
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది.
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. గుర్రంపోడు ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు జైవీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల జంక్షన్ ఎదుట సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన పరమేష్ బైక్‌పై చిట్యాలకు కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చాడు.
తిరుగు ప్రయాణంలో చిట్యాల పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై జంక్షన్ దాడుతుండగా హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. పరమేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.