కార్తీ
వెండితెర ‘ఖైదీ’ విడుదల తేదీ ఖరారైంది. కార్తీ హీరోగా ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ’. ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా గురువారం వెల్లడించింది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం విశేషం. ఓ నేరం చేసి దాదాపు పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన కూతుర్ని కలసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. మరోవైపు తమిళ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’) కూడా ఈ నెల 25నే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment