అట్లీ, మహేశ్ కోనేరు, హరీశ్ శంకర్
‘‘తమిళంలో ‘బిగిల్’ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో ‘విజిల్’కి కూడా అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఇదేదో తమిళ సినిమా అనో.. దక్షిణాది సినిమా అనో చెప్పడం కంటే ఇండియన్ సినిమా అని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో కంటెంటే కింగ్’’ అని నిర్మాత మహేష్ కోనేరు అన్నారు. ‘పోలీస్, అదిరింది’ వంటి చిత్రాల తర్వాత హీరో విజయ్–డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘బిగిల్’.
నయనతార హీరోయిన్. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘విజిల్’ పేరుతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రేపు ఈ సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘అట్లీగారి సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని.
విజయ్‌గారితో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ‘విజిల్’ బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు. అట్లీ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని చాలా కాలంగా కల కంటున్నాను.. త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఎన్టీఆర్‌గారు మంచి వ్యక్తి. నా ప్రతి సినిమాకు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ‘విజిల్’ కేవలం ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలోనే ఉండదు.. చాలా భావోద్వేగాలుంటాయి. స్త్రీ సాధికారతను తెలియజే సే ఈ సినిమాను మహిళలకు అంకితమిస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment