నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌ | Karthi Khaidi Telugu Movie Official Trailer Out | Sakshi
Sakshi News home page

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

Published Mon, Oct 14 2019 3:46 PM | Last Updated on Mon, Oct 14 2019 3:48 PM

Karthi Khaidi Telugu Movie Official Trailer Out - Sakshi

‘దేవ్‌’చిత్రంతో నిరాశపర్చిన హీరో కార్తీ.. తాజాగా ‘ఖైదీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్ఛర్ సంస్ధ నిర్మిస్తోంది.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విజయ దశమి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ను విడుదల చేయగా.. తాజాగా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది.
 

ఈ సందర్భంగా హీరో కార్తీ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ.. ‘నో సాంగ్స్‌ ,నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌ అండ్‌ థ్రిల్‌’అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ చిత్రంలో కార్తీ పూర్తిగా మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు.  ట్రైలర్‌లో ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్‌‌’ అంటూ కార్తీ చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మాస్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాతో కార్తీ మళ్లీ విజయాలబాట పడతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement