![Prisoner Gold Rings In Nalgonda District Jail - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/15/Nlg-Jail.jpg.webp?itok=de-h_RN4)
సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు.
Comments
Please login to add a commentAdd a comment