
నల్గొండ: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారయ్యాడు. జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంకులో ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం చిమ్మటవారి పాలేనికి చెంది జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉన్న శివకృష్ణ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బంకులో డ్యూటీ చేసి బంకుకు వచ్చిన ఆదాయం రూ.25,000 తీసుకుని పరారయ్యాడు. ఇతని కోసం జైలు అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment