
‘ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్ తర్వాత సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకునే వ్యక్తివి నువ్వే. అయ్యో అసలు నేను నీ తల్లిననే విషయాన్నే మర్చిపోయాను. ఎందుకంటే నీకున్న లక్షలాది మంది అభిమానుల్లో ఒకదాన్నైన నేను కూడా ఓ విజిల్ వేసి నిన్ను ప్రశంసిస్తాను కదా’ అంటూ దర్శకురాలు, నేపథ్య గాయని, నిర్మాత శోభా చంద్రశేఖర్ తన తనయుడు ఇళయ దళపతి విజయ్‌కు లేఖ రాశారు. విజయ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ లేఖ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా శోభా చంద్రశేఖర్ బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరొందారు. క్లాసికల్ సింగర్‌గా గుర్తింపు పొందిన ఆమె నంబర్గల్, ఇన్నిసాయి మలాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్’.. తెరి, మెర్సల్ వంటి హిట్ సినిమాల తర్వాత యువ డైరెక్టర్ అట్లీ- విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్’ యూనిట్ సభ్యులకు 400 ఉంగరాలు ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.
#ShobaChandrasekhar Abut #ThalapathyVijay 😍😍 pic.twitter.com/vpnkEqsegc
— Jegan ebi (@jeganebenezar1) August 27, 2019
Comments
Please login to add a commentAdd a comment