khaidi
-
కార్తీ, సూర్య కాంబోలో ఖైదీ-2 చేసేలా ప్లానింగ్..
-
'ఖైదీ' సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరియర్లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్‌గా మెరిశారు. అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
స్టార్ వార్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..!
బాక్సాఫీస్ వసూళ్ల కోసం గ్యాంగ్‌వార్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ కొందరు స్టార్స్ వార్ డిక్లేర్ చేసి సెట్స్‌లో బిజీగా ఉన్నారు. మరికొందరు రెడీ అవుతున్నారు. ఈ బాక్సాఫీస్ గ్యాంగ్‌వార్ పై ఓ లుక్ వేద్దాం. పోలీసాఫీసర్‌గా ప్రభాస్ నటించనున్న సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ‘స్పిరిట్’ ముంబైలో జరిగే గ్యాంగ్‌వార్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హిందీ ‘యానిమల్’ కూడా ఇలాంటి తరహా చిత్రమే. రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న కంప్లీట్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. తండ్రి కోసం ఓ యువకుడు గ్యాంగ్‌వార్‌లో ఎలా చిక్కుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా సాగుతుందని బాలీవుడ్ టాక్. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దర్శకుడు సుజిత్ తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైమ్‌లో ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే ట్యాగ్‌లైన్ తెరపైకి వచ్చింది. ‘ఓజీ’ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని ప్రచారం జరిగింది. దీంతో పవన్–సుజిత్ కాంబినేషన్లోని మూవీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఆల్రెడీ విడుదలైన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో కొన్ని గ్యాంగ్‌వార్ సీన్స్ చూశాం. అలాగే ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న ‘పుష్ప: ది రూల్’లోనూ కొన్ని గ్యాంగ్ వార్ సన్నివేశాలు ఉంటాయనుకోవచ్చు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా సీనియర్ యాక్టర్ రాజశేఖర్ సైతం ఈ వెండితెర గ్యాంగ్‌వార్‌లో భాగమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే యువ హీరో సందీప్ కిషన్ టైటిల్ రోల్లో, విజయ్ సేతుపతి ఓ లీడ్ రోల్లో నటించిన ‘మైఖేల్’ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామానే. ఇంకోవైపు ‘మాస్టర్’ చిత్రం తర్వాత తమిళ ప్రముఖ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా రూపొందనుంది. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌వార్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఆల్రెడీ కోలీవుడ్‌లో మొదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు లోకేష్ అండ్ కో. అదే విధంగా ఈ సినిమా తర్వాత కార్తీతో ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తీయనున్నారు లోకేష్. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ‘ఖైదీ 2’ గ్యాంగ్‌వార్ ఫిల్మ్ అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు కన్నడంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960–1984 బ్యాక్‌డ్రాప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కాగా, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన దుల్కర్ సల్మాన్ చేస్తున్న మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు అభిషేక్ జోషి దర్శకుడు. దుల్కర్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనున్నాయి. -
ఖైదీ బిర్యానీ.. ఇది లేటేస్ట్ గురూ..
కాకినాడ/రాజమహేంద్రవరం సిటీ: లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఏ విషయంలోనైనా కావచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఇదెక్కువగా అందరిలో కనిపిస్తోంది. కొందరికి ఒక్క టిఫిన్ సెంటరే నచ్చుతుంది. మరొకరు తనకు నచ్చిన హోటల్లో తప్ప మరోచోట భోజనం చేయరు. ఏమైనప్పటికీ ఆహారాభిరుచికి ఇంచుమించు అందరూ అగ్రాసనం వేస్తారు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలూ ఇలానే వ్యవహరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫుడ్ సెంటర్లు, హోటళ్ల విషయంలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. చదవండి: రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు కాకినాడలో ఆహార ప్రియులను ఆకర్షించేందుకు ‘జైలు థీమ్’తో ఓ రెస్టారెంట్ ఏర్పాటైంది. భోజనం చేసే గది జైలులోని ఖైదీ సెల్లా ఉంటుంది. ఇక్కడ సర్వర్లు ఖైదీ డ్రెస్‌లు వేసుకుని మరీ వడ్డిస్తున్నారు. అంతేకాదు.. బిల్లును ‘బెయిల్’గా వ్యవహరిస్తున్నారిక్కడ. భానుగుడి సెంటర్లో కొత్త కాన్సెప్టుతో వచ్చిన ‘ఖైదీ బిర్యానీ’ రెస్టారెంట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోపల పూర్తిగా జైలు వాతావరణాన్ని తలపించేలా దీనిని తీర్చిదిద్దారు. అడుగు పెట్టగానే చుట్టూ జైలు ఊసలతో కూడిన 16 క్యాబిన్లు దర్శనమిస్తాయి. 20 మందికి సరిపడా ఓ వీఐపీ సెల్ కూడా ఉంటుంది. జిల్లాలో చైనీస్, కాంటినెంటల్, చెట్టినాడు స్పెషల్ ఇలా వివిధ ప్రాంతాల ఫుడ్ కూడా వడ్డిస్తున్నారు. రావులపాలెం మార్గంలో కూడా రకరకాల ఐటెమ్స్‌తో ఫుడ్ బాగుంటుందని అటుగా దూర ప్రయాణాలు చేసేవారు లొట్టలేసు కుంటూ తింటూంటారు. ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ పేరు వింటే ఫిదా ఫుడ్ మాట అటుంచితే కొన్ని రెస్టారెంట్లకు పెడుతున్న పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ పేర్లే భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారు అడుగులు ఇటువైపే పడుతున్నాయి. మచ్చుకు రాజమహేంద్రవరంలో కొన్ని పేర్లు ఇవి.. ‘కడుపు నింపుతాం, పొట్ట పెంచుదాం, నా పొట్ట నా ఇష్టం, పాతాళ భైరవి, మాయాబజార్, మిఠాయి పొట్లం, చిక్‌పెట్ దొన్నె బిర్యానీ హౌస్, పల్లెవంట,గోదావరి రుచులు ఇలా పలు రకాల పేర్లతో ఆహారప్రియుల మనసులు గెలుచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తినే ఆహారం ఒకటే అయినప్పటికీ వైవిధ్యభరితమైన పేర్లతో కస్టమర్ల మనసులో స్థానానికి ప్రయత్నిస్తున్నారు. రుచులకు బందీ కావల్సిందే.. ఆహార ప్రియులను మా హోటల్లో రుచులతో బందీ చేయాలన్నదే ‘జైల్ థీం’ ప్రధాన ఉద్దేశం. కాకినాడలో కొత్తదనంతో హోటల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ‘ఖైదీ బిర్యానీ’గా పేరు పెట్టాం. మేమిచ్చే ఆతిథ్యం, నాణ్యమైన ఆహారం, సరసమైన ధర చూసి ఆహార ప్రియులు మా ‘ఖైదీ బిర్యానీ’కి మళ్లీ మళ్లీ వచ్చేలా ఆకర్షించడమే ధ్యేయం. ప్రజలను బాగా ఆకట్టుకోగలమన్న నమ్మకం ఉంది. – నల్లపాటి సాయివేణు, ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యజమాని -
అజయ్ దేవగణ్ భార్యగా కాజల్..
హిందీ హీరో అజయ్ దేవగణ్‌తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్–కాజల్ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్. అయితే తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. -
మళ్లీ జంటగా...
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు చిత్రం ‘ఖైదీ’. రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. హీరోయిన్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్ కాబోతోంది. కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఓ పెద్ద మార్పు చేయబోతున్నారని తెలిసింది. హిందీ రీమేక్‌లో హీరోయిన్ పాత్రను కూడా చేర్చనున్నారట. ఈ పాత్ర కోసం కాజోల్‌ను సంప్రదించారని సమాచారం. గతంలో ‘హల్చల్, దిల్ క్యా కరే, యు మీ ఔర్ తుమ్’ వంటి సినిమాల్లో జంటగా నటించారు ఈ ఇద్దరూ. ‘ఖైదీ’లో నటిస్తే ఈ రియల్ లైఫ్ కపుల్‌ని మరోసారి జంటగా తెర మీద చూడొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. -
ఖైదీకి జోడి
ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. -
కన్నడంలోకి ఖైదీ
తెలుగు–తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ నటించనున్నారు. తాజాగా ‘ఖైదీ’ కన్నడంలో రీమేక్ కాబోతున్నట్టు తెలిసింది. కార్తీ చేసిన ఖైదీ పాత్రలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తారట. నంద కిశోర్ దర్శకుడు. -
హిందీలో ఖైదీ
గత ఏడాది దీపావళికి థియేటర్స్‌లో లక్ష్మీ బాంబ్లా పేలిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించారు. హీరోయిన్, పాటలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. తాజాగా ‘ఖైదీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్రనిర్మాత యస్ఆర్ ప్రభు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలసి ఈ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నారాయన. ‘ఖైదీ’ హిందీ రీమేక్ డైరెక్టర్, యాక్టర్స్ వివరాలను ప్రకటించలేదు. -
‘ఖైదీ’ సినిమా తరహా చోరీ
సాక్షి, గుడ్లూరు: జాతీయ రహదారిపై సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను దుండగులు హైజాక్ చేశారు. కంటైనర్‌కు వాహనాలు అడ్డు పెట్టి వాటిల్లో ఉన్న దుండగలు కంటైనర్ డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చెడ్లలో పడేసి కంటైనర్‌తో వెళ్లిపోయారు. సినీ పక్కీలో సంచలనం రేపిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు–శాంతినగర్ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడకు సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ శాంతినగర్–తెట్టు గ్రామాల మధ్యలోకి వచ్చే సరికి కారులో వచ్చిన దొంగలు కంటైనర్‌కు తమ కారును అడ్డు పెట్టారు. డ్రైవర్ రవి కంటైనర్‌ను ఆపేశాడు. కంటైనర్‌లోకి ఎక్కిన దుండగులు డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచి బట్టలు విప్పదీసి కాళ్లు, చేతులు గుడ్డ పేలికలతో కట్టేసి కళ్లకు గంతలు చుట్టారు. అనంతరం అతడిని రహదారి పక్కన ఉన్న చెట్లల్లో పడేసి కంటైనర్‌ను అపహరించుకెళ్లారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ పెద్దగా కేకలు వేస్తుండటంతో శాంతినగర్ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి చెట్ల కింద పడి ఉన్న డ్రైవర్ రవిని చూసి హైవే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే సిబ్బంది డ్రైవర్‌కు కట్టిన కట్లు విప్పదీసి 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్వంలో గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ఎస్ఐలు కంటైనర్ చోరీకి గురైన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. చికిత్స పొందిన అనంతరం డ్రైవర్‌ను తెట్టు తీసుకొచ్చి విచారించారు. తెట్టు జంక్షన్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం కంప్యూటర్లో పరిశీలించారు. కంటైనర్ సింగరాయకొండ వద్ద ఉన్న ఫెరల్ డిస్టిలరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉందని సమాచారం రావడంతో విచారణ కోసం అక్కడికి వెళ్లారు. కంటైనర్‌ను హైజాక్ చేయడంలో సుమారు 20 మంది దుండగులు పాల్గొని ఉంటారని సమాచారం. బీహార్ గ్యాంగ్ పనేనా? బీహార్ రాష్ట్రానికి చెందిన పారంగి ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన విధానం ఆధారంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వీరు క్రూరులని, చోరీ సమయంలో డ్రైవర్‌ను కచ్చితంగా చంపుతారని, ఇక్కడ ఉన్న నిందితుల్లో డ్రైవర్‌ను ఒకరు చంపుదామంటే మరొకరు చంపొద్దని వారించారని, చివరకు డ్రైవర్‌ను కట్టేసి కళ్లకు గంతలు చుట్టి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసుకు పారంగి ముఠాతో సంబంధం ఉందా..లేదా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహా చోరీ కంటైనర్ చోరీ తీరు ఇటీవల తమిళ నటుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహాలో ఉందని పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చోరీకి గురైన కంటైనర్‌ను మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. అందులోని సిగరెట్ బాక్స్‌లను మాత్రం ప్రస్తుతానికి గుర్తించలేకపోయారు. ఐటీసీ కంపెనీకి చెందిన సిగిరెట్ల కంటైనర్ బెంగళూరు నుంచి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటలకు విజయవాడలోని గూడవల్లి గోల్డెన్ రాయల్ వేర్ హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బయల్దేరింది. కంటైనర్ తెట్టు సమీపంలోని శాంతినగర్ వద్దకు రాగానే సుమారు 10 మంది దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మూడు లారీల్లో వచ్చి కంటైనర్ వెళ్లేందుకు వీల్లేకుండా ముందు, వెనుక లారీలు ఆపారు. ఆ తర్వాత కంటైనర్ డ్రైవర్ బి.రవిపై దాడి చేసి గాయపరిచి కంటైనర్‌తో పరారయ్యారు. సింగరాయకొండ ఎస్ఐ మేడా శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద కంటైనర్‌ను హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే అప్పటికే కంటైనర్‌లో 531 సిగిరెట్ పెట్టెలు ఉండాల్సి ఉండగా కేవలం 125 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. చోరీ సొత్తు విలువ సుమారు 3.50 కోట్ల రూపాయలుగా పోలీసులు పేర్కొంటున్నారు. మిస్టరీగా కంటైనర్ చోరీ ఘటన.. కంటైనర్ చోరీ ఘటన మిస్టరీగా మారింది. చోరీ జరిగిన తీరు గమనిస్తుంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కంటైనర్‌కు జీపీఆర్ఎస్ సిస్టం ఉంది. దీని ప్రకారం కంటైనర్ ఎక్కడ ఉందో వెంటనే గుర్తించవచ్చు. కంటైనర్‌ను దుండగులు సింగరాయకొండ పట్టణం నుంచి పాకల రోడ్డు వరకు తీసుకొచ్చి మళ్లీ కావలి వైపు బయల్దేరి చివరకు పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జీపీఆర్ఎస్ విధానం ద్వారా కంటైనర్‌ను గుర్తించి వెళ్లేలోపు దుండగులు కంటైనర్‌ను ఫ్యాక్టరీ వద్ద వదిలి వేరే వాహనంలో కావలి వైపు పరారయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంటైనర్ చోరీకి గురైన సమాచారం రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ స్టెల్లార్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధికి సుమారు రాత్రి 11 గంటలకు అందింది. అంతేగాక కంటైనర్ సింగరాయకొండ వద్దే చోరీకి గురైందని వారికి పక్కా సమాచారం అందింది. -
అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ
‘‘ఖైదీ’ సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్. ఇంతకు ముందు నన్ను ‘ఆవారా’ కార్తీ అనేవారు.. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా ‘ఖైదీ’ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు కార్తీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ ఈ నెల 25న విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తమిళనాడు, కేరళలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘ఖైదీ’లో ఢిల్లీ (కార్తీ పాత్ర పేరు)లాంటి పాత్ర నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్ రాసిన, తీసిన విధానం అద్భుతం. నాకు ఒక బామ్మ ఫోన్ చేసి, మంచి సినిమా, గొప్ప సినిమా చేశావని ప్రశంసించారు.. అదే నిజమైన సక్సెస్. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్.ఆర్. ప్రభుకు థ్యాంక్స్. ‘ఖైదీ’ టైటిల్ పెడితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయ్యింది. రవితేజగారు ఫోన్ చేసి, ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. కేకే రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మా సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది’’ అన్నారు. ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎస్.ఆర్. ప్రభు. -
ఖైదీ, అనగనగా ఒకరోజు, ఓయ్-గమ్యం..
కథలను హీరో చెప్తాడు. హీరోయిన్ చెప్తుంది. కేరెక్టర్ ఆర్టిస్ట్ చెప్తాడు. కాని ఒక్కోసారి రోడ్ కూడా చెప్తుంది.కథ రోడ్ మీద నడుస్తుంది. రోడ్ కథలో పాత్ర అవుతుంది. హాలీవుడ్లో రోడ్ మూవీస్ ప్రత్యేకమైనవి.మన దేశంలో అలాంటి కథలు తక్కువ. కాని తీసిన రోడ్ మూవీస్ ప్రేక్షకులకు నచ్చాయి. నల్లరోడ్డు మీద తెల్ల అక్షరాలతో చెక్కిన కథలు ఇవి. మనిషి ప్రయాణం చేస్తాడు. ఒక్కోసారి తెలిసిన గమ్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి తెలియని లక్ష్యం కోసం ప్రయాణిస్తాడు. ఒక్కోసారి భౌతిక ప్రయాణం చేస్తాడు. మరోసారి ఆత్మిక ప్రయాణం చేస్తాడు. ఒక ప్రయాణంలో పరులను తెలుసుకుంటాడు. ఒక ప్రయాణంలో తనను తాను కనుక్కుంటాడు. ఈ మొత్తం ప్రయాణాల్లో ఎవరు తోడు ఉన్నా ఎవరు లేకపోయినా తప్పక ఉండే పాత్ర ఒకే ఒక్కటి.æరోడ్డు. ఆ రోడ్డుకు కథంతా తెలుసు లేదా అదే కథంతా మనకు చెప్తుంటుంది. ఖైదీ పదేళ్ల జైలు శిక్ష అనుభవించి ఆ రోజు విడుదలవుతాడు కార్తి. సాయంత్రం బస్సెక్కి అనాథ శరణాలయంలో ఉన్న కూతురిని మరుసటిరోజు ఉదయం కలవాలి. కాని అతడి వాలకం చూసి పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేస్తారు. అప్పటికే పోలీసులు మరోచోట దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకొని ఎస్.పి.ఆఫీస్‌లో దాచి ఉంటారు. వాటి కోసం మాదక ద్రవ్యాల ముఠా ఆ రాత్రి ఎస్.పి. ఆఫీస్ మీద దాడి చేయాలనుకుంటుంది. పోలీస్ ఆఫీసర్లందరూ ఒకచోట పార్టీ చేసుకుంటుంటే వారు తాగే మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతుంది ముఠా. ఆ మద్యం తాగి ఆఫీసర్లు చావు బతుకుల్లోకి వెళతారు. ఒక్క ఆఫీసరే మద్యం తాగక స్పృహలో ఉంటాడు. అతనికి గత్యంతరం లేక కార్తిని సాయం కోరతాడు. మీడియాకు తెలియకుండా పోలీసులందరికీ వేరే ఊరిలో ఉన్న ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించాలి. అలాగే ఎస్.పి. ఆఫీస్ మీద జరిగే దాడిని ఎదుర్కోవాలి. ఈ రెంటి కోసం మాత్రమే కాకుండా తన కూతురు కోసం కూడా కార్తి చేసే ప్రయాణమే ‘ఖైదీ’. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆరేడు గంటల్లో జరిగే ఈ కథను ఎంతో బిగువుగా చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దుర్మార్గం తన లక్ష్యాన్ని చేరే లోపల మంచే తన గమ్యానికి చేరుతుందని ఈ కథ చెబుతుంది. మానవోద్వేగాలు బయల్పడాలంటే మనిషికి ఒక గట్టి ప్రయాణం తగలాలని చెబుతుందీ సినిమా. నిమజ్జనంతో మొదలయ్యి... తెలుగులో ‘రోడ్డు ప్రయాణం’ ప్రధానాంశంగా వచ్చిన సినిమాలలో ‘నిమజ్జనం’ (1979) ను మొదట చెప్పుకోవాలి. ఇందులో మామగారి అస్తికలు గంగలో నిమజ్జనం చేయడానికి భర్తతోపాటు ఎడ్లబండిలో బయలు దేరుతుంది శారద. ఊరి నుంచి చాలా దూరంలో ఉన్న రైలుస్టేషన్కి ఎడ్లబండిలో ప్రయాణం చేయాలి. కాని బండివాడు శారద మీద కన్నేస్తాడు. అస్తికల కుండ నేల జారేలా చేసి భర్తను అది వెతుక్కుంటూ వెళ్లేలా చేసి ఆమెపై అఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం ఆమె ఎవరితోనూ చెప్పుకోలేక గంగలో నిమజ్జనం సమయంలో నీట మునిగి ప్రాణాలు వదులుతుంది. తిరుగు ప్రయాణంలో ఒక్కడే వచ్చిన భర్తను చూసి బండివాడు భార్య గురించి వాకబు చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతాడు. పాపభీతితో, పశ్చాత్తాపంతో బండివాడు తాను చేసిన తప్పు ఒప్పుకొని ప్రాణం వొదులుతాడు. నాగార్జున ‘చైతన్య’– వర్మ ‘అనగనగా ఒకరోజు’ ప్రతాప్‌పోతన్ తీసిన ‘చైతన్య’ తెలుగులో పూర్తిస్థాయి రోడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో మద్రాసు నుంచి గోవా వరకు ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో దొంగలు, స్మగ్లర్లు, పోలీసులు, హీరో, హీరోయిన్ అందరూ ఉంటారు. అయితే సరైన కథాంశమే లేదు. ఆ తర్వాత వచ్చిన ఎస్.వి. కృష్ణారెడ్డి ‘గన్ షాట్’(1996) ఒక సైకో నుంచి తప్పించుకోవడానికి హీరో అలీ చేసే రోడ్డు ప్రయాణం కూడా నిరాశ పరిచింది. కాని రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒకరోజు’ హిట్టయ్యింది. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఒకరోజులో ఎన్ని అనూహ్య సంఘటనలు ఎదుర్కొందనేది కథ. శ్రీదేవి, వెంకటేశ్‌ల ‘క్షణక్షణం’ కూడా రోడ్ మూవీనే. సంబంధం లేని చోరీ కేసులో తామే నిందితులమని భావించి వీరు అడవుల్లోకి పారిపోతారు. ఆ తర్వాత సిటీకి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణాల మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఓయ్– గమ్యం తాను ప్రేమించిన అమ్మాయి కేన్సర్ వల్ల మరి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నదని తెలిసిన అబ్బాయి ఆమె తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న కోరికలు కొన్నింటిని తీర్చడానికి ఆమెను తీసుకొని ప్రయాణం మొదలుపెడతాడు. సిద్ధార్థ, షామిలి నటించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కాని క్రిష్ తన తొలి సినిమాగా తీసిన రోడ్ మూవీ ‘గమ్యం’ ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందింది. ఒక ధనిక కుర్రవాడు శర్వానంద్ తన ప్రియురాలిని వెతుక్కుం టూ చేసే ప్రయాణం ఈ కథ. ఈ ప్రయాణంలో అతడు నిజమైన భారతదేశాన్ని కనుగొంటాడు. జనం ఎలా ఉన్నారో చూస్తాడు. ప్రజల కోసం అడవుల్లో ఉండి పని చేయడం కన్నా ప్రజల మధ్య ఉండి పని చేయడం మంచిదని గ్రహిస్తాడు. క్రిష్‌కు పేరు తెచ్చిన రోడ్ మూవీ ఇది. ఖలేజా త్రివిక్రమ్ తీసిన రోడ్ మూవీ ‘ఖలేజా’ కల్ట్ మూవీగా నిలిచింది. రిలీజైనప్పుడు కన్నా టీవీల్లో ఇది ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ‘గమ్యం’ ను పోలిన కథతో తయారైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మనిషి విలువలతో ప్రయాణం చెయ్యాలని చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రేమ కోసం సఫలమైన ప్రయాణం చేయాలని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చెబుతుంది. ఒక పిల్లవాడితో ఏర్పడిన అనుబంధంతో విలన్ భరతం పట్టడానికి సాయితేజ్ చేసిన ప్రయాణమే ‘సుప్రీమ్’. ముగింపు: కథలన్నీ కంచికి చేరతాయని పెద్దల మాట. ఆ కంచికి చేరడంలో కొన్ని కథలు రోడ్డు మీద జారిపోయి ఉంటాయి. కంచికి పోతూ పోతూ మనకూ తారసపడుతూ ఉంటాయి. అందువల్ల మంచి కథ కోసం రోడ్డు మీద పడి వాటిని పట్టుకోవడంలో తప్పులేదు. రోడ్డుతోపాటు జరిగే ఈ సినీ ప్రయాణం కొనసాగాలి. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
మేకింగ్ ఆఫ్ మూవీ-ఖైదీ
-
‘ఖైదీ’ మూవీ రివ్యూ
మూవీ : ఖైదీ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : కార్తీ, నరైన్, రమణ, జార్జ్ మార్యన్ తదితరులు ఎడిటింగ్ : ఫిలోమన్ రాజు సంగీతం : సామ్ సీఎస్ డైరెక్టర్ : లోకేశ్ కనగరాజ్ నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ హిట్‌ను సాధించలేకపోయాయి. అనంతరం కమర్షియల్ హంగులతో వచ్చిన ‘దేవ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని తెలుగు సూపర్ హిట్ టైటిల్ ‘ఖైదీ’తో థియేటర్ తలుపులు తట్టాడు కార్తీ. ఖైదీ అనగానే తెలుగు ప్రేక్షకుల అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి కార్తీ ఖైదీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా? చాలా కాలం తర్వాత కార్తీ కమర్షియల్ హిట్ సాధించాడా? హీరోయిన్, కామెడీ, రొమాన్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారా? చూద్దాం. కథ: 80 కిలోమీటర్లు.. నాలుగు గంటలు.. పదేళ్ల నిరీక్షణ.. చావుకు దగ్గరగా.. ఆశకు దూరంగా ఇది దిల్లీ(కార్తీ) పరిస్థితి. పదేళ్ల జైలు శిక్ష అనంతరం తన బిడ్డను చూడటానికి ప్రయాణం మొదలు పెట్టిన దిల్లీ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ బిజయ్(నరైన్)కు సహాయం చేయాల్సి వస్తుంది. బిజయ్‌తో సహా మరో నలుగురు పోలీస్ ఆఫీసర్లను చంపడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. అంతేకాకుండా ఈ ఐదుగురు పోలీసులతో పాటు పెను ప్రమాదంలో ఉన్న మరో నలుగురు యువకులు, ఓ యువతిని కాపాడాల్సిన బాధ్యత దిల్లీపై ఉంటుంది. అసలు ఆ ముఠా బిజయ్‌పై, పోలీస్ స్టేషన్‌పై ఎందుకు దాడి చేశారు? వందలమంది శత్రు సైన్యంతో పోరాడి దిల్లీ వారిని కాపాడాడా? చివరకు తన బిడ్డను కలుసుకున్నాడా? అనేదే మిగతా కథ. నటీనటులు: ఎప్పుడూ ప్రయోగాత్మకమైన, మంచి కథలను ఎంచుకునే కార్తీ. ఈ సారి కూడా ఓ విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా మొత్తం మాసిన గడ్డం, లుంగీతో రఫ్ లుక్‌లో కనిపిస్తాడు. ఇక యాక్షన్ సీన్లలో మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు తన బిడ్డను చూడటానికి అతడు పడే తాపత్రయం, కొన్ని ఎమోషన్ సీన్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఇక కార్తీతో పాటు నరైన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. కానిస్టేబుల్ పాత్రతో పాటు కార్తీ, నరైన్‌లతో సినిమా మొత్తం కనిపించే కుర్రాడు ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడితో కార్తీ అక్కడక్కడా చేసే కామెడీ పండింది. చాలాకాలం తర్వాత తెరమీద కనిపించిన రమణ.. విలన్ పాత్రలో జీవించాడు. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: చాలా కాలంగా కమర్షియల్ హిట్ లేని కార్తీ ఈ కథను ఓకే చేసి రిస్క్ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ, హీరోయిన్, రొమాన్స్, పాటలు లేకుండా కమర్షియల్ హిట్ సాధించడం సాధ్యం కాదు. అయితే హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. దీంతో ప్రయోగాత్మకంగా యువ దర్శకుడు లోకేశ్‌ను, కథను పూర్తిగా నమ్మి కార్తీ ఈ చిత్రానికి ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకొని.. సందీప్ కిషన్‌తో ‘మానగరం’వంటి హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ ఈ సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై మోశాడు. ఒక రోజు రాత్రి నాలుగు గంటలు జరిగే ప్రయాణానికి సస్సెన్స్, థ్రిల్స్‌ను జోడించి కథ, కథనాన్ని ముందుకు నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. తను అనుకున్న కథను ఎక్కడా డీవియేట్ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ముఖ్యం. దీంతో పక్కాగా స్క్రీన్‌ప్లేను ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ విజయవంతమయ్యాడు. ఫస్టాఫ్‌లో కొంచెం సాగదీసినట్లు అనిపించినా.. ఆ లోపాన్ని సెకండాఫ్‌లో కవర్ చేశారు. అయితే కొన్ని చోట్ల ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఎక్కడా సీన్లు అతికించినట్టు కాకుండా కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రజంట్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఇక రెండు ప్రదేశాల్లో జరిగే యాక్షన్ సీన్స్‌ను ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తెరపై చక్కగా చూపించారు. ఇక సినిమా రాత్రి పూట జరిగే కథ. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మెచ్చుకునేలా ఉంది. పాటలు లేనప్పటికీ కథనానికి తగినట్లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెరుపులు మెరిపిస్తుంది. ఫైట్ మాస్టర్స్ కొత్త యాక్షన్ సీన్స్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక క్లైమాక్స్‌లో దీపావళి ముందే వచ్చిందా అన్నట్లు తుపాకుల మోతతో సినిమా ముగుస్తుంది. ప్లస్ పాయింట్స్ కథ, కథనం కార్తీ నటన యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ విలువలు లేకపోవడం కొన్ని చోట్ల సీన్ల సాగదీత - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
కార్తీ సినిమాలకు పెద్ద అభిమానిని
‘‘కార్తీ ‘ఆవారా’ సినిమాని బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను. ‘ఖైదీ’ ట్రైలర్ నచ్చి ట్వీట్ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. కార్తీ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని’’ అన్నారు అడివి శేష్. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘బెంగాల్ టైగర్, పంతం’ లతో నిర్మాతగా మంచి పేరొచ్చింది. ‘ఖైదీ’ సినిమాతో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు.. మాది అలాంటి సినిమానే’’ అన్నారు. ‘‘ఖైదీ’ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ఆర్ ప్రభు. కార్తీ మాట్లాడుతూ – ‘‘నేను కొత్త ప్రయోగాలు చేయడానికి ‘ఖాకీ’ సినిమా చిరునామా అయిపోయింది. ఆ చిత్రం తర్వాత వస్తోన్న అలాంటి సినిమా ‘ఖైదీ’’ అన్నారు. ‘‘ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో ఒక్కటైన తెలుగుకి పరిచయం అవడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటుడు నరేన్. నిర్మాత ‘ఠాగూర్’ మధు, మాటల రచయిత రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. -
‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్
‘‘నా సినిమా హిట్ అయితే ఎందుకు ఆడింది?, ఫ్లాప్ అయితే ఎందుకు ఆడలేదు? అని ఎక్కువగా ఆలోచించను. అలా ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం (నవ్వుతూ). నేనెప్పుడు ఒక్కటే ఫాలో అవుతా. నేను చేసే సినిమా నాకు నచ్చాలి. నాకే నచ్చకపోతే మిగతావాళ్లకు నచ్చాలని ఎలా కోరుకోగలను’’ అని కార్తీ అన్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత రాధామోహన్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ పంచుకున్న విశేషాలు... ► ఒక రోజు రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథే ‘ఖైదీ’ సినిమా. పదేళ్ల నుంచి జైల్లో ఉండి విడుదలైన ఖైదీ పాత్రలో కనిపిస్తాను. జైల్లో ఉండటంతో పదేళ్లుగా తన పాపను కూడా చూడలేడు. మొదటిసారి తన కూతుర్ని చూడబోయే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి పాపను చూస్తానా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. పోలీసులు ఉన్నారనే ధీమాతో మనందరం హాయిగా నిద్రపోతున్నాం. పోలీసులు అనేవాళ్లు లేకుంటే పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాం. ► ‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్ ఉన్నాయి. అందుకే పాటలు, రొమాన్స్ పెట్టలేదు. ఇది ఫుల్ మాస్ సినిమా. నా పాత్ర ఊరమాస్‌గా ఉంటుంది. సినిమాలో నేను మాత్రమే హీరోని కాదు. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హీరోలా మారుతుంటుంది. టైటిల్ కూడా సూట్ అవుతుందని ‘ఖైదీ’ పెట్టాం. ► దర్శకుడు లోకేశ్‌కి ఇది రెండవ సినిమా. ఇంతకు ముందు ‘మానగరం’ సినిమా తెరకెక్కించారు. అంతకు ముందు కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించారు. ‘ఖైదీ’ ఇంటర్నేషన్ల్ రేంజ్ ఫిల్మ్. హాలీవుడ్ ‘బ్యాట్‌మ్యాన్, సూపర్‌మేన్’ సినిమా స్టయిల్ ట్రీట్మెంట్ ఇచ్చాం. భవిష్యత్తులో ‘ఖైదీ’ చేశామని కచ్చితంగా గర్వపడతాం. ► ‘విక్రమార్కుడు’ తమిళ రీమేక్ చేస్తున్నప్పుడు నాకు ఒక పాప ఉన్నట్టు ఊహించుకొని ఎమోషన్ని పండించాలి. అప్పుడు నాకు కూతురు లేదు.. ఇప్పుడు ఉంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కూతురు అనగానే తండ్రికి ఒకలాంటి సంరక్షించే బాధ్యత ఉంటుంది. ఈ భావోద్వేగాన్ని ఈ సినిమాలో చూపించాం. ► ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ వల్ల ప్రపంచ సినిమాను ఫోన్లోనే వీక్షిస్తున్నారు. ‘డిజిటల్లో కేవలం సిటీ వాళ్లే చూస్తారులే అనుకునేవాణ్ణి’. కానీ, షూటింగ్ కోసం ఓ ఊరు వెళితే ‘సార్.. ‘మనీ హెస్ట్’ షో చూశారా? అని అడుగుతున్నారు. పండగకి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏది బావుంటే దాన్ని చూస్తారు. పండగ టైంలో ప్రేక్షకులకు ఆప్షన్స్ ఉండాలి. బావుంటే రెండు సినిమాలూ చూస్తారు. ఈ సంక్రాంతికి తమిళంలో విడుదలైన ‘పేట్టా, విశ్వాసం’ రెండూ హిట్ అయ్యాయి. ► ఏ పాత్ర అయినా నన్ను చాలెంజ్ చేయాలి. ఈ సినిమా కోసం నిజంగానే ఖైదీలను కలిశాం. వాళ్ల నుంచి సమాచారం తీసుకొని నా పాత్రను చేశాను. నా దృష్టిలో అందరూ ప్రేక్షకులే. తెలుగు, తమిళం అని వ్యత్యాసం ఉండదు. రెండు రాష్ట్రాలకు కొన్ని పోలికలు ఉంటాయి. ► జోసెఫ్గారి దర్శకత్వంలో వదిన జ్యోతికగారితో ఓ సినిమా చేశాను. అందులో మేమిద్దరం అక్కా తమ్ముడిగా నటించాం. ప్రస్తుతం ‘సుల్తాన్’ అనే సినిమా చేస్తున్నాను. ► రజనీకాంత్, విజయ్, అజిత్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులందరూ మీతో పని చేసినవాళ్లే. మీరు వాళ్లకు లక్కీ హీరో కదా? అని అడగ్గా – ‘అది నా అదృష్టం. వాళ్లకు ప్రతిభ ఉంది కాబట్టి వరుసగా మంచి సినిమాలు చేస్తున్నారు. ‘ఖైదీ’ టీజర్ రాగానే విజయ్‌గారు మా దర్శకుడికి ఫోన్ చేసి అవకాశం ఇచ్చారు. -
ఖైదీ విడుదల
వెండితెర ‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారైంది. కార్తీ హీరోగా ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా గురువారం వెల్లడించింది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం విశేషం. ఓ నేరం చేసి దాదాపు పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన కూతుర్ని కలసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరోవైపు తమిళ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’) కూడా ఈ నెల 25నే విడుదల కానుంది. -
నో సాంగ్స్, నో రొమాన్స్.. జస్ట్ యాక్షన్
‘దేవ్’చిత్రంతో నిరాశపర్చిన హీరో కార్తీ.. తాజాగా ‘ఖైదీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్ఛర్ సంస్ధ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విజయ దశమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా.. తాజాగా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో కార్తీ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ‘నో సాంగ్స్ ,నో రొమాన్స్.. జస్ట్ యాక్షన్ అండ్ థ్రిల్’అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో కార్తీ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ట్రైలర్లో ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్’ అంటూ కార్తీ చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ మాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాతో కార్తీ మళ్లీ విజయాలబాట పడతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కార్తి ‘ఖైదీ’ మూవీ స్టిల్స్
-
కార్తీతో కోలీవుడ్ ఎంట్రీ
నటుడు కార్తీ కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈయన నటించిన దేవ్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో కార్తీ తాజా చిత్రాల విషయంలో జోరు పెంచారనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఖైదీ అనే చిత్రంలో నటిస్తున్నారు. మానగరం ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దీనికి దర్శకుడు. ఇది ఒక రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఇందులో హీరోయిన్ కూడా ఉండదట. కాగా ఖైదీ చిత్ర షూటింగ్ పూర్తి కావస్తుండడంతో కార్తీ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. తాజా చిత్రం బుధవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కార్తీతో రొమాన్స్ చేయనుంది. ఇదే ఈ అమ్మడి కోలీవుడ్ ఎంట్రీ చిత్రం. నటుడు యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్న దీనికి రెమో చిత్రం ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్–మెర్విన్ల ద్వయం ఈ చిత్రానికి సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను కంటిన్యూగా చెన్నై ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్స్‌ను వేస్తున్నట్లు చెప్పారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు చిత్రయూనిట్. -
మిస్టర్ ఖైదీ
తమిళ నటుడు కార్తీ మంచి ఊపు మీద ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో జోరు పెంచారు. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుంది. అలాగే ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ కార్తీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ఖైదీ’ అనే టైటిల్ పెట్టారని కోలీవుడ్ టాక్. మరి.. కార్తీ ఖైదీగా ఎందుకు మారారు? అనే విషయాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... టాలీవుడ్లోచిరంజీవికి ‘ఖైదీ’ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు కార్తీ కెరీర్‌కు ఈ టైటిల్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో మరి. -
కమెడియన్ సినిమాకు మెగాస్టార్ టైటిల్
శ్రీ భవాని ఫిలింస్ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఖైదీ.ఈ సినిమాను హనుమాన్ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా విజయదశమి కానుకగా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానుంది. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’ . అలాంటి గొప్ప సినిమా టైటిల్ తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్ హీరోగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’ అని తెలిపారు. -
పెట్రోల్ బంకు సొత్తుతో జీవిత ఖైదీ పరార్
నల్గొండ: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారయ్యాడు. జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంకులో ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం చిమ్మటవారి పాలేనికి చెంది జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉన్న శివకృష్ణ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బంకులో డ్యూటీ చేసి బంకుకు వచ్చిన ఆదాయం రూ.25,000 తీసుకుని పరారయ్యాడు. ఇతని కోసం జైలు అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. -
కడప జైలులో ఖైదీ ఆత్మహత్య
సాక్షి, కడప : కడప కేంద్ర కారాగారంలో శ్రీనివాసరెడ్డి అనే ఖైదీ బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. చీటింగ్ కేసులో 10 నెలల శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరెడ్డి తన బ్యారక్‌లోనే లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన జైలు సిబ్బంది అతనిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. -
ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?
డోన్ టౌన్: ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయేందుకు కారణంగా పేర్కొంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విధుల నుంచి తొలగిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. డోన్ పట్టణంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడి గతంలో బెయిల్‌పై విడుదలైన నారాయణస్వామి, కొండలరెడ్డి అనే ఇరువురూ ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి ముద్దాయిలను డోన్ కోర్టులో ఈ నెల 7న హాజరు పరిచారు. వీరిని తిరిగి తెనాలి సబ్‌జైలుకు రైలులో తరలిస్తుండగా ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వేష్టేషన్లో పోలీసుల కన్నుగప్పి పారిపోయారు. విచారణ జరిపిన అనంతరం జిల్లా ఎస్పీ రవికృష్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై డోన్ ఎస్సై శ్రీనివాసులును వివరణ కోరగా కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదన్నారు.