తమిళ నటుడు శ్రీకాంత్ మృతి.. ప్రముఖుల నివాళి | Veteran Tamil Actor Srikanth Passes Away Rajinikanth and Kamal Hassan Offers Condolence | Sakshi
Sakshi News home page

Tamil Veteran Actor Srikanth: తమిళ నటుడు శ్రీకాంత్ మృతి.. ప్రముఖుల నివాళి

Published Wed, Oct 13 2021 12:30 PM | Last Updated on Wed, Oct 13 2021 3:59 PM

Veteran Tamil Actor Srikanth Passes Away Rajinikanth and Kamal Hassan Offers Condolence - Sakshi

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) మంగళవారం  చెన్నైలో కన్నుమూశారు. వయసు పైబడడంతో వచ్చిన అనారోగ్య కారణాలతో మరణించిన ఆయనకి ఎంతోమంది కోలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నివాళి తెలిపారు. ఆయనతో పాటు భైరవి, సాధురంగం వంటి చిత్రాలలో కలిసి పనిచేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ప్రియమైన స్నేహితుడి మరణం చాలా బాధించిందని చెప్పాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ సైతం ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కథానాయకుడు, విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన శ్రీకాంత్‌ని బరువైన హృదయంతో సాగనంపుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

శ్రీకాంత్‌ తన చివరి ఇంటర్వ్యూలో.. రజనీకాంత్‌ని కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతడి ఆశ నెరవేరలేదు. ఆయన బామా విజయం, పూవ తలైయా, ఎతిర్ నీచల్ వంటిక్లాసిక్ మూవీస్‌ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. శివాజీ గణేషన్, ఆర్.ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి స్క్రీన్ షేర్‌ చేసుకున్నాడు.

చదవండి: రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ టీజ‌ర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement