ప్రముఖ నటుడు కమల్‌హాసన్(kamal haasan) ‘ఖైదీ 2’(Khaidi2) సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. కార్తీ(karthi) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ రూపొందనుంది. ఈ మూవీలోనూ కార్తీ హీరోగా నటించనుండగా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించనున్నారు.
కాగా ఈ సీక్వెల్‌లో కమల్‌హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. కమల్‌హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. దీంతో ‘ఖైదీ 2’లోని ఓ కీలక పాత్ర చేయాలని కమల్‌ని లోకేశ్ అడగడం.. ఆ పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చడంతో చేసేందుకు కమల్ ఓకే అన్నారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment