
విజయ్, ‘బిగిల్’ ఉంగరం
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బిగిల్’ (విజిల్ అని అర్థం). ఫీమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ చిత్రబృందం విజయ్ అన్నకు విజిల్ కొట్టు అంటున్నారు. విజిల్ కొట్టే పని ఏం చేశారు? అంటే.. ఈ సినిమా పూర్తి కావస్తున్న సందర్భంగా పని చేసిన చిత్రబృందానికి గోల్డ్ రింగ్స్‌ను బహుమతిగా అందించారట.
ప్రతి సినిమా పూర్తయ్యే సందర్భంలో తన టీమ్‌లో అందరికీ బహుమతులు అందించడం విజయ్ అలవాటు. అలా ఈసారి బిగిల్ టీమ్ అందరికీ ‘బిగిల్’ అని రాసి ఉన్న ఉంగరాలను అందించారు విజయ్. కొందరికి ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్‌బాల్‌ను కూడా బహూకరించారు. తమ హీరో తమ పట్ల చూపించిన కే–రింగ్ చూసి విజయ్‌ని ‘గోల్డెన్ స్టార్’ అంటున్నారు ‘బిగిల్’ యూనిట్.
Comments
Please login to add a commentAdd a comment