34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం! | 34-year-old after a beautiful experience! | Sakshi
Sakshi News home page

34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం!

Published Mon, Sep 16 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం!

34ఏళ్ల తర్వాత అందమైన అనుభవం!

కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్, కమల్‌హాసన్ పలు చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇద్దరికీ ఓ ఇమేజ్ ఏర్పడ్డాక కలిసి నటించడం మానేశారు. దానికి కారణం ఇద్దరూ బిజీగా ఉండటం, వారి ఇమేజ్‌కి తగ్గ కథలు కుదరకపోవడం అని చెప్పొచ్చు. 
 
 మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే బావుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. అది జరుగుతుందో లేదో కానీ ఈ కాంబినేషన్ మాత్రం త్వరలో తెరపై కనిపించబోతోంది. ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ దర్శకత్వంలో కమల్, రజనీ నటించిన ‘నినైత్తాలే ఇనిక్కుమ్’(1979) చిత్రాన్ని డిజిటల్‌కి మార్చి విడుదల చేయబోతున్నారు. 
 
 ఓ ప్రముఖ తమిళ టీవీ చానల్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోంది. ఇటీవలే ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో తెలుగులో ఈ చిత్రం ‘అందమైన అనుభవం’గా రూపొందింది. ఇప్పుడు కూడా ఈ డిజిటల్ వెర్షన్ తెలుగులో విడుదల అయ్యే అవకాశం లేకపోలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement