌లో. ఏడాది వరకు వీళ్లు కలుసుకోడానికి వీల్లేదు. డెడ్‌లైన్... డిసెంబర్ 19, 1977. ఈలోపు కలుసుకుంటే ప్రేమ రద్దు. అక్కడ హైదరాబాద్‌లో కమల్‌కి ఎవరైనా ‘కావ్యం’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ‘వెన్నెల’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ఇక్కడ విశాఖపట్నంలో సరిత... కమల్ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతోంది. అక్కడ కమల్‌కి మాధవి పరిచయం అయింది. మాధవియంగ్ విడో. కమల్‌కి తెలుగు నేర్పిస్తోంది. డాన్స్ నేర్పిస్తోంది. ఇక్కడ సరితకు బావ టార్చర్ మొదలైంది. కమల్ ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసి, తన తమ్ముడు మిశ్రోకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సరిత తల్లే ఆ బావని రప్పించింది. సరితకు ఇంకో టార్చర్.. అమెపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్. అవకాశం కోసం కాచుక్కూర్చున్న కామాంధుడు అతడు. రోజులు గడుస్తున్నాయి. కమల్, సరితల ప్రేమకు ఒక్కోరోజు ఒక్కో పరీక్ష ఎదురౌతోంది. కమల్ నెగ్గుతున్నాడు. సరిత నెగ్గుతోంది. కానీ ఓ రోజు కమల్ ఓడిపోయినంత పని చేశాడు! జూలాజికల్ ఎక్స్కర్షన్ కోసం వైజాగ్ నుండి సరిత, ఆఫీస్ ఇన్స్పెక్షన్ కోసం హైదరాబాద్ నుండి కమల్ కాకినాడ వెళ్లారు. ఓ రెస్టారెంట్లో దిగారు. అనుకోకుండా ఇద్దరివీ పక్కపక్క గదులు. సరితకు తెలీకుండా ఆమె బావ కూడా ఆమెను ఫాలో అయి వచ్చాడు. సరిత ఆశ్చర్యపోయింది. తనపై నిఘా పెట్టినందుకు తల్లిని తిట్టుకుంది. ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. సరితను చూడకుండా ఉండలేక ఆమె గదిలోకి వెళ్లిన కమల్‌కు సరిత బావ కనిపించాడు. త్వరలో తను సరితను చేసుకుంటున్నట్లు చెప్పాడు. కమల్ నమ్మాడు. కోపంతో వెళ్లిపోయాడు. ఆ కోపం మాధవి మీద ప్రేమ అయింది. ఆ ప్రేమ పెళ్లి కార్డులు వేసే వరకు వెళ్లింది. ఈలోపు కమల్, మాధవి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళతారు. అక్కడ స్టాల్ పెట్టిన వైజాగ్ బుక్‌షాప్ ఓనర్ (నటుడు కృష్ణ చైతన్య) కమల్‌కి కనిపిస్తాడు. మాధవిని అనుమానంగా చూడడం గమనించి, నా కాబోయే భార్య అని చెప్తాడు కమల్. ‘పెళ్లి చేసుకోవడం నాకూ చేతనౌను. వైజాగ్ వెళ్లి చెప్పండి’ అంటాడు. ఇక కృష్ణ చైతన్య ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి సరితకు, ఆమె అమ్మానాన్నలకు చెప్పాడు. సరిత షాక్ తింది. పరుగున వెళ్లి ‘బాలూ పెళ్లి చేసుకుంటున్నాడా..’ అని కమల్ తల్లిని అడిగింది. నిజం కాదని తెలుసుకుని గుండెమీద చెయ్యి వేసుకుంది. గడువు తేదీ కోసం ఎదురు చూస్తోంది. అక్కడ హైదరాబాద్‌లో కమల్ సరితకు రాసి, పోస్ట్ చేయని ఉత్తరాలను చూసింది మాధవి. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహించింది. వెంటనే వైజాగ్ వచ్చి సరితకు కమల్ ప్రేమ గురించి చెప్పింది. సరిత పెళ్లి కూడా వట్టి మాటేనని తెలుసుకుంది. తిరిగి హైదరాబాద్ వెళ్లి కమల్‌కు అసలు సంగతి చెప్పింది. ప్రింట్ అయిన పెళ్లి కార్డులను పక్కన పడేసింది. వెంటనే వెళ్లి సరితను కలుసుకొమ్మని కమల్‌కు చెప్పింది. కమల్‌కు ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేసింది. కమల్ వైజాగ్ బయల్దేరాడు. మాధవి అన్న రెడ్డి, తన చెల్లెలి పెళ్లి పాడైపోయిందన్న ఆవేదనతో, ఆగ్రహంతో కమల్‌ను చంపేందుకు పథకం వేశాడు. రాత్రి 3 గంటలప్పుడు విశాఖపట్నం అప్పారావుకు ఫోన్ చేసి, వాణ్ణి చంపెయ్ అని చెప్పాడు. నా చె ల్లెల్ని దగా చేసినవాడు మరొక దానితో కులకడానికి వీల్లేదు అని అన్నాడు. క్లైమాక్స్ వైజాగ్‌లో కొండ మీద గుడి. కమల్, సరితల లవ్స్పాట్. కమల్ వస్తున్నాడని గుడికి బయల్దేరింది సరిత. ఒంటరిగా సైకిల్ మీద. అమెను ఫాలో అవుతున్నాడు... ఎప్పటినుంచో ఆమె కోసం కాచుక్కూర్చున్న కృష్ణ చైతన్య. ఇప్పటికి ఛాన్స్ దొరికింది.ఇంటికి వచ్చి, అక్కడి నుంచి సరిత వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె గుడికి వెళ్లిందని తెలుసుకుని బైక్‌పై బయల్దేరాడు కమల్. మాధవి అన్న రెడ్డి పురమాయించిన రౌడీలు కమల్ని వెంబడించారు. సరితను కృష్ణ చైతన్య వెంటాడుతున్నాడు. కమల్ ను వీళ్లు వెంటాడుతున్నారు. ఒకరు శీలం దోచుకోవడం కోసం. ఇంకొకరు ప్రాణాలు తీయడం కోసం. ఇక్కడ ట్విస్టులేమీ లేవు. సర్వం కోల్పోయి సరిత, ప్రాణాలు కోల్పోతుండగా కమల్ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరిలోకి ఒకరు ఒరిగిపోయారు. బాలు... బాలు.. ఇంతకాలం మనం విడిపోయింది మృత్యువు ఒడిలో కలవడానికా? బాలూ ఇది జరక్కముందే నన్ను నీతో లేవదీసుకుపో బాలూ... అంటోంది సరిత. రా స్వప్నా అంటున్నాడు కమల్. ఇద్దరూ సముద్రంలో కలిసిపోయారు. ప్రేమికులు ఓడిపోయారు. కానీ ప్రేమ గెలిచింది. మరో చరిత్ర అయి నిలిచింది. వివరాలు నటీనటులు : కమల హాసన్, సరిత (తొలి పరిచయం), మాధవి, జయవిజయ, కాకినాడ శ్యామల, జె.వి.రమణమూర్తి, కృష్ణచైతన్య, పి.ఎల్.నారాయణ, మిశ్రో. పాటలు : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం : పి.సుశీల, జానకి, వాణీజయరామ్ ఎల్.ఆర్.ఈశ్వరి, రమోలా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాటలు : గణేశ్ పాత్రో సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ నిర్మాత: రామ అరంగణ్ణల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్, విడుదల (1978) సమర్పణ: ఆండాళ్ ప్రొడక్షన్స్. విశేషాలు మరో చరిత్ర 1981లో హిందీలో ఏక్ దూజేకే లియే పేరుతో వచ్చింది. ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే. సరిత అసలు పేరు అభిలాష. బాలచందరే సరితగా మార్చారు. పాటలు ఏ తీగ పువ్వునొ, ఏ కొమ్మ తేటినో (సంతోషం) బలే బలే మగాడివివోయ్ బంగారు నా సామివోయ్ కలిసి ఉంటే కలదు సుఖము... కలసి వచ్చిన అదృష్టము పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే... ఏ తీగ పువ్వునో... ఏ కొమ్మ తేటినో (విషాదం) విధి చేయు వింతలన్నీ... -
నలభై ఏళ్ల రజనీకాంతి
రజనీకాంత్‌కు ఈ మంగళవారం ఒక మరపురాని రోజు. ఈ సౌతిండియన్ సూపర్‌స్టార్ వెండితెరపై తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇవాళ్టి (ఆగస్టు 18)తో సరిగ్గా నాలుగు దశాబ్దాలు పూర్తవుతున్నాయి. కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ (తెలుగులో దాసరి ‘తూర్పు - పడమర’గా రీమేక్ చేశారు) సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1975 ఆగస్టు 18న రిలీజైంది. బస్ కండక్టర్‌గా జీవితం మొదలుపెట్టిన శివాజీరావ్ గైక్వాడ్, చిన్న చిన్న పాత్రల్లో రాణించి, విలన్‌గా పేరు తెచ్చుకొని, హీరోగా తిరుగులేని స్థానానికి చేరుకొని తమిళ తెరకు రజనీకాంతుడైన ప్రస్థానం ఎప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన చరిత్రే. ఆరు పదుల వయసు దాటినా, ఇప్పటికీ తమిళ తెరపై మకుటంలేని మహారాజుగా వెలుగుతున్న స్టార్ రజనీకాంత్. ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమా చేసినా, బాక్సాఫీస్ వద్ద హిట్టయితే కలెక్షన్లకు ఆకాశమే హద్దని తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉవాచ. ఇప్పటికీ కొన్ని వందల సంఖ్యలో అభిమాన సంఘాలు, రాజకీయంగా ఒక్క అభిప్రాయం చెబితే దాన్ని తు.చ తప్పకుండా పాటించే కోట్లాది అభిమానులు ఆయన సొంతం. భోగిగా మొదలై హిమాలయ గురువుల బోధనలతో యోగిగా పరిణతి చెందిన జీవితం రజనీది. ఇంతకీ కాళీనా? కపాలీనా? భక్తియోగంలో ఆధ్యాత్మికతను అనుసరిస్తూనే కర్మయోగంలో నటనను వదులుకోని రజనీకాంత్ ఇప్పుడు తన 159వ సినిమాతో మళ్ళీ కెమేరా ముందుకు రావడానికి బిజీ బిజీగా సిద్ధమవుతున్నారు. యువ దర్శకుడు రంజిత్ నిర్దేశకత్వంలో సెట్స్ మీదకొస్తున్న తమిళ చిత్రం సన్నాహాల్లో ఉన్నారు. వయసు మీద పడ్డ మాఫియా డాన్‌గా రజనీ కనిపించే ఈ చిత్రానికి ఇటీవలి వరకు ‘కాళి’ అనే పేరు మీడియాలో ప్రచారమైంది. తాజా కబురేమిటంటే, ఈ సినిమాకు ‘కపాలి’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట. కపాలీశ్వరుడనేది శివుడి పేరు. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలోని కపాలీశ్వరస్వామి కోవెల సుప్రసిద్ధం. ఈ సినిమా కథ కూడా చెన్నైలోని మైలాపూర్‌లో మొదలవుతుందట. అందుకే, ఈ పేరు పెట్టాలనుకుంటున్నారట. నిజజీవిత డాన్ కథ? అన్నట్లు, ఈ సినిమాలో రజనీ పోషిస్తున్న పాత్ర పేరు కూడా కపాలీశ్వరన్ అట. ఒకప్పుడు మైలాపూర్‌లో నివసించిన కపాలీశ్వరన్ అనే మాఫియా డాన్ జీవితం కూడా ఈ కథకు స్ఫూర్తి అని కోడంబాకవ్‌ులో గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరగనుంది. సినిమాలో మొదట కొద్దిసేపు మైలాపూర్, ఆ గుడి పరిసరాలు కనిపిస్తాయి. రాధికా ఆప్టే, ధన్సిక తదితరులు నటించే ఈ సినిమాతో రజనీ కొత్త రికార్డులు సృష్టిస్తారా? చూడాలి. -
అపూర్వ గురుభక్తి
సినిమా వాళ్లకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అని ఆశ్చర్యపోకండి! చాలా కాలం తరువాత తెలుగులో నేరుగా సినిమా (పేరు ‘చీకటి రాజ్యం’) చేస్తూ, ఆ షూటింగ్ కోసం భాగ్యనగరికి వచ్చిన నటుడు కమల్‌హాసన్ మాటల్లో అచ్చంగా సెంటిమెంట్, తనను ఇంతవాణ్ణి చేసిన దర్శక గురువు స్వర్గీయ కె. బాలచందర్ పట్ల అపారమైన భక్తి కనిపించాయి. కొద్దినెలల క్రితం మరణించిన బాలచందర్‌ను ఈ ‘విశ్వనటుడు’ గుర్తుచేసుకుంటూ, భౌతికంగా దూరమైనా అలాంటి పెద్దలు చూపిన ప్రభావం అలాగే ఉండిపోతుందన్నారు. ‘‘నా అలవాట్లు, నా కోపం, నా నటన దగ్గర నుంచి రచన దాకా అన్నీ నేను కె.బి. సార్ నుంచి, ఆయన సహాయకులైన అనంతు గారి దగ్గర నుంచి నేర్చుకున్నవే’’ అని వినయంగా ఒప్పుకున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సినిమాలు చేసి, కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న కమల్ మాత్రం ఈ 50 ఏళ్ళ పైచిలుకు కెరీర్లో కె.బి. దర్శకత్వంలో తాను పనిచేసిన 36 సినిమాలే తన అసలైన స్కోర్ అనడం విశేషం. ‘‘ఇటీవలి ‘ఉత్తమ విలన్’లో మేమిద్దరం కలసి పనిచేసిన 37వ చిత్రం. నా కెరీర్లో నేను సాధించిన పెద్ద విజయం ఇదే’’ అన్నారాయన. తన లాగానే కె.బి. ద్వారా పైకొచ్చిన తరువాతి తరం శిష్యుడు ప్రకాశ్‌రాజ్‌ను ప్రస్తావిస్తూ, ‘‘కె.బి. భౌతికంగా లేరని బాధపడుతున్న ప్రకాశ్‌కు ఒక పెద్దన్న లాగా పక్కన ఉంటానని చెప్పా’’ అని ప్రకటించారు. వేదికపై కమల్ ఈ మాటలు చెబుతున్నప్పుడు కిందనున్న ప్రకాశ్‌రాజ్ కళ్ళలో తడి, ఎప్పుడూ ప్రెస్‌మీట్స్‌కి పెద్దగా రాని త్రిష ముఖంలో అబ్బురం కనిపించాయి. విద్య నేర్పిన గురువు మీద, ప్రతిభావంతుడైన సీనియర్ సహచరుడి మీద అసలు సిసలు గురుభక్తి అంటే బహుశా ఇదేనేమో! -
సంతోషంగాలేని రజనీకాంత్!
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతుంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం సంతోషంగా లేడట. ఎందుకంటే... రజనీకాంత్ జీవితంలో హోలీ పండక్కి చాలా ప్రత్యేకత వుంది. ప్రతి సంవత్సరం రజనీకాంత్...తన గురువు, అభిమాన దర్శకుడు కె.బాలచందర్‌కి తప్పకుండా శుభాకాంక్షలు తెలిపేవారట ఎక్కడ, ఎలా , ఎంత బిజీగా ఉన్నా... కలిసేందుకు వీలు లేకుంటే... కనీసం కాల్ చేసి అయినా బాలచందర్‌కి శుభాకాంక్షలు చెప్పడం మాత్రం మర్చిపోయేవారు కాదుట. అయితే ఈసారి ..తనను సినీ రంగానికి పరిచయం చేసిన బాలచందర్ ను విష్ చేసే అవకాశాన్ని మిస్ అవడం లింగ స్టార్‌ని బాధిస్తోందట. అనారోగ్యంతో ఇటీవల బాలచందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. 'అపూర్వ రాగంగళ్' సినిమాతో చలన చిత్రపరిశ్రమకు పరిచయమై ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న, ఈ సూపర్ స్టార్ జీవితంలో హోలీ పండుగ కు ఇంకో ప్రాముఖ్యత ఉందట. అవును సరిగ్గా హోలీ రోజే బస్ కండక్టర్ శివాజీ రావు గైక్వాడ్ ...రజనీకాంత్‌గా అవతరించాడట. 1975వ సంవత్సరంలో శివాజీ రావు అనే రజనీకాంత్‌ను బిగ్ స్క్రీన్ కు పరిచయం చేద్దామనుకున్నపుడు బాలచందర్... రజనీకాంత్, చంద్రకాంత్, శ్రీకాంత్ అనే మూడు పేర్లను సూచించి, చివరికి రజనీకాంత్ బావుందని ఆ పేరును ఖాయం చేశారట. అలా తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్‌గా అడుగుపెట్టారు ఈ బస్ కండక్టర్.ఆ మధ్య జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో స్వయంగా బాలచందరే ఈ విషయాన్ని వెల్లడించారు. -
'నాలో నటిని కనుగొన్నది ఆయనే'
దివంగత సీనియర్ దర్శకుడు కె.బాలచందర్ అంటే.. అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రికి ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. తెలుగులో వచ్చిన 'మరోచరిత్ర'ను హిందీలో 'ఏక్ దూజే కే లియే'గా రీమేక్ చేసినప్పుడు అందులో హీరోయిన్గా రతి అగ్నిహోత్రిని ఎంపిక చేసింది ఆయనే. ఆ సినిమా 1981లో విడుదలైంది. అందులో కమల్ హాసన్ సరసన నటించిన రతి అగ్నిహోత్రి.. ఆ తర్వాత బాలీవుడ్లో బ్రహ్మాండమైన స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పుడు బాలచందర్ ఈ లోకంలో లేరంటే.. ఆమె నమ్మలేకపోతోంది. కొన్ని రోజుల క్రితం తాను పంజాబ్‌లో ఓ సినిమా షూటింగులో ఉండగా, చెన్నై నుంచి ఫోన్ వచ్చిందని రతి అగ్నిహోత్రి తెలిపింది. బాలచందర్‌తో పాటు.. భారతీరాజాను సన్మానిస్తున్నామని, ఆ కార్యక్రమానికి 1970లు, 80లలో వాళ్లతో కలిసి చేసిన నటీనటులు, సాంకేతికవర్గం అంతటినీ పిలుస్తున్నామన్నది ఆ ఫోన్ సారాంశం. అయితే, సరిగ్గా ఆ సన్మానం జరిగే సమయానికి తన తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో ఆమెతోపాటు తాను ఉండిపోవాల్సి వచ్చి.. తాను వెళ్లలేకపోయినట్లు రతి తెలిపింది. తనకు తమిళంలో తొలి సినిమా చాన్సు భారతీరాజా, హిందీలో బాలచందర్ ఇచ్చారని.. అందుకు తనను తాను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తానని చెప్పింది. ఇప్పుడు బాలచందర్ లేరంటే అది తీరని లోటని రతి అగ్నిహోత్రి వాపోయింది. -
కన్నీటి వీడ్కోలు
తమిళసినిమా:దర్శక శిఖరం, తమిళ చిత్ర పరిశ్రమ దర్శక దిగ్గజం గా, అభిమాన, గౌరవ, మర్యాదలను అందుకున్న దర్శక పితామహుడు కె.బాలచందర్ భౌతిక కాయానికి యావత్ సినీ కుటుంబం బాధాతప్త హృదయంతో ఘన నివాళి అర్పించింది. బాలచందర్ సాధనలను, అసాధారణ వెండితెర ఆవిష్కరణలను కన్నీటితో కీర్తించింది. ‘స్త్రీ’ అనే సున్నితమైన హృదయ పుస్తకం చదివి ఆ మనోభావాలను నిర్భయంగా సినిమా రూపంలో ప్రపంచానికి చూపించిన దర్శక సవ్యసాచి బాలచందర్. సరాసరి చిత్రాలకు దూరంగా తన చిత్రాలు ఎంతో కొంత మేలు చేయాలి. సందేశం ఉండాలని తపించిన కళాతృష్ణ బాలచందర్. తమిళ సినిమాకు జాతీయస్థాయిలో గౌరవాన్ని సాధించిన మేటి దర్శకుడు. బాలచందర్ ప్రతి చిత్రం ఒక కళాఖండమేనని చెప్పడం అతిశయోక్తి కాదు.కళాత్మక చిత్రాలైనా కాసుల వర్షం కురిపించడంలో గురి తప్పని చిత్రాలు. ఎందరో కళాకారులకు సృష్టికర్తగా, ఎందరో కళాకారులకు స్ఫూర్తిదాయకంగా మరెంరదికో అత్యున్నత స్థారుు జీవితాలను ప్రసాదించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు గొప్ప చిత్రాలను నిర్మించారు. అంతటి దర్శక శిఖరం నేలకొరగడం, చిత్ర పరిశ్రమకే కాదు యావత్ భారత సినీలోకానికి తీరనిలోటని తారలు ఉద్ఘాటిస్తున్నారు. సినీచరిత్రలో నూతన అధ్యాయానికి నాంది బాలచందర్. సినిమాను మరో కొత్త కోణంలో ఆవిష్కరించిన ఘనత ఆయనది. దర్శక శిఖామణి భౌతిక కాయూలనికి నివాళులర్పించడానికి సినీ రాజకీయ, అభిమాన లోకం తరలివచ్చింది. ఆయన శిష్యగణం శోక సంద్రంలో మునిగిపోయింది. నివాళులర్పించిన ప్రముఖుల్లో డీఎంకే నేత కరుణానిధి, స్టాలిన్, పుదియ తమిళ కట్చి నేత ఎ.సి.షణ్ముగం, పొన్ముడి, దురైమురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, డీఎండీకే నేత విజయకాంత్ తిరుమావళవన్, కుష్బూ వంటి రాజకీయ నాయకులన్నారు. ఇంకా సినీ పరిశ్రమలో అగ్రస్థారుులో వెలుగొందిన రజనీకాంత్, లత రజనీకాంత్, శరత్ కుమార్, రాధిక, శివకుమార్, విజయ్, ధనుష్, ముక్తాశ్రీనివాస్, ఎ.వి.ఎం శరవణన్, టి.రాజేంద్రన్, ఎస్.జె.సూర్య, కార్తి, ఎస్.పి.ముత్తురామన్, పి.వాసు, శంకర్, కె.ఎస్.రవికుమార్, ధారణి, లింగుసామి, పేరరసు, వసంత్, సత్యరాజ్, జయరాం, వివేక్, ఆర్.సి. శక్తి, వాగై చంద్రశేఖర్, రాధారవి, కె.రాజన్, నటి మనోరమ, శ్రీప్రియ, సరిత, విమలారామన్, నిరోషా, సరస్వతి, ఆర్.కె. సెల్వమణి, ప్రభు సాలమన్, నిర్మాత ధాను, ఆర్.బి.చౌదరి, తమిళచ్చి తంగపాండియన్, కె.ఆర్, వైజీ మహేంద్రన్, డ్రమ్స్ శివమణి, ప్రతాప్ పోతన్, దేవా, శ్రీకాంత్ దేవా, చో.రామస్వామి, నల్లి కుప్పుసామి, మణిరత్నం, సుహాసినీ, కుష్బూ, విజయకుమార్ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. కె.బాలచందర్ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు అభిమానుల కోసం స్థానిక మైలాపూర్‌లోని ఆయన స్వగృహంలో ఉంచారు. భార్య రాజ్యం, కూతురు పుష్పా కందసామి, శోఖ సంద్రంలో మునిగిపోయారు. కొడుకు ప్రసన్న శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలచందర్ అంత్యక్రియలు బీసెంట్ రోడ్డులో గల శ్మశాన వాటికలో జరిగాయి. వేలాదిమంది సినీ ప్రముఖులు, అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తమిళ సినిమాకు మలుపు తమిళ సినిమాను కొత్త మలుపు తిప్పిన దర్శకుడు కె.బాలచందర్. జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన దర్శకుడు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన చిత్రాలు సజీవ సాక్ష్యాలు. సినిమా ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి గుర్తుండిపోతుంది. బాలచందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. - కరుణానిధి, డీఎంకే అధినేత నన్ను నేను కోల్పోయాను నన్ను నేను కోల్పోయాను. బాలచందర్ మనిషిగా జీవించిన దేవుడు. నన్పెప్పుడూ నటుడిగా చూడలేదు. తన కొడుకుగానే భావించే వారు. అలాంటి వ్యక్తిని మళ్లీ ఈ సినిమా పరిశ్రమ చూడలేదు. - నటుడు రజనీకాంత్ వెతికి వెళ్లి అభినందించేవారు నేను చదువుకుంటున్న రోజుల్లోనే బాలచందర్ చిత్రాలు చూసి అబ్బురం చెందేవాడిని. మూడు దశాబ్దాల పాటు ప్రఖ్యాత దర్శకుడిగా వెలుగొందడం అసాధ్యం. నేనైతే 15 ఏళ్లు దర్శకుడిగా రాణిస్తే చాలనుకుంటున్నా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దర్శక శిఖరం బాలచందర్. దర్శకులకే దర్శకుడాయన. మంచి విషయం అనిపిస్తే వెతుక్కుంటూ వె ళ్లి అభినందించే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. బాలచందర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. - దర్శకుడు శంకర్ జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి దర్శక శిఖరం కె.బాలచందర్ జ్ఞాపకాలు కాలాన్ని జయిస్తాయి. ఆయన చేతివేళ్లు పట్టుకుని ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగారు. బాలచందర్ భౌతికంగా లేకపోయినా ఆయన మధురజ్ఞాపకాలు భవిష్యత్ తరాలను సజీవంగా వెంటాడతాయి. - నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ‘అరంగేట్రం’తోనే బలమైన నిర్ణయాలు తమిళ సినిమాలో నటులుగా ఎమ్జీఆర్, శివజీగణేశన్ ఎంతగొప్పవారో దర్శకులు బాలచందర్ అంత గొప్పవారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు బాలచందర్ పరిచయం చేసిన మాట వాస్తవమే. అయితే అంతకు ముందే నాగేష్ లాంటి నటుడిని కథానాయకుడిగా పరిచయం చేసిన గట్స్ ఉన్న దర్శకుడాయన. అరంగేట్రం చిత్రం తరువాత బాలచందర్ పొగతాగరాదని, స్త్రీ ఇతివృత్తంలో పలు చిత్రాలు తీసిన ఘనత బాలచందర్కే దక్కుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. - నటుడు శివకుమార్ అద్భుత దర్శకుడు బాలచందర్ చిత్రాలు అఖిల భారత స్థాయిలో కీర్తి కిరీటాలు పొందాయి. అంత గొప్ప చిత్రాలు తీసిన అద్భుత దర్శకుడాయన. బాలచందర్ అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని విన్నపం - సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా బాలచందర్ కవితాలయ సంస్థ నిర్మించిన అన్నామలై చిత్రంతోనే సంగీత దర్శకుడిగా నా స్థారుు పెరిగింది. - సంగీత దర్శకుడు దేవా నాకు మార్గదర్శి భారత దేశ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శక దిగ్గజం కె.బాలచందర్. నేనుచదివిన అన్నామలై, కళాశాలలోనే నాకన్నా ముద్ర చదివి నాకు మార్గదర్శిగా నిలిచారు. ఎవరేమనుకున్నా తన మనసులోని భావాలను నిర్భయంగా వెండితెరపై ఆవిష్కరించి విజయం సాధించిన దర్శకుడు. అలాంటి దర్శకుడు మరణం సినీ లోకాన్ని శోక సముద్రంలో ముంచింది. - నటుడు టి.రాజేందర్ ఇక ముందు చూడలేం బాలచందర్ అంత గొప్ప దర్శకుడ్ని ఇక ముందు చూడలేం. ఆదిలోనే నా నవగ్రహ నాటకం ప్రదర్శన చూసి చాలా బాగుందని అభినందించారు. అంత ఉన్నత మనసు ఆయనది. - నటి మనోరమ చిత్ర పరిశ్రమకు తీరని లోటు బాలచందర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక ధృవతార రాలిపోయింది. మధ్య తరగతి కుటుంబాల జీవిన శైలిని కళ్లకు కట్టినట్లు చూపించడంలో బాలచందర్ సిద్ధహస్తులు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలికి, దక్షిణ భారత సినీ కార్మికుల సంఘానికి, దక్షిణ భారత సినీ దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా సేవలు చేసిన ఏకైక వ్యక్తి బాలచందర్. ఆయన ఆత్మకు శాంతికలగాలని వారి కుటుంబానికి ఆయన లేని కష్టాన్ని భరించే ధైర్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. - కాట్రగడ్డ ప్రసాద్ (సౌత్ ఇండియన్ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి) -
బాలచందర్‌కు ప్రముఖుల నివాళి
-
కమలహాసన్ కు దక్కని 'చివరిచూపు'
చెన్నై: తన గురువు కె. బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన ఈ రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. బాలచందర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ముగియనున్నాయి. తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్... లాస్ ఏంజెలెస్ కు వెళ్లారు. బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. బాలచందర్ తో కలిసి 40పైగా సినిమాలకు కమలహాసన్ పనిచేశారు. -
బాలచందర్‌కు ప్రముఖుల నివాళి
చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలోని ఆయన నివాసానికి బుధవారం ఉదయం సినీ, రాజకీయ నేతలతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. బాలచందర్‌ను కడసారి దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహ్మాన్, నెపోలియన్, కాంచన, వాణీజయరాం, కె.ఎస్.రవికుమార్, అర్చన, కుష్బూ తదితరులు బాలచందర్ పార్థివ దేహాన్ని సందర్శించి, అంజలి ఘటించారు. మరోవైపు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న నటుడు కమల్ హాసన్ ...బాలచందర్ మరణవార్త వినగానే హుటాహుటీన చెన్నై బయల్దేరారు. మరికొద్దిసేపట్లో ఆయన చెన్నై చేరుకోనున్నారు. కాగా బాలచందర్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నట్లు సమాచారం. -
‘మరో చరిత్ర’ ముగిసింది
-
‘మరో చరిత్ర’ ముగిసింది
* దర్శక శిఖరం కె. బాలచందర్ ఇక లేరు * అస్వస్థతతో చెన్నైలో కన్నుమూత * సినీ చరిత్రకే మకుటాయమానమైన చిత్రాలను తీసిన కేబీ * ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంపై తొలి గుర్తింపు * మరోచరిత్ర, అంతులేనికథ, ఆకలిరాజ్యం వంటి ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం * దర్శక శిఖరం మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి సాక్షి, చెన్నై, హైదరాబాద్: మరో చరిత్ర ముగిసింది.. రుద్రవీణ మూగబోయింది.. భారత సినీ పరిశ్రమలో ధ్రువతారగా వెలిగిన దర్శక శిఖరం నేలకొరిగింది.. చిత్ర పరిశ్రమకు మకుటాయమానంగా వెలిగిన కైలాసం బాలచందర్(84) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరువారూర్ (గతంలో తంజావూరు జిల్లా) జిల్లా నన్నిలం గ్రామంలో దండపాణి కైలాసం, సరస్వతి దంపతులకు 1930, జూలై 9న బాలచందర్ జన్మించారు. 1956లో రాజంను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు (కైలాసం, ప్రసన్న), ఓ కూతురు(పుష్పా కందసామి). అనారోగ్యంతో పెద్ద కుమారుడు కైలాసం ఇటీవల మృతి చెందడంతో బాలచందర్ బాగా కుంగిపోయారు. అదే బెంగతో అస్వస్థతకు గురై ఈనెల 15న ఆస్పత్రిలో చేరారు. చిన్నతనం నుంచే నాటకాలు, చిత్రాలపై మక్కువ పెంచుకున్న బాలచందర్‌పై.. త్యాగరాజ భాగవతార్ సినిమాలు ప్రభావం చూపాయి. బాలచందర్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. 12 ఏళ్ల ప్రాయంలోనే నటన వైపు... తమిళ, తెలుగు సినిమాను వైవిధ్య భరితమైన కథాంశాలతో ఓలలాడించిన దర్శక వైతాళికుడు కె.బాలచందర్(కేబీ) తన 12 ఏళ్ల ప్రాయంలోనే నటనవైపు అడుగులు వేశారు. ఒక నాటిక సమాజంలో సభ్యుడిగా చేరి పేరు తెచ్చుకున్నారు. అన్నామలై యూనివర్సిటీ ద్వారా 1949లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి 1950లో తిరువారూరు జిల్లా ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తర్వాత 1956లో చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సాధారణ అకౌంటెంట్‌గా చేరారు. అదే ఏడాది రాజంను పెళ్లిచేసుకున్నారు. ఆ సమయంలో యునెటైడ్ అమెరికన్ ఆర్టిస్ట్ (మద్రాసు) నాటక కంపెనీలో సభ్యుడిగా చేరి కొద్ది కాలంలోనే సొంతంగా నాటక బృం దాన్ని ఏర్పరుచుకున్నారు. స్వీయ దర్శకత్వంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి రంగస్థల ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఆయన రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంలో గుర్తిం పు తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్ హీరోగా నటించిన ‘దైవత్తాయ్’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా 1965లో సినీ పరిశ్రమకు పరిచయమయ్యూరు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీ మెయ్యప్పన్ ప్రోత్సాహంతో ‘సర్వర్ సుం దరం’ చిత్రానికి స్క్రిప్ట్ సహకారం అందించారు. 1965లో ‘నీర్కుముళి’తో దర్శకుడిగా మారారు. 1981లో కవితాలయా ప్రొడక్షన్స్‌ను సొంతంగా స్థాపించి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగా 101 సినిమాలు.. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం బాలచందర్‌కి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తన కథలు స్టార్లకు నప్పవని, వాళ్ల డేట్స్, కాలపరిమితికి లోబడి పనిచేయడం తన వల్ల కాదని కరాకండీగా చెప్పేవారు. సాధ్యమైనంత వరకూ కొత్తవారితోనే పని చేసేవారు. దాదాపు వందకు పైచిలుకు కొత్త నటులను తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. దర్శకుడిగా 101 సినిమాలు చేశారాయన. వాటిలో తమిళంలోనే దాదాపు 80 సినిమాలుంటాయి. అన్నీ ఆణిముత్యాలే. బాలచందర్ సినిమాల్లో కాలం కోరల్లో నలిగిపోతున్న సగటు జీవితాలు కనిపిస్తాయి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ 1970ల్లోనే వెండితెరపై ఆవిష్కరించిన సృజనశీలి బాలచందర్. నిరుద్యోగం, అంటరానితనం, కట్టుబాట్లు, వ్యసనాలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక రుగ్మతలపై ఎన్నో సినిమాలు తీశారు. దర్శకుడు బాలచందర్ చాలా జానర్లు స్పృశించలేకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ అన్ని వర్గాలను రక్తికట్టించాయి. సగటు జీవితాలు ఎదుర్కొంటున్న సున్నిత సమస్యల్ని ఆయన ఎంత సునిశితంగా చూస్తారో చెప్పడానికి ‘అం తులేని కథ’ ఓ మచ్చుతునకగా మిగిలిపోతుంది. తెలుగులో ఆయన భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, అందమైన అనుభవం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, రుద్రవీణ వంటి ఆణిముత్యాలను తెరకెక్కించారు. రజనీ కాంత్‌ని ‘అపూర్వరాగంగళ్’తో వెండితెరకు పరిచయం చేసింది బాలచందరే. ‘మరో చరిత్ర’ ద్వారా కమల్‌హాసన్, సరితలను హీరోహీరోయిన్లుగా పరి చయం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రాన్ని నిర్మించి, సినీ లోకానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పరిచ యం చేసిన ఘనత బాలచందర్దే. ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా ప్రకాశ్‌రాజ్‌ను వెలుగులోకి తెచ్చారు. నటుడిగా.. : దర్శకుడిగా ఖ్యాతిపొందినా అప్పుడప్పుడూ నటుడిగా కూడా కనిపించారు బాలచందర్. చిన్నచిన్న పాత్రలతో ఐదు సినిమాల్లో నటుడిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. ‘రెట్టైసుళి’ అనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్ర చేసి మెప్పిం చారు. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కూడా బాలచందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఎన్నెన్నో అవార్డులు... పద్మశ్రీ(1987), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(2011), జాతీయ అవార్డు(2013), పలు ఫిలింఫేర్ అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు బాలచందర్‌ను వరించాయి. ఇవిగాక ప్రైవేటు సంస్థలు అందజేసిన అవార్డులు కోకొల్లలు. సినిమాలకు దూరమైన దశలో ఎన్నో టీవీ సీరియళ్లకు దర్శకత్వం అందించారు. -
'ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా'
హైదరాబాద్: దర్శక దిగ్గజం కె. బాలచందర్ లేరంటే నమ్మలేక పోతున్నానని సీనియర్ నటి జయప్రద అన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు గొప్పలోటు అన్నారు. తనను మంచి కళాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఆయనతో కలిసి పలు సినిమాలు చేశానని, తమకు మార్గదర్శకుడిగా వ్యవహరించారని పేర్కొన్నారు. తాము ఈ స్థానంలో ఉన్నామంటే ఆయనే కారణమన్నారు. సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆవేదనను తెరపై చూపించేందుకు బాలచందర్ తపించేవారని చెప్పారు. ఆయన మరణం తమకు దురదృష్టమని జయప్రద అన్నారు. -
'ధ్రువతార రాలిపోయింది'
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ మరణంతో ధ్రువతార రాలిపోయిందని కళాతపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. ఆయన మరణం గ్రేటెస్ట్ షాక్ అని వ్యాఖ్యానించారు. తమలాంటి వారందరికీ ఆయన టెక్ట్ బుక్ లాంటి వారని పేర్కొన్నారు. ఆయన దగ్గర వారం రోజులు పనిచేస్తానని బాలచందర్ ను అడిగానని వెల్లడించారు. ఆయన దగ్గర పనిచేసే అవకాశం రాకపోయినా తెర పంచుకునే భాగ్యం దక్కిందన్నారు. ఉత్తమ్ విలన్ సినిమాలో ఆయనతో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే కుతూహలం, ఎవరిచేతైనా నటింపచేయగల సామర్థ్యం ఆయన సొంతమన్నారు. అనారోగ్యం బారిన పడిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారని అనుకున్నామని, కానీ ఇంతలోనే ఆయన వెళ్లిపోయారని విశ్వనాథ్ వాపోయారు. -
బాలచందర్‌కు రజనీ, కుష్బూ పరామర్శ
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ క్రమంగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలచందర్ ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. కాగా, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ కావేరి ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలచందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, దానిపై ఎవరూ ఎలాంటి వదంతులు సృష్టించొద్దని ఈ సందర్భంగా కుష్బూ చెప్పారు. -
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
-
ప్రముఖ దర్శకుడు బాలచందర్ పరిస్థితి విషమం
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చెన్నై నగరంలోని కావేరి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్‌హాసన్ తన గురువుగా బాలచందర్‌ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్‌హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్‌హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. తాము ఎంత ప్రయత్నించినా చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని వైద్యులు అంటున్నారు. దాదాపు 80 ఏళ్ల వయసు ఉండటంతో చికిత్స కూడా కష్టం అవుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆస్పత్రి వద్ద బాలచందర్ అల్లుడు, మరికొందరు బంధువులు ఉన్నారు. -
కె.బాలచందర్ తనయుడు కైలాసం కన్నుమూత
చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి. -
ఆ రోజు ఆ రోడ్డులో వెళ్లకపోయి ఉంటే...
‘‘ఓ రోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే, ఒకాయన కారులో వెళుతున్నారు. నన్ను చూడగానే ఆయన కారాపి ‘రేపు ఒకసారి ఆఫీసుకి రాగలవా’ అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. కాసేపు నా నోట మాట రాలేదు. ఎందుకంటే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు.. గ్రేట్ డెరైక్టర్ కె. బాలచందర్. ఆ తర్వాత రోజు నేను ఆఫీసుకు వెళ్లడం. నా కెరీర్ మలుపు తిరగడం.. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే’’ అని కమల్‌హాసన్ ఉద్వేగంగా చెప్పారు. కామెడీ హీరో సంతానం కథానాయకునిగా నటించిన ‘వాలిబ రాజా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో కమల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఇంకా కమల్ మాట్లాడుతూ - ‘‘యువతరాన్ని ప్రోత్సహించాలని నా గురువు కె. బాలచందర్ చెబుతుంటారు. ఆయన ప్రోత్సహించారు కాబట్టే, నేనీ రోజు మంచి స్థాయిలో ఉన్నాను. ఇక.. నన్ను రోడ్డు మీద చూసి, ఆయన ఎందుకు రమ్మన్నారంటే... ‘అపూర్వ రాగంగళ్’ సినిమా కోసం తమిళ నటుడు శ్రీకాంత్‌ని హీరోగా అడిగితే, ఆయన బిజీగా ఉన్నారట. శ్రీకాంత్ బిజీగా ఉన్నంత మాత్రన రోడ్డు మీద వెళ్లేవాళ్లని నటించపజేస్తామా.. ఏంటి? అని బాలచందర్‌గారు అంటున్న సమయంలో నేను కనిపించానట. నేను కరెక్ట్‌గా ఉంటాననిపించి, నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు నేనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లకపోయి ఉంటే, ఈరోజు ఎక్కడ ఉండేవాణ్ణో తెలియడంలేదు. నేను లాయర్ కావాలనుకునేవాణ్ణి. ఒకవేళ సినిమాల్లో అవకాశం రాకపోతే, ఈపాటికి ఏదైనా కేసులు వాదించుకుంటూ ఉండేవాణ్ణేమో’’ అన్నారు నవ్వుతూ. -
34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం!
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్, కమల్‌హాసన్ పలు చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇద్దరికీ ఓ ఇమేజ్ ఏర్పడ్డాక కలిసి నటించడం మానేశారు. దానికి కారణం ఇద్దరూ బిజీగా ఉండటం, వారి ఇమేజ్‌కి తగ్గ కథలు కుదరకపోవడం అని చెప్పొచ్చు. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బావుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. అది జరుగుతుందో లేదో కానీ ఈ కాంబినేషన్ మాత్రం త్వరలో తెరపై కనిపించబోతోంది. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్, రజనీ నటించిన ‘నినైత్తాలే ఇనిక్కుమ్’(1979) చిత్రాన్ని డిజిటల్‌కి మార్చి విడుదల చేయబోతున్నారు. ఓ ప్రముఖ తమిళ టీవీ చానల్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోంది. ఇటీవలే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగులో ఈ చిత్రం ‘అందమైన అనుభవం’గా రూపొందింది. ఇప్పుడు కూడా ఈ డిజిటల్ వెర్షన్ తెలుగులో విడుదల అయ్యే అవకాశం లేకపోలేదు.