gold rings
-
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి. -
నాన్నా క్షమించు.. ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
వరంగల్: ఉంగరం పోయిందని మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల హేమలతరెడ్డి(19) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హేమలతరెడ్డి హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ కోసం ఇటీవల ఇంటికి వచ్చిన హేమలతరెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వాళ్లు ఏమైనా అంటారనే భయంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి మద్దుల జానకీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు. -
ఉంగరాలు మింగేసిన దొంగ
బనశంకరి: పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు. ఈ సంఘటన కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
'అమ్మ' జయంతి సందర్భంగా బంగారు ఉంగరాల పంపిణీ
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. వివరాల ప్రకారం.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు. జయలలిత జయంతి సందర్భంగా తమ కార్యకర్తలంతా పేదలకు సాయం చేయడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నాడీఎంకే పార్టీ పిలుపునిచ్చింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జయలలితకు నివాళులర్పించారు. అలాగే తలైవికి నివాళిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటి ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24ను మహిళలు, చిన్నారుల భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. చదవండి: ఆమె ఆదర్శమైన ముఖ్యమంత్రి : కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి -
కేరింగ్
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బిగిల్’ (విజిల్ అని అర్థం). ఫీమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ చిత్రబృందం విజయ్ అన్నకు విజిల్ కొట్టు అంటున్నారు. విజిల్ కొట్టే పని ఏం చేశారు? అంటే.. ఈ సినిమా పూర్తి కావస్తున్న సందర్భంగా పని చేసిన చిత్రబృందానికి గోల్డ్ రింగ్స్‌ను బహుమతిగా అందించారట. ప్రతి సినిమా పూర్తయ్యే సందర్భంలో తన టీమ్‌లో అందరికీ బహుమతులు అందించడం విజయ్ అలవాటు. అలా ఈసారి బిగిల్ టీమ్ అందరికీ ‘బిగిల్’ అని రాసి ఉన్న ఉంగరాలను అందించారు విజయ్. కొందరికి ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్‌బాల్‌ను కూడా బహూకరించారు. తమ హీరో తమ పట్ల చూపించిన కే–రింగ్ చూసి విజయ్‌ని ‘గోల్డెన్ స్టార్’ అంటున్నారు ‘బిగిల్’ యూనిట్. -
ఖైదీ బంగారం మాయం..!
సాక్షి, నల్గొండ: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి చెందిన బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. 80 వేల విలువైన ఉంగరాలను ఎవరో తస్కరించారని జైళ్ల శాఖ డీఐజీ సైదయ్య వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనపై విచారణ చేసేందుకు స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా లాకర్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేవారు. -
వలంటైన్స్ డే.. ట్రెండీ హార్ట్స్
సాక్షి, సిటీబ్యూరో: రానున్న వలంటైన్స్ డేను పురస్కరించుకుని మార్కెట్లోకి వెరైటీ డిజైన్లతో ఆభరణాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మెలొర్రా.. హృదయాకార డిజైన్‌ను మధ్యభాగంలో అమర్చి రూపుదిద్దిన ఆభరణాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ‘ట్రెండీ హార్ట్స్’ పేరుతో ఈ కలెక్షన్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసినట్లు సంస్థ సంస్థ సీఈఓ సరోజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్కో సీక్వెన్స్, నైఫ్ ప్లీట్స్, ఫ్లవర్ బొకె, యానిమల్ ప్రింట్, బౌస్ అండ్ నియోన్ తదితర వెరైటీలు ఈ కలెక్షన్లో ఉన్నాయని, తమ ఇష్టసఖికి గుర్తుండిపోయేలా అందమైన బహుమతిని ఇవ్వాలని ఆశించే పురుషుల అభిరుచులకి తగ్గట్లుగా ఇవి ఆకట్టుకుంటాయని ఆమె వివరించారు. -
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్
-
ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు
బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు. మన సాంప్రదాయాన్ని తీసుకుంటే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. కాలక్రమేణా పురుషులు ఆభరణాలు ధరించటం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ టేస్టు మారుతోంది. మెడలో సింపుల్‌గా చైన్‌తో కాకుండా... ఒంటి నిండా బంగారం దిగేసుకుని మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ అనే వ్యాపారి అలా ఇలా కాదు...ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ బంగారు చొక్కా బరువు నాలుగు కిలోలు. ముంబై సమీపంలోని యోలా వీధిలో ఇతగాడు పసిడి చొక్కాతో పాటు ఒంటిపై మూడు కిలోల నగలు ధరించి మహిళలకు పోటీ ఇవ్వటం విశేషం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లా పట్టణానికి చెందిన మహేశ్ సోనీ చేతినిండా ఉంగరాలు.. ధగధగ మెరిసే బంగారు బ్రెస్లెట్తో ఉంగరాల బంగార్రాజుగా గుర్తింపు పొందారు. బంగారం వ్యాపారం చేసే మహేశ్ తన చేతివేళ్లు అన్నింటికీ కలిపి ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాలతో పాటు ఒక పెద్ద బ్రేస్లెట్, బంగారు గొలుసును ఆయన గత పుష్కరకాలంగా ధరిస్తూ వస్తున్నారు. వాటి ఖరీదు అక్షరాల కోటి రూపాయలు. -
లో దుస్తుల్లో బంగారు తీగలు
శంషాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాములు పట్టివేత మరో వ్యక్తి నుంచి 465 గ్రాముల ఆభరణాలు స్వాధీనం శంషాబాద్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి లో దుస్తుల్లో బంగారు తీగలు తెచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 467 గ్రాముల బంగారు తీగలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు అనుమతి లేకుండా తీసుకొచ్చిన 465గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్ ఇక్బాల్(28) ఏఐ 952 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీలో పన్నెండు బ్రాలు కనిపించడంతో వాటిని నిశితంగా పరిశీలించారు. వాటిల్లో 24 తెలుపు రంగు తీగలను గుర్తించారు. ఇక్బాల్ బంగారు తీగలకు వెండి పూత పూసి లో దుస్తుల్లో చొప్పించాడని గుర్తించారు. 467 గ్రాముల బరువున్న ఆ బంగారు తీగలను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విమానంలో వచ్చిన షేక్ జలీల్ సుమారు 465 గ్రాముల బరువున్న ఆభరణాలను ధ రించాడు. వాటికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి రశీదులు లేకపోవడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెండు ఘటనల్లో సుమారు రూ.28 లక్షలు విలువ చేసే 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.